ది ఘోస్ట్‌లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా? | Nagarjuna The Ghost Movie Makers Released Tamahagane Promo | Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: ది ఘోస్ట్‌లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా?

Published Fri, Aug 19 2022 9:50 AM | Last Updated on Fri, Aug 19 2022 10:16 AM

Nagarjuna The Ghost Movie Makers Released Tamahagane Promo - Sakshi

ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ కత్తి పట్టారు. అది కూడా విలువైన జపనీస్‌ ఉక్కుతో తయారు చేయబడిన ‘తమ హగనే’ కత్తితో రంగంలోకి దిగారు. విక్రమ్‌ ఎందుకు కత్తి పట్టాల్సి వచ్చిందో తెలియాలంటే ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే. నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్, గుల్‌ పనాగ్, అనిఖా సురేంద్రన్‌ ఇతర పాత్రల్లో నటించారు. నారాయణ్‌దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానుంది.

చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు

‘ది ఘోస్ట్‌’లో నాగార్జున పట్టుకున్న కత్తి (తమ హగనే) గురించి ఓ ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ‘‘తమ హగనే’ అనేది జపనీస్‌ పదం. తమ అంటే విలువైనదని, హగనే అంటే ఉక్కు అని అర్థం. ఈ చిత్రంలోని యాక్షన్‌ సీన్స్‌లో తమ హగనేని వాడారు నాగార్జున’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ట్రైలర్‌ ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. 

చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement