ఈ సినిమాతో ఆ కోరిక తీరింది: నాగార్జున | Akkineni Nagarjuna Interview Today On The Ghost Release | Sakshi
Sakshi News home page

Nagarjuna Interview: ఈ సినిమా చూస‍్తే చాలా కొత్తదనంగా ఫీలౌతారు: నాగార్జున

Published Tue, Oct 4 2022 9:42 PM | Last Updated on Tue, Oct 4 2022 9:43 PM

Akkineni Nagarjuna Interview Today On The Ghost Release - Sakshi

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున   చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ది ఘోస్ట్‌లో వెపన్ ప్రమోషన్స్‌లో ఆకట్టుకుంది. దీని వెనుక కథ వుందా ? 
తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ ఉంది. ఈ సినిమాలో ఉండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్‌గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం.(నవ్వుతూ) 

ది ఘోస్ట్ పై చాలా ఇష్టం పెరగడానికి కారణం ? 

ఈ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బాగుంటుంది. తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్‌ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీలో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది.  ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్.  

ది  ఘోస్ట్‌ని శివతో పోల్చడానికి కారణం ? 
నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ ఉందనిపించింది. 

ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ? 
నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్‌తో కూడిన ఒక స్టైలీష్ యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. గరుడ వేగలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాలా నచ్చింది. ప్రవీణ్‌ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్‌లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేశారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం.

మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ?

మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్లాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే  యూఎస్‌లో రిలీజ్ అవుతోంది. ఈ రకంగా నిన్నే పెళ్లాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ). 

పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్లీ వస్తుందా ? 
తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్స్ పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి. 

మీరు బాలీవుడ్‌లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చెరిగిపోయాయని అనుకోవచ్చా ? 

ఇప్పుడు బౌండరీలు లేవు. యూఎస్‌లో ఐమాక్స్ స్క్రీన్‌లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్రలో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ? 
ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66రోజుల్లోనే పూర్తయింది. 

కొత్తగా చేయబోయే సినిమాలు ? 
రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్‌లో ఉంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement