The Ghost Movie Streaming On Netflix From November 2 - Sakshi
Sakshi News home page

The Ghost OTT Release: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్‌ మూవీ, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..

Published Wed, Nov 2 2022 9:30 AM | Last Updated on Wed, Nov 2 2022 1:52 PM

OTT: Nagarjuna The Ghost Movie Streaming on Netflix From November 2nd - Sakshi

టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది.  యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆస్‌ ఆడియన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది.

చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’ 

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ రోజు(నవంబర్ 2) నుంచి నెట్‌ఫ్లిక్స్‌తో ది ఘోస్ట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ది ఘోస్ట్‌ ఓటీటీలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement