అయ్యబాబోయ్... దెయ్యం!
శాస్త్రం
లండన్‌కు చెందిన ఎలిజెబెత్‌కు నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వచ్చింది. తన గదిలో దెయ్యపు నీడ! గట్టిగా అరుద్దామంటే నోరు పెగలలేదు. బిగుసుకు పోయింది. వాషింగ్టన్‌కు చెందిన డేవిడ్ గాఢనిద్రలో ఉన్నాడు. తన ఛాతిపై ఎవరో కూర్చున్నారు. నిద్ర నుంచి లేవబోయి, అరవబోయాడు డేవిడ్. రెండూ సాధ్యం కాలేదు!! అక్కడెక్కడో లండన్, వాషింగ్టన్‌లో మాత్రమే కాదు... మనకు కూడా ఇలాంటి అనుభవాలు చాలాసార్లు ఎదురై ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభవాలు సుపరిచితం. దీన్ని శాస్త్రీయంగా ‘స్లీప్ పెరాలసిస్’ అంటారు. ‘స్లీప్ పెరాలసిస్’ అనేది నిద్రకు, మెలకువకు మధ్య, చేతనకు, అచేతనకు మధ్య ఉగిసలాడే ధోరణి.
ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు ‘స్లీప్ పెరాలసిస్’ గురించి అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన ఒక న్యూరల్ మ్యాప్‌ను రూపొందించారు. మెదడులోని నిర్దేశిత ప్రాంతంలో చోటు చేసుకునే ‘కల్లోలం’ దెయ్యాలు, రాక్షసులు నిద్రలో కనిపిస్తాయనేది శాస్త్రవేత్తల అంచనా.