Elizabeth
-
మహేశ్ సరసన ఇండోనేషియా బ్యూటీ
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఓ హీరోయిన్గా నటిస్తారనే వార్త కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని ఫాలో అవుతున్నారు చెల్సియా. అలాగే మహేశ్‌బాబు– రాజమౌళి సినిమాల అప్డేట్స్ను ఇన్‌స్టాలో చెల్సియా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో మహేశ్‌కు జోడీగా చెల్సియా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కానుందట. -
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
స్వదేశీ అబ్బాయి.. విదేశీ అమ్మాయి
తెనాలి: ఆస్ట్రేలియా అమ్మాయి..తెనాలి అబ్బాయి ప్రేమించుకుని హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. కొల్లిపరకు చెందిన ఇంద్రసేనారెడ్డి ఎంఎస్ చేయడానికి ఆ్రస్టేలియా వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశ పౌరసత్వమూ లభించింది. తన కంపెనీలోనే పనిచేస్తోన్న ఆ్రస్టేలియా యువతి సారా ఎలిజబెత్ కౌల్టర్ను ప్రేమించాడు. యువతి కూడా ప్రేమను అంగీకరించడంతో ఈ విషయాన్ని ఇరువురూ వారి కుటుంబాలకు చెప్పారు. హిందూ సంప్రదాయాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కొల్లిపరలో సంప్రదాయ వివాహానికి ఇంద్రసేనారెడ్డి చేసిన ప్రతిపాదనకు ఎలిజబెత్ సమ్మతించారు. దీంతో ఇంద్రసేనారెడ్డి తల్లిదండ్రులు కూసం శ్రీనివాసరెడ్డి, పద్మజ, బంధుమిత్రుల సమక్షంలో కొల్లిపరలోని జీవీఆర్ కళ్యాణమండపంలో శనివారం వైభవంగా వివాహం జరిగింది. కుమార్తె పెళ్లికి ఎలిజబెత్ తల్లిదండ్రులు జాన్ కౌల్టర్, అన్నెట్టీ దంపతులు, సోదరి, సోదరుడు, అతడి భార్య హాజరయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో పురుషులు షర్టు, పట్టు పంచెలు, మహిళలు చీరె, జాకెట్ ధరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
పైగా టూంబ్స్కు అమెరికా సాయం
సంతోష్ నగర్ (హైదరాబాద్): భవిష్యత్తు తరాల కోసం అమూల్యమైన శిల్ప సంపదను పరిరక్షించాలని అమెరికా చార్జ్ డి అఫైర్స్ ఎలిజబెత్ జోన్స్ చెప్పారు. మంగళవారం ఆమె అమెరికా కాన్సుల్ జెన్నిఫర్ లార్సెన్తో కలిసి సంతోష్ నగర్ ఒవైసీనగర్ కాలనీలోని పైగా టూంబ్స్ (సమాధి)ను సందర్శించారు. 18, 19వ శతాబ్దాల్లో నిర్మించిన పైగా సమాధుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమైనందుకు తాము గరి్వస్తున్నామని ఎలిజబెత్ చెప్పారు. ఆరుకు పైగా సమా«ధుల పరిరక్షణ, పునరుద్ధరణకు కోసం అమెరికా ‘అంబాసిడర్స్ ఫండ్స్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ (ఏఎఫ్‌సీపీ)’రూ.2.04 కోట్ల సాయం చేసిందని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రతీష్ నందా తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆగాఖాన్ ట్రస్ట్ అమలు చేస్తోందన్నారు. ఇది హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ద్వారా నిధులు సమకూర్చిన ఐదో ప్రాజెక్టని కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ చెప్పారు. హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీ టూంబ్స్ వద్ద తమ ఏఎఫ్‌సీపీ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. -
వేసవికల్లా వీసా చిక్కులకు చెల్లు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని త్వరలోనే అధిగమిస్తామని, వచ్చే వేసవికల్లా జారీ వేగవంతం అవుతుందని చార్జ్ డి అఫైర్స్ ఎ.ఎలిజబెత్ జోన్స్ స్పష్టం చేశారు. వీసాల జారీ జాప్యాన్ని అత్యంత ప్రాధాన్యం గల అంశంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆమె మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమస్యపై ఇప్పటికే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ జాన్ బ్లింకిన్, జయశంకర్ చర్చించారని చెప్పారు. వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. వచ్చే వేసవికల్లా భారత్‌లో కోవిడ్‌కు ముందు ఉన్నదాని కంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారని వివరించారు. ‘సాధారణంగా బీ1, బీ2 వీసాల జారీలోనే జాప్యం ఎక్కువగా జరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. హైదరాబాద్‌లోనూ అదనపు సిబ్బంది త్వరలోనే అందుబాటులోకి వస్తారు. గత ఏడాది విద్యార్థులకు 1.25 లక్షల వీసాలు జారీ చేయగా.. ప్రస్తుతం మరోసారి వీసాలకు డిమాండ్ పెరిగింది. విద్యార్థి వీసాలకు ప్రాధాన్యమిచ్చి వారు సకాలంలో తమ కోర్సుల్లో చేరేలా వీసాలు జారీ చేస్తాం’అని ఎలిజబెత్ తెలిపారు. భారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నాం భారత్‌కు పూర్తిస్థాయి దౌత్యవేత్త నియామకం రెండేళ్లుగా జరక్కపోవడంపై ఎలిజబెత్ జోన్స్ మాట్లాడుతూ.. దాని ప్రభావం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి దౌత్యవేత్త లేకున్నా అనేకమంది అమెరికా పార్లమెంటు సభ్యులు భారత్‌ను సందర్శించారని, ఇరుదేశాల మిలటరీ దళాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని, వాణిజ్యం కూడా పెరిగిందని తెలిపారు. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ పరిస్థితిని మేము సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఏ దేశమైనా తమ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుంది. అందుకే విదేశీ వ్యవహారాల్లో ఏ దేశం ఎలా వ్యవహరించాలో మేము ఎప్పుడూ నిర్ణయించం’అని ఆమె చెప్పారు. ఆయా దేశాల సమస్యలను అర్థం చేసుకుని.. వాటికి లోబడే ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ఉక్రెయిన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం అందించడం భారత్ చేస్తున్న అతిపెద్దమేలని పేర్కొన్నారు. జీ–20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా నుంచి మరిన్ని బృందాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం భేష్ అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అన్ని రకాలుగా మద్దతు లభిస్తోందని, మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారాన్ని అమెరికా వ్యాపారవేత్తలు ఎంతగానో ప్రశంసిస్తున్నారని ఎలిజబెత్ జోన్స్ చెప్పారు. అయితే, మేకిన్ ఇండియా కార్యక్రమంలో తామెలా భాగం కావాలన్నది వారికి ఇంకా స్పష్టం కావడం లేదని, భారతీయ కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. చైనాతో భారత్ సరిహద్దు వివాదాల విషయంలో అమెరికా పాత్ర ఏమీ ఉండదని, కాకపోతే భారతీయ భౌగోళిక సమగ్రతకు ఎలాంటి ముప్పు రాకూడదని అమెరికా భావిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కాన్సుల్ జనరల్ భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ కొత్త భవనానికి నిపుణుల అనుమతి లభించాల్సి ఉందని చెప్పారు. కొత్త భవనంలో మరింత ఎక్కువ మంది సిబ్బంది పనిచేసేందుకు సౌకర్యాలు ఉన్నాయన్నారు. -
ప్రేమించినవాడితో నటి, ట్రాన్స్‌వుమెన్ పెళ్లి
తిరువనంతపురమ్: నటి, ట్రాన్స్‌వుమెన్ ఎలిజబెత్ హరిని చందన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. కొంతకాలంగా తను గాఢంగా ప్రేమిస్తున్న సునీష్‌ను వేదమంత్రాల సాక్షిగా మనువాడారు. కేరళలోని ఎర్నాకులమ్ బీటీహెచ్ హాల్లో ఈ పెళ్లి తంతు జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సెలబ్రిటీల మేకప్ ఆర్టిస్ట్, ట్రాన్స్‌జెండర్ రెంజు రెంజిమార్ వధువు తల్లి స్థానంలో నిలబడి తంతును పూర్తి చేశారు. ఎలిజబెత్‌ను పెళ్లి కూతురిని చేసే దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "తల్లిగా నా బాధ్యతలను పూర్తి చేశాను. నా చేతుల మీదుగా కూతురి పెళ్లి చేశాను. భగవంతుడికి కృతజ్క్షతలు" అని రాసుకొచ్చారు. (చదవండి: ఇంట్లో నా ప్రవర్తన నచ్చలేదు) కాగా కుంబలంగికి చెందిన హరిని చందన 17 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారారు. 2017లో కొచ్చిలో జరిగిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీలో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 'దైవత్తింటే మనవట్టి' అనే మలయాళ హిట్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో నటుడు జయసూర్య ముఖ్యపాత్రలో కనిపించారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) View this post on Instagram A post shared by Renju Renjimar (@renjurenjimar) View this post on Instagram A post shared by Renju Renjimar (@renjurenjimar) -
బ్రిటన్ రాణి దంపతులకు కోవిడ్ టీకా
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌కు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చారు. విండ్సర్ కేజల్‌లో ఉంటున్న రాణి దంపతులకు ఫ్యామిలీ డాక్టర్ శనివారం నాడు కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్టుగా బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి, రాజు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను బయట ప్రపంచానికి వెల్లడించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎలాంటి ఊహాగానాలకు తావుండ కూడదని తామిద్ద్దరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా మహారాణియే స్వయంగా ప్రజలందరికీ వెల్లడించమన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎలిజెబెత్ వయసు 94 కాగా, ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న బ్రిటన్‌లో ఇప్పటివరకు 15 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చారు. బ్రిటన్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తున్నారు. అయితే రాణి దంపతులకి ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చారో తెలియలేదు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ప్రస్తుతం బ్రిటన్‌లో ఇస్తున్నారు. -
రేపట్నుంచి యూకేలో ఫైజర్ టీకా
లండన్: బ్రిటన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఒక భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మొత్తం 50 జాతీయ ఆరోగ్య సేవా ఆస్పత్రుల్లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్‌కాక్ చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇళ్లల్లోనే ఉండే వయో వృద్ధులకు, ముఖ్యంగా 80 ఏళ్ల వయసు పై బడిన వారికి, వారి సంరక్షకులకి మొట్ట మొదట వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా మంత్రి తెలిపారు. ప్రజలందరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని, నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న యూకే గతవారంలోనే అమెరికాకి చెందిన ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. 6.7కోట్ల జనాభా ఉన్న బ్రిటన్ తొలి విడతగా 2 కోట్ల మందికి టీకా డోసుల్ని ఇవ్వనుంది. ఇందు కోసం 4 కోట్ల టీకా డోసులకి ఆర్డర్ చేసింది. బెల్జియం నుంచి ఇప్పటికే 8 లక్షల డోసులు జాతీయ ఆరోగ్య కేంద్రాలకి చేరుకున్నాయి. రాణి దంపతులకు వ్యాక్సినేషన్! బ్రిటన్ రాణి ఎలిజెబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)లకు త్వరలో ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. వయసుని దృష్టిలో ఉంచుకొని వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తారని ది మెయిల్ పత్రిక వెల్లడించింది. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ప్రజల్లో నమ్మకం పెంచేందుకు రాణి దంపతులతో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా టీకా తీసుకోనున్నారు. అయితే బకింగ్çహామ్ ప్యాలె స్ టీకా అంశంలో ఇంకా స్పందించాల్సి ఉంది. చైనా సన్నాహాలు చైనా కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. 140 కోట్ల మంది జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడం సవాలేనని అధికారులు చెప్పారు. చైనాలో మొత్తం అయిదు వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటిలో సినోఫార్మ్ కంపెనీ టీకా వినియోగం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఏ వ్యాక్సిన్‌ను ఇస్తుందో అధికారికంగా వెల్లడించలేదు. -
2020 అమెరికా అధ్యక్ష బరిలో వారెన్!
వాషింగ్టన్: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ ఎలిజబెత్ వారెన్(69) ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తన అభిమానులు, మద్దతుదారులకు పంపిన వీడియో సందేశంలో ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ముందు, అవకాశాలపై అధ్యయనం చేసేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటుచేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో తదుపరి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు సవాలు విసరబోతున్నానని అధికారికంగా ప్రకటించిన తొలి డెమొక్రటిక్ నాయకురాలిగా ఆమె నిలిచారు. ట్రంప్ విధానాల్ని తీవ్రంగా ఎండగట్టే వారెన్ ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మసాచుసెట్స్ నుంచి సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. ఇండో–అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్, హిందూ మతానికి చెందిన మరో సభ్యురాలు తులసీ గబ్బార్డ్‌లు కూడా ట్రంప్‌పై పోటీ చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. -
టేలర్ కుమార్‌గారి టైమ్ ఆటో!
‘‘టైమ్ ఆటో... టైమ్ ఆటో’’ చౌరస్తాలో తన ఆటో పక్కన నిల్చొని అరుస్తున్నాడు ఎలిజబెత్ టేలర్ కుమార్. ఈయన పేరు గురించి కొద్దిగా చెప్పుకుందాం...టేలర్ కుమార్ తండ్రి టెక్కు సోమలింగం... హాలీవుడ్ అందాల రాశి ఎలిజబెత్ టేలర్‌కు వీరాభిమాని. తనకు కూతురు పుడితే ‘ఎలిజబెత్ టేలర్’ అని పేరు పెడతానని శపథం చేశాడు. కానీకొడుకు పుట్టాడు. అయినప్పటికీ... ఎలిజబెత్ టేలర్ చివర కుమార్ అని చేర్చి తన శపథం నెరవేర్చుకున్నాడు.ఇప్పుడు మళ్లీ ‘టైమ్ ఆటో’ దగ్గరికి వద్దాం.‘‘కొత్తగా ఈ టైమ్ ట్రావెల్ ఆటో ఏందిరో... అంటే ఎక్కడా లేట్ చేయకుండా టైమ్‌కు తీసుకెళ్లే ఆటోనా ఏంది?’’ బుర్రగోక్కుంటూ టేలర్ కుమార్‌ను అడిగాడు టీస్టాల్ నర్సింగ్.‘‘ఆ మాత్రం దానికి ఇంతలా అరుస్తానా? నా ఆటో గొప్పదనం ఏమిటంటే... ఇది ఎక్కి గతంలోకి వెళ్లవచ్చు... ఫ్యూచర్లోకి వెళ్లవచ్చు. అమీర్‌పేట, పంజగుట్ట, ఎర్రమంజిల్... ఇలా రకరకాల స్టాప్‌లు ఉన్నట్లే... నా ఆటోలో సంవత్సరాల పేరుతో స్టాప్‌లు ఉంటాయి. గతంలోకి వెళితే 1920, 1930, 1940... ఇలా ఉంటాయి. ఫ్యూచర్లోకి వెళితే... 2019, 2020, 2040... ఇలా ఉంటాయన్నమాట... మీ ఛాయిస్‌ని బట్టి అక్కడికి నా ఆటోలో తీసుకెళతాను’’ వివరించాడు టేలర్ కుమార్. ‘‘పొద్దుగాల పొద్దుగాల షెవుల పూలు బెడుతున్నవుగదనే!’’ అని పెద్దగా నవ్వాడు నర్సింగ్.‘టైమ్ ఆటో... టైమ్ ఆటో’ అని రోజూ టేలర్ కుమార్ అరుస్తున్నాడేగానీ అతన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. టేలర్ ఆటో అందరికీ వినోదంగా మారింది. అలాంటి రోజుల్లో ఒకరోజు...తన కారులో అటుగా వెళుతున్న ప్రఖ్యాత పారిశ్రామికవేత్త సీఆర్డీ కాటా, టేలర్ అరుపులను విని, ‘‘డ్రైవర్,,,, కారు ఒక పక్కకు ఆపు’’ అన్నాడు. కారును ఒక పక్కన పార్క్ చేసిన తరువాత అతడి ముందు నిల్చున్నాడు కాటా. అయిదారు నిమిషాల తరువాత ‘‘నీ ఆటో ఎక్కుతున్నాను పదా’’ అన్నాడు. టేలర్ కుమార్ ఆనందానికి హద్దులు లేవు. ఈలోపు ఒకడు వచ్చి...‘‘సార్ ఈ వెర్రివాడి మాటలు నమ్మకండి’’ అన్నాడు.‘‘వెర్రిమాటలు కాదు... వీడి కళ్లలో ఏదో నిజా/తీ కనిపిస్తుంది’’ అంటూ ఆటో ఎక్కాడు కాటా.‘‘ ఏ స్టాప్‌కు తీసుకెళ్లమంటారు సార్?’’ అడిగాడు టేలర్. ‘‘కొద్దిసేపు ఆలోచించి చెబుతాను’’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు కాటా. సీఆర్డీ కాటా మరోపారిశ్రామికవేత్త బీఆర్డీ బీటాతో కలిసి కొత్తగా కొన్ని వ్యాపారాల్లోకి దిగాడు.అయితే, బీటా నమ్మదగిన వ్యక్తి కాదని.... మోసగాడని చాలామంది కాటాతో చెప్పారు.కానీ ఆయన వాటిని సీరియస్‌గా తీసుకోలేదు.‘‘నేనే పెద్ద మోసగాడిని.... నన్ను మోసం చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు’’ అంటుండేవాడు కాటా.నిజమే. ఒకప్పుడు బూట్‌పాలిష్ చేసుకొని బతికే కాటప్ప... ఆ తరువాత రౌడీయిజంలోకి దిగి ‘కాటన్న’ అయ్యాడు. ఆ తరువాత ఎన్నో భూకబ్జాలు చేశాడు... ఎంతో మందిని మోసం చేసి కోటీశ్వరుడిగా ఎదిగి తన పేరును ‘సీఆర్డీ కాటా’గా స్టయిలిష్‌గా మార్చుకున్నాడు. కాటాకు తెలియని మోసం అంటూ లేదు...అందుకే అంటాడు...‘‘నన్ను మోసం చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు’’ అని. అలాంటి కాటాకు తన ఫ్యూచర్ చూడాలనిపించింది.‘‘వచ్చే సంవత్సరానికల్లా... మన వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది’’ అని బీటా అన్నమాట గుర్తుకు వచ్చింది. వెంటనే...‘‘2019 స్టాప్‌కు తీసుకువెళ్లు’’ అన్నాడు కాటా.‘‘అలాగే’’ అంటూ ఆటోను స్టార్ట్ చేశాడు టేలర్ కుమార్. 2019 సంవత్సరం. మే నెల.సమయం: ఉదయం పదకొండు గంటలు.స్థలం: ఎర్రగడ్డ, రైతు బజారు.ఆటో దిగి రైతు బజార్లోకి నడిచాడు కాటా. అక్కడ ఒక మూల ఒక వ్యక్తి మూడు బుట్టల్లో పువ్వులు, ఆరు బుట్టల్లో మామిడికాయలు ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు.‘పువ్వులు పువ్వులోయ్... కాయలు కాయలోయ్’ అని అరుస్తున్నాడు.ఆ వ్యక్తి ఎవరో కాదు... తనే!‘అంటే 2019లో నా పొజిషన్ ఇదన్నమాట. మూడు పువ్వులు ఆరు కాయలు అంటే ఏమిటో అనుకున్నా... ఇప్పుడు అర్థమైంది’ అంటూ కోపంతో పళ్లుపటపటా కొరికాడు కాటా.తన డైరీ తెరిచి...‘వెనక్కి వెళ్లగానే... ఆ బీటా గాడి పని పట్టాలి’ అని రెడ్ స్కెచ్ పెన్‌తో పెద్ద పెద్ద అక్షరాల్లో రాసుకున్నాడు. ఎందుకో ఆ సమయంలో ఒకసారి నాస్టాల్జియా గాలి అతడిని సోకింది.‘గతంలోకి... అందులోనూ... తాను కొత్తగా హైదరాబాద్‌కు వచ్చిన రోజుల దగ్గరికి వెళ్లాలనిపించింది. 2000 సంవత్సరం డిసెంబర్‌లోకి తీసుకెళ్లు’’ అన్నాడు.‘‘మరో లచ్చరూపాయలు ఖర్చు అవుతుందండీ’’ అన్నాడు టేలర్ కుమార్.‘‘లచ్చగాకుంటే... రెండు లచ్చలు తీసుకో’’ అన్నాడు కాటా. ఆటోను 2000 సంవత్సరం స్టాప్‌లోకి తీసుకెళ్లాడు టేలర్ కుమార్.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు...‘‘పాలీష్... బూట్ పాలీష్... తళతళ మెరిసే పాలీష్’ అని అరుస్తున్నాడు బక్కపల్చటి కుర్రాడు కాటప్ప. ‘‘అటు చూడు కుమార్.... ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని. జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్’’ అంటూ కర్చీప్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు కాటా. కొద్దిసేపటి తరువాత... ‘‘ఆలస్యం చేయకుండా 2018 స్టాప్‌కి తీసుకెళ్లు. ఆ బీటాగాడి పని పట్టాలి’’ అన్నాడు పిడికిలి బిగిస్తూ కాటా. ఆటో స్టార్ట్ చేశాడు టేలర్. డుర్ర్ర్ర్ర్ర్... అని సౌండ్ వస్తుందేగానీ ఆటో ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు.‘‘ఏమైంది?’’ ఆందోళనగా అడిగాడు కాటా.‘‘ ఇది సెకండ్‌హ్యాండ్ టైమ్‌మిషన్ పార్టులతో తయారుచేసిన ఆటో అండీ. ఎప్పుడు కదులుతుందో ఏమో’’ అని తలపట్టుకున్నాడు టేలర్ కుమార్.‘ఓరీ నీ యబ్బా కడుపు మాడా, టైమ్ మిషన్లలో కూడా ఫస్ట్‌హ్యాండ్ సెకండ్‌హ్యాండ్ ఉంటాయా!!! .... ఇంతకీ మనం ముందుకు వెళతామంటావా?’’ అని ఆందోళనగా అడిగాడు కాటా.‘మన టైమ్ బాగుంటే కచ్చితంగా వెళతామండి... లేకుంటే కచ్చితంగా ఇక్కడే ఉంటామండి’’ అని వినయంగా బదులిచ్చాడు ఎలిజబెత్ టేలర్ కుమార్! – యాకుబ్ పాషా -
అందరికీ ధన్యవాదాలు
రాజమాత క్వీన్ ఎలిజబెత్–2 మనవడు ప్రిన్స్ హ్యారీని (లేడీ డయానా చిన్న కొడుకు) ఈ మే నెలలో వివాహమాడబోతున్న అమెరికన్ నటి మేఘన్ మార్కల్.. సోషల్ మీడియాలో ఇంతకాలం తనను ఫాలో అయిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు! ఆ వెంటనే ఆమె తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను మూసి వేశారు. బ్రిటన్ రాచ కుటుంబపు నియమ నిబంధనలను గౌరవిస్తూ మేఘన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజప్రాసాదంలో ఎవరికీ వ్యక్తిగతంగా సోషల్ మీడియా అకౌంట్లు ఉండవు. వారి తరఫున ప్రత్యేకంగా ఒక మీడియా నిపుణుల బృందం అధికారికంగా ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్బుక్ పోస్టింగ్‌లు ఇస్తుంటుంది. ప్రిన్స్ హ్యారీ జీవిత భాగస్వామిగా మేఘన్ ఆ కుటుంబంలోకి అడుగు పెట్టాక అవసరమైతే ఆమె తరఫున కూడా ఆ ప్రత్యేక బృందమే ట్వీట్లు వగైరాలు ఇస్తుంది. 2017 డిసెంబర్ నాటికి మేఘన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 19 లక్షల మంది, ట్విట్టర్లో 3 లక్షల 50 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆమె ఫేస్బుక్ అకౌంట్‌కి 8 లక్షల లైకులు ఉన్నాయి. మెట్టినింటి సంప్రదాయాలకు మేఘన్ మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నట్లే ఉంది. -
ఎలిజబెత్ సాధించింది
⇒ యువతి న్యాయపోరాటం ⇒ మోసగించిన యువకుడికి శిక్ష పడేవరకు విశ్రమించని వైనం ⇒ బిడ్డకు తండ్రి ఎవరో చట్టబద్ధంగా వెల్లడి ⇒ నిందితుడికి పదేళ్ల జైలు బంజారాహిల్స్: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమేగాక, గర్భం దాల్చాక నువ్వెవరో నాకు తెలియదంటూ బయటకు తరిమిన నయవంచకుడికి శిక్ష పడాలని, తన బిడ్డకు తండ్రి ఎవరో చట్టబద్దంగా వెల్లడించాలన్న పట్టుదలతో న్యాయపోరాటం సాగించిన ఓ బాలిక ఎట్టకేలకు విజయం సాధించింది. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిజాన్ని వెలుగులోకి తేవడమేగాక, తనను వంచిన మానవ మృగానికి పదేళ్ల జైలు శిక్ష పడే వరకు అలుపెరుగని పోరాటం సాగించింది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10 సింగాడిబస్తీకి చెందిన ఎలిజబెత్(16) 2013లో తాజ్‌కృష్ణా హోటల్లో హౌస్‌కీపింగ్ విభాగంలో పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన జావి(23) అనే యువకుడితోనామెకు పరిచయం ఏర్పడింది. ప్రేమపేరుతో నమ్మించి మోసం చేయడంతో 2013 ఆగస్టులో గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని జావిపై ఒత్తిడి తేగా ఇంట్లో తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారంటూ బెదిరించి తప్పించుకు తిరిగేవాడు. అయితే ఎలిజబెత్ ఆరోగ్యంపై కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు జావిని కలిసి పెళ్లి చేసుకోవాలని కోరగా, తానెప్పుడూ ఎలిజబెత్‌ను చూడలేదని, ప్రేమించలేదని, ఆమె గర్భానికి తాను కారణం కాదని తప్పించుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఎలిజబెత్ 2014 ఏప్రెల్‌లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జావిపై ఐపీసీ సెక్షన్ 376, 420, ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఎలిజబెత్ నిరక్ష్యరాస్యురాలు కావడంతో ఆమె వయస్సు ధృవీకరణ కాలేదు. ఇందుకోసం పోలీసుల సహాయంతో ఆస్పత్రికి వెళ్లి తన వయస్సును నిర్ధారణ పరీక్షలు చేయించుకుని కోర్టుకు ఆధారాలు సమర్పించింది. ఈ పరిస్థితుల్లోనే ఓ పాపకు జన్మనిచ్చింది. బాలింత అయినా పోలీసుల సహాయంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయించగా, బిడ్డకు తండ్రి జావిగా నిర్ధారణ కావడంతో కోర్టుకు ఆధారాలు సమర్పించింది. ఆ తరువాత నిందితుడికి శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా పోరాటం సాగించింది. మూడేళ్లుగా కొనసాగిన ఈ కేసులో ఈ నెల 18న అదనపు మెజిస్ట్రేట్ సెషన్స్ జడ్జి నిందితుడు జావికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఒక వైపు పాపను పెంచుకుంటూ.. పని చేస్తూనే మరో వైపు కోర్టు చుట్టూ తిరుగుతూ నిందితుడికి శిక్షపడేలా చేసి విజయం సాధించింది. దీంతో స్థానికులు ఆమెను ప్రశంసిస్తున్నారు. -
వీటి దుంప తెగ
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే బంగాళ దుంపలనునిషేధించిన ఘనత బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్‌కు దక్కుతుంది. ఇంతకీ బంగాళదుంపలు ఏం పాపం చేశాయని వాటిపై రాణిగారు ఆగ్రహించారనుకుంటున్నారా..? ఆగ్రహం కాదు గానీ, బంగాళదుంపలను చూసి భయపడ్డారామె. భయపడటానికి అవేమైనా బాంబులా.. అనుకుంటున్నారా..? అప్పట్లో బ్రిటిష్ యాత్రికుడు, గూఢచారి, బహుముఖ ప్రజ్ఞశాలి అయిన సర్ వాల్టర్ రాలీ ప్రపంచాన్వేషణ కోసం తరచుగా నౌకాయానాలు చేసేవాడు. ఆయన యాత్రల ఖర్చులను రాణిగారే భరించేవారు. ఒకసారి రాలీ దొరవారు దక్షిణ అమెరికా యాత్ర ముగించుకుని ఇంగ్లండ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి భారీ పరిమాణంలో బంగాళదుంపలను మోసుకొచ్చాడు. వాటిని రాణిగారికి కానుకగా సమర్పించుకున్నాడు. వాటితో రాచ బంధువులకు, రాజోద్యోగు లకు విందు చేసి ఘనత చాటుకోవాలని తలచిన రాణిగారు, బంగాళదుంపలతో రుచికరమైన వంటకాలను తయారు చేయాల్సిందిగా రాచప్రాసాదంలోని పాక నిపుణులను ఆదేశించారు. పాపం... ఆ పాక నిపుణులు బంగాళదుంపలను ఎప్పుడూ చూసి ఉండ లేదు. మట్టిరంగులో ఉండే దుంపలను పారేసి, వాటిపై ఉన్న ఆకులతో, ఆకుపచ్చని కాండంతో తోచిన రీతిలో వింతైన వంటకాలను తయారు చేశారు. రాచ విందులో పాల్గొన్న వారంతా వాటినే తిన్నారు. బంగాళ దుంపల ఆకుల్లోను, కాండంలోను ఉండే విషపదార్థాల కారణంగా వాళ్లందరికీ విందు ఆరగించిన కొద్దిసేపటికే కడుపులో సుడిగుండాలు మొదలయ్యాయి. దాంతో బంగాళదుంపలంటేనే ఎలిజబెత్ రాణిగారే కాదు, యావత్ బ్రిటిష్ ప్రజానీకమూ హడలి చచ్చే పరిస్థితి తలెత్తింది. దెబ్బకు రాణిగారు బంగాళదుంపలపై నిషేధం ప్రకటించారు. ఈ సంఘటన 1598లో జరిగింది. ఆ తర్వాత వందేళ్ల పాటు బ్రిటన్‌లో బంగాళదుంపలపై నిషేధం కొనసాగింది. -
కోడల్ని కాల్చి చంపేసింది!
జార్జియాః అమెరికా జార్జియాలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకును విడాకులు కోరినందుకు ఏకంగా ఓ అత్తగారు కోడల్ని కాల్చి చంపేసింది. కొద్దిరోజులుగా ఇంటి గొడవలు కారణంగా కోడలు.. తన ఇద్దరు పిల్లలతోపాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లితండ్రులతో కలసిఉంటున్న ఆమెను కాపురానికి తీసుకొచ్చే వంకతో వెళ్ళిన అత్త.. మనవలు చూస్తుండగానే కోడల్ని కాల్చి చంపేసింది. సౌత్ జార్జియా మెక్ రియోకు చెందిన 68 ఏళ్ళ ఎలిజబెత్ వాల్.. వాయువ్య అట్లాంటా పౌడర్ స్ప్రింగ్స్ లో నివసిస్తున్నతన 35 ఏళ్ళ కోడలు.. జెన్నావాల్ ను తుపాకీతో కాల్చి చంపింది. కొడుకుతో గొడవలు పడి కొద్దిరోజులుగా పుట్టింట్లోనే ఉంటున్నజెన్నాను కాపురానికి తెచ్చేందుకు వెళ్ళిన ఎలిజబెత్.. అక్కడే ఉన్న మనవళ్ళను ముందుగా బయటకు పంపించి, ఇంట్లోనే ఉన్న కోడల్ని మాత్రం షూట్ చేసి, హత్య చేసినట్లు జైల్ రికార్డులు చెప్తున్నాయి. కోడల్ని చంపడంతోపాటు, పిల్లల ఎదుటే హింసకు పాల్పడినందుకు గాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎలిజబెత్ వాల్ పై పలు కేసులు నమోదు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. బాధితురాలు కాబ్ కౌంటీ కెంప్ ఎలిమెంటరీ స్కూల్లో కిండర్‌గార్టెన్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ వెబ్ సైట్ లోని వివరాలను బట్టి ఆమె.. జార్జియా కెన్నెసా హారిసన్ హై లోను, జార్జియా యూనివర్శిటీలోను చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె...కాబ్ కౌంటీలోని మరో రెండు స్కూళ్ళలో కూడ చదివినట్లు వెబ్ సైట్ లోని వివరాలు చెప్తున్నాయి. -
అతిపురాతనం అధరాలంకరణం!
పురాణాలు, ప్రబంధాలలో బింబాధర వర్ణనలను విరివిగానే చదువుకుని ఉంటాం. వాటిని చదివినప్పుడల్లా లిప్స్టిక్లేవీ లేని కాలంలో అప్పటి కవులు పెదవులను అంత సవర్ణభరితంగా ఎలా వర్ణించారబ్బా అని ఆశ్చర్యపోయే ఉంటాం. ఇప్పటి మోడర్న్ మేకప్‌లో వాడే లిప్‌స్టిక్ అప్పట్లో ఉండేది కాదు. అయితే, అధరాలంకరణ అలవాటు అప్పట్లో లేదనుకుంటే పొరపాటే! ఐదువేల ఏళ్ల కిందటే సుమేరియన్లు పెదవులకు రంగు పూసుకునేవారు. పైగా ఆడా మగా తేడా లేకుండా అందరూ పూసుకొనేవాళ్లు. ప్రాచీన ఈజిప్షియన్లు తమ సామాజిక హోదాను చాటుకొనేందుకు పెదవులను శ్రద్ధగా అలంకరించుకునేవారు. మొక్కల నుంచి ఖనిజాల నుంచి ఎరుపు రంగును సేకరించి, శుభ్రపరచి పెదవులకు అలంకారంగా వాడేవారు. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ నిత్యం ఎర్రబారిన పెదవులతోనే ప్రజలకు దర్శనమిచ్చేది. తెల్లని ముఖంలో ఎర్రని పెదవులను జనం అబ్బురంగా చూసేవాళ్లు. కొన్నాళ్లకు ఈ ఫ్యాషన్‌ను అనుకరించడం మొదలుపెట్టారు. అప్పట్లో తేనెటీగల కొవ్వులో మొక్కల నుంచి సేకరించిన ఎరుపురంగును కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని దీర్ఘకాలం భద్రపరచుకుని ఉపయో గించేవారు. ఆధునిక లిప్స్టిక్కు ఒకరకంగా ఇదే పూర్వరూపం. ప్యారిస్‌లోని ఓ కాస్మొటిక్స్ సంస్థ 1884లో మొదటిసారిగా రకరకాల రసాయనాలను ఉపయోగించి ఆధునిక లిప్‌స్టిక్‌ను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇక అప్పటి నుంచి పాశ్చాత్య ఫ్యాషన్ రంగంలో లిప్‌స్టిక్ కీలకంగా మారింది. క్రమంగా ఇది ఇతర దేశాలకూ వ్యాపించింది. -
అయ్యబాబోయ్... దెయ్యం!
శాస్త్రం లండన్‌కు చెందిన ఎలిజెబెత్‌కు నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వచ్చింది. తన గదిలో దెయ్యపు నీడ! గట్టిగా అరుద్దామంటే నోరు పెగలలేదు. బిగుసుకు పోయింది. వాషింగ్టన్కు చెందిన డేవిడ్ గాఢనిద్రలో ఉన్నాడు. తన ఛాతిపై ఎవరో కూర్చున్నారు. నిద్ర నుంచి లేవబోయి, అరవబోయాడు డేవిడ్. రెండూ సాధ్యం కాలేదు!! అక్కడెక్కడో లండన్, వాషింగ్టన్లో మాత్రమే కాదు... మనకు కూడా ఇలాంటి అనుభవాలు చాలాసార్లు ఎదురై ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభవాలు సుపరిచితం. దీన్ని శాస్త్రీయంగా ‘స్లీప్ పెరాలసిస్’ అంటారు. ‘స్లీప్ పెరాలసిస్’ అనేది నిద్రకు, మెలకువకు మధ్య, చేతనకు, అచేతనకు మధ్య ఉగిసలాడే ధోరణి. ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు ‘స్లీప్ పెరాలసిస్’ గురించి అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన ఒక న్యూరల్ మ్యాప్‌ను రూపొందించారు. మెదడులోని నిర్దేశిత ప్రాంతంలో చోటు చేసుకునే ‘కల్లోలం’ దెయ్యాలు, రాక్షసులు నిద్రలో కనిపిస్తాయనేది శాస్త్రవేత్తల అంచనా. -
యాక్సెంచర్‌లో ఉద్యోగం...విలాసాల కోసం చోరీలు
బెంగళూరు : స్నేహితుల ఇళ్లో చోరీలకు పాల్పడిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హెణ్ణూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితురాలిని గోవిందశెట్టిపాళ్యలో నివాసముంటున్న ఎలిజబెత్ అలియాస్ మారీ(22)గా గుర్తించినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. నిందితురాలి వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న ఎలిజబెత్, నాలుగు నెలలుగా పలుమార్లు హెణ్ణూరులోని తన స్నేహితురాలు పూజాశర్మ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో పూజాశర్మ కుటుంబసభ్యుల కళ్లు కప్పి బంగారు నగలు, విలువైన వస్తువులను తన వ్యానిటీ బ్యాగ్‌లో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయేది. పదేపదే ఇంటిలో నగలు చోరీ అవుతుండడంతో పూజాశర్మ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటిలో పనిచేస్తున్న వారిని ప్రశ్నించి వారి ప్రమేయం లేదని తెలుసుకున్నారు. అనంతరం నాలుగు నెలలుగా పూజాశర్మ ఇంటికి వచ్చివెళ్లిన వారిపై నిఘా పెంచారు. ఆ సమయంలో ఎలిజబెత్ వైఖరిపై అనుమానం కలిగింది. ఆమె గురించి వాకాబు చేశారు. ఎలిజబెత్ తండ్రికి తాహతుకు మించి అప్పులు ఉన్నాయని, అయితే ఎలిజబెత్ మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతోందని గుర్తించారు. అనుమానితురాలిగా అదుపులో తీసుకుని పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆమె వద్ద నుంచి పోలీసులు నాలుగున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఆభరణాలను తాకట్టు వ్యాపారికి అమ్మి ఆ డబ్బుతో ఖరీదైన సెల్ఫోన్లు కొనుగోలు చేయటంతో పాటు, విలాసవంత జీవితం గడపటం చేసేంది. అంతేకాకుండా తండ్రి అప్పులను కూడా ఎలిజబెత్ తీర్చేది. -
టెక్కీ... చోరీ
బెంగళూరు, న్యూస్‌లైన్ : స్నేహితుల ఇళ్లో చోరీలకు పాల్పడిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హెణ్ణూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితురాలిని గోవిందశెట్టిపాళ్యలో నివాసముంటున్న ఎలిజబెత్(22)గా గుర్తించినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. నిందితురాలి వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న ఎలిజబెత్, నాలుగు నెలలుగా పలుమార్లు హెణ్ణూరులోని తన స్నేహితురాలు పూజాశర్మ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో పూజాశర్మ కుటుంబసభ్యుల కళ్లు కప్పి బంగారు నగలు, విలువైన వస్తువులను తన వ్యానిటీ బ్యాగ్‌లో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయేది. పదేపదే ఇంటిలో నగలు చోరీ అవుతుండడంతో పూజాశర్మ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటిలో పనిచేస్తున్న వారిని ప్రశ్నించి వారి ప్రమేయం లేదని తెలుసుకున్నారు. అనంతరం నాలుగు నెలలుగా పూజాశర్మ ఇంటికి వచ్చివెళ్లిన వారిపై నిఘా పెంచారు. ఆ సమయంలో ఎలిజబెత్ వైఖరిపై అనుమానం కలిగింది. ఆమె గురించి వాకాబు చేశారు. ఎలిజబెత్ తండ్రికి తాహతుకు మించి అప్పులు ఉన్నాయని, అయితే ఎలిజబెత్ మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతోందని గుర్తించారు. అనుమానితురాలిగా అదుపులో తీసుకుని పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కేసును చాకచక్యంగా పరిశోధించిన హెణ్ణూరు పోలీసులు సీపీ అభినందించి రివార్డు ప్రకటించారు. -
ఎలిజబెత్ రాణికి మునిమనవరాలు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 ఇంట మరో మహారాణి పుట్టింది. ఎలిజబెత్ రాణి మనవరాలు జారా ఫిలిప్స్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జారాకు నెలల నిండిన తర్వాత శుక్రవారం ఆడబిడ్డను ప్రసవించింది. బేబీ బరువు 3.5 కిలోల ఉన్నట్లు బక్కింగ్ హమ్ ప్యాలెస్ పేర్కొంది. గ్లోసిస్టర్ రోయల్ ఆస్పత్రిలో జారా బిడ్డకు జన్మినిచ్చే సమయంలో ఆమె భర్త, రగ్బీ ఆటగాడు మైక్ తిండాల్ ఆమె ప్రక్కనే ఉన్నాడు. ప్రిన్స్ జార్జ్, కేట్ లకు బిడ్డ పుట్టిన ఐదు నెలల్లోనే ఎలిజబెత్ రాణి ఇంట్లోమరో శుభవార్త అందడంతో వారు ఆనంద పరవశంలో మునిగితేలుతున్నారు. మైక్ తిండాల్-జారా ఫిలిప్స్ లకు 2011వ సంవత్సరం జూలై నెలలో వివాహమైంది. -
మలాలాకు బ్రిటన్ రాణి ఆహ్వానం
లండన్: తాలిబన్ల కాల్పుల్లో గాయపడి కోలుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్(16)కు బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ఆహ్వానం పంపారు. మలాలా ధైర్యసాహసాలను మెచ్చుకున్న రాణి ఆమెను బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు రావాలని ఆహ్వానించారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందని బ్రిటన్‌లోని పాక్ హైకమిషనర్‌ను వాకబు చేశారు. ఈ ఆహ్వానం నేపథ్యంలో మలాలాకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించే అవకాశముందన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. -
‘విక్రాంత్’ తొలి అడుగులు!
కొచ్చి: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ తొలి అడుగు వేసింది! రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ సోమవారం కొచ్చి నౌకాశ్రయంలో దీన్ని ప్రారంభించారు. ‘ఇది జాతి యావత్తూ గర్వించదగిన, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. యుద్ధనౌకల నిర్మాణంలో మన సత్తా చాటాం. ఇలాంటి సామర్థ్యం అభివృద్ధి చెందిన కొన్ని దేశాలకు మాత్రమే ఉంది’ అని ఈ సందర్భంగా ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. దేశం కోసం యుద్ధనౌకల నిర్మాణ సుదీర్ఘ ప్రస్థానంలో ఇది కీలకమైన తొలి అడుగుగా అభివర్ణించారు. తొలిదశ నిర్మాణానికి చిహ్నంగా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సోమవారం ప్రారంభించారు. తదుపరి దశలో మిగతా నిర్మాణం పూర్తికానుంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని కొచ్చిన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్(సీఎస్ఎల్)కు ఆంటోనీ సూచించారు. సమన్వయం లేక దీని నిర్మాణంలో చాలా ఏళ్ల జాప్యం జరిగిందన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని దీర్ఘకాలం పోరాడేందుకు నౌకాదళ శక్తిసామర్థ్యాలను మరింత పెంచాలన్నారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1972లో శంకుస్థాపన చేశారని ఆంటోనీ గుర్తు చేసుకున్నారు. పృథ్వీ-2 క్షిపణి, అరిహంత్ అణు జలాంతర్గాములను విజయవంతంగా పరీక్షించటం దేశ రక్షణ రంగ సామర్థ్యానికి రుజువన్నారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంపై ప్రశ్నించగా, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే స్వేచ్ఛ మన బలగాలకు ఉందని ఆంటోనీ చెప్పారు. ‘విక్రాంత్’పై చైనాలో ఆందోళనలు బీజింగ్: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడంపై చైనాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత నేవీని బలోపేతం చేసి చైనా సొంత ప్రాంతంగా భావించే పసిఫిక్ మహాసముద్రంలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ వినియోగిస్తున్న ఐఎన్ఎస్ విరాట్‌కు తోడుగా ఈ ఏడాది జనవరిలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య రానుందని, దీంతో ఆ దేశం చైనాపై పైచేయి సాధిస్తుందని చైనా నావల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు జాంగ్ జుషే చెప్పారు. విక్రాంత్ వినియోగంలోకి వస్తే త మ పొరుగు దేశం సుదూర సముద్రాల్లోనూ కాపలా కాయడానికి వీలవుతుందని, దీంతో దక్షిణాసియాలో సైనిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పారు. విక్రమాదిత్య తోడైతే ఆసియాలో రెండు విమానవాహక యుద్ధనౌకలున్న ఒకే ఒక దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. చైనా గత ఏడాది తన తొలి విమానవాహక యుద్ధనౌకను ప్రారంభించింది. -
నేడు ‘విక్రాంత్’ ప్రారంభం
కొచ్చి: భారత తొలి స్వదేశీయ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొలి దశ నిర్మాణం పూర్తిచేసుకుంది. కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ ఎస్ విక్రాంత్‌ను సోమవారం నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించనున్నారని నేవీ అధికారులు వెల్లడించారు. తొలిదశ నిర్మాణం పూర్తిచేసుకున్న దానికి గుర్తుగా ఈ నౌకను ప్రారంభించనున్నట్లు, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 2016 నాటికి పూర్తయి పరీక్షలకు సిద్ధం కానుందని, 2018 నాటికి నావికాదళంలోకి చేరనుందన్నారు. ప్రస్తుతం ఇలాంటి భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు మాత్రమే ఉండగా.. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ కూడా సత్తా చాటినట్లవుతుందని వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఆర్కే ధావన్ అన్నారు. ఈ నౌక నిర్మాణానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారుచేసిన హైగ్రేడ్ స్టీలును, స్వదేశీయ పరికరాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఇవీ ప్రత్యేకతలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇప్పటిదాకా భారత్ 6-7వేల టన్నుల బరువును మోయగల నౌకలను మాత్రమే నిర్మించగా.. ఈ నౌక ఏకంగా 37,500 టన్నుల బరువును మోయగలగడం విశేషం. దీనిపై రెండు టేకాఫ్ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. మిగ్-29కే, కమోవ్ 31, తేలికపాటి యుద్ధవిమానాలు ఈ నౌకపై మోహరించనున్నాయి. నౌకపై 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 8 డీజిల్ జనరేటర్లు, 4 గ్యాస్ టర్బైన్లు అమర్చారు. దీని డిజైన్‌ను ‘డెరైక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్’ రూపొందించగా, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ 2006 నుంచి నిర్మిస్తోంది.