కోడల్ని కాల్చి చంపేసింది! | Elizabeth Wall Charged With Fatally Shooting Daughter-in-Law in Georgia | Sakshi
Sakshi News home page

కోడల్ని కాల్చి చంపేసింది!

Published Mon, Jun 27 2016 4:00 PM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM

కోడల్ని కాల్చి చంపేసింది! - Sakshi

కోడల్ని కాల్చి చంపేసింది!

జార్జియాః అమెరికా జార్జియాలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకును విడాకులు కోరినందుకు ఏకంగా ఓ అత్తగారు కోడల్ని కాల్చి చంపేసింది. కొద్దిరోజులుగా ఇంటి గొడవలు కారణంగా కోడలు.. తన ఇద్దరు పిల్లలతోపాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లితండ్రులతో కలసిఉంటున్న ఆమెను కాపురానికి తీసుకొచ్చే వంకతో వెళ్ళిన అత్త.. మనవలు చూస్తుండగానే కోడల్ని కాల్చి చంపేసింది.

సౌత్ జార్జియా మెక్ రియోకు చెందిన 68 ఏళ్ళ ఎలిజబెత్ వాల్.. వాయువ్య అట్లాంటా పౌడర్ స్ప్రింగ్స్  లో నివసిస్తున్నతన 35 ఏళ్ళ కోడలు.. జెన్నావాల్ ను తుపాకీతో కాల్చి చంపింది. కొడుకుతో గొడవలు పడి కొద్దిరోజులుగా పుట్టింట్లోనే ఉంటున్నజెన్నాను కాపురానికి తెచ్చేందుకు వెళ్ళిన ఎలిజబెత్.. అక్కడే ఉన్న మనవళ్ళను ముందుగా బయటకు పంపించి, ఇంట్లోనే ఉన్న కోడల్ని మాత్రం షూట్ చేసి, హత్య చేసినట్లు జైల్ రికార్డులు చెప్తున్నాయి. కోడల్ని చంపడంతోపాటు, పిల్లల ఎదుటే హింసకు పాల్పడినందుకు గాను అదుపులోకి తీసుకున్న పోలీసులు..  ఎలిజబెత్ వాల్ పై పలు కేసులు నమోదు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన  మిగిలిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

బాధితురాలు కాబ్ కౌంటీ కెంప్ ఎలిమెంటరీ స్కూల్లో కిండర్గార్టెన్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ వెబ్ సైట్ లోని వివరాలను బట్టి ఆమె.. జార్జియా కెన్నెసా హారిసన్ హై  లోను, జార్జియా యూనివర్శిటీలోను చదివి  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె...కాబ్ కౌంటీలోని మరో రెండు స్కూళ్ళలో కూడ చదివినట్లు వెబ్ సైట్ లోని వివరాలు చెప్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement