2 killed in shooting at Georgia house party with over 100 teenagers - Sakshi
Sakshi News home page

100 మంది టీనేజర్లు కలిసి పార్టీ చేస్కుంటుండగా కాల్పులు.. 

Published Mon, Mar 6 2023 5:48 PM | Last Updated on Mon, Mar 6 2023 6:53 PM

Us Shooting House Party Over 100 Teenagers Georgia - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. జార్జియా రాష్ట్రం డౌగ్లాస్ కౌంటీలోని ఓ ఇంట్లో 100 మంది టీనేజర్లు కలిసి పార్టీ చేసుకుంటుండగా కాల్పుల మోత మోగింది.  ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

శనివారం రాత్రి 10:30-11:30 మధ్య ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పార్టీలో ఏదో గొడవ జరిగే కాల్పులు చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అందరూ టీనేజర్లే ఉన్నారని, ఘటన సమయంలో పెద్దలు ఒక్కరైనా ఉన్నారో లేదో తెలియదని పేర్కొన్నారు.

ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అయ్యాక ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని చెప్పారు. కాల్పులు ఒక్కరే జరిపారా? లేదా ఎక్కువ మందికి ఇందులో ప్రమేయం ఉందా? తెలియాల్సి ఉందన్నారు.
చదవండి: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీ కన్నుమూత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement