10 Reportedly Injured In Shooting At Miami Restaurant During French Montana Video Shoot - Sakshi
Sakshi News home page

అమెరికా రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు.

Published Fri, Jan 6 2023 4:30 PM | Last Updated on Fri, Jan 6 2023 6:07 PM

Shooting At Miami Restaurant During French Montana Video Shoot - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులమోత మోగింది. ఫ్లోరిడాలోని మియామి గార్డెన్స్ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ సమయంలో ఫ్రెంచ్ ర్యాపర్ మోంటనా, రాబ్49 అక్కడ మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్నారు.

దుండగుడి కాల్పుల్లో ర్యాపర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో 15 రౌండ్ల కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తూటాల శబ్దం విని జనం పరుగులు తీశారని  పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 10 మందికి తూటాలు తగిలినట్లు సమాచారం. 

అంతకుముందు 'ది లికింగ్ రెస్టారెంట్' బయట కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలోనూ పలువురు గాయపడ్డారు. పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితులు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement