Florida shooting
-
రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులమోత మోగింది. ఫ్లోరిడాలోని మియామి గార్డెన్స్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ సమయంలో ఫ్రెంచ్ ర్యాపర్ మోంటనా, రాబ్49 అక్కడ మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్నారు. దుండగుడి కాల్పుల్లో ర్యాపర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో 15 రౌండ్ల కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తూటాల శబ్దం విని జనం పరుగులు తీశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 10 మందికి తూటాలు తగిలినట్లు సమాచారం. అంతకుముందు 'ది లికింగ్ రెస్టారెంట్' బయట కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలోనూ పలువురు గాయపడ్డారు. పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితులు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి.. -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
టల్లాహస్సీ: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. శుక్రవారం ఫ్లొరిడా రాష్ట్ర రాజధాని టల్లాహస్సీలోని యోగా స్టూడియోలో ఓ దుండగడు ఆకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు జరిగాయనే సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లామని, కానీ అక్కడికి వెళ్లేలోపు బుల్లెట్ల గాయాలతో కొంతమంది పడి ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామని, ఇందులో ఇద్దరు ఘటన స్థలిలోనే మృతి చెందారని పేర్కొన్నారు. అయితే మృతుల్లో ఒకరు దుండగుడున్నాడని గుర్తించామని, అతను తనకు తనే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఘటనస్థలిలో చాలా మంది దుండగుడితో పోరాడారని, తమ ప్రాణాలతో పాటు ఇతరులను రక్షించటానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. -
‘ఆ స్కూల్లో 20 మందిని చంపేస్తా’
వాషింగ్టన్: ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్ పాఠశాలపై ఫిబ్రవరిలో కాల్పులకు తెగబడి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న ఉన్మాది నికోలస్ క్రూజ్ ఆ ఘటనకు ముందు తీసిన వీడియోలు బుధవారం బయటపడ్డాయి. వాటిల్లో పలు విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి. మరికొద్దిసేపట్లో తాను ఏం చేయబోతున్నాడో నికోలస్ ఒక వీడియోలో పేర్కొన్నాడు. ‘నేను 2018లో మరో నరహంతకున్ని కాబోతున్నాను. నేను చదువుకున్న మర్జోరీ స్టోన్మాన్ డగ్లస్ పాఠాశాలలో నరమేధం సృష్టించబోతున్నాను. నరమేధం వల్ల నాకు ఎంతో పేరొస్తుంది. గతంలో కాల్పులకు తెగబడి ఉన్మాదం సృష్టించిన వారిని అనుసరించబోతున్నాను. వార్తల్లో నన్ను చూశాక తెలుస్తుంది ఈ ప్రపంచానికి నేనెవరినో..! కనీసం 20 మందిని చంపడమే నా లక్ష్యం. నా వద్ద గల ఏఆర్-15 గన్‌తో రెండు రౌండ్లలో పని ముగించేస్తా. మీరంతా నా చేతుల్లో చావబోతున్నారు’ అంటూ నికోలస్ వికృత దరహాసం చేశాడు. కాగా, నికోలస్ హత్యాకాండకు పాల్పడటానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. నికోలస్ ప్రవర్తన సరిగా లేదని, తుపాకి కూడా కలిగి ఉన్నాడని ఘటనకు ముందు పలు సందర్భాల్లో పోలీసుల అతనిపై అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. వారి అనుమానాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 14న దర్జాగా స్కూల్లోకి ప్రవేశించిన నికోలస్ 17 విద్యార్థులను తన గన్‌తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చాడు. మరో 17 మందిని తీవ్రంగా గాయపరిచాడు. అభం శుభం తెలియని పిల్లలను బలితీసుకుని ఉరికంభం ఎక్కబోతున్నాడు. బ్రోవార్డ్ కౌంటీ న్యాయవాదులు నికోలస్‌కు మరణ శిక్ష పడేలా చూస్తామని అన్నారు. కాగా, ఈ వీడియోని బహిర్గతం చేయొద్దని బాధిత కుటుంబాలు మీడియా చానెళ్లను కోరాయి. The Voice of Evil #NikolasCruz pic.twitter.com/2N5mjqVPGn — Carl Stresing (@CarlStresing) May 30, 2018 -
ట్రంప్‌కి ఇంగ్లిష్ రాదా..!
న్యూయార్క్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..! అక్షరాల కూర్పులో తప్పులు దొర్లితే అమెరికా అధ్యక్షుడి ఉత్తరమైనా దానిపై టీచర్ పెన్ను పడాల్సిందే..! విషయమేంటంటే.. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని పాఠశాలపై ఫిబ్రవరిలో నికోలజ్ క్రూజ్ అనే ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని అట్లాంటాలో నివాసముంటే వ్యోన్ మాసోన్(61) అనే రిటైర్డ్ టీచర్ కొన్నాళ్ల క్రితం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఆమె ఉత్తరంపై స్పందించిన వైట్‌హౌస్ కార్యాలయం ట్రంప్ పేరుతో మాసోన్కు ప్రత్యుత్తరం రాసింది. ‘విద్యార్థుల భద్రత, బాధిత కుటుంబాల సంక్షేమంపై మీ సూచనలకు ధన్యవాదాలు. త్వరలోనే అన్ని వర్గాల మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వైట్ హౌస్‌లో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామ’ని లెటర్లో పేర్కొన్నారు. అయితే, సదరు ఉత్తరం తప్పుల తడకగా ఉండడంతో ఇంగ్లిష్ టీచర్ మాసోన్కు చిర్రెత్తుకొచ్చింది. లేఖలోని దోషాలను సరిచేయకుండా ఆమె ఉండలేక పోయారు. అందులోని గ్రామర్, ఉచ్చారణ దోషాలను సరిదిద్ది ఆ లేఖను తిరిగి వైట్ హౌస్‌కు పంపారు. ఉత్తరం పైభాగాన ‘గ్రామర్, శైలికి సంబంధించి మీరు చెక్ చేశారా?’ అని మాసోన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లేఖలోని భాషాంశాలు మరీ పేలవంగా ఉన్నాయి. పొరపాట్లు సహజం. నాకు తెలిసినంత వరకు చేశాను’ అని మాసోన్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఆ లెటర్ కాపీని షేర్ చేశారు. అయితే ‘ఓ మై గాడ్’, ‘యూ ఆల్’ అంటూ ఆమె ఉత్తరంలో ఆశ్చర్యం వ్యక్తం చేయడాన్ని కొందరు తప్పుబట్టారు. -
'దెయ్యాలే నాతో ఆ పని చేయించాయి..'
వాషింగ్టన్ : 'నా తలలో ఏవేవో అరుపులు వినిపించేవి. అవి దెయ్యాల అరుపులనుకుంటా. అవే నాకు కాల్పులు ఎలా జరపాలో చెప్పాయి' ఈ మాటలు ఫ్లోరిడా స్కూల్లో కాల్పులకు తెగబడిన ఉన్మాది పోలీసులకు చెప్పాడు. ఫ్లోరిడాలోని హైస్కూల్లో అదే స్కూల్లో గతంలో చదివిన నికోలస్ క్రజ్ అనే యువకుడు ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు స్కూల్ సిబ్బంది సహా 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడిన నికోలస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు పోలీసులకు పై విధంగా సమాధానం చెప్పాడు. తన మానసిక పరిస్థితి ఎప్పుడూ చాలా ఆందోళనగా ఉండేదని, ఎవరో తనను పిలిచినట్లుగా అనిపిస్తుండేదని, తనకు పుర్రెల్లో రకరకాల శబ్దాలు వినిపిస్తుండేవని పోలీసులకు చెప్పాడు. వాటిని తాను దెయ్యాలుగా భావిస్తున్నానని, అవే తనకు ఆదేశాలు చేశాయని ఆ క్రమంలోనే కాల్పులకు తెగబడినట్లు అతడు పోలీసులకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతున్నాడు. -
ఆ టీచర్ లేకుంటే క్లాస్రూమ్ రక్తపు మడుగే..
న్యూయార్క్ : అమెరికాలో సంచలనం సృష్టించిన కాల్పుల సమయంలో ఓ భారతీయ సంతతి మహిళా ఉపాధ్యాయురాలు పెద్ద మొత్తంలో ధైర్యసాహసాలు ప్రదర్శించింది. వేగంగా స్పందించి పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు కాపాడింది. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేసినా క్షణాల్లో ఆ తరగతి గది మరో రక్తపు మడుగులా మారి చిన్నారులు విగతజీవులయ్యేవారు. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని హైస్కూల్లో అదే స్కూల్లో గతంలో చదివిన ఓ యువకుడు ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 17మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కాల్పులు జరిగే సమయంలో భారతీయ సంతతి మ్యాథ్స్ టీచర్ శాంతి విశ్వనాథన్ ఆల్జీబ్రాను బోధిస్తున్నారు. కాల్పుల శబ్దం విన్నవెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. వేగంగా వెళ్లి తలుపులు మూశారు. అలాగే, ఉన్మాదిని చూసి విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా కిటికీలను కూడా మూసేశారు. ఆ వెంటనే వారందరిని నేలపై పడుకోవాలని చెప్పారు. అనంతరం కొద్ది సేపటి తర్వాత పోలీసు అధికారులు వచ్చి తలుపు తీయమన్నా సరే ఆమె తీయలేదు. తాను పోలీసునని చెప్పుకొని తలుపులు తీయించేందుకు ఉన్మాదినే ట్రిక్స్ ఉపయోగించి ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడని భావించి పోలీసులను కూడా అడ్డుకున్నారు. దీంతో కిటికీలు ఓపెన్ చేసి పోలీసులని నిర్దారించుకొని పిల్లలను బయటకు పంపించింది. 'ఆమె చాలా వేగంగా స్పందించారు. తన తెలివి తేటలన్నీ ఉపయోగించి చాలామంది పిల్లలను కాపాడారు. పోలీసులు వెళ్లి తలుపు కొట్టినా కూడా సాయుధుడే అని అనుమానించి తలుపు తెరవలేదు. వీలయితే తలుపులు బద్దలు కొట్టుకోండని చెప్పారు. నిజంగా ఆమె సాహసం అద్భుతం' అని డాన్ జార్బో అనే ఓ విద్యార్థి తల్లి చెప్పినట్లు సన్ సెన్షియల్ తెలిపింది. -
విషాద పరంపర
తుపాకి సంస్కృతి మరోసారి అమెరికాలో నెత్తురు పారించింది. ఫ్లోరిడా రాష్ట్రం లోని పార్క్‌లాండ్ నగరంలో ఉన్న పాఠశాలలో ఒక ఉన్మాద యువకుడు సెమీ ఆటోమాటిక్ రైఫిల్ చేతబూని మూడంటే మూడే నిమిషాల్లో 17మంది పసివాళ్ల ఉసురుతీశాడు. మరో 15మందిని గాయపరిచాడు. వీరిలో ముగ్గురు మినహా మిగిలినవారికి ప్రాణాపాయం తప్పి ఉండొచ్చుగానీ ఈ ఉదంతం సృష్టించిన భయో త్పాతం వీరిని జీవితాంతమూ వెంటాడుతూనే ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారం భమై 45 రోజులవుతుండగా అక్కడి పాఠశాలల్లో తుపాకి పేలడం ఇది 18వసారి. 3,200 మంది చదువుకునే ఒక పాఠశాలలో అప్పటికే దాన్నుంచి బహిష్కృతుడైన ఒక ఉన్మాద విద్యార్థి ప్రవేశించి, పిల్లల్ని కాల్చుకుంటూ పోవడం ఊహించడానికే భయంకరమైన సన్నివేశం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా తీవ్ర సంతాపం ప్రకటించడం, ఊరడింపు మాటలు మాట్లాడటం అమెరికాలో మామూలే. అధ్య క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా ఆ లాంఛనాన్ని పూర్తిచేశారు. దాంతోపాటు ఎప్పటిలాగే దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. నిందితుడి మానసిక ఆరోగ్యం బాగా లేదన్నారు. నిరుడు టెక్సాస్ చర్చిలో ఒక ఉన్మాది 26మందిని కాల్చి చంపేసినప్పుడు కూడా ఆయన అచ్చం ఇలానే మాట్లాడారు. అప్పడు మాత్రమే కాదు... తుపాకి పేలినప్పుడల్లా ఆయనకు అందులో మానసిక అనారోగ్యమే సమస్యగా కనిపిస్తుంది. చదువుల బడులు జేమ్స్‌బాండ్ సినిమాల తరహాలో తుపాకి కాల్పులకు వేదికలు కావడం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్క అమెరికాలోనే కని పిస్తుంది. ఇది దాని ప్రారబ్ధం కాదు... చేజేతులా చేసుకున్నది. అమెరికా పౌరులకు తుపాకి కలిగి ఉండే హక్కు ఎన్నడో 1791లో అక్కడి రాజ్యాంగానికి చేసిన రెండో సవరణ ద్వారా అమల్లోకొచ్చింది. దీన్ని వదుల్చు కోవడానికి సరిగ్గా యాభైయ్యేళ్లక్రితం ఆ దేశానికి అవకాశం వచ్చింది. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని దుండగులు కాల్చిచంపాక సాధా రణ పౌరులకు సులభంగా తుపాకులు అందుబాటులోకి రానీయొద్దన్న డిమాండు వచ్చింది. అయితే అది త్వరలోనే చల్లారిపోయింది. కానీ 1968లో పౌర హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, సెనెటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ సైతం ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయాక ఆ చర్చ మళ్లీ తలెత్తింది. అది సవ్యంగా కొనసాగి, ఒక అర్ధవంతమైన పరిష్కారం లభించి ఉంటే అమెరికా ఇప్పుడీ పరి స్థితుల్లో ఉండేది కాదు. కానీ ఆ సంవత్సరం తుపాకుల నియంత్రణ చట్టం అమల్లోకొచ్చింది. దాని ప్రకారం తుపాకుల అమ్మకందార్లు పోస్టు ద్వారా జరిగే అమ్మకాల్ని నిలిపేయాలి. అలాగే తుపాకి కొనేవారికి నేర చరిత్ర ఉందో, లేదో చూడాలి. మానసిక రోగులకు అమ్మకూడదు. ఇలాంటివే ఇంకా చాలా నిబంధనలు న్నాయి. కానీ అంగట్లో సరుకులమ్మినట్టు తుపాకులు అమ్మకూడదన్న నిషేధం మాత్రం లేదు. ఫలితంగా ఎవరైనా తుపాకి కొనుక్కోవచ్చు. వారికి దాంతో ఏం పని, ఎందుకు కొన్నారని ఆరా తీసే నాథుడు లేడు. ఆస్ట్రేలియాలో 1996లో ఉన్మాది ఒకడు 35మంది పర్యాటకుల్ని కాల్చిచంపినప్పుడు అక్కడి ప్రభుత్వం చురుగ్గా కదిలి పౌరుల వద్ద ఉన్న తుపాకుల్ని వెనక్కు ఇచ్చేయమని కోరింది. అందుకైన డబ్బు వెనక్కి ఇచ్చింది. అవి తప్పనిసరనుకుంటున్నవారు పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే వారు తనిఖీ చేసి పర్మిట్ మంజూరు చేసే విధానం అమల్లోకి తెచ్చారు. బ్రిటన్‌లోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఇలాంటి విధానమే అమల్లో ఉంది. తుపాకులు విచ్చలవిడిగా లభించేచోట వాటివల్ల ముప్పు ఎక్కువ ఉంటుం దని, పకడ్బందీ నియంత్రణలున్నచోట తీవ్రత తక్కువుంటుందని ఇంగితజ్ఞానం ఉన్నవారికి అర్ధమవుతుంది. కానీ రిపబ్లికన్ పార్టీకి ఆ జ్ఞానం లేదు. బరాక్ ఒబామా పదవిలో ఉన్నప్పుడు ఈ తుపాకుల సంస్కృతిని ధ్వంసం చేయాలని గట్టిగా ప్రయ త్నిస్తే రిపబ్లికన్లు దాన్ని సాగనివ్వలేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ)కు వత్తాసుగా, దానికి లబ్ధి చేకూరేలా మొదటినుంచీ అది వ్యవహరిస్తోంది. ప్రపం చంలో పౌరుల దగ్గరున్న తుపాకుల్లో సగం అమెరికా వాసుల్లోనే ఉన్నాయని గణాం కాలు చెబుతున్నాయి. అలాగని అమెరికాలో అందరికీ ఈ పిచ్చి లేదు. జనాభాలో 3 శాతంమంది వద్ద మాత్రమే తుపాకులున్నాయి. అయితే వీరిలో ఒక్కొక్కరి వద్ద సగ టున 40 తుపాకులుంటాయని అంచనా. మొత్తంగా పౌరుల దగ్గరున్న తుపాకుల సంఖ్య 13 కోట్ల 30 లక్షలు. ఇవి నిరుడు వెలువడిన గణాంకాలు. విషాదమేమంటే 1968 నుంచి ఇంతవరకూ తుపాకుల కారణంగా అమెరికాలో మరణించినవారి సంఖ్య ఆ దేశ చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలన్నిటిలో చనిపోయినవారి అమె రికన్ల సంఖ్య కన్నా చాలా ఎక్కువ. ఏటా అమెరికాలో తుపాకి హింసతో 33,000 మంది చనిపోతున్నారు. ఇందులో మూడింట రెండొంతులు ఆత్మహత్యలు, మిగిలి నవి హత్యలు. గాయపడేవారి సంఖ్య 70వేల పైమాటే. తుపాకులు లేకుండా చేయా లన్న డిమాండు అరణ్యరోదన అవుతుండగా, ఆ బూచి చూపించి ఇతరేతర వ్యాపా రాలు విస్తరిస్తున్నాయి. పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్‌లు అమ్మడం మొదలు కొని పాఠశాలల పకడ్బందీ రక్షణ బాధ్యత తీసుకుంటామంటూ సొమ్ము చేసుకునే సంస్థల వరకూ అనేకం వెలుస్తున్నాయి. వాటి వ్యాపారం విలువ నిరుడు దాదాపు 300 కోట్ల డాలర్లు! ఇలాంటి విపత్కర పరిస్థితికి దేశం చేరుకుంటే డోనాల్డ్ ట్రంప్ ఎప్పటి మాదిరే ‘మానసిక అనారోగ్యం’ వాదన తీసుకురావడమంటే అమెరికా ప్రజల్ని వంచిం చడమే. మళ్లీ ఒకటి, రెండు వారాల్లో ఇవే ఘటనలు పునరావృతం కావడానికి దోహదపడటమే. ఎటునుంచో ఉగ్రవాదులు చొరబడి దురంతాలకు పాల్పడతారని అనుక్షణం వణికే అమెరికా సమాజం తనలో అంతర్లీనంగా తిష్ట వేసుకుకూర్చున్న శత్రువు జాడను పసిగట్టలేకపోతోంది. దానికి వ్యతిరేకంగా బలమైన స్వరం విని పించలేకపోతోంది. కత్తి అంచున సాగే తన ప్రయాణంలో ప్రతి అడుగూ ప్రాణాంత కమైనదేనని గుర్తించనంతవరకూ... దాన్ని సరిదిద్దుకోనంతవరకూ అమెరికాకు ఇలాంటి విషాద ఉదంతాలు తప్పవు. -
బీరు కొనడం కష్టం... తుపాకీ ఈజీ
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఉన్మాదిగా మారిన ఓ 19 ఏళ్ల విద్యార్థి నికోలస్ క్రజ్ నిర్ధాక్షిణ్యంగా 17 మంది విద్యార్థులను కాల్చి చంపిన విషయం తెల్సిందే. అందుకు ఆ విద్యార్థి ఉపయోగించిన ఆయుధం ‘ఏఆర్–15’ పిస్టల్. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, న్యూయార్క్ రాష్ట్రాలు మాత్రమే ఈ పిస్టల్ అమ్మకాలను నిషేధించాయి. 21 ఏళ్లున్న వ్యక్తులకు మాత్రమే ఈ పిస్టల్‌ను అమ్మాలని అమెరికా ఫెడరల్ చట్టం సూచిస్తోంది. 18 ఏళ్లకే తుపాకులు విక్రయించవచ్చని పలు రాష్ట్రాలు చట్టాలు చెబుతుండడంతో ఆ ఏడుకే ఏఆర్–15 లాంటి పిస్టళ్లను కూడా ఆయుధ దుకాణాలు స్వేచ్ఛగా అమ్ముతున్నాయి. అందుకనే 19 ఏళ్ల నికోలస్ క్రజ్ కూడా సులభంగానే ఈ లైసెన్స్డ్ పిస్టల్‌ను సులభంగానే కొన్నాడు. తాను ఇలాంటి పిస్టల్‌ను కొని తోటివారిని కాల్చబోతున్నట్లు కూడా ఆన్లైన్లో గతంలోనే హెచ్చరించారట. అలాంటప్పుడు ఆ విద్యార్థి గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ఆయుధ సంస్థలకు ఆయన ఫొటో పంపించడం లాంటి చర్యలేవీ పోలీసులు తీసుకోలేదు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఎంతో మంది మరణిస్తున్నప్పటికీ తుపాకీ విక్రయాలను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 21 ఏళ్లలోపు బీరు తాగడానికి వీల్లేదనే చట్టాన్ని మాత్రం దేశంలో కఠినంగా అమలు చేస్తారుగానీ, తుపాకులను అమ్మరాదనే చట్టాన్ని మాత్రం కఠినంగా ఎందుకు అమలు చేయరాదని పాఠశాల దుర్ఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. హంతకుడుగా మారిన విద్యార్థి ట్రంప్ లాంటి టోపీని ధరించడం కూడా దేశం ఎటు పోతుందా? అన్న దానికి సూచికగా మారిందని వారంటున్నారు. -
'నేను బాత్రూమ్ లో దాక్కున్నా, వాడు వస్తున్నాడు'
ఆర్లెండో: కొడుకు ఎడీ జస్టిస్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చేటప్పటికి మినా జస్టిస్ గాఢ నిద్రలో ఉంది. తాను వెళ్లిన క్లబ్ లో కాల్పులు జరుగుతున్నాయని, చనిపోవడం ఖాయమని కొడుకు మెసేజ్ పెట్టడంతో ఆమె అమాంతంగా నిద్రలేచింది. ఫ్లోరిడాలోని ఆర్లెండో పల్స్ నైట్ క్లబ్ లో నరమేధం జరిగినప్పుడు అక్కడే ఉన్న 30 ఏళ్ల ఎడీ జస్టిస్ తన తల్లికి మెసేజ్ లు పంపాడు. వారిద్దరి మధ్య పలు మెసేజ్ లు నడిచాయి. తెల్లవారుజామున 2.06 ప్రాంతంలో 'మమ్మీ ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ పెట్టి, నైట్ క్లబ్ లో కాల్పులు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలిపాడు. ఆమె ఫోన్ చేసినా సమాధానం రాలేదు. దీంతో నీవు బాగానే ఉన్నావా అంటూ మెసేజ్ పంపింది. మరో నిమిషానికి తాను బాత్రూమ్ లో దాక్కున్నానని సమాధానం వచ్చింది. ఈ క్లబ్ లో ఉన్నావని అడగ్గా 'పల్స్, డౌన్ టౌన్, పోలీసులకు ఫోన్ చేయి' జవాబిచ్చాడు. మరో నిమిషం తర్వాత 'నేను చనిపోతాను' అంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో భయపడిన మినా జస్టిస్ 911కు ఫోన్ చేసింది. 'నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నా. నువ్వు అక్కడే ఉన్నావా, ఫోన్ చేయి' అంటూ కొడుక్కి ఆమె మెసేజ్ లు పంపింది. 2.39 గంటలకు అతడి నుంచి సమాధానం వచ్చింది. 'నేను బాత్రూమ్ లోనే ఉన్నా. వాడు ఇటే వస్తున్నాడు. నన్ను చంపేస్తాడు' అంటూ మెసేజ్ చేశాడు. 'నీతో పాటు ఎవరైనా ఉన్నారా, పోలీసులు వచ్చారా' మెసేజ్ పెట్టగా రాలేదని జవాబిచ్చాడు. తీవ్రవాది మాతో పాటే బాత్రూమ్ లో ఉన్నాడని చెప్పాడు. కాల్పులు జరుపుతోంది అతడేనా అని అడగ్గా 'యస్' అని సమాధానమిచ్చాడు. తర్వాత అతడి నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. అయితే తన కొడుకు గురించి ఎటువంటి సమాచారం తెలియలేదని మినా జస్టిస్ ఆందోళన చెందుతోంది. ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతోంది. తన కొడుకు ప్రాణాలతో ఉండాలని ప్రార్థిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున ఆర్లెండో నైట్ క్లబ్ లో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 50 మందికిపైగా మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. -
నైట్ క్లబ్లో నరమేధం
అమెరికాలోని ఆర్లెండో ‘గే’ క్లబ్లో ఉన్మాది కాల్పులు 50 మందికి పైగా మృతి.. 53 మందికి గాయాలు గోడను పేల్చేసి ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. 30 మంది బందీలకు విముక్తి ఉన్మాది అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్‌గా గుర్తింపు ఇది ఉగ్రవాద చర్యే: ఒబామా; మా పనే: ఐసిస్ ఆర్లెండో: అది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం.. ఆర్లెండో నగరంలో గే (స్వలింగ సంపర్కులు)ల కోసం వెలిసిన పల్స్ నైట్ క్లబ్.. సమయం.. ఆదివారం తెల్లవారుజాము 2 గంటలు..! కళ్లు చెదిరే కాంతులు, అదరగొట్టే బీట్ మధ్య క్లబ్లో అంతా ఉర్రూతలూగుతున్నారు.. మరికొద్ది సేపట్లో క్లబ్ మూస్తారనగా ఒక్కసారిగా ధన్.. ధన్.. ధన్..! ఓ ఉన్మాది వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న క్లబ్ రక్తసిక్తమైంది. ఉన్మాది కాల్పుల్లో 50 మందికిపైగా చనిపోయారు. మరో 53 మంది గాయపడ్డారు. కాల్పుల విషయం తెలియగానే క్లబ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఉన్మాదిని మట్టుబెట్టారు. అతడిని అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్‌గా గుర్తించారు. క్లబ్ నుంచి 30 మంది బందీలను రక్షించారు. ఇది ఉగ్రవాద చర్యేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. కాల్పులు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించుకుంది. ఉలిక్కిపడ్డ అమెరికా..: ఆర్లెండోలోనే శనివారం జరిగిన కాల్పుల్లో యూట్యూబ్ గాయని క్రిస్టినా గ్రిమ్మీ మరణించింది. ఇది మరవకముందే మరోసారి కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద కాల్పుల దుర్ఘటనగా చెబుతున్నారు. ఉన్మాది ఉన్నట్టుంటి కాల్పులకు తెగబడడంతో అనేక మంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. కొందరు బాత్రూముల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాల్పుల్లో మొదట 20 మందే మరణించారని భావించినా.. చివరికి 50 మందికిపైగా చనిపోయినట్టు తేలింది. అయితే వీరంతా ఉన్మాది కాల్పుల్లోనే మరణించారా? లేక పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రమాదవశాత్తూ ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్నది తెలియాల్సి ఉంది. గోడను పేల్చేసి.. ఆపరేషన్ కాల్పుల విషయం తెలియగానే పోలీసులు క్లబ్‌ను చుట్టుముట్టినా.. ఐదు గంటల వరకూ లోపలకు వెళ్లలేకపోయారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో పాటు స్వాట్(స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీం) బృందాల్ని రప్పించారు. ఉన్మాదిని మట్టుపెట్టేందుకు ముందుగా క్లబ్ పరిసరాల్ని పూర్తిగా ఖాళీ చేయించారు. బందీల్ని విడిపించేందుకు ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. పేలుడు పదార్థాలతో గోడను పేల్చేసి అత్యాధునిక వాహనం ‘బేర్‌క్యాట్’తో స్వాట్ బృందాలు క్లబ్‌లోకి ప్రవేశించాయి. ఉన్మాదిని మట్టుబెట్టి దాదాపు 30 మందికి విముక్తి కల్పించాయి. గాయపడ్డవారిని ఆర్లెండో రీజినల్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. గస్తీ పోలీసును తప్పించుకొని.. ఆర్లెండో పోలీసు చీఫ్ జాన్ మినా కథనం ప్రకారం... మతీన్ రైఫిల్, హ్యాండ్‌గన్‌తో క్లబ్‌లోకి వెళ్లేందుకు యత్నించాడు. అయితే అక్కడ గస్తీ ఉన్న పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. మతీన్ తప్పించుకొని క్లబ్‌లోకి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఒబామా ఉన్నతస్థాయి సమీక్ష కాల్పుల నేపథ్యంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రతా అధికారులతో, ఉగ్రవాద నిరోధక విభాగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనతో ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఏదైనా సంబంధముందా అన్న ప్రశ్నకు ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి రాన్ హార్పర్ స్పందిస్తూ.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని చెప్పారు. ఉన్మాది ఉగ్రవాద సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యాడా అన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు. విదేశీ ఉగ్రవాద కోణంతోపాటు, దుండగుడు ఒక్కడేనా.. కాదా? అన్న కోణంలోను అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ‘గే ’లపై అసహ్యంతోనే..: మతీన్ తండ్రి ‘గే’లంటే అసహ్యంతో తన కొడుకు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని మతీన్ తండ్రి మిర్ సిద్దిఖీ ఓ న్యూస్ ఛానల్‌కు తెలిపాడు. అంతేకానీ అతడు అవ లంబిస్తున్న ఇస్లాంకు సంబంధం లేదన్నాడు. మయామీలో ఒక గే జంట కౌగిలించుకోవడం చూసిన ఒమర్ ఇటీవల తన సమక్షంలో తీవ్రంగా విమర్శించాడని సిద్దిఖీ తెలిపాడు. ఫేస్బుక్ మెసేజ్‌లతో అప్రమత్తం ఒకవైపు కాల్పులు జరుగుతుండగా క్లబ్‌లోని అందరి ఫోన్లలో ఫేస్బుక్ మెసేజ్‌లు... ‘అందరూ క్లబ్ నుంచి పారిపోండి. పరుగెత్తండి ’ అంటూ పల్స్ క్లబ్ యాజమాన్యం ఫేస్బుక్లో అందరినీ అలర్ట్ చేసింది. ఉదయం ఆరుగంటలకు తీవ్ర విషాదంతో కూడిన మరో పోస్టు.. ‘ఏదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు తెలుపుతాం. ఈ ఘోర దుర్ఘటనను ఎదుర్కొనేందుకు దయచేసి అంద రూ ప్రార్థించండి. మీ ఆలోచనలు, ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ... కొద్ది రోజుల క్రితమే ఆర్లెండొ ఎల్జీబీటీ కమ్యూనిటీ వార్షిక గే సంబరాలు నిర్వహించుకుంది. గేల కోసం అమెరికాలో నిర్వహించే అతిపెద్ద ఉత్సవం ఇదే. క్లబ్ వెనక్కి పరిగెట్టాం: ప్రత్యక్ష సాక్షి రికార్డో ‘కాల్పులు మొదలగానే జనం కింద పడుకున్నారు. సీలింగ్పైకి కూడా కాల్పులు జరపడంతో లైట్లన్నీ ధ్వంసమయ్యాయి. ఒక్క నిముషమే కాల్పులు జరిగినా చాలా సేపు కొనసాగినట్లు అనిపించింది. మధ్యలో కొద్ది సేపు ఆగడంతో క్లబ్ వెనక్కి పరుగెట్టాం’ అంటూ మరో ప్రత్యక్ష సాక్షి రికార్డో నెగ్రాన్ వెల్లడించాడు. తప్పించుకున్న అక్కాచెల్లెళ్లు కెన్యా మిచెల్స్.. ప్యూర్టోరికోకు చెందిన డ్రాగ్ క్వీన్(గే క్లబ్‌ల్లో ప్రత్యేక నృత్యం చేసేవారు). తన సోదరి జాస్మిన్‌తో కలిసి స్టేజ్‌పైన ప్రదర్శనలిస్తోంది. ఇంతలో ఒక్కసారిగా కాల్పులు.. అదృష్టవశాత్తూ అక్కాచెల్లెళ్లిద్దరు కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఎవరీ మతీన్..? క్లబ్లో కాల్పులకు తెగబడ్డ ఒమర్ మతీన్‌ను అఫ్గాన్ సంతతికి చెందిన వాడిగా గుర్తించారు. అమెరికాలో స్థిరపడిన అఫ్గాన్ దంపతులకు 1986లో జన్మించిన ఇతడు.. ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీలో నివసిస్తున్నాడు. ఈ ప్రాంతం ఆర్లెండోకు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉంది. ఒమర్‌కు ఇంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేదని సీబీఎస్ న్యూస్ ఛానల్ పేర్కొంది. ఇతడికి ఇస్లామిక్ ఉగ్రవాదంతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒమర్ మతీన్‌పై గతంలోనే అమెరికా దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయని ద డైలీ బీస్ట్ పత్రిక పేర్కొంది. 2013, 2014లో ఇతడి కదలికలపై ఎఫ్ఐబీ దృష్టిసారించింది. ఒక దశలో మతీన్‌పై విచారణ ప్రారంభించిన ఎఫ్‌బీఐ.. తదుపరి విచారణ కోసం ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో ఆ కేసును మూసివేయాల్సి వచ్చింది. డ్రమ్ బీట్ శబ్దం అనుకున్నా ప్రత్యక్ష సాక్షి హన్సన్ ‘అందరూ కాక్టైల్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో స్టేజ్ పైకి డాలర్లు విసురుతున్నారు. కేరింతలు, కేక పుట్టించే మ్యూజిక్‌తో క్లబ్ సందడిగా మారింది. ఇంతలో రివాల్వర్ కాల్పుల శబ్దం. డ్రమ్ బీట్ శబ్దం అనుకున్నాం... ఆగకుండా వినిపించే వరకూ అవి రివాల్వర్ శబ్దాలని తెలియలేదు. ఇంతలో మా వైపుకు కాల్పులు జరగడంతో పరుగులు పెట్టాను’ అంటూ ప్రత్యక్ష సాక్షి క్రిస్టోపర్ హన్సన్ సీఎన్ఎన్కు తెలిపారు. లాస్ ఏంజెల్స్ కౌంటీలోనూ కాల్పుల కలకలం లాస్ ఏంజెల్స్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో 24 గంటల వ్యవధిలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కార్సన్ ప్రాంతంలో ప్రారంభమైన కాల్పులు శాన్ గేబ్రియల్ వ్యాలీ వరకూ కొనసాగాయి. లాస్ ఏజెంల్స్ టైమ్స్ కథనం ప్రకారం... శుక్రవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా దుండుగుడు కాల్పులు జరపగా... తీవ్ర గాయాలతో అతను మరణించాడు. ఆరు గంటల అనంతరం బైక్ వచ్చిన దుండగులు మరో ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున కారుకు మరమ్మతులు చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపారు. లాస్ఏంజెల్స్ కౌంటీలో జరిగిన మరో మూడు కాల్పుల ఘటనల్లో నలుగురు మరణించారు. ఈ కాల్పుల ఘటనలకు ఒకదానికొకటి సంబంధంలేదని పోలీసులు వెల్లడించారు.