అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి | Several Injured After Gunman Opens Fire At Yoga Studio In Florida | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 9:18 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Several Injured After Gunman Opens Fire At Yoga Studio In Florida - Sakshi

టల్లాహస్సీ: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. శుక్రవారం ఫ్లొరిడా రాష్ట్ర రాజధాని టల్లాహస్సీలోని యోగా స్టూడియోలో ఓ దుండగడు ఆకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు జరిగాయనే సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లామని, కానీ అక్కడికి వెళ్లేలోపు బుల్లెట్ల గాయాలతో కొంతమంది పడి ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామని, ఇందులో ఇద్దరు ఘటన స్థలిలోనే మృతి చెందారని పేర్కొన్నారు. అయితే మృతుల్లో ఒకరు దుండగుడున్నాడని గుర్తించామని, అతను తనకు తనే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఘటనస్థలిలో చాలా మంది దుండగుడితో పోరాడారని, తమ ప్రాణాలతో పాటు ఇతరులను రక్షించటానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement