bullet injuries
-
రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులమోత మోగింది. ఫ్లోరిడాలోని మియామి గార్డెన్స్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ సమయంలో ఫ్రెంచ్ ర్యాపర్ మోంటనా, రాబ్49 అక్కడ మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్నారు. దుండగుడి కాల్పుల్లో ర్యాపర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో 15 రౌండ్ల కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తూటాల శబ్దం విని జనం పరుగులు తీశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 10 మందికి తూటాలు తగిలినట్లు సమాచారం. అంతకుముందు 'ది లికింగ్ రెస్టారెంట్' బయట కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలోనూ పలువురు గాయపడ్డారు. పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితులు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి.. -
ఇమ్రాన్ ఖాన్ నటనలో షారుక్, సల్మాన్‌లను మించిపోయారు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ దిగ్గజ నటులు సల్మాన్, షారుక్ ఖాన్‌లను మించి పోయారంటూ కామెంట్ చేశారు పాక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్. వజీరాబాద్‌లోని నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల అనంతరం ఇమ్రాన్ ఖాన్ తనపై జరిగిన దాడిని హత్యయత్నంగా పేర్కొన్నారు. కానీ పాక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ చీఫ్ మౌలానా ఫ్లజుర్ మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాను తొలుత ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన ఘటన గురించి విని బాధపడ్డాను కానీ ఇప్పడూ ఇది ఒక డ్రామాలా కనిపిస్తోందన్నారు. "ఖాన్ శరీరంలోకి దిగిన బుల్లెట్ ఎలా ముక్కలుగా అయిపోతుంది. శరీరంలో పేలుడు ముక్కలు దిగడం గురించి విన్నాం ఇలాంటిది ఎప్పడూ వినలేదు. ఖాన్‌పై దాడి గురించి విన్నప్పుడూ తాను ఖండించానని చెప్పారు. కానీ ఎక్కడైన బాంబు శకలాలు శరీరంలోకి దిగడం చూశాం కానీ బుల్లెట్ శకలాలు శరీరంలో దిగడం ఏమిటో అర్థం కావడం లేదు. ఐనా ఆయనపై జరిగింది కాల్పులు కానీ బాంబు దాడి కాదన్నారు." ఖాన్‌కి బుల్లెట్ గాయాలైనప్పుడూ క్యాన్సర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఖాన్ చికిత్స తీసుకుంటున్న షౌకత్ ఖనుమ్ హాస్పిటల్ ఆయన చారిటబుల్ సంస్థ నిర్వహస్తున్న ఆస్పత్రేనని చెప్పారు. అలాగే వైద్యుల స్టేట్మెంట్లు కూడా చాలా విరుద్దంగా ఉన్నాయన్నారు ఫజ్లుర్ రెహ్మాన్ . (చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్ బ్లాక్!) -
సింగర్ సిద్ధూ మర్డర్.. పోస్టుమార్టంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్
పంజాబ్ ర్యాపర్, సింగర్ సిద్ధూ(29) మూసేవాలా.. ఆదివారం గ్యాంగ్ వార్కి బలైన విషయం తెలిసిందే. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు. ఈ దారుణ హత్య దేశంలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. సిద్ధూ మృతదేహానికి సోమవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం షాకింగ్ విషయాలను బహిర్గతం చేశారు. సిద్దూ బాడీలోకి రెండు డజన్ల బుల్లెట్స్(24) దూసుకెళ్లినట్టు తెలిపారు. బాడీ నుంచి 24 బుల్లెట్స్‌ను బయటకు తీసినట్టు ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్ వెల్లడించింది. మరోవైపు.. సిద్ధూ మూసేవాలాను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్నాడని భావిస్తున్న ఓ అనుమానితుడ్ని(లారెన్స్) పంజాబ్ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్‌లోని పర్వత సానువుల్లో హేమకుండ్ సాహిబ్ పవిత్ర యాత్ర నిర్వహిస్తుండగా, ఆ యాత్రలో పాల్గొన్న భక్తుల చాటున ఆ అనుమానితుడు దాక్కున్నప్పటికీ అతడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, మరో ఐదుగురు అనుమానితులను కూడా ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం -
ముందు ట్రీట్మెంట్.. తర్వాతే పెళ్లి!
న్యూఢిల్లీ : మరికొన్ని క్షణాల్లో తమ కూతురు వివాహ బంధంలోకి అడుగుపెడుతుందని సంబర పడుతున్న ఓ కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎంతో ఆనందంగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్న పెళ్లికూతురి కాళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లీలోని షకార్‌పూర్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. షకార్‌పూర్‌కు చెందిన పూజ అనే యువతికి భరత్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో గురువారం పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత.. పూజ వేదిక వద్దకు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడింది. ఏమైందో తెలుసుకునే లోపే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాళ్లపై తుపాకీతో కాల్చి పారిపోయారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం పూజను తిరిగి మండపానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు పెళ్లి తంతును పూర్తి చేశారు. ఈ విషయంపై ఆమె భర్త భరత్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గతంలో కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గతేడాది నవంబరులో... పెళ్లి మండపానికి ఊరేగింపుగా బయల్దేరిన ఓ యువకుడిపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాతే అతడు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. -
ముందు పెళ్లి.. ఆ తర్వాతే ట్రీట్మెంట్!
సాక్షి, న్యూఢిల్లీ : పెళ్లి మండపానికి బయల్దేరిన ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎంతో ఆనందంగా ఊరేగింపుతో వధువును చేరేందుకు వెళ్తున్న అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఢిల్లీలోని మదన్గిర్లో చోటుచేసుకుంది. వివరాలు.... ఖాన్పూర్ ఏరియాకు చెందిన బాదల్ అనే వ్యక్తికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయల్దేరాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులకు తెగబడ్డారు. అయితే డీజే శబ్దం ఎక్కువగా ఉండటంతో ఎవరూ కూడా ఈ విషయాన్ని గమనించలేదు. ఈ ఘటనలో బాదల్ భుజానికి బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వెంటనే అతడు ఈ విషయాన్ని బంధువులకు తెలపగా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సుమారు మూడు గంటలపాటు చికిత్స జరిగిన అనంతరం వివాహ వేదిక వద్దకు చేరుకున్న బాదల్.. గాయంతోనే పెళ్లి తంతు పెళ్లి పూర్తి చేశాడు. ఆ తర్వాత సర్జరీ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. కాగా ఈ ఘటనపై బాదల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మొన్న శత్రువుతో.. నేడు ప్రాణాలకోసం
గరుడ్ కమాండో శైలేష్ పోరాటం పఠాన్‌కోట్: జనవరి 2న రాత్రి రెండు గంటలకు ఉగ్రవాదుల చొరబాటు వార్తతో అప్రమత్తమై రంగంలోకి దిగి.. శత్రువులతో పోరాడిన గరుడ కమాండో శైలేష్ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మెకానికల్ ట్రాన్స్‌పోర్టు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసి వారిని నిలువరించేందుకు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 12 మంది గరుడ్ కమాండోలను మోహరించారు. ఉగ్రవాదులను కాసేపు అక్కడే నిలువరించేలా కాల్పులు జరపాలని ఈ కమాండోలకు ఆదేశాలందాయి. దీంతో గురుసేవక్ ఓ భారీ యంత్రం పక్కన నక్కి ఉగ్రవాదులపై కాల్పులు మొదలుపెట్టారు. ఉగ్రవాదుల ఎదురుదాడిలో మూడు బుల్లెట్లు తగిలినా.. కాసేపు పోరాడిన తర్వాత గురుసేవక్ నేలకొరిగారు. వెంటనే పొజిషన్ తీసుకున్న శైలేష్ కాల్పులు ప్రారంభించారు. అయితే.. ఎదురుకాల్పులతో శైలేష్‌కు కడుపు కింది భాగంలో ఆరు బుల్లెట్లు దిగాయి. అయినా ధైర్యం కోల్పోకుండా శైలేష్ కాల్పులు జరుపుతూనే ఉన్నారు. వీరి పోరాటం వల్ల ఉగ్రవాదులు మెకానికల్ ఏరియా దాటి టెక్నికల్ ఏరియాలోకి వెళ్లలేక ఆగిపోయారు. అదే జరిగి ఉంటే ఎయిర్‌బేస్ పూర్తిగా ఉగ్రవాదుల హస్తగతమయ్యేది. తెల్లవారిన తర్వాత(అంటే బుల్లెట్ గాయాలు తగిలిన మూడు గంటల తర్వాత) శైలేష్‌తో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఈ వీరుడు ఆసుపత్రిలో ప్రాణం కోసం పోరాడుతున్నారు. -
శివసేన నాయకుడిపై కాల్పులు
శివసేన నాయకుడు అనిల్ చౌహాన్‌పై కాల్పులు జరిగాయి. వెంటనే ఆయనను భక్తివేదాంత ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయమే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తర ముంబైలోని కశ్మీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనిల్ చౌహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దుండగులు ఎవరు, ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామని ముంబై పోలీసు అధికారి అవినాష్ అంబురే తెలిపారు. -
భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
చంఢీగడ్: భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనుకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్. ఆ ఘటనలో భార్య మృతి చెందగా, కానిస్టేబుల్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సంఘటన చంఢీగడ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అనంతకుమార్ పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని... అతడి భార్య డింపుల్ ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తుందని తెలిపారు. అయితే ఇద్దరు మధ్య గత కొద్ది కాలంగా మనస్పర్థలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆ ఘటన చేసుకుని ఉంటుందని చెప్పారు. కానిస్టేబుల్ అనంతకుమార్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.