పంజాబ్ ర్యాపర్, సింగర్ సిద్ధూ(29) మూసేవాలా.. ఆదివారం గ్యాంగ్ వార్‌కి బలైన విషయం తెలిసిందే. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు. ఈ దారుణ హత్య దేశంలో సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా.. సిద్ధూ మృతదేహానికి సోమవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం షాకింగ్ విషయాలను బహిర్గతం చేశారు. సిద్దూ బాడీలోకి రెండు డజన్ల బుల్లెట్స్(24) దూసుకెళ్లినట్టు తెలిపారు. బాడీ నుంచి 24 బుల్లెట్స్‌ను బయటకు తీసినట్టు ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్ వెల్లడించింది.
మరోవైపు.. సిద్ధూ మూసేవాలాను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్నాడని భావిస్తున్న ఓ అనుమానితుడ్ని(లారెన్స్) పంజాబ్ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్‌లోని పర్వత సానువుల్లో హేమకుండ్ సాహిబ్ పవిత్ర యాత్ర నిర్వహిస్తుండగా, ఆ యాత్రలో పాల్గొన్న భక్తుల చాటున ఆ అనుమానితుడు దాక్కున్నప్పటికీ అతడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, మరో ఐదుగురు అనుమానితులను కూడా ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
Comments
Please login to add a commentAdd a comment