autopsy report
-
వాడొక శాడిస్టు!
బనశంకరి: వయ్యాలికావల్ మునేశ్వరబ్లాక్‌లో మహాలక్ష్మీ (29) హత్య కేసుకు సంబంధించి వైద్య బృందం శవపరీక్ష నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. మరోపక్క వయ్యాలి కావల్ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో తనిఖీల్లో ఫ్రిడ్జ్‌పై వేలిముద్రల ఆచూకీ లభించినట్లు తెలిసింది. దీనిపై ఎఫ్ఎస్ఎల్ నిపుణులు నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. మహాలక్ష్మీ హత్య వెనుక హంతకుడు ఒక్కరేనా లేక ఇద్దరా అనే దానిపై అనుమానం వ్యక్తమైంది. హంతకుడిని శాడిస్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానిత హంతకుడి సోదరుడిని పిలిపించి సుమారు 2 గంటల పాటు విచారణ చేపట్టిన పోలీసులు సమాచారం రాబట్టారు. హతురాలు మహలక్ష్మీ అనుమానిత హంతకుడు ఒకేచోట పనిచేసేవారు. మల్లేశ్వరంలోని వస్త్రదుకాణంలో ఇద్దరు పనిచేసేవారు. పలు కారణాలతో హంతకుడు ఆరునెలలు క్రితం విడిచిపెట్టాడు. దీంతో అప్పటి నుంచి మహలక్ష్మీ అతని నుంచి దూరంగా ఉండటంతో అతనిలో పగ రగిలింది. ఆ కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.హంతకుడిలో వికృత ప్రవృత్తి :మహలక్ష్మీ హంతకుడు సడోమాసోకిస్ట్ తరహా ఉన్నారని అతడిని త్వరలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు. హంతకుడు మహిళ దేహాన్ని 30 ముక్కలుగా కోసి ప్రిజ్‌లో భద్రపరచాడు. హంతకుడిలో శాడిస్టు ప్రవృత్తి ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. -
జూనియర్ డాక్టర్‌పై జరిగింది సామూహిక హత్యాచారామే? : వైద్యులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కోల్‌కతా పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా, ఈ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.బాధితురాలిపై ఒకరి కంటే ఎక్కువ మంది సామూహిక హత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి అటాప్సీ రిపోర్ట్‌ను పరిశీలించిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి మాజీ విద్యార్థి అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి.. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆమెపై ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యాచారం జరిగి ఉండొచ్చని అభిప్రాయడ్డారు.శవపరీక్ష నివేదిక ఆమె ఎదుర్కొన్న క్రూరత్వానికి రుజువు. ఒకరు కంటే ఎక్కువ మంది నిందితులు ఆమెను లైంగికంగా వేధించారు. ఇది అత్యంత దారుణం అని పీటీఐతో అన్నారాయన. దీంతో పాటు బాధితురాలిపై జరిగిన హత్యాయత్నానికి గురైన గాయాలు యాంటిమార్టం అని, అంటే ఆమె మరణానికి ముందు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. హత్య చేసిన తర్వాత ఆమెపై హత్యాచారం జరిగిందన్న వాదనలను కొట్టిపారేశారు. ఆమె మరణించిన సమయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఉండవచ్చని చెప్పారాయన.#EXCLUSIVE: Kolkata rape and murder case Dr Subarno Goswami, who examined the victim's body speaks to @shreyadhoundial and says, "Postmortem reports hints that there might be involvement of more than one rapist" #TheUrbanDebate #JusticeForDevi #KolkataDoctorDeath pic.twitter.com/nnJMSfRvpA— Mirror Now (@MirrorNow) August 14, 2024బాధితురాలి తల్లిదండ్రులు సైతం ఆమె శరీంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారని, ఇదే విషయాన్ని కోల్కత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్లో ఆరోపించారు.బాధితురాలు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువువుతున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో గత గురువారం ఆమె ఎప్పటిలాగే విధులకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
అయ్యో అంజలి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: సుల్తాన్‌పురి-కంఝావాలా మధ్య కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో దారుణ రీతిలో ప్రాణం కోల్పోయిన అంజలి(20) కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఆల్కాహాల్ తీసుకోలేదని, ఆమె మృతదేహంలో ఆనవాలు కనిపించలేదని స్పష్టం అయ్యింది. అంతేకాదు ఆ ఘటన సమయంలో ఆమె నరకం అనుభవించి ఉంటుందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా స్పష్టం అవుతోంది. మొత్తం ఎనిమిది పేజీల ఆ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ‘‘రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా బాడీని ఈడ్చుకెళ్లారు. శరీరం మట్టి కొట్టుకుపోయింది. ఆమె ఒంటిపై 40కి పైగా గాయాలు అయ్యాయి. పక్కటెముకలు బయటకు వెనుకవైపు పొడుచుకువచ్చాయి. రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో శరీరం మొత్తం కమిలిపోయింది. తల పగిలి మెదడు బయటకు వచ్చి.. అందులో కొంత భాగం మిస్సయ్యింది. వెన్నుముక పూర్తిగా విరిగిపోయిందని రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో, రక్త స్రావంతోనే ఆమె మరణించిందని శవ పరీక్ష ద్వారా వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో జరిగిన శవ పరీక్ష నివేదికను పోలీసులు స్వీకరించారు. అయితే.. సాధారణ శవ పరీక్ష తర్వాత మరోసారి కెమికల్ అనాలసిస్, బయోలాజికల్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే తుది ధృవీకరణ చేసినట్లు వైద్యులు ఆ నివేదికలో వెల్లడించారు. పోలీసుల నివేదిక ప్రకారం.. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత(జనవరి 1న) స్కూటీపై స్నేహితురాలితో వస్తున్న అంజలి సింగ్‌ను.. వేగంగా వస్తున్న బలెనో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బాడీని అలాగే కిలోమీటర్ల మేర లాక్కునిపోయింది ఆ కారు. సుల్తాన్‌పురి-కంఝావాలా మధ్య చక్కర్లు కొట్టి.. చివరకు ఆమె మృతదేహాం కారు నుంచి వేరై రోడ్డు మీద పడిపోయింది. కారులో ఉన్న ఐదుగురు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఢిల్లీని కుదిపేయడంతో పాటు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో నిందితులను త్వరగతిన అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. బుధవారం(ఇవాళ) సాయంత్రంతో ఆ కస్టడీ ముగియనుంది. ఇక అత్యాచారం జరిగిందనే కోణాన్ని శవ పరీక్ష కొట్టిపారేసింది. ఇక బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ ముఖ్యమంత్రి సిసోడియా.. దారుణ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన అంజలి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. -
సింగర్ సిద్ధూ మర్డర్.. పోస్టుమార్టంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్
పంజాబ్ ర్యాపర్, సింగర్ సిద్ధూ(29) మూసేవాలా.. ఆదివారం గ్యాంగ్ వార్కి బలైన విషయం తెలిసిందే. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు. ఈ దారుణ హత్య దేశంలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. సిద్ధూ మృతదేహానికి సోమవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం షాకింగ్ విషయాలను బహిర్గతం చేశారు. సిద్దూ బాడీలోకి రెండు డజన్ల బుల్లెట్స్(24) దూసుకెళ్లినట్టు తెలిపారు. బాడీ నుంచి 24 బుల్లెట్స్‌ను బయటకు తీసినట్టు ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్ వెల్లడించింది. మరోవైపు.. సిద్ధూ మూసేవాలాను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్నాడని భావిస్తున్న ఓ అనుమానితుడ్ని(లారెన్స్) పంజాబ్ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్‌లోని పర్వత సానువుల్లో హేమకుండ్ సాహిబ్ పవిత్ర యాత్ర నిర్వహిస్తుండగా, ఆ యాత్రలో పాల్గొన్న భక్తుల చాటున ఆ అనుమానితుడు దాక్కున్నప్పటికీ అతడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, మరో ఐదుగురు అనుమానితులను కూడా ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం -
షాకింగ్.. లెదర్ బాల్లా గట్టిగా మారిన ఊపిరితిత్తులు
బెంగళూరు: కరోనా మహమ్మారి గురించి రోజుకొక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇలాంటి వార్త మరొకటి తెలిసింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్ బాల్ కన్నా స్ట్రాంగ్‌గా మారినట్లు శవపరీక్షలో తెలిసింది. వివరాలు.. కర్ణాటకకు చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఒకరు కరోనా బారిన పడి మరణించారు. ఈ క్రమంలో అతడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. దానిలో సంచలన విషయాలు తెలిశాయి. సదరు వ్యక్తి మరణించిన 18 గంటల తర్వాత కూడా అతడి గొంతు, ముక్కులో నుంచి సేకరించిన స్వాబ్ శాంపిల్స్‌లో వైరస్ ఉనికిని గుర్తించారు. ఈ సందర్భంగా శవపరీక్ష నిర్వహించిన ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దినేష్ రావు మాట్లాడుతూ, రోగి ఊపిరితిత్తులు "తోలు బంతిలాగా గట్టిగా ఉన్నాయి".. రక్త నాళాలలో గడ్డలు ఏర్పడ్డాయని తెలిపారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి శవపరీక్ష వ్యాధి పురోగతిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అని తెలిపారు. అక్టోబర్ 10న ఈ శవపరీక్ష నిర్వహించామన్నారు. ఇది పూర్తి కావడానికి 1.10గంటల సమయం పట్టిందన్నారు డాక్టర్ రావు. (చదవండి: వ్యాక్సిన్ మొదట వారియర్స్‌కే! ) కరోనాతో మృతి చెందిన రోగి శరీరం.. అతడి మరణం తర్వాత కూడా వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉందని నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక డాక్టర్ రావు శవ పరీక్ష నిర్వహించడం కోసం సదరు రోగి ముక్కు, గొంతు, నోరు, ఊపిరితిత్తుల ఉపరితలం, శ్వాసకోశ మార్గాలు, ముఖం, మెడపై చర్మం నుంచి ఐదు శాంపిల్స్‌ని తీసుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో ముక్కు, గొంతులో నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అంటే కోవిడ్ రోగి శరీరం మరణం తర్వాత వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉందన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చర్మం మీద నుంచి సేకరించిన శాంపిల్స్ నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇక కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ శవపరీక్ష నిర్వహించినట్లు డాక్టర్ రావు తెలిపారు. రోగి మరణించిన సమయంలో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్లో ఉన్నారని.. మృత దేహాన్ని తీసుకెళ్లలేదన్నారు. ఇక ఇటీవల కాలంలో అమెరికా, ఇటలీలో శవపరీక్ష నివేదికలలో కనిపించిన ఫలితాలకు.. తాను నిర్వహించిన పరీక్ష ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు డాక్టర్ రావు. దీన్ని బట్టి చూస్తే.. భారతదేశంలో కనిపించే వైరస్ జాతులు భిన్నంగా ఉన్నాయన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే మృతికి ఉరే కారణం
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హెమ్టాబాద్ బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ మృతి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. స్వగ్రామం బిండాల్లో సోమవారం తన ఇంటికి సమీపంలో ఎమ్మెల్యే రాయ్ విగతజీవుడై ఉరికి వేలాడుతూ ఉండగా గ్రామస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి ఉరే కారణమనీ, శరీరంపై ఎటువంటి ఇతర గాయాలు లేవని మంగళవారం పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మంగళవారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. రాజకీయ హత్యలకు పాల్పడుతున్న బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాయ్ మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. (బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’) -
కాన్పూర్ ఎన్కౌంటర్: శవపరీక్షలో విస్తుగొలిపే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వికాస్ దూబే అనే గ్యాంగ్‌స్టర్ అతడిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీతో సహా మొత్తం 8 మంది పోలీసులు మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి శవపరీక్ష నివేదికల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఎనిమిది మంది పోలీసుల శవపరీక్ష నివేదికలు శనివారం విడుదలయ్యాయి. చనిపోవడానికి ముందు పోలీసులను అతి క్రూరంగా హింసించబడ్డారని వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారు. బిల్హౌర్ సర్కిల్ ఆఫీసర్(సీఐ) దేవేంద్ర మిశ్రా తలను వికాస్ దూబే మనుషులు గొడ్డలితో నరికినట్లు శవపరీక్షలో వెల్లడైంది. అతని కాలు కత్తిరించబడి, శరీరం తీవ్రంగా గాయాలపాలైనట్లు తేలింది. అదే విధంగా పోలీసుల వద్ద నుంచే దూబే అనుచరులు తుపాకులు లాక్కొని మరీ కాల్పులు జరిపినట్లుగా తెలిసింది. (యూపీ గ్యాంగ్‌స్టర్ అనుచరుడి అరెస్టు) కానిస్టేబుల్స్ బబ్లు, రాహుల్, సుల్తాన్ బుల్లెట్ గాయాలతో మరణించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు. అదే విధంగా కానిస్టేబుల్ జితేంద్ర పాల్కుపై ఎకే-47తో కాల్పులు జరిగినట్లు చెప్పారు. మరణించిన పోలీసుల భుజాలపై తీవ్రమైన గాయాలు ఉండటంతో వైద్యులు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నివేదికలపై కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ శనివారం మాట్లాడుతూ.. దుబే గ్యాంగ్ మనుషులు మావోయిస్టులు దాడి చేసే విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. ఇక దుబే గ్యాంగ్‌లో పని చేసే దయా శంకర్ అగ్నిహోత్రిని కాన్పూర్ నగరం సమీపంలోని కల్యాణ్‌పూర్‌లో శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(వికాస్ దూబేకు సాయం.. పోలీస్ అధికారిపై వేటు) చదవండి: గ్యాంగ్‌స్టర్ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం -
సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ట్విటర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. గాంధీజీ హత్యపై సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్లో వరుస ప్రశ్నలు సంధించారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే కాల్చిన రివాల్వర్‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అందుకే కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ('కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు') 1st question: Why no post mortem or autopsy on Gandhiji's body? 2nd : Why Abha and Manu as direct eyewitnesses not questioned in court? 3rd: How many empty chambers in Godse's revolver? Italian revolver "untraceable"!! Why? We need to re-open the case — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 మరో ట్వీట్లో అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ప్రస్తావిస్తూ.. ఆరోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పాడన్నారు. ఏపీఐ జర్నలిస్టు బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. కాగా సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఇమ్రాన్‌ది రోడ్డుపక్క ప్రసంగం) Page 52 quotes Associated Press International journo: he heard at 5.05 pm 4 shots [not 3 as PP in Court later told court]. Godse deposed he fired only 2. Same API journalist said Gandhi declared dead in Birla House at 5.40PM i.e., he was alive for 35 mins. — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 కాగా, గతంలోనూ గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపించాయి. 2017 అక్టోబర్‌లో ఐటీ ప్రొఫెషనల్ డా.పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నీస్ గాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే నాల్గవ బుల్లెట్‌ను కాల్చాడా లేదా అన్న దానిపై కొంత అస్పష్టత ఉన్నందున.. ఈ హత్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసులో గాడ్సే, దత్తాత్రేయ ఆప్టేలను 15 నవంబర్,1949లో ఉరితీశారని.. దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటుకు 71 రోజుల ముందు ఈ ఘటన జరిగిందని తెలిపారు. అప్పట్లో సుప్రీం కోర్టు లేకపోవడం వల్ల ఈస్ట్ పంజాబ్ హైకోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేసే అవకాశం వారికి లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. -
సునంద కేసులో మరో కొత్త మలుపు
సునందా పుష్కర్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అటాప్సీ నివేదిక విషయంలో తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించలేనని, తాను వివక్షకు గురవుతున్నానని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అధినేత డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా ఆరోపించారు. దాంతో.. ఆయనను మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఎయిమ్స్ కోరింది. ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం కొత్త అధినేతగా డాక్టర్ డీఎన్ భరద్వాజను నియమించేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు ఈ కేసు విచారణను జూలై 23కు వాయిదా వేసింది. గుప్తాను ఆ స్థానం నుంచి మార్చాలంటే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో మార్చి 25న చెప్పిన నేపథ్యంలో ఎయిమ్స్.. ఇప్పుడు కోర్టుకు వెళ్లింది.