సునందా పుష్కర్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అటాప్సీ నివేదిక విషయంలో తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించలేనని, తాను వివక్షకు గురవుతున్నానని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అధినేత డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా ఆరోపించారు. దాంతో.. ఆయనను మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఎయిమ్స్ కోరింది.
ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం కొత్త అధినేతగా డాక్టర్ డీఎన్ భరద్వాజను నియమించేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు ఈ కేసు విచారణను జూలై 23కు వాయిదా వేసింది. గుప్తాను ఆ స్థానం నుంచి మార్చాలంటే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో మార్చి 25న చెప్పిన నేపథ్యంలో ఎయిమ్స్.. ఇప్పుడు కోర్టుకు వెళ్లింది.
సునంద కేసులో మరో కొత్త మలుపు
Published Tue, Jun 2 2015 6:30 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM
Advertisement