Dr Sudhir Gupta
-
సునంద కేసులో మరో కొత్త మలుపు
సునందా పుష్కర్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అటాప్సీ నివేదిక విషయంలో తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించలేనని, తాను వివక్షకు గురవుతున్నానని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అధినేత డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా ఆరోపించారు. దాంతో.. ఆయనను మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఎయిమ్స్ కోరింది. ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం కొత్త అధినేతగా డాక్టర్ డీఎన్ భరద్వాజను నియమించేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు ఈ కేసు విచారణను జూలై 23కు వాయిదా వేసింది. గుప్తాను ఆ స్థానం నుంచి మార్చాలంటే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో మార్చి 25న చెప్పిన నేపథ్యంలో ఎయిమ్స్.. ఇప్పుడు కోర్టుకు వెళ్లింది. -
'రిపోర్టు మార్చమని ఒత్తిడి తెచ్చారు'
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పోస్టుమార్టం నివేదిక మార్చాలని ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తాపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. సునంద మృతిని సహజ మరణంగా పేర్కొనాలని ఉన్నతస్థాయిలో తనపై ఒత్తడి తెచ్చారని విజిలెన్స్ కమిషన్ అధిపతికి గుప్తా లేఖ రాసినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. తాను లొంగకపోవడంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయారు. తన స్థానంలో వేరొకరిని ఫోరెన్సిక్ విభాగం అధిపతిగా నియమించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు 'క్యాట్' కూడా లేఖ రాశారు. విషం కారణంగానే సునంద మరణించినట్టు గుప్తా తన నివేదికలో పేర్కొన్నారు. ఆమెది హత్యేనని నిర్ధారణయింది.