జూనియర్‌ డాక్టర్‌పై జరిగింది సామూహిక హత్యాచారామే? : వైద్యులు | Kolkata doctor incident : Autopsy reveals multiple penetrations | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్‌పై జరిగింది సామూహిక హత్యాచారామే? : వైద్యులు

Published Thu, Aug 15 2024 12:18 PM | Last Updated on Tue, Aug 20 2024 11:19 AM

Kolkata doctor incident : Autopsy reveals multiple penetrations

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కోల్‌కతా పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా, ఈ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బాధితురాలిపై ఒకరి కంటే ఎక్కువ మంది సామూహిక హత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి అటాప్సీ రిపోర్ట్‌ను పరిశీలించిన ఆర్‌జీ కార్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రి మాజీ విద్యార్థి అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సుబర్ణ గోస్వామి.. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆమెపై ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యాచారం జరిగి ఉండొచ్చని అభిప్రాయడ్డారు.

శవపరీక్ష నివేదిక ఆమె ఎదుర్కొన్న క్రూరత్వానికి రుజువు. ఒకరు కంటే ఎక్కువ మంది నిందితులు ఆమెను లైంగికంగా వేధించారు. ఇది అత్యంత దారుణం అని పీటీఐతో అన్నారాయన.  

దీంతో పాటు బాధితురాలిపై జరిగిన హత్యాయత్నానికి గురైన గాయాలు యాంటిమార్టం అని, అంటే ఆమె మరణానికి ముందు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. హత్య చేసిన తర్వాత ఆమెపై హత్యాచారం జరిగిందన్న వాదనలను కొట్టిపారేశారు. ఆమె మరణించిన సమయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఉండవచ్చని చెప్పారాయన.

బాధితురాలి తల్లిదండ్రులు సైతం ఆమె శరీంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారని, ఇదే విషయాన్ని కోల్‌కత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్‌లో ఆరోపించారు.

బాధితురాలు ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువువుతున్నారు. మరోవైపు జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో గత గురువారం ఆమె ఎప్పటిలాగే విధులకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ కేసులో పోలీసు వాలంటీర్‌ అయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement