మహాలక్ష్మీ హత్యకేసులో శవపరీక్ష
నివేదిక అందజేత
బనశంకరి: వయ్యాలికావల్ మునేశ్వరబ్లాక్‌లో మహాలక్ష్మీ (29) హత్య కేసుకు సంబంధించి వైద్య బృందం శవపరీక్ష నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. మరోపక్క వయ్యాలి కావల్ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో తనిఖీల్లో ఫ్రిడ్జ్‌పై వేలిముద్రల ఆచూకీ లభించినట్లు తెలిసింది. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. మహాలక్ష్మీ హత్య వెనుక హంతకుడు ఒక్కరేనా లేక ఇద్దరా అనే దానిపై అనుమానం వ్యక్తమైంది.
హంతకుడిని శాడిస్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానిత హంతకుడి సోదరుడిని పిలిపించి సుమారు 2 గంటల పాటు విచారణ చేపట్టిన పోలీసులు సమాచారం రాబట్టారు. హతురాలు మహలక్ష్మీ అనుమానిత హంతకుడు ఒకేచోట పనిచేసేవారు. మల్లేశ్వరంలోని వస్త్రదుకాణంలో ఇద్దరు పనిచేసేవారు. పలు కారణాలతో హంతకుడు ఆరునెలలు క్రితం విడిచిపెట్టాడు. దీంతో అప్పటి నుంచి మహలక్ష్మీ అతని నుంచి దూరంగా ఉండటంతో అతనిలో పగ రగిలింది. ఆ కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
హంతకుడిలో వికృత ప్రవృత్తి :
మహలక్ష్మీ హంతకుడు సడోమాసోకిస్ట్ తరహా ఉన్నారని అతడిని త్వరలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు. హంతకుడు మహిళ దేహాన్ని 30 ముక్కలుగా కోసి ప్రిజ్‌లో భద్రపరచాడు. హంతకుడిలో శాడిస్టు ప్రవృత్తి ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment