Sidhu
-
మొదలైంది... తెలుసు కదా
‘‘మొదలైంది... తెలుసు కదా’ అంటున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, రాశీ ఖన్నా, శ్రీ నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. దాదాపు ముప్పై రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు పాటలనూ చిత్రీకరించనున్నారు. ‘‘తొలి రోజు సిద్ధు, రాశీ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
డబుల్ ధమాకా?
కన్నడ హిట్ ఫ్రాంచైజీ ‘కేజీఎఫ్’లో హీరోయిన్గా నటించిన శ్రీనిధీ శెట్టి మంచి నటన కనబరచి ప్రేక్షకుల మెప్పు పొందారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ పరిచయం కానున్నారు. అయితే ‘తెలుసు కదా’ విడుదల కాకముందే డబుల్ ధమాకాలా మరో రెండు తెలుగు సినిమాల్లో శ్రీనిధికి ఆఫర్స్ దక్కాయట. రానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది.తాజాగా నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందనున్న ‘హిట్ 3’ సినిమాలోనూ హీరోయిన్గా శ్రీనిధీ శెటిని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఆ తర్వాత ‘హిట్ 3’ని ఆరంభించే ఆలోచనలో ఉన్నారట. సో... ‘సరిపోదా శనివారం’ రిలీజ్ తర్వాత కానీ ‘హిట్ 3’ సినిమాలో ఎవరు హీరోయిన్గా నటిస్తారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్‌కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్‌గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
అతనో కామిక్ యాక్టర్
‘‘సుందరం మాస్టర్’ ట్రైలర్ బాగుంది. కల్యాణ్ సంతోష్‌కు తొలి చిత్రమిది.. మంచి ఫలితాన్నివ్వాలి. రవితేజగారు హీరోగా ఎంత బిజీగా ఉన్నా ఇలా కొత్తవాళ్లని ప్రోత్సహించేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు’’ అన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. హర్ష చెముడు, దివ్య శ్రీపాద జంటగా కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుందరం మాస్టర్’. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి సిద్ధు జొన్నలగడ్డ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘హర్షని కమెడియన్ అనడం నాకు నచ్చదు. అతను ఓ కామిక్ యాక్టర్. ట్రైలర్లో చూసినట్టుగా హర్షని ఎప్పుడూ సీరియస్‌గా చూడలేదు’’ అన్నారు. ‘‘పదేళ్ల క్రితం ప్రేక్షకుల మధ్యలో ఉన్నాను. ఇప్పుడీ వేదికపై ఉన్నాను. గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం’’ అన్నారు హర్ష చెముడు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు సుధీర్ కుమార్. ‘‘ఈ సినిమా మా యూనిట్‌కి గౌరవం తెస్తుంది, ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది’’ అన్నారు కల్యాణ్ సంతోష్. -
డీజే టిల్లు కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బాపినీడు.బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రాడ్యూసర్ ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భాస్కర్ దర్శకత్వంలో సిద్ధుతో మా బ్యానర్లో సినిమా చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈప్రారంభోత్సవంలో నిర్మాతలు వై.రవిశంకర్, వంశీ, దామోదర్ ప్రసాద్, రాధా మోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ నందినీ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్. -
టిక్కెట్టే కొనకుండా...
‘డీజే టిల్లు’ సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా...’ అంటూ సాగే తొలి మాస్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. రామ్ మిరియాల స్వరపరచి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల. -
షాకింగ్: పోలీసు క్యాంప్‌పై 150 మంది బందిపోట్ల దాడి
ఇస్లామాబాద్: దారి దోపిడిలో భాగంగా బందిపోట్లు దాడి చేయటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఎదురించిన వారిని విచక్షణరహితంగా చంపి దోపిడి చేస్తుంటారు. అలాంటి షాకింగ్ సంఘటనే పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రంలో వెలుగు చూసింది. అయితే, తమపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులపై దాడికి దిగింది దొంగల ముఠా. రోంటి రీజియన్ కచా ప్రాంతంలోని ఓ పోలీసు క్యాంపుపై భారీ సంఖ్యలో బందిపోట్లు ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డీఐజీ జావేద్ జాస్కాని తెలిపిని వివరాల ప్రకారం.. కచా ప్రాంతంలో దుండగుల ఆక్రమణలు పెరిగిపోయిన క్రమంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఒక్కసారిగా 150 మంది బందిపోట్లు పోలీసు పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఓ డీఎస్పీ, ఇద్దరు ఎస్హెచ్ఓలతో పాటు మొత్తం ఐదుగురు పోలీసులను హత్యచేశారు. మృతులు డీఎస్పీ అబ్దుల్ మాలిక్ భుట్టో, ఎస్హెచ్ఓ అబ్దుల్ మాలిక్ కమాన్‌గర్, ఎస్హెచ్ఓ డీన్ ముహమ్మద్ లెహారి, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సలీమ్ చాచాదర్, జటోయ్ పటాఫిలుగా గుర్తించారు. పోలీసు క్యాంపుపై బందిపోట్లు దాడి చేసిన క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భారీగా బలగాలను కచా ప్రాంతానికి తరలించారు. బందిపోట్లు దాడి చేసినప్పటికీ తమ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు డీఐజీ. మరోవైపు.. పోలీసులపై దాడిని ఖండించారు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి. పోలీసుల ప్రాణాలు తీసిన దండగులు తగిన శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా? -
సింగర్ సిద్ధూ హత్య కేసు: కీలకంగా మారునున్న సెల్ఫీ!
చండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతికార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుపెట్టినందుకు ప్రతీకారంగానే సిద్ధూని తన ముఠా సభ్యులు చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ తరుణంలో సిద్ధు హత్య జరిగిన రోజుకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఫుటేజ్‌లో సిద్ధూ ఎస్యూవీ కారుకి సమీపంలో ఇద్దరూ వ్యక్తులు నిలుచుని ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వద్దకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్ వైపుగా వచ్చి సిద్ధూతో సెల్ఫీ తీసుకున్నాడు. ఐతే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతే.. సిద్ధూ పై జరిగింది. ఆ సమయంలోనే ‘దాడి చేయడానికి సిద్ధంకండి’ అంటూ షూటర్లకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిద్ధూని హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందినవారు. నిందితుల ఆచూకి కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. (చదవండి: యస్.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు) -
సింగర్ సిద్ధూ మర్డర్.. పోస్టుమార్టంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్
పంజాబ్ ర్యాపర్, సింగర్ సిద్ధూ(29) మూసేవాలా.. ఆదివారం గ్యాంగ్ వార్కి బలైన విషయం తెలిసిందే. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు. ఈ దారుణ హత్య దేశంలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. సిద్ధూ మృతదేహానికి సోమవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం షాకింగ్ విషయాలను బహిర్గతం చేశారు. సిద్దూ బాడీలోకి రెండు డజన్ల బుల్లెట్స్(24) దూసుకెళ్లినట్టు తెలిపారు. బాడీ నుంచి 24 బుల్లెట్స్‌ను బయటకు తీసినట్టు ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్ వెల్లడించింది. మరోవైపు.. సిద్ధూ మూసేవాలాను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్నాడని భావిస్తున్న ఓ అనుమానితుడ్ని(లారెన్స్) పంజాబ్ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్‌లోని పర్వత సానువుల్లో హేమకుండ్ సాహిబ్ పవిత్ర యాత్ర నిర్వహిస్తుండగా, ఆ యాత్రలో పాల్గొన్న భక్తుల చాటున ఆ అనుమానితుడు దాక్కున్నప్పటికీ అతడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, మరో ఐదుగురు అనుమానితులను కూడా ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం -
డీజే టిల్లు ఎఫెక్ట్: డైరెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన సిద్ధు జొన్నలగడ్డ !
Siddhu Jonnalagadda Is Put Aside Malayalam Kappela Remake Movie: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. దీంతో సిద్ధు తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇదివరకు ఒప్పుకున్న ఓ సినిమాను ఇప్పుడు చేయనని అంటున్నాడట ఈ హీరో. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'కప్పెలా' రీమెక్‌లో సిద్ధు ఓ కీలక పాత్రలో చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'డీజే టిల్లు' మూవీ నిర్మించిన అదే బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. శౌరి చంద్రశేఖర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ను కాపాడే మరో హీరో పాత్రలో సిద్ధును సెలెక్ట్ చేశారట. ఈ రోల్ కొద్దిసేపే ఉన్న చాలా సినిమాలో చాలా ప్రభావం చూపిస్తుందట. అయితే ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో మళ్లీ ఇలాంటి పాత్రలు చేస్తే తన పాపులారిటీ తగ్గుతుందేమోనని సిద్ధు భయపడుతున్నాడని టాక్. అందుకే ఈ రీమేక్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టామని, అగ్రిమెంట్‌పై కూడా సంతకం చేసి ఎలా తప్పుకుంటాడని డైరెక్టర్ నిలదీయడంతో అతడిపై సిద్ధు కొంచెం దురుసుగా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో ఇంకా తెలియరాలేదు. చదవండి: 12 ఏళ్ల తర్వాత ఫేం వచ్చింది: డీజే టిల్లు హీరో సిద్దు చదవండి: డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
12 ఏళ్ల తర్వాత ఫేం వచ్చింది: డీజే టిల్లు హీరో సిద్దు
DJ Tillu Movie Success Meet In Visakhapatnam: ప్రేక్షకుల అభిమానం పూర్తిస్థాయిలో పొందేందుకు 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చిందని డీజే టిల్లు హీరో సిద్ధు అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో డీజే టిల్లు సినిమా విజయోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఏదో సాధించాలని ప్రతి ఒక్క నటుడు, డైరెక్టర్, రచయితకు ఉంటుందని.. ఈ రోజు అందరి కల నెరవేరిందన్నారు. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు గుంటూరు టాకీస్ సినిమా విజయం సాధించినా.. అనుకున్నంత పేరు రాలేదన్నారు. ఎన్నో భయాందోళన పరిస్థితుల మధ్య డీజే టిల్లు సినిమాను చిత్రీకరించామన్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ నేహా మాట్లాడుతూ వైజాగ్‌లో వేరే సినిమా షూటింగ్లో ఉన్న సమయంలోనే.. డీజే టిల్లు సినిమా కోసం ఆఫర్ వచ్చిందన్నారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! ఇప్పుడు అదే సిటీలో సినిమా విజయోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ విమల్ మాట్లాడుతూ తన స్కూల్ ఫంక్షన్లు ఇదే సిటీలో జరిగాయని, ఇక్కడే వేదికలపై చాలా సార్లు డ్యాన్స్‌లు చేశానని గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌కు చెందిన తనను ఈ వేదికపై నిలబెట్టిన సినీ అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం భువనేష్ అనే అభిమానికి హీరో సిద్ధు తన జాకెట్‌ను బహుమతిగా అందించారు. సినిమా టైటిల్ సాంగ్‌కు హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ, ఇతర నటులు పాలొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సిద్ధూ రాకలోనూ ప్రియాంకే!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో చివరి నిమిషంలో పొత్తు కుదరటంలో కీలకపాత్ర పోషించిన ప్రియాంక గాంధీ.. పంజాబ్‌లో సిద్ధూను పార్టీలోకి తీసుకురావటంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారని తెలిపారు. ‘సిద్ధూ, ప్రగత్ సింగ్‌లను కాంగ్రెస్‌లోకి తీసుకురావటంలో ప్రధాన పాత్ర ప్రియాంకదే. పార్టీకి ఆమె అదనపు బలం అవుతారు’ అని అమరీందర్ తెలిపారు. ‘కాంగ్రెస్‌లో ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం లేదు. కానీ నియమాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పంజాబ్‌లో సీఎం ఎవరో ప్రకటిస్తేనే బాగుంటుంది’ అమరీందర్ సింగ్ తెలిపారు. -
కెప్టెన్ అమరీందర్ సింగ్ నామినేషన్
-
గంగూలీ తలకు గన్ పెట్టిన వేళ!
తొలి సిరీస్‌లో సౌరవ్ అనుభవం కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 1996 తొలి టెస్టు సిరీస్ మధుర జ్ఞాపకాలు పంచడమే కాదు, ఒక భయంకర అనుభవాన్ని కూడా మిగిల్చింది. ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో అతను నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్ మధ్యలో ఒకసారి గంగూలీ తన బంధువులను కలిసేందుకు కావెండిష్ నుంచి పిన్నార్‌కు లండన్ అండర్‌గ్రౌండ్ ట్రెయిన్ (ట్యూబ్)లో ప్రయాణించాడు. అతనితో పాటు మరో క్రికెటర్ సిద్ధూ కూడా ఉన్నాడు. వాళ్లు కూర్చున్న క్యారేజ్‌లో టీనేజర్లు అయిన ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల బృందం కూడా ఉంది. వారిలో బీరు తాగిన ఒకడు ఖాళీ క్యాన్‌ను వీరిపై విసిరేశాడు. అయితే దీనిని పట్టించుకోకుండా సౌరవ్, క్యాన్‌ను పక్కన పెట్టి సిద్ధూను కూడా వారించాడు. కానీ అక్కడితో ఆగని ఆ కుర్రాడు మాటల దాడి చేస్తూ వీరిపైకి దూసుకొచ్చాడు. సౌరవ్ సంయమనం పాటించినా, సిద్ధూ వెనక్కి తగ్గకపోవడంతో గొడవ ముదిరింది. గంగూలీ కూడా ఏదైనా జరగనీ అన్నట్లుగా తానూ జత కలిశాడు. అయితే వారు ఊహించని విధంగా అటువైపు నుంచి స్పందన వచ్చింది. కింద పడ్డ ఆ కుర్రాడు ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి దాదా ముఖంపై గురి పెట్టాడు. ‘నా జీవితం ఇక్కడ ట్రెయిన్‌లోనే ముగిసిపోయింది అనుకున్నాను’ అని సౌరవ్ గుర్తు చేసుకున్నాడు. వీరి అదృష్టవశాత్తూ అదే టీమ్‌లో బాగా బలంగా ఉన్న అమ్మాయి వెంటనే సహచరుడిని వెనక్కి లాగింది. అప్పుడే స్టేషన్ రావడంతో అతడిని తీసుకపోవడంతో బతుకు జీవుడా అని గంగూలీ, సిద్ధూ బయట పడ్డారు. ఆ తర్వాత ఎప్పుడు ఇంగ్లండ్‌లో తిరగాలని అనిపించినా... సౌరవ్ సొంత కారులో డ్రైవింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు! -
సిద్ధూ వచ్చాకే ఉత్కంఠ వీడుతుంది!
చండీగఢ్: మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆమ్ఆద్మీ పార్టీలో చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సిద్ధూ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున ఆప్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే నవజోత్ కౌర్ బుధవారం వెల్లడించారు. ఓ కార్పోరేట్ సంస్థ ఉద్యోగులకు ప్రేరణ ఉపన్యాసం ఇవ్వడానికి గాను సిద్ధూ అమెరికాకు వెళ్లినట్లు కౌర్ తెలిపారు. సిద్ధూ తిరిగొచ్చాక ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు. సిద్ధూ ఆప్‌లో చేరే విషయంలో జరుగుతున్న తాత్సారానికి కారణం ఆప్ పెట్టిన నిబంధనలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరికే టికెట్ అన్న నిబంధన సిద్ధూ ఫ్యామిలీకి మింగుడుపడటం లేదని సమాచారం. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలనే డిమాండ్ సైతం సిద్ధూ ఆప్ ముందు ఉంచాడన్న మరో వాదన సైతం ఉంది. మరోవైపు కాంగ్రెస్ సైతం మాటకారి సిద్ధూతో పార్టీకి మేలు జరుతుందని భావిస్తూ.. అతడిని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో సిద్ధూ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
అందుకే ఎంపీ పదవిని వదులుకున్నా: సిద్ధూ
-
క్రికెటర్ సిద్ధూ అవకాశవాది
-
ఆయనతో డేటింగ్ చేస్తున్నాను
అవును ఆయనతో డేటింగ్ చేస్తున్నాను అని ధైర్యంగా వెల్లడించింది నటి రేష్మీగౌతమ్. తమిళంలో కండేన్, మాప్పిళై వినాయగర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు ఆ తరువాత కనుమరుగైందనే చెప్పాలి. తెలుగులోనూ ఒకటిరెండు చిత్రాలు చేసిన రేష్మీ సహ నటీమణుల గ్లామర్ దాటికి తట్టుకోలేక, సరైన అవకాశాలు రాక చాలా మదనపడి చివరికి బుల్లితెరపై దృష్టి సారించింది. జబర్దస్త్లాంటి బుల్లి తెర కార్యక్రమాలతో అలరిస్తున్న రేష్మీ సినిమాల్లో రాణించాలన్న ఆశతో ఇతర హీరోయిన్లతో పోటీ పడడానికి తనూ గ్లామర్ బాట పట్టక తప్పలేదు. కురుచ దుస్తులకు, లిప్‌లాక్‌లకు, బెడ్రూమ్ సన్నివేశాలకు రెడీ అంటూ రంగంలోకి దిగిన ఈ అమ్మడు తాజాగా గుంటూర్ టాకీస్ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. అందులో హీరోగా సిద్ధుతో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించిందట. ఆ సన్నివేశాల దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో సిద్ధుతో రేష్మీ ప్రేమకలాపాలు అంటూ ప్రసారాలు జోరందుకున్నాయి. సంగతి తెలిసిన రేష్మీ ఆగ్రహంతో రెచ్చిపోతుందని భావించిన వారికి ఆమె రియాక్షన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంతకీ నటి రేష్మీ స్పందన ఏమిటనుకుంటున్నారు? అవును నేను సిద్ధుతో డేటింగ్ చేస్తున్నాను. ఇది చెప్పడానికి నేనేమీ సంకోచించడంలేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, అందుకే ఆ చిత్రంలోని సన్నివేశాలలో మా మధ్య అంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అని స్పష్టం చేస్తూ విమర్శకుల నోళ్లకు మూతలు పడేలా చేసిందట. రేష్మీకి ఎంత డేర్ అంటున్నారిప్పుడు సినీవర్గాలు. -
కాంగ్రెస్‌లో సిద్దూ పతనం ప్రారంభం
బళ్లారి ఎంపీ శ్రీరాములు సింధనూరు టౌన్ : కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య హవా పతనం ప్రారంభమైందని బీజేపీ నేత, బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం నగరంలోని బీజేపీ నాయకుడు కొల్లా శేషగిరిరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులోని హెబ్బాళ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిద్దరామయ్య తన ఆప్తుడు బైరతి సురేష్‌కు టికెట్ సాధించడంలో విఫలం కావడం కాంగ్రెస్ పార్టీలో ఆయన హవా పతనం ఆరంభమైనట్లుగా సూచిస్తోందన్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గె గతంలో నుంచి కాంగ్రెస్ అధిష్టానం వద్ద పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇంకా పరిహారం పంపిణీ కాలేదన్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న దేవదుర్గ, బీదర్ నార్త్, హెబ్బాళ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. త్వరలో జరుగనున్న జెడ్పీ, టీపీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుందన్నారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు కొల్లా శేషగిరిరావు, అమరేగౌడ విరుపాపుర, దేవేంద్రప్ప యాపలపర్వి, బసప్ప కల్లూరు, బసనగౌడ తుర్విహాళ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
పూల కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయారు...
పూల కోసం చెరువులో దిగిన అక్కా తమ్ముళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కా తమ్ముళ్లు నాగమణి(8), సిద్ధు(5) ఈ రోజు గ్రామ సమీపంలోని ఊర చెరువులో ఉండే అల్లి పూల(తామర పూల వంటివి) కోసం చెరువులోకి దిగారు. చిన్నారులకు ఈత రాకపోవడంతో.. ప్రమాదవశాత్తూ నీట మునిగిగారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే వారు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విస్తరణకు బ్రేక్
ఫలితాల ప్రభావం పార్టీ లక్ష్యాన్ని అందుకోలేకపోయిన సిద్ధు ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సిద్ధు, పరమేశ్వర్ సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. అధికారంలో ఉన్నా మెజారిటీ సీట్లు సాధించడంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చతికిల పడటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండంకెల సీట్లను కూడా కైవసం చేసుకోలేక పోయింది. ఇందుకు గల కారణాలను అధిష్టానం ఎదుట వివ రించేందుకు సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను భేటీ అయినప్పుడు మంత్రి మండలి విస్తరణ విషయం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రి మండలిలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక మంత్రి ప్రకాశ్బాబన్న హుకేరి చిక్కోడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది. అదే విధంగా కొందరు మంత్రుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో కొందరి శాఖలు మార్పుతో పాటు మరికొందరిని మంత్రిమండలి నుంచి తొలగించాలనే ఆలోచన కూడా అధిష్టానంకు ఉంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు సరిగా పనిచేయకపోవడం వల్లే ఆయా జిల్లాల్లో పార్టీ పార్లమెంటు అభ్యర్థులకు విజయం దక్కలేదనే సమాచారం కూడా అధిష్టానం సేకరించింది. ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయం చేసి పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా సీఎం సిద్ధుతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు దిగ్విజయ్‌సింగ్ సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో సరిగా పనిచేయని మంత్రుల లిస్ట్‌లో వినయ్‌కుమార్ సూరకే, కిమ్మెన రత్నాకర్, శామనూరు శివశంకరప్ప, పరమేశ్వర్‌నాయక్, ఎం.బీ పాటిల్ ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకులు ఇచ్చే నివేదికను పరిశీలించిన తర్వాతనే మంత్రిమండలిలో మార్పులతో పాటు విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందన్న సీఎం సిద్ధు భరోసాపై ఆశలు పెంచుకున్న నాయకులు అమాత్య పదవి కోసం మరో మూడు మాసాలు ఎదురు చూడక తప్పదేమో. ఇక మంత్రి మండలి విస్తరణ చేసే సమయంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.