డబుల్‌ ధమాకా? | Siddu Jonnalagadda and Srinidhi Shetty to enchant audiences in Telusu Kada | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా?

Published Sun, Jul 14 2024 1:22 AM | Last Updated on Sun, Jul 14 2024 1:22 AM

Siddu Jonnalagadda and Srinidhi Shetty to enchant audiences in Telusu Kada

కన్నడ హిట్‌ ఫ్రాంచైజీ ‘కేజీఎఫ్‌’లో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధీ శెట్టి మంచి నటన కనబరచి ప్రేక్షకుల మెప్పు పొందారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ పరిచయం కానున్నారు. అయితే ‘తెలుసు కదా’ విడుదల కాకముందే డబుల్‌ ధమాకాలా మరో రెండు తెలుగు సినిమాల్లో శ్రీనిధికి ఆఫర్స్‌ దక్కాయట. రానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందనున్న ‘హిట్‌ 3’ సినిమాలోనూ హీరోయిన్‌గా శ్రీనిధీ శెటిని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఆ తర్వాత ‘హిట్‌ 3’ని ఆరంభించే ఆలోచనలో ఉన్నారట. సో... ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ తర్వాత కానీ ‘హిట్‌ 3’ సినిమాలో ఎవరు హీరోయిన్‌గా నటిస్తారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement