srinidhi
-
పేదరికాన్ని అధిగమించి ఉద్యోగం సాధించిన గొర్రెల కాపరి కుమార్తె
వజ్రపుకొత్తూరు: తండ్రి గొర్రెల కాపరి.. కుటుంబానిది అతి సామాన్య నేపథ్యం.. అయినా ఆమె కల లు కనడం మానలేదు. ఎన్ని అడ్డు గోడలు ఉన్నా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టింది. అన్నింటినీ దాటుకుని 19 ఏళ్ల వయసులోనే నేవీ ఉద్యోగం సాధించింది వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన బందాపు శ్రీనిధి. ఆమె సాధించిన ఈ విజయం స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. ఇదీ నేపథ్యం.. శ్రీనిధి తండ్రి బందాపు తేజేశ్వరరావు గొర్రెల కాపరి(పెద్ద కోనారి). తల్లి గౌరి గృహిణి. చెల్లి శ్రీజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదు వుతోంది. శ్రీనిధి మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఆమె పెదనాన్న బందాపు గణపతిరావు ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వహించడం చూసి ఆయనను స్ఫూర్తిగా తీసుకుంది. బాబాయ్ బందాపు తిరుమలరావు ప్రోత్సాహంతో నేవీలో కొలువు సాధించాలని కలలు కన్నది. నేవీ కొలువు అంటే చదువులోనే కాదు శారీరకంగా కూడా చురుగ్గా ఉండాలి. ప్రతి రోజూవెంకటాపురం – పర్లాకిమిడి రహదారిపై పరుగులో సాధన చేసేది. పుష్అప్స్, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇతర ఎక్స్‌ర్‌సైజ్‌లు చేసేది. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గౌరవం అని గమనించి పట్టుదలలో ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందింది. ఇటీవల విడుదలైన ఆలిండియా మెరిట్ జాబితాలో ఎంపికై నవంబరు 11న ఒడిశాలోని చిలకలో శిక్షణ తీసుకోనుంది. మరో ఉద్యోగానికి చేరువలో... జూలై 2024లో సీబీటీ పరీక్షలో అర్హత సాధించిన శ్రీనిధి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ శాతవాహనలో ఆగస్టు 2024లో జరిగిన ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో విజేతగా నిలిచింది. పరీక్షల ఫలితాలు ఈ నెలలో విడుదలై నేవీలో జీడీ (ఎస్ఎస్ఆర్) ఉద్యోగానికి ఎంపికైంది. మరో పక్క ఏప్రిల్ 30, 2024న విశాఖపట్నంలోనే జరిగిన ఉమెన్ మిటరీ పోలీస్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ ఉద్యోగానికి కూడా చేరువైంది. నా కాళ్లపై నేను నిలబడాలి నా కాళ్లపై నేను నిలబడాలి. దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో నేవీ ఉద్యోగం సాధించాను. మాది చాలా సాధారణ కుటుంబం. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అలాగే ఒకే చోట ఉండిపోకూడదు. లక్ష్యం ఏర్పాటు చేసు కుని ప్రతి రోజూ సాధన చేయాలి. మా పెదనాన్న భారత సైన్యంలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆయన నిత్యం ప్రోత్సహించే వారు. మా బాబాయ్ తిరుమల నిత్యం నా వెన్ను తట్టి లక్ష్యం వైపు పయనించేలా సహకరించారు. ఈ విజయం వారికే అంకితం. – బందాపు శ్రీనిధి -
డబుల్ ధమాకా?
కన్నడ హిట్ ఫ్రాంచైజీ ‘కేజీఎఫ్’లో హీరోయిన్గా నటించిన శ్రీనిధీ శెట్టి మంచి నటన కనబరచి ప్రేక్షకుల మెప్పు పొందారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ పరిచయం కానున్నారు. అయితే ‘తెలుసు కదా’ విడుదల కాకముందే డబుల్ ధమాకాలా మరో రెండు తెలుగు సినిమాల్లో శ్రీనిధికి ఆఫర్స్ దక్కాయట. రానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది.తాజాగా నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందనున్న ‘హిట్ 3’ సినిమాలోనూ హీరోయిన్గా శ్రీనిధీ శెటిని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఆ తర్వాత ‘హిట్ 3’ని ఆరంభించే ఆలోచనలో ఉన్నారట. సో... ‘సరిపోదా శనివారం’ రిలీజ్ తర్వాత కానీ ‘హిట్ 3’ సినిమాలో ఎవరు హీరోయిన్గా నటిస్తారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు విజయంతో ముగించింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలివీరా (4వ ని.లో), గేబ్రియల్ రోసెన్‌బర్గ్ (16వ ని.లో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. షిల్లాంగ్ జట్టుకు ఫ్రాంగీ బువామ్ (46వ, 87వ ని.లో) రెండు గోల్స్ అందించాడు. 13 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు నిరీ్ణత 24 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 14 మ్యాచ్‌ల్లో నెగ్గిన శ్రీనిధి జట్టు ఆరు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 48 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్లోనూ శ్రీనిధి జట్టు రెండో స్థానంలోనే నిలిచింది. 52 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్‌గా నిలిచిన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ ఇండియన్ సూపర్ లీగ్‌కు అర్హత సాధించింది. -
శ్రీనిధి డెక్కన్ జట్టును గెలిపించిన ఒలివేరా
కొడుమన్ (కేరళ): ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో 12వ విజయం చేరింది. గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 44వ నిమిషంలో నికోలా స్టొజనోవిచ్ గోల్‌తో గోకులం కేరళ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే శ్రీనిధి తరఫున విలియమ్ అల్వెస్ డి ఒలివేరా (47వ ని.లో, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
I-League 2023-24: శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు మరో విజయం
లుధియానా: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఖాతాలో 11వ విజయం చేరింది. ఢిల్లీ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0 గోల్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో రిల్వాన్ పాస్‌ను హెడర్ షాట్‌తో లాల్రొమావియా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శ్రీనిధి జట్టు ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషందాకా కాపాడుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం శ్రీనిధి జట్టు 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 17న జరిగే తదుపరి మ్యాచ్‌లో గోకులం కేరళ ఎఫ్‌సీతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
నల్లగొండ బరిలో కోమటిరెడ్డి కూతురు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల ఏఐసీసీ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోటీలో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై ఏఐసీసీ సర్వేలు చేయించినట్లు సమాచారం. ఈ సర్వేల్లో మంత్రి కోమటిరెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డివైపు కూడా ప్రజలు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో అనూహ్యంగా శ్రీనిధిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే నల్లగొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జయవీర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్ విషయంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పోటీ పడ్డారు. టికెట్ దామోదర్‌రెడ్డికి దక్కడంతో పటేల్ రమేష్‌రెడ్డి వర్గమంతా ఆందోళనకు దిగింది. అసెంబ్లీ బరిలో తాను కూడా ఉంటానని రమేష్‌రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానం నల్లగొండ లోక్‌సభ టికెట్ ఇస్తామని ఆయనకు సర్దిచెప్పింది. ప్రస్తుతం ఆయన కూడా లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా శ్రీనిధిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన శ్రీనిధిరెడ్డి తన తండ్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటివరకు ఆమె ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. -
రెండో రౌండ్లో శ్రావ్య శివాని
న్యూఢిల్లీ: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి చిలకలపూడి శ్రావ్య శివాని రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో మూడో సీడ్ శ్రావ్య శివాని 6–3, 7–5తో శ్రీనిధిపై గెలిచింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా రెండో రౌండ్‌కు చేరింది. స్మృతి 7–6 (7/1), 5–7, 6–4తో మిహికా యాదవ్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో గంటా సాయికార్తీక్ రెడ్డి 4–6, 3–6తో టాప్ సీడ్ నిక్కీ పునాచా చేతిలో ఓడిపోయాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కాజా వినాయక్ శర్మ 6–4, 6–1తో భూపతి శక్తివేల్‌పై, విష్ణువర్ధన్ 6–4, 6–3తో ఆదిల్ కల్యాణ్‌పూర్‌పై నెగ్గారు. -
మొదటి ఓటు మా నాన్నకే వేయడం నా అదృష్టం
నల్లగొండ: మొదటిసారి నాకు ఓటు హక్కు వచ్చింది. నా ఓటును నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వేయడం నా అదృష్టం. మా నాన్న తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు నాకు అవకాశం దక్కలేదు. అమెరికాలో ఉన్నాను.ఓటు హక్కును వినియోగించుకునేందుకు కళాశాలకు సెలవులు ఉన్నందున నేరుగా అమెరికా నుంచి వచ్చి నాన్న, అమ్మతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఓ మధురానుభూతి. నా మొదటి ఓటు మానాన్నకే వేసే అవకాశం నాకు దేవుడు కలిగించిన అదృష్టంగా భావిస్తున్నాను. – కోమటిరెడ్డి శ్రీనిధి -
పల్లె రుచులకు పట్టం
కాజీపేట అర్బన్: బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే పిజ్జాలు, బర్గర్లు, కబాబ్‌లపై మోజు పెంచుకుంటున్న నేటి కాలంలో సంప్రదాయ వంటలకు పట్టాభిషేకం చేస్తున్నారు ఓరుగల్లు వనితలు. కరకరాలడే కారప్పూస, నోరూరించే సకినాలు, గారెలు, తియతీయని అరిసెలు ఇలా ఒక్కటేమిటి మరెన్నో రకాల అసలు సిసలైన తెలంగాణ పిండి వంటకాలను నేటి తరానికి అందిస్తున్నారు. వరంగల్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలు, ఇతర దేశాలకు వీరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. నలుగురు మహిళలతో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 30మంది ఉపాధి దుతున్నారు. దినదినాభివృద్ధి చెందతూ ప్రగతి పథంలో పయనిస్తున్న వరంగల్ హంటర్‌రోడ్డులోని ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ సంస్థపై ప్రత్యేక కథనం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వర్‌రావు, రాధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రమ, ఉమ, ఉష, కుమారుడు భీంరావ్ ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. చిన్నతనంలో తల్లి చేసిన వంటలను ఆస్వాదించిన కుమార్తెలు నేటి తరానికి బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌కు దీటుగా సంప్రదాయ తెలంగాణ పిండి వంటకాలను పరిచయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు, మరదలు అర్చన(తమ్ముడి భార్య) కలిసి 2016 మే 2న ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ అనే సంస్థను ప్రారంభించారు. నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 30 మంది ఉపాధి పొందుతున్నారు. వరంగల్ నుంచి విదేశాలకు... శ్రీనిధి సంస్థ ఉత్పత్తులను నగరంతోపాటు దేశవిదేశాల్లోని ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. బెంగుళూరు, ముంబాయి, చెన్సై, నగరాలతోపాటు ఆస్టేలియా, అమెరికా వంటి దేశాలకు ఆర్డర్లపై పిండి వంటలను సరఫరా చేస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్లు.. శ్రీనిధి తెలంగాణ పిండి వంటల కోసం ఆన్లైన్లో జస్ట్ డైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. ఆన్లైన్లో శ్రీనిధి ఆర్డర్ కోసం 98494 03242, 93949 46666 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. రకరకాల రుచులు రుచిలో తేడా రాకుండా వంటలకు సంబంధించి కారం పొడి, పసుపు, ఇతర పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. పల్లి గారెలు, పçప్పు గారెలు, తెల్ల సకినాలు, కారం సకినాలు, చెగోడీలు, మురుకులు, బూందీ కార, మడుగులు, సర్వపిండి, అరిసెలు, బూందీ లడ్డూ, బాదుషా, గవ్వలు, పల్లి, నువ్వుల లడ్డూ, గరిజెలు, సున్నుండలతోపాటు, పచ్చళ్లను సైతం తయారు చేస్తున్నారు. పిండి వంటలు కిలోకు రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తున్నారు. ఆర్డర్ ఇస్తే చాలు.. వివాహాది శుభకార్యాల సందర్భంగా పిండి వంటలు కావాల్సిన వారు రెండు రోజుల ముందు ఆర్డర్ ఇస్తే చాలు సరఫరా చేస్తాం. తెలంగాణ పిండి వంటలకు నగరంలో మంచి డిమాండ్ ఉంటోంది. రుచికరమైన పిండి వంటలను అందించేందుకు స్వయంగా పప్పులు, కారం, పసుపును గిర్నీలో పట్టిస్తున్నాం. వంటల తయారీలో వంద శాతం, నాణ్యత, శుభ్రత పాటిస్తున్నాం. - రమ, సంస్థ ప్రతినిధి చాలా ఆనందంగా ఉంది నేను నా పిల్లలు చేస్తున్న వంటలకు ఆదరణ లభిస్తుండడంతో ఆనందంగా ఉంది. మా వద్ద మరో 30 మంది గృహిణులు ఉపాధి పొందుతున్నారు. నేటి తరానికి సంప్రదాయ వంటకాలు తప్పనిసరిగా పరిచయం చేయాలి. తెలంగాణ పిండి వంటలు రుచితోపాటు బలాన్ని ఇస్తాయి. – రాధ, సంస్థ నిర్వాహకులు వనమాలకనపర్తి నుంచి వస్తా.. ఐనవోలు మండలంలోని వనమాలకనపర్తి నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నా. పిండి వంటలు తయారు చేసి ఉపాధి పొందడం బాగుంది. నిర్వాహకులు సొంత మనుషుల్లా చూసుకుంటారు. మేం చేసే వంటలకు గిరాకీ పెరుగుతోంది. – కళ, కార్మికురాలు సొంత ఇంట్లో ఉన్నట్లుగానే శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు ప్రారంభించి నాటి నుంచి ఇక్కడ పని చేస్తున్నా. ఇంట్లో ఉండి పనిచేస్తున్నట్లుగానే ఉంటుంది. నాకు పూర్వ అనుభవం ఏమీ లేకున్నా నిర్వాహకులు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ పనిచేయడం ఆనందంగా ఉంది. – దేవి, కార్మికురాలు. అమ్మ స్ఫూర్తితో.. అమ్మ స్ఫూర్తితో ప్రారంభించిన మా సంస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది. బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌లకు దీటుగా పిండి వంటలను పిల్లలకు అందించాలి. ప్రతిరోజు సుమారు 60 నుండి 100 మందికి పైగా కస్టమర్లు మా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పండుగల సమయంలో ఆర్డర్లపై పిండి వంటలను అందిస్తున్నాం. – ఉమ, సంస్థ ప్రతినిధి -
శ్రీనిధి కాలేజీ ఫీజు విషయంలో కోర్టుకు ఏఎఫ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు విషయం లో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది. గతంలో టీఏఎఫ్ ఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కళాశాల యాజ మాన్యం హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కళాశాల అడుగుతున్న రూ.1.54 లక్షల ఫీజులో టీఏఎఫ్ఆర్సీ రూ.91వేలు ఖరారు చేయగా.. మిగతా రూ.63వేలను విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట డీడీలు తీసి సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు డీడీలు సమర్పించాలని, లేకుంటే కోర్టు దిక్కరణకు పాల్పడినట్లు అవుతుందని కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. దీంతో టీఏఎఫ్ఆర్సీకి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనాన్ని ఆశ్రయించాలని టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకుంది. -
ఘనంగా విక్రమ్‌కుమార్ వివాహం
-
ఇంటివాళ్లైన సినీ దర్శకులు
తమిళసినిమా: సక్సెస్‌పుల్ దర్శకులుగా వెలుగొందుతున్న ఇద్దరు దర్శకులు ఆదివారం ఇంటివారయ్యారు. వారిద్దరూ తాము ప్రేమించిన ప్రియురాళ్లను పరిణయమాడారు. కోలీవుడ్‌లో శింబు హారోగా అలై, మాధవన్ కథానాయకుడిగా యావరుం నటమ్, సూర్య త్రిపాత్రాభినయం చేసిన 24 చిత్రాలతో పాటు తెలుగులో మనం వంటి హిట్ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలను తెరకెక్కించిన మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ తన ప్రియురాలు శ్రీనిధిని వివాహం చేసుకున్నారు. శ్రీనిధి ప్రముఖ సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ రికార్డింగ్ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు దర్శకుడు విక్రమ్‌కుమార్‌కు మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఆదివారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో పెళ్లి చేసుకున్నారు. ఏఆర్.రెహ్మాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు ఈ పెళ్లికి హజరై నూతన వధూవరులను ఆశీర్వధించారు. మరో తమిళ దర్శకుడు రాజుమురుగన్. ఈయన కూక్కూ,ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన జోకర్ చిత్రాలను తెరకెక్కించారు. అంతే కాదు నాగార్జున, కార్తీ నటించిన తోళా చిత్రానికి సంభాషణలు అందించారు. ఈయన టీవీ చానల్ యాంకర్ హేమతో కలిసి ఏడడుగులు నడిచారు. స్థానిక బీసెంట్ నగర్‌లోని ఒక ఆలయంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇదీ ప్రేమ జంటేనన్నది గమనార్హం. -
వైభవంగా దర్శకుడి వివాహం
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చెన్నైలో విక్రమ్ కుమార్, శ్రీనిధిల పెళ్లి వైభవంగా జరిగింది. బంధువులు, స్నేహితులు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి హాజరైన వారిలో నటుడు సూర్య, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తదితరులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని సన్నిహితులు చెప్పారు. విక్రమ్ కుమార్.. మాధవన్‌తో ‘13 బీ’, సూర్యతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’ సినిమాలు తీశారు. 24 సినిమా నిర్మాణ సమయంలో విక్రమ్‌కు శ్రీనిధి పరిచయమైంది. ఈ సినిమాకు శ్రీనిధి సౌండ్ డిజైనర్‌గా పనిచేసింది. -
జైలు.. అమ్మ.. చిన్నారి
జగిత్యాల : మాతృమూర్తి చేసిన నేరం ఆ చిన్నారిని జైలులో ఉండేలా చేసింది. 14 రోజులుగా జైలు గోడలమధ్య అమ్మతో కాలం వెళ్లదీస్తోంది. తల్లిలేక ఉండలేని ఆ బిడ్డకు జైలు సిబ్బంది ఆడిస్తూ లాలిస్తూ సంబరపడుతున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నాగసముద్రపు రాజశేఖర్(30) వండంగ్రి. ఈయనకు నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన మమతతో వివాహమైంది. వీరికి 20 నెలల కూతురు శ్రీనిధి ఉంది. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలూ జరిగాయి. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. 2015 డిసెంబర్ 10న రాజశేఖర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘తన చావుకు భార్య సహా అత్తింటివారే కారణం’ అని సూసైడ్ నోట్ రాశాడు. అప్పుడు రాజశేఖర్ కుటుంబ సభ్యులు భార్య మమతతో పాటు అత్తింటివారిపై పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం గత నెల 30న మమతను అరెస్టు చేసి జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో మమత జగిత్యాల స్పెషల్ జైలులో గడుపుతోంది. తల్లితో కూతురు.. జైలులో ఉంటున్న మమత వెంట కూతురు శ్రీనిధి (20 నెలలు) ఉంటోంది. పాలుతాగే వయస్సు కావడంతో తల్లితోపాటు కూతురును జైలులో ఉండేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో 14 రోజులుగా చిన్నారి శ్రీనిధి జైలులో గడుపుతోంది. మహిళా ఖైదీలు అమ్మమ్మలు, నానమ్మలుగా మారి చిన్నారికి స్నానం చేయించడం.. అన్నం తినిపించడం, ఆటలాడించడం చేస్తూ అమ్మకు ఆసరా, చిన్నారికి భరోసా ఇస్తున్నారు. జైలు సిబ్బంది మానతా దృక్పథం.. జైలు సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ఆమెను ఆడిస్తున్నారు. నవిస్తూ ముచ్చటపడుతున్నారు. చాకెట్లు, బిస్కెట్లు ఇస్తూ ప్రేమను పంచుతున్నారు. దీంతో శ్రీనిధి అమ్మకంటే జైలు సిబ్బంది వద్దే ఎక్కువ సమయం గడుపుతోంది. చిన్నారికి ఎలాంటి అనారోగ్యం లేకున్నప్పటికీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వారం రోజులకోసారి ఆసుపత్రికి తరలించి సిబ్బంది చికిత్సలు చేయిస్తున్నారు. బిడ్డను చూసినప్పుడల్లా తల్లి మమత కళ్లలో కన్నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ‘నేను నేరం చేశానో, చేయలేదో దేవుడికి తెలుసు, కానీ.. ఏ నేరం చేయని బిడ్డ నాతో జైలు జీవితం అనుభవించడమే నాకు పెద్ద శిక్ష’ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతోంది. -
చిన్నారి శ్రీనిధి కన్నుమూత
- మూడేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి - ఆమె కోరిక మేరకు ఇటీవలే మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ బంధనపల్లి (రాయపర్తి) : ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌తో బాధపడుతూ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలుసుకున్న చిన్నారి శ్రీనిధి మృత్యుఒడి చేరింది. మూడేళ్లుగా చికిత్స పొందుతున్నప్పటికీ ఫలితం లేకపోరుుంది. రాయపర్తి మండలంలోని బంధనపల్లి గ్రామానికి చెందిన నౌగరి శివాజీ, క్రాంతికి ముగ్గురు కుమార్తెలు శ్రీనిధి(11), వేదశ్రీ, ఆరాధ్య. శ్రీనిధి మూడేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రాందేవరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చివరగా ‘నా కోరిక సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉంది’ అని చిన్ని చిన్ని ముచ్చట్లతో ఆమె తన తండ్రికి చెప్పింది. కన్నప్రేమతో ఎక్కడికైనా వెళ్లాలని జూనియర్ ఎన్టీఆర్ ను కలవగా అతను ఓకే అన్నారు. ఈనెల 12న జూనియర్ ఎన్టీఆర్ రాందేవరావు మెమోరియల్ హాస్పిటల్‌కు వెళ్లి చిన్నారితో మాట్లాడారు. దీంతో తబ్బిఉబ్బిపోయిన చిన్నారి పట్టలేనంత ఆనందంలో మునిగితేలింది. కాగా, జూని యర్ ఎన్టీఆర్ పుట్టిన రోజునే కేన్సర్ బాధిత చిన్నారి మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనిధి మృతి ఆమె కుటుంబంలో పెనువిషాదం నింపగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారుు. -
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూత
హైదరాబాద్: గతకొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూసింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి గత కొద్దిరోజులుగా హైదరాబాద్ కూకట్పల్లి రాందేవ్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష యం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన శ్రీనిధి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆమెను పరామర్శించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజి కుమార్తె శ్రీనిధి(10) ఆరో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం శ్రీనిధికి నడుమునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా బ్లడ్‌క్యాన్సర్ అని తేల్చారు. దీంతో ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత పరిస్థితి విషమించింది. -
చిన్నారి శ్రీనిధి కన్నుమూత
-
తారలు దిగివచ్చిన వేళ...
(సాక్షి వెబ్ ప్రత్యేకం) వాళ్లంతా ఆకాశంలో ఉండే తారల కంటే ఏమాత్రం తక్కువ కారు. తమ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటారు. కోట్లల్లో సంపాదన.. పెద్ద పెద్ద పడవల్లాంటి కార్లలోనే తిరగడం.. ఐదు నక్షత్రాల జీవితం. ఇదీ సినీ తారల పరిస్థితి. కానీ.. అలాంటి తారలు ఆకాశం నుంచి కిందకు దిగి వస్తున్నారు. తమను ఎంతగానో అభిమానించే సామాన్యుల కోసం తామే నేరుగా నడిచి వెళ్తున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను తాము స్వయంగా ఆదుకోలేకపోయినా.. తమను చూడటమే వాళ్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలుసుకుని, తీరిక చేసుకుని మరీ వెళ్తున్నారు. తమను ఎంతగానో అభిమానించి.. ఇంతవాళ్లను చేసిన వాళ్ల కోసం ఎంతోకొంత చేయాలన్న ఉద్దేశంతో మంచి పనులు మొదలు పెడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శ్రీనిధి అనే చిన్నారి కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇక బతకడం కూడా కష్టమని వైద్యులు చెప్పేశారు. ఆమెకు హీరో ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. అతడు నటించిన 'యమదొంగ' సినిమా చాలా చాలా నచ్చింది. ఆమె అనారోగ్యం విషయం తెలిసిన ఎన్టీఆర్.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లాడు. పెద్ద టెడ్డీ బేర్ ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. బోలెడన్ని చాక్లెట్లను గిఫ్టు బాక్సులో ప్యాక్ చేయించి ఇచ్చి, ఆమె పక్కనే కూర్చుని మాట్లాడాడు. ఆ చిన్నారి శ్రీనిధికి ఎక్కడలేని ఆనందం. కొన్నాళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ అనే అమ్మాయి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. ఆమెకు పవన్ కల్యాణ్ అంటే ఎనలేని ఇష్టం. విషయం తెలిసిన పవర్ స్టార్.. తానే స్వయంగా ఖమ్మం ఆస్పత్రికి వెళ్లారు. కానీ ఆ సమయానికి ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదు. కొన్నాళ్ల తర్వాత కోలుకున్న ఆమెను ఆమె తండ్రి పవన్ వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆమె కళ్లలో ఎనలేని సంతోషం. హీరోయిన్ సమంత మహిళలు, అమ్మాయిల కోసం 'ప్రత్యూష ఫౌండేషన్' పేరుతో ఓ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రులు అన్నింటితోను ఈ ఫౌండేషన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అక్కడ చికిత్స చేయించుకోడానికి వచ్చి, ఆర్థిక పరిస్థితి అనుకూలించని నిరుపేదలు ఎవరైనా ఉంటే.. ఆ సమాచారాన్ని సదరు ఆస్పత్రి వర్గాలు ప్రత్యూష ఫౌండేషన్‌కు పంపుతాయి. అవకాశం మేరకు వాళ్లకు ఫౌండేషన్ నుంచి సాయం అందుతుంది. ఇందుకోసం తాను వివిధ సినిమాల్లో ధరించిన దుస్తులు, నగలతో పాటు సహ నటులు ధరించిన దుస్తులను కూడా సమంత ఆన్లైన్లో వేలానికి పెడుతోంది. గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ వేసుకున్న పోలీసు యూనిఫాం, దూకుడు సినిమాలో మహేష్‌బాబు ఓ పాటలో ధరించిన ఎర్ర పువ్వుల చొక్కా లాంటివి ఈ వేలంలో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చిన సొమ్మును కూడా ఆమె ఇలా చికిత్సల కోసం వెచ్చిస్తోంది. అభిమానులు టికెట్లు కొన్న డబ్బులతో సకల సౌకర్యాలు అనుభవించే తారలు.. ఆ అభిమానుల కోసం తాము కిందకు దిగివచ్చి స్వయంగా వెళ్లి పలకరించడంతో పాటు వీలైనంత మేర ఆర్థిక సాయం కూడా అందించడం ప్రశంసనీయం. -పి.ఆర్.ఆర్. కామేశ్వరరావు -
'తండ్రిగా ఆ బాధ నాకు తెలుసు'
-
మీ డైలాగ్స్ అంటే చాలా ఇష్టం : శ్రీనిధి
-
శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ
-
తండ్రిగా ఆ బాధ నాకు తెలుసు:జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ : పిల్లలకు ఏమైనా జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీనిధిని మంగళవారం అతడు పరామర్శించాడు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ 'నాకు ఓ కొడుకు ఉన్నాడు. పిల్లలకు ఏదైనా జరిగితే తల్లిదండ్రుల గుండె తరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. చిన్నారి శ్రీనిధి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఆమె కోలుకుని మనందరి మధ్య ఆరోగ్యంగా తిరగాలని కోరుకుంటున్నా. నాకు ఏదో చేయాలని ఉంది. తప్పకుండా సాయం చేస్తా. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నేను రావడం వల్ల అయినా ఆ పాపకు ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడితే బాగుంటుంది. అందరి ప్రార్థనలు ఫలించి శ్రీనిధి త్వరగా కోలుకోవాలి. పాప కోలుకుంటే అంతకన్నా కావల్సింది ఏమీ లేదు. పాప కోర్కెను తీర్చాలనే ఇక్కడకు వచ్చాను' అని తెలిపాడు. -
శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ
ఆ చిన్నారికి... జూనియర్ ఎన్టీఆర్ అంటే.. విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా.. చూడకుండా... ఉండదు. ఫస్ట్ షో దొరక్కున్నా... కనీసం విడుదలైన రోజైనా. ఆ సినిమా చూడాల్సిందే. ఎప్పటికైనా తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ను కలుసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. అయితే ఆడుతూ పాడుతూ ఉన్న ఆ చిన్నారికి కేన్సర్ సోకింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావ్ ఆస్పత్రిలో చేర్పించారు. తన అభిమాన నటుడుని వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజీ కూతురు శ్రీనిధి. పాపకు పదేళ్లు వయస్సు.. రెండేళ్ల క్రితం నడుము నొప్పి రావటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఓ పిడుగులాంటి వినాల్సి వచ్చింది. బ్యాక్‌పెయిన్ కాదు... పాపకు బ్లడ్‌క్యాన్సర్ అన్న డాక్టర్ల మాట విని షాక్ తిన్నారు. దీంతో... బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలన్న తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. పేరున్న ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇక అమ్మాయి పరిస్థితి మెరుగుపడదని వైద్యులు తేల్చేశారు. దీంతో బిడ్డను ఎలాగూ బతికించుకోలేమనుకున్న తల్లిదండ్రులు... కూకట్‌పల్లిలోని స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రామ్‌దేవ్‌రావ్ ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీనిధి చివరి కోరికనైనా తీర్చాలనుకున్నారు. ఫేస్బుక్ ద్వారా శ్రీనిధి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందించిన ఎన్టీఆర్ మంగళవారం పాపను చూసేందుకు నేరుగా ఆస్పత్రికి వచ్చాడు. అయితే శ్రీనిధికి బ్లడ్ కేన్సర్ అన్న విషయం తెలియనివ్వకుండా పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ వస్తున్నాడని చెప్పారు. శ్రీనిధిని కలిసి కొద్దిసేపు ఆమెతో గడిపాడు. ఆ కుటుంబానికి తనకు చేతనైన సాయం అందిస్తానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు. -
కడచూపూ కరువాయే..
♦ అశ్రునయనాలతో శ్రీనిధి అంత్యక్రియలు ♦ కన్నీటిసంద్రమైన రేకుర్తి కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి రాజిరెడ్డి-అనంతలక్ష్మి దంపతుల రెండో కూతురు శ్రీనిధి(19) హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. విజ్ఞానయాత్రలో భాగంగా కళాశాల విద్యార్థులతో కలిసి గతనెల 3న శ్రీనిధి వెళ్లింది. 8న హిమాచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో శ్రీనిధి కూడా ఉందనే సమాచారంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. ఆమె అచూకీ కోసం తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. బియాస్ నది ఒడ్డున కూతురు అచూకీ కోసం పదిరోజులపాటు పడిగాపులు పడ్డప్పటికీ ఫలితం లేకపోవడంతో గతనెల 20న రేకుర్తికి తిరిగి వచ్చాడు.శ్రీనిధి జ్ఞాపకాలతో కాలం గడుపుతున్న కుటుంసభ్యులకు ఆదివా రం బియాస్ నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో శ్రీనిధి మృతదేహం లభించినట్టు సమాచారం అందింది. దీంతో వారిలో దు:ఖం మిన్నంటింది. ప్రత్యేక విమానంలో మృతదేహం తరలింపు శ్రీనిధి మృతదేహానికి ఆదివారం మండి జిల్లాలో పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీస్ అధికారులు ప్రత్యేక విమానంలో సోమవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపించారు. శ్రీనిధి మృతదేహం కోసం హైదరాబాద్‌కు ఆమె మేనమామ లింగారెడ్డి, డెప్యూటీ తహశీల్దార్ లింబాద్రి, ఆర్ఐ ఖాజా వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన శ్రీనిధి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని సాయంత్రం 4.45 గంటలకు రేకుర్తికి చేరుకున్నారు. కన్నీటి సంద్రమైన రేకుర్తి శ్రీనిధి మృతదేహమున్న శవపేటికను అంబులెన్స్ నుంచి కిందకు దించడంతోనే తల్లిదండ్రులు అనంతలక్ష్మి, రాజిరెడ్డి, సోదరి శ్రీతేజ, కుటుంబసభ్యులు బోరున విలపించారు. శ్రీనిధి శవపేటికపైపడి రోదించడం చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శ్రీనిధి శవపేటికను తిరిగి అంబులెన్స్‌లో చేర్చి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శవపేటికలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో దుర్వాసన వెలువడింది. చివరిసారిగా శ్రీనిధి ముఖం చూడాలనే తల్లిదండ్రుల కోర్కే మేరకు మృతదేహానికి చుట్టిన కవర్లను బంధువులు విప్పేందుకు ప్రయత్నించగా, దుర్వాసన రావడంతో వెనుకడుగేశారు. శ్రీనిధిని చివరిసారి చూస్తానంటూ తల్లి అనంతలక్ష్మి, అక్క శ్రీతేజ రోదించిన తీరు పలువురి హృదయాలను కలచివేసింది. చివరకు హిందూ సాంప్రదాయరీతిలో అంతిమసంస్కారాలు నిర్వహించిన అనంతరం కుమార్తె చితికి తండ్రి రాజిరెడ్డి నిప్పంటించారు. శ్రీనిధి మృతదేహానికి జిల్లా జడ్జి నాగమారుతిశర్మ, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్, సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్, ఎంపీటీసీ సభ్యులు శేఖర్, నాగరాణి, బాలయ్యతో పాటు స్థానిక నాయకులు నివాళులర్పించారు. -
బియాస్ నదిలో లభించిన శ్రీనిధి ఆచూకీ
కన్నీటి నిరీక్షణకు తెర - 42 రోజులుగా దు:ఖసాగరంలో తల్లిదండ్రులు - నేడు రేకుర్తికి మృతదేహం కరీంనగర్ రూరల్ : కన్నకూతురు మృతదేహాన్ని కడసారి చూడాలనే ఆ తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడింది. 42 రోజుల సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం ఆదివారం బియాస్ నదిలో కూతురు మృతదేహం లభించిందనే సమాచారంతో ఇన్నాళ్లూ దిగమింగిన దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం రేకుర్తికి తీసుకరావడానికి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద ఉధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 24 మంది విద్యార్థులు నదిలో గల్లంతు కావడంతో శ్రీనిధి అచూకీ కోసం ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. కూతురు ఆచూకీ కోసం నది ఒడ్డున పదిరోజులపాటు పడిగాపులు కాశాడు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి కొద్ది రోజులపాటు అక్కడే ఉండి గా లింపును పర్యవేక్షించారు. మంచుకొండలు కరిగి నదిలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చే పట్టగా గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో 21 మృతదేహాలు లభించా యి. ఒక్కొక్క మృతదేహం బయటపడుతున్న కొద్దీ అది తమ కూతురుదేమోననే ఆతృతతో వెళ్లి చూడడం... ఆమెది కాదని తెలిసి నది ఒడ్డున విషాదవదనంతో ఎదురుచూపులు చూడడం రాజిరెడ్డికి నిత్యకృత్యమైంది. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు ప్రకటి ంచింది. గల్లంతైన విద్యార్థుల పేరిట డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కూతురు ఆచూకీపై రాజిరెడ్డి ఆశ లు వదులుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరినీ అక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజిరెడ్డి గత నెల 20న స్వగ్రామం రేకుర్తికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి శ్రీనిధి జ్ఞాపకాలతో ఆమె మృతదేహం ఆచూకీ కోసం రాజిరెడ్డి కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం బియాస్‌నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో లభించిన రెండు మృతదేహాల్లో ఒకటి శ్రీనిధిగా గుర్తించినట్లు అధికారులు ప్రకటించడంతో తల్లిదండ్రులు రాజిరెడ్డి, అనంతలక్ష్మి, అక్క తేజతోపాటు బంధువుల్లో దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. శ్రీనిధి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని సోమవారం హిమాచల్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించడానికి అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి రాజిరెడ్డి సమీప బంధువులతో కలిసి సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మృతదేహం రేకుర్తికి వచ్చే అవకాశముంది. -
స్త్రీనిధి రుణాలకు గ్రేడింగ్ కొర్రీ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కందుకూరు మండలంలోని ఓ గ్రామైక్య సంఘం పనితీరు ఆధారంగా స్త్రీ నిధిలో గ్రేడ్-ఎ పరిధిలోకి రావడంతో రూ. 20 లక్షల రుణం పొందేందుకు అర్హత సాధించింది. అదే జరుగుమల్లి మండలంలోని కొన్ని గ్రూపుల పనితీరు బాగున్నా ఆ మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో రుణాలు పొందేందుకు అర్హత కోల్పోతున్నాయి. పనితీరు ఒకేలా ఉన్నా..గ్రామైక్య సంఘం ఉన్న మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో దాని పరిధిలో ఉన్న గ్రూపులకు రుణాలు అందడం లేదు. ఈ ఏడాది దాదాపు వంద సంఘాల వారు గ్రేడింగ్‌ల కారణంగా రుణం పొందలేకపోయారు. ఫలితంగా జిల్లాలో దాదాపు 1500 మందికిపైగా సభ్యులు రుణానికి దూరం కానున్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు సక్రమంగా రుణాలివ్వడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేసింది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే స్త్రీనిధి బ్యాంకు ద్వారా గ్రూపులకు రుణాలందిస్తారు. 2011 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం అమలు కోసం గ్రూపులకు కొన్ని నియమ నిబంధనలు విధించారు. గ్రామైక్య సంఘాల గ్రేడింగ్: పనితీరు ఆధారంగా గ్రామైక్య సంఘాలకు గ్రేడ్లను కేటాయిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు సక్రమంగా చెల్లించడం, సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా..ఆడిట్‌ను నిర్వహించారా లేదా..దస్త్రాల నిర్వహణ, ఆర్థికంగా గ్రేడింగ్ కొర్రీ అభివృద్ధి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడింగ్ ఇస్తారు. ఆ గ్రేడింగ్ ఆధారంగానే రుణాలందిస్తారు. ఈ ఏడాది జిల్లాలోని అన్ని మండలాలు గ్రేడింగ్ పరిధిలోకి వచ్చాయి. గ్రేడ్-ఎ మండలానికి రూ. 3.50 కోట్లు, గ్రేడ్-బి మండలానికి రూ. 1.5 నుంచి రూ. 2 కోట్లు, గ్రేడ్-సి మండలానికి కోటి రూపాయల నుంచి రూ. 50 లక్షలు, గ్రేడ్-డి మండలానికి రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలిస్తారు. గ్రేడ్-ఎ గ్రామైక్య సంఘానికి రూ. 20 లక్షలు, గ్రేడ్-బి సంఘానికి రూ. 12 నుంచి రూ. 15 లక్షలు, గ్రేడ్-సి సంఘానికి రూ. 10 లక్షలు, గ్రేడ్-డి సంఘానికి రూ. 7 లక్షల రుణం ఇస్తారు. అక్కడ నుంచి స్వయం సహాయక సంఘాలకు రుణాలందిస్తారు. గతంలో 14 శాతం వడ్డీతో రుణాలు తీసుకుని తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి పావలా వడ్డీని వర్తింపజేస్తారు. తాజాగా ఇందులో కూడా వడ్డీలేని రుణాన్ని ఇస్తున్నారు. వాయిదా పద్ధతుల సమయంలో నెలా ఏడు రోజుల వరకు కేవలం అసలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అనంతరం చెల్లిస్తే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మండలానికి గ్రేడింగ్ నిర్ణయించే సమయంలో సదరు మండలంలోని గ్రామైక్య సంఘాలన్నింటి పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయిస్తారు. అందులో కొన్నింటి పనితీరు సక్రమంగా ఉండి, మరికొన్నింటి పనితీరు సరిగా లేకపోతే అది మండల గ్రేడింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలా..పలు గ్రామైక్య సంఘాల పనితీరు సక్రమంగా ఉన్నా..మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో ఆయా సంఘాలకు నిధులు రావడం లేదు. జిల్లాలో తాజాగా నిర్ణయించిన గ్రేడింగ్ విధానంలో జరుగుమల్లి మండలం సీ-గ్రేడ్, హనుమంతునిపాడు మండలం డీ- గ్రేడ్ కిందకు వచ్చాయి. దీంతో ఈ మండలాల్లోని అన్ని గ్రామైక్య సంఘాలకు, అనంతరం గ్రూపులకు ఈ ఏడాది రుణాలు రాని పరిస్థితి. దీంతో పనితీరు బాగున్న సంఘాల వారు తామేం తప్పు చేశామని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేడింగ్ పరిధిలోకి వచ్చాయి. సెర్ప్ ఫార్మేట్ ప్రకారమే... గ్రేడింగ్ సరిగా లేని మండలాల్లో పనితీరు బాగున్న గ్రామైక్య సంఘాలు కూడా ఉన్నా యి. సెర్ప్ ఫార్మేట్ ప్రకారం గ్రామాన్ని, మండల సమాఖ్యను యూనిట్‌గా తీసుకుని గ్రేడింగ్ నిర్ణయిస్తున్నాం. - ధర్మేంద్ర, స్త్రీనిధి ఏజీఎం -
‘స్త్రీనిధి’ రికవరీలో జిల్లా ప్రథమస్థానం
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : స్త్రీనిధి ద్వారా ఈ ఏడాది లక్ష్యానికి మించి రుణాలు అందించామని, అలాగే లబ్ధిదారుల నుంచి రికవరీ చేయడంలో జిల్లా ప్రథమస్థానంలో ఉందని స్త్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. మండలంలోని లింగంపల్లికలాన్‌లో రుణాలను పొందిన లబ్ధిదారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. స్త్రీనిధి ద్వారా రుణాలు పొందడం వల్ల కలిగిన ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం వల్ల తిరిగి ఎక్కువ డబ్బులను రుణంగా పొందవచ్చని ఆయన సూచించారు. అనంతరం మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది స్త్రీనిధి ద్వారా 122కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటివరకు 127కోట్లను రుణాలుగా ఇచ్చామని, మార్చి ఆఖరు వరకు మరో 20కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ఏడాది లక్ష్యానికిమించి స్త్రీనిధి ద్వారా మహిళలకు రుణాలు అందించామన్నారు. జిల్లాలో రుణాల రికవరీ ఇప్పటి వరకు 99.5శాతం జరిగిందని ఆయన వివరించారు. జిల్లాలోని స్త్రీనిధి పథకం ద్వారా అత్యధికంగా కోటగిరి మండలంలో 5కోట్ల75లక్షలు రుణాలుగా ఇచ్చామని, తర్వాత బోధన్ మండలంలో 5కోట్ల68లక్షలు ఇచ్చామని ఆయన చెప్పారు. రైతులకు రుణాలు ఎల్లారెడ్డి, బాన్సువాడ బీఎంసీల పరిధిలో రైతులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందించడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైతులకు రుణాలను ఇస్తామని ఏజీఎం పేర్కొన్నారు. స్త్రీనిధి రుణాల వినియోగంపై ప్రస్తుతం మొదటివిడతగా జిల్లాలో లింగంపేట మండలంలోని పర్మళ్ల, కోర్పొల్, పోతాయిపల్లితోపాటు డిచ్పల్లి మండలంలోని ఇందల్వాయి గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. రెండోవిడతలో నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లికలాన్, నిజాంసాగర్ మండలం సింగితం గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనవెంట ఏపీఎం మహేష్‌కుమార్, సిబ్బంది రాజు తదితరులు ఉన్నారు. -
చక్రాలకింద నలిగిన చిన్నారి
దుబ్బాక, న్యూస్‌లైన్: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన మంగళవారం సాయంత్రం దుబ్బాకలో జరిగింది. ఎంతో గారాభంగా చూసుకుంటున్న తమ గారాల పట్టి ఇక లేదన్న విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి అక్కడున్న వారు కూడా కంటతడిపెట్టారు. అందరినీ కలచి వేసిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌లోని పద్మశాలిగడ్డకు చెందిన పారుపల్లి శ్రీనివాస్, అనురాధ దంపతులకు కూతురు శ్రీనిధి(6), కుమారుడు నిఖిల్‌లు సంతానం. వీరిద్దరూ ప్రస్తుతం గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉన్న దుబ్బాకలో గాయత్రి వివేకానంద విద్యాలయంలో చదువుకుంటున్నారు. రోజూ గ్రామానికే చెందిన రవీందర్ ఆటోలో పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే రోజు మాదిరిగానే అనురాధ తన పిల్లలు శ్రీనిధి, నిఖిల్‌లను మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఆటోలో పాఠశాలకు పంపించింది. బడి ముగిశాక సాయంత్రం 5గంటల సమయంలో పాఠశాల నుంచి విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోలో 25 మంది వరకు విద్యార్థులుండటంతో, డ్రైవర్ రవీందర్ తన పక్కన కూడా విద్యార్థులను కూర్చోపెట్టుకుని నడిపిస్తున్నాడు. ఇందులో యూకేజీ చదువుతోన్న శ్రీనిధి ఉంది. కొంత దూరం ప్రయాణించాక బీసీ కాలనీ సమీపంలో ఆటోలో నుంచి శ్రీనిధి జారిపడిపోయింది. ఇది గమనించని డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లడంతో ఆటో వెనుక చక్రం శ్రీనిధి తలపై నుంచి పోయింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన తోటి విద్యార్థులాంత షాక్‌కు గురయ్యారు. స్థానికులు వెంటనే ఆటోలో ఉన్న మిగతా విద్యార్థులను మరో ఆటోలో గ్రామానికి పంపించారు. విషయం తెలుసుకున్న శ్రీనిధి తల్లిదండ్రులు , గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న దుబ్బాక ఎస్ఐ లెనిన్‌బాబు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆరేళ్లకే..నూరేళ్లు నిండయా తల్లీ... ‘‘అయ్యో.. దేవుడా ఎంత పని చేశావయ్యా..మా పప్పిని(శ్రీనిధిని) మా నుంచి దూరం చేశావా..మేమేం పాపం చేశామయ్యా’’ అంటూ తల్లిదండ్రులు అనురాధ, శ్రీనివాస్‌లు సంఘటనా స్థలంలో రోదించిన తీరు చూసి అక్కడున్న వారు సైతం కంటతడిపెట్టారు. చిన్నారి మృతదేహం వద్ద గుండెలు బాదుకుంటూ ఆరేళ్ల వయసులోనే నీకు నూరేళ్లు నిండాయా అంటూ రోదించిన ఆ దంపతులు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.