ఇంటివాళ్లైన సినీ దర్శకులు | Director Vikram Kumar Marries Srinidhi in Chennai | Sakshi
Sakshi News home page

ఇంటివాళ్లైన సినీ దర్శకులు

Published Mon, Sep 5 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

Director Vikram Kumar Marries Srinidhi in Chennai

 తమిళసినిమా: సక్సెస్‌పుల్ దర్శకులుగా వెలుగొందుతున్న ఇద్దరు దర్శకులు ఆదివారం ఇంటివారయ్యారు. వారిద్దరూ తాము ప్రేమించిన ప్రియురాళ్లను పరిణయమాడారు. కోలీవుడ్‌లో శింబు హారోగా అలై, మాధవన్ కథానాయకుడిగా యావరుం నటమ్, సూర్య త్రిపాత్రాభినయం చేసిన 24 చిత్రాలతో పాటు తెలుగులో మనం వంటి హిట్ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలను తెరకెక్కించిన మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ తన ప్రియురాలు శ్రీనిధిని వివాహం చేసుకున్నారు.

 
 శ్రీనిధి ప్రముఖ సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ రికార్డింగ్ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు దర్శకుడు విక్రమ్‌కుమార్‌కు మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఆదివారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏఆర్.రెహ్మాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు ఈ పెళ్లికి హజరై నూతన వధూవరులను ఆశీర్వధించారు.



మరో తమిళ దర్శకుడు రాజుమురుగన్. ఈయన కూక్కూ,ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన జోకర్ చిత్రాలను తెరకెక్కించారు. అంతే కాదు నాగార్జున, కార్తీ నటించిన తోళా చిత్రానికి సంభాషణలు అందించారు. ఈయన టీవీ చానల్ యాంకర్ హేమతో కలిసి ఏడడుగులు నడిచారు. స్థానిక బీసెంట్ నగర్‌లోని ఒక ఆలయంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇదీ ప్రేమ జంటేనన్నది గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement