Director Vikram Kumar
-
ఇంటివాళ్లైన సినీ దర్శకులు
తమిళసినిమా: సక్సెస్‌పుల్ దర్శకులుగా వెలుగొందుతున్న ఇద్దరు దర్శకులు ఆదివారం ఇంటివారయ్యారు. వారిద్దరూ తాము ప్రేమించిన ప్రియురాళ్లను పరిణయమాడారు. కోలీవుడ్‌లో శింబు హారోగా అలై, మాధవన్ కథానాయకుడిగా యావరుం నటమ్, సూర్య త్రిపాత్రాభినయం చేసిన 24 చిత్రాలతో పాటు తెలుగులో మనం వంటి హిట్ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలను తెరకెక్కించిన మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ తన ప్రియురాలు శ్రీనిధిని వివాహం చేసుకున్నారు. శ్రీనిధి ప్రముఖ సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ రికార్డింగ్ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు దర్శకుడు విక్రమ్‌కుమార్‌కు మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఆదివారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో పెళ్లి చేసుకున్నారు. ఏఆర్.రెహ్మాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు ఈ పెళ్లికి హజరై నూతన వధూవరులను ఆశీర్వధించారు. మరో తమిళ దర్శకుడు రాజుమురుగన్. ఈయన కూక్కూ,ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన జోకర్ చిత్రాలను తెరకెక్కించారు. అంతే కాదు నాగార్జున, కార్తీ నటించిన తోళా చిత్రానికి సంభాషణలు అందించారు. ఈయన టీవీ చానల్ యాంకర్ హేమతో కలిసి ఏడడుగులు నడిచారు. స్థానిక బీసెంట్ నగర్‌లోని ఒక ఆలయంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇదీ ప్రేమ జంటేనన్నది గమనార్హం. -
వైభవంగా దర్శకుడి వివాహం
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చెన్నైలో విక్రమ్ కుమార్, శ్రీనిధిల పెళ్లి వైభవంగా జరిగింది. బంధువులు, స్నేహితులు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి హాజరైన వారిలో నటుడు సూర్య, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తదితరులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని సన్నిహితులు చెప్పారు. విక్రమ్ కుమార్.. మాధవన్‌తో ‘13 బీ’, సూర్యతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’ సినిమాలు తీశారు. 24 సినిమా నిర్మాణ సమయంలో విక్రమ్‌కు శ్రీనిధి పరిచయమైంది. ఈ సినిమాకు శ్రీనిధి సౌండ్ డిజైనర్‌గా పనిచేసింది. -
త్వరలో పెళ్లాడనున్న టాప్ డైరెక్టర్
ఇష్క్, మనం, 24 వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సౌండ్ డిజైనర్ శ్రీనిధి వెంకటేశ్(27)ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. చైన్నెలో ఆదివారం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 24 సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారని, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని విక్రమ్ కుమార్ సన్నిహితులు వెల్లడించారు. సెప్టెంబర్ లో వీరి పెళ్లి జరిగే అవకాశముందని తెలిపారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ దగ్గర శ్రీనిధి సౌండ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాతే కొత్త సినిమా చేయాలని విక్రమ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తో ఆయన సినిమా చేయనున్నారని సమాచారం. -
నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా 24 విన్నా - సూర్య
‘‘ ‘24’ నా కెరీర్లో ముఖ్యమైన సినిమా. ‘మనం’ సమయంలోనే ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పుడే దర్శకుడు విక్రమ్‌కుమార్ ‘24’ కథ వినిపించారు. నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా ఆయన చెప్పిన కథే విన్నాను. ఈ కథ ఎంతగా నచ్చిందంటే వెంటనే నిర్మాతగా మారడానికి నిర్ణయించుకున్నా. వెంటనే సంగీత దర్శకుడు ఏ.ఆర్.రె హ్మాన్ తలుపు తట్టాం. ఇంతకాలం ఎందుకు గ్యాప్ వచ్చిందనే ప్రశ్నకుఈ చిత్రం ఓ సమాధానం అవుతుంది’’ అని హీరో సూర్య అన్నారు. ‘ఇష్క్’, మనం’ చిత్రాల ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సూర్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన చిత్రం - ‘24’. గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్టైన్ మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్త నిర్మాణంలో జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. సమంత, నిత్యామీనన్ కథానాయికలు. ఏ.ఆర్.రెహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను హీరో కార్తీ విడుదల చేశారు. ఏఆర్. రెహ్మాన్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా అవకాశం ఇచ్చినం దుకు సూర్య, విక్రమ్‌కుమార్‌లకు చాలా థ్యాంక్స్, మా అబ్బాయి అమీన్ మొదట ‘ఓకే బంగారం’లో అరబిక్ పాట పాడాడు. మళ్లీ రెండో సారి ‘నిర్మలా కాన్వెంట్’లో ‘కొత్త కొత్త భాష’ పాట పాడాడు. మీ ఆశీస్సులు అతనికి ఎప్పుడూ ఉండాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడు అసలు దీన్ని తెరకెక్కించడం సాధ్యమా అని అనిపించింది. కానీ మాకు చెప్పిన దాని కన్నా బాగా విక్రమ్ ఈ సినిమా తీశారు’’ అని సమంత అన్నారు. ఈ వేడుకలో హీరోలు కార్తీ, అఖిల్, నిర్మాత సుధాకర్‌రెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, నటుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.