వైభవంగా దర్శకుడి వివాహం | Director Vikram Kumar ties the knot | Sakshi
Sakshi News home page

వైభవంగా దర్శకుడి వివాహం

Published Sun, Sep 4 2016 3:08 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

వైభవంగా దర్శకుడి వివాహం

వైభవంగా దర్శకుడి వివాహం

చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చెన్నైలో విక్రమ్ కుమార్, శ్రీనిధిల పెళ్లి వైభవంగా జరిగింది. బంధువులు, స్నేహితులు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి హాజరైన వారిలో నటుడు సూర్య, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తదితరులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని సన్నిహితులు చెప్పారు.

విక్రమ్ కుమార్.. మాధవన్తో ‘13 బీ’, సూర్యతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’ సినిమాలు తీశారు. 24 సినిమా నిర్మాణ సమయంలో విక్రమ్కు శ్రీనిధి పరిచయమైంది. ఈ సినిమాకు శ్రీనిధి సౌండ్ డిజైనర్గా పనిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement