
యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు
తిరుమలాయపాలెం(ఖమ్మం): అప్పటికే ఒకరి చేతిలో మోసపోయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన దగ్గరి బంధువు పాప జన్మించాక ముఖం చాటేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలాయపాలెంకు చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం క్రితం వివాహం జరగగా, 16 రోజులకే భర్త మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తోంది.
రెండేళ్లుగా ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకు చెందిన మేనత్త కుమారుడు చిర్రా హరీశ్ వీరి ఇంటికి వచ్చివెళ్లే క్రమాన ఆమె అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా దగ్గరయ్యాడు.
దీంతో ఆమె గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చాక తనతో ఎలాంటి సంబంధం లేదని, పాప తనకు పుట్టలేదంటూ హరీశ్ బుకాయించాడు. ఈక్రమాన ఆమె మూడు నెలల పాపను తీసుకుని హరీశ్ ఇంటికి వెళ్లగా ఆయనతో పాటు తల్లిదండ్రులు, సోదరి ఇంటికి రావొద్దని, వస్తే చంపేస్తామని బెదిరించారు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment