
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వికారాబాద్(రంగారెడ్డి): బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుల్కచర్లకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. బాలిక తండ్రి గ్రామంలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకి లభించకపోవడంతో గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అదే గ్రామానికి చెందిన శ్రీనుపై అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీను బాలికను పెళ్లిచేసుకున్నట్లుగా గుర్తించారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించి నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment