
తండ్రిగా ఆ బాధ నాకు తెలుసు:జూ.ఎన్టీఆర్
పిల్లలకు ఏమైనా జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు.
హైదరాబాద్ : పిల్లలకు ఏమైనా జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీనిధిని మంగళవారం అతడు పరామర్శించాడు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ 'నాకు ఓ కొడుకు ఉన్నాడు. పిల్లలకు ఏదైనా జరిగితే తల్లిదండ్రుల గుండె తరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. చిన్నారి శ్రీనిధి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా.
ఆమె కోలుకుని మనందరి మధ్య ఆరోగ్యంగా తిరగాలని కోరుకుంటున్నా. నాకు ఏదో చేయాలని ఉంది. తప్పకుండా సాయం చేస్తా. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నేను రావడం వల్ల అయినా ఆ పాపకు ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడితే బాగుంటుంది. అందరి ప్రార్థనలు ఫలించి శ్రీనిధి త్వరగా కోలుకోవాలి. పాప కోలుకుంటే అంతకన్నా కావల్సింది ఏమీ లేదు. పాప కోర్కెను తీర్చాలనే ఇక్కడకు వచ్చాను' అని తెలిపాడు.