శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ | actor Jr ntr met blood cancer patient srinidhi | Sakshi
Sakshi News home page

శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ

Published Tue, May 12 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ

శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ

ఆ చిన్నారికి... జూనియర్ ఎన్టీఆర్‌ అంటే.. విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా రిలీజ్‌ అయినా.. చూడకుండా... ఉండదు. ఫస్ట్‌ షో దొరక్కున్నా... కనీసం విడుదలైన రోజైనా. ఆ సినిమా చూడాల్సిందే. ఎప్పటికైనా తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ను కలుసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది.

అయితే ఆడుతూ పాడుతూ ఉన్న ఆ చిన్నారికి కేన్సర్ సోకింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. తన అభిమాన నటుడుని

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజీ కూతురు శ్రీనిధి. పాపకు పదేళ్లు వయస్సు.. రెండేళ్ల క్రితం నడుము నొప్పి రావటంతో  తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఓ పిడుగులాంటి వినాల్సి వచ్చింది. బ్యాక్‌పెయిన్‌ కాదు... పాపకు బ్లడ్‌క్యాన్సర్‌ అన్న డాక్టర్ల మాట విని షాక్‌ తిన్నారు.

దీంతో... బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలన్న తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. పేరున్న ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇక అమ్మాయి పరిస్థితి మెరుగుపడదని వైద్యులు తేల్చేశారు. దీంతో బిడ్డను ఎలాగూ బతికించుకోలేమనుకున్న తల్లిదండ్రులు... కూకట్‌పల్లిలోని స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రామ్‌దేవ్‌రావ్‌ ఆస్పత్రిలో చేర్పించారు.  

శ్రీనిధి చివరి కోరికనైనా తీర్చాలనుకున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా శ్రీనిధి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందించిన ఎన్టీఆర్‌ మంగళవారం పాపను చూసేందుకు నేరుగా ఆస్పత్రికి వచ్చాడు. అయితే శ్రీనిధికి బ్లడ్‌ కేన్సర్‌ అన్న విషయం తెలియనివ్వకుండా  పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్‌ వస్తున్నాడని చెప్పారు. శ్రీనిధిని కలిసి కొద్దిసేపు ఆమెతో గడిపాడు. ఆ కుటుంబానికి తనకు చేతనైన సాయం అందిస్తానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement