
న్యూఢిల్లీ: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి చిలకలపూడి శ్రావ్య శివాని రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో మూడో సీడ్ శ్రావ్య శివాని 6–3, 7–5తో శ్రీనిధిపై గెలిచింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా రెండో రౌండ్‌కు చేరింది. స్మృతి 7–6 (7/1), 5–7, 6–4తో మిహికా యాదవ్‌ను ఓడించింది.
పురుషుల సింగిల్స్‌లో గంటా సాయికార్తీక్ రెడ్డి 4–6, 3–6తో టాప్ సీడ్ నిక్కీ పునాచా చేతిలో ఓడిపోయాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కాజా వినాయక్ శర్మ 6–4, 6–1తో భూపతి శక్తివేల్‌పై, విష్ణువర్ధన్ 6–4, 6–3తో ఆదిల్ కల్యాణ్‌పూర్‌పై నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment