స్త్రీనిధి రుణాలకు గ్రేడింగ్ కొర్రీ | irregularities in sri nidhi loans | Sakshi
Sakshi News home page

స్త్రీనిధి రుణాలకు గ్రేడింగ్ కొర్రీ

Published Wed, Feb 19 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

irregularities in sri nidhi loans

ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కందుకూరు మండలంలోని ఓ గ్రామైక్య సంఘం పనితీరు ఆధారంగా స్త్రీ నిధిలో గ్రేడ్-ఎ పరిధిలోకి రావడంతో రూ. 20 లక్షల రుణం పొందేందుకు అర్హత సాధించింది. అదే జరుగుమల్లి మండలంలోని కొన్ని గ్రూపుల పనితీరు బాగున్నా ఆ మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో రుణాలు పొందేందుకు అర్హత కోల్పోతున్నాయి. పనితీరు ఒకేలా ఉన్నా..గ్రామైక్య సంఘం ఉన్న మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో దాని పరిధిలో ఉన్న గ్రూపులకు రుణాలు అందడం లేదు.

ఈ ఏడాది దాదాపు వంద సంఘాల వారు గ్రేడింగ్‌ల కారణంగా రుణం పొందలేకపోయారు. ఫలితంగా జిల్లాలో దాదాపు 1500 మందికిపైగా సభ్యులు రుణానికి దూరం కానున్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు సక్రమంగా రుణాలివ్వడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేసింది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే స్త్రీనిధి బ్యాంకు ద్వారా గ్రూపులకు రుణాలందిస్తారు. 2011 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం అమలు కోసం గ్రూపులకు కొన్ని నియమ నిబంధనలు విధించారు.  

 గ్రామైక్య సంఘాల గ్రేడింగ్:
 పనితీరు ఆధారంగా గ్రామైక్య సంఘాలకు గ్రేడ్లను కేటాయిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు సక్రమంగా చెల్లించడం, సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా..ఆడిట్‌ను నిర్వహించారా లేదా..దస్త్రాల నిర్వహణ, ఆర్థికంగా గ్రేడింగ్ కొర్రీ
 
 
 అభివృద్ధి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడింగ్ ఇస్తారు. ఆ గ్రేడింగ్ ఆధారంగానే రుణాలందిస్తారు. ఈ ఏడాది జిల్లాలోని అన్ని మండలాలు గ్రేడింగ్ పరిధిలోకి వచ్చాయి.

 గ్రేడ్-ఎ మండలానికి రూ. 3.50 కోట్లు, గ్రేడ్-బి మండలానికి రూ. 1.5 నుంచి రూ. 2 కోట్లు, గ్రేడ్-సి మండలానికి కోటి రూపాయల నుంచి రూ. 50 లక్షలు, గ్రేడ్-డి మండలానికి రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలిస్తారు. గ్రేడ్-ఎ గ్రామైక్య సంఘానికి రూ. 20 లక్షలు, గ్రేడ్-బి సంఘానికి రూ. 12 నుంచి రూ. 15 లక్షలు, గ్రేడ్-సి సంఘానికి రూ. 10 లక్షలు, గ్రేడ్-డి సంఘానికి రూ. 7 లక్షల రుణం ఇస్తారు. అక్కడ నుంచి స్వయం సహాయక సంఘాలకు రుణాలందిస్తారు. గతంలో 14 శాతం వడ్డీతో రుణాలు తీసుకుని తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి పావలా వడ్డీని వర్తింపజేస్తారు. తాజాగా ఇందులో కూడా  వడ్డీలేని రుణాన్ని ఇస్తున్నారు. వాయిదా పద్ధతుల సమయంలో నెలా ఏడు రోజుల వరకు కేవలం అసలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అనంతరం చెల్లిస్తే వడ్డీ కట్టాల్సి ఉంటుంది.  

 మండలానికి గ్రేడింగ్ నిర్ణయించే సమయంలో సదరు మండలంలోని గ్రామైక్య సంఘాలన్నింటి పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయిస్తారు. అందులో కొన్నింటి పనితీరు సక్రమంగా ఉండి, మరికొన్నింటి పనితీరు సరిగా లేకపోతే అది మండల గ్రేడింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలా..పలు గ్రామైక్య సంఘాల పనితీరు సక్రమంగా ఉన్నా..మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో ఆయా సంఘాలకు నిధులు రావడం లేదు. జిల్లాలో తాజాగా నిర్ణయించిన గ్రేడింగ్ విధానంలో జరుగుమల్లి మండలం సీ-గ్రేడ్, హనుమంతునిపాడు మండలం డీ- గ్రేడ్ కిందకు వచ్చాయి. దీంతో ఈ మండలాల్లోని అన్ని గ్రామైక్య సంఘాలకు, అనంతరం గ్రూపులకు ఈ ఏడాది రుణాలు రాని పరిస్థితి. దీంతో పనితీరు బాగున్న సంఘాల వారు తామేం తప్పు చేశామని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేడింగ్ పరిధిలోకి వచ్చాయి.  

 సెర్ప్ ఫార్మేట్ ప్రకారమే...
 గ్రేడింగ్ సరిగా లేని మండలాల్లో పనితీరు బాగున్న గ్రామైక్య సంఘాలు కూడా ఉన్నా యి. సెర్ప్ ఫార్మేట్ ప్రకారం గ్రామాన్ని, మండల సమాఖ్యను యూనిట్‌గా తీసుకుని గ్రేడింగ్ నిర్ణయిస్తున్నాం.  - ధర్మేంద్ర, స్త్రీనిధి ఏజీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement