చిన్నారి శ్రీనిధి కన్నుమూత
- మూడేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి
- ఆమె కోరిక మేరకు ఇటీవలే మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్
బంధనపల్లి (రాయపర్తి) : ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌తో బాధపడుతూ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలుసుకున్న చిన్నారి శ్రీనిధి మృత్యుఒడి చేరింది. మూడేళ్లుగా చికిత్స పొందుతున్నప్పటికీ ఫలితం లేకపోరుుంది. రాయపర్తి మండలంలోని బంధనపల్లి గ్రామానికి చెందిన నౌగరి శివాజీ, క్రాంతికి ముగ్గురు కుమార్తెలు శ్రీనిధి(11), వేదశ్రీ, ఆరాధ్య. శ్రీనిధి మూడేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రాందేవరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చివరగా ‘నా కోరిక సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉంది’ అని చిన్ని చిన్ని ముచ్చట్లతో ఆమె తన తండ్రికి చెప్పింది.
కన్నప్రేమతో ఎక్కడికైనా వెళ్లాలని జూనియర్ ఎన్టీఆర్ ను కలవగా అతను ఓకే అన్నారు. ఈనెల 12న జూనియర్ ఎన్టీఆర్ రాందేవరావు మెమోరియల్ హాస్పిటల్‌కు వెళ్లి చిన్నారితో మాట్లాడారు. దీంతో తబ్బిఉబ్బిపోయిన చిన్నారి పట్టలేనంత ఆనందంలో మునిగితేలింది. కాగా, జూని యర్ ఎన్టీఆర్ పుట్టిన రోజునే కేన్సర్ బాధిత చిన్నారి మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనిధి మృతి ఆమె కుటుంబంలో పెనువిషాదం నింపగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారుు.