శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు విషయం లో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు విషయం లో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించింది. గతంలో టీఏఎఫ్ ఆర్‌సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కళాశాల యాజ మాన్యం హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కళాశాల అడుగుతున్న రూ.1.54 లక్షల ఫీజులో టీఏఎఫ్‌ఆర్‌సీ రూ.91వేలు ఖరారు చేయగా.. మిగతా రూ.63వేలను విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట డీడీలు తీసి సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు డీడీలు సమర్పించాలని, లేకుంటే కోర్టు దిక్కరణకు పాల్పడినట్లు అవుతుందని కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. దీంతో టీఏఎఫ్‌ఆర్‌సీకి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనాన్ని ఆశ్రయించాలని టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయం తీసుకుంది.