సిద్ధు జొన్నలగడ్డ, అల్లు అరవింద్
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బాపినీడు.బి సమర్పణలో ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రాడ్యూసర్ ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భాస్కర్ దర్శకత్వంలో సిద్ధుతో మా బ్యానర్‌లో సినిమా చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈప్రారంభోత్సవంలో నిర్మాతలు వై.రవిశంకర్, వంశీ, దామోదర్ ప్రసాద్, రాధా మోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ నందినీ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్.
Comments
Please login to add a commentAdd a comment