bhaskar
-
ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో భారీ స్కామ్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని వెంచర్స్‌లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 600 మంది నుంచి దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఆర్ హోమ్స్ నిర్వాహకులపై బాధితులు శుక్రవారం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు బాధితులు హైదరాబాద్ సీసీఎస్‌ను ఆశ్రయించి, ఆ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్ హోమ్స్ సంస్థ, దాని వెంచర్లు సైతం సైబరాబాద్ పరిధిలో ఉండటంతో పోలీసులు వారిని అక్కడికి పంపించారు. కూకట్పల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థకు భాస్కర్ గుప్తా ఎండీగా, ఆయన భార్య సుధారాణి డైరెక్టర్‌గా ఉన్నారు. వీళ్లు జై వాసవి బ్లిస్ హైట్స్ సహా అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో చదరపు అడుగు రూ.2,199కి ఇస్తున్నట్లు 2020 నవంబర్‌లో ప్రకటించారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి కపిల్ దేవ్ (క్రికెటర్), ప్రసాద్ (క్రికెటర్), కోటి (మ్యూజిక్ డైరెక్టర్) తదితర ప్రముఖులతో ప్రచారం చేయించారు. దీంతో అనేక మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందినవారు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని వీరి వద్ద ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. దాదాపు 600 మంది రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున చెల్లించారు. రెండు నెలల్లో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను పొందుతామని, 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాస్కర్ గుప్తా, సుధారాణిలు నమ్మించారు. నిర్మాణంలో జాప్యంపై బాధితులు ప్రశ్నించచడంతో ధరణి, ఎన్నికలు సహా అనేక కారణాలు చెబుతూ వారు తప్పించుకున్నారు. ఈ సంస్థ ప్లాట్లు కూడా విక్రయిస్తామని, తమకు శివార్లలో అనేక చోట్ల భూములు ఉన్నాయని అవసరమైతే బాధితులకు వాటిని కేటాయిస్తామని నమ్మించింది. నారాయణ్‌ఖేడ్ , ఘట్కేసర్, పఠాన్ చెరు, కర్తనుర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్, ఫార్మ్ ల్యాండ్ పేరిటా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. -
స్టార్టప్‌ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
మన్యంలో మోసగాడిగా.. పచ్చ నేత! యథేచ్ఛగా మేత!!
పాడేరు: మఠం భాస్కర్.. రంపచోడవరం నియోజకవర్గంలో ఈయన పేరు తెలియని వారండరు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో సిద్ధహస్తుడు. సొంతూరు రాజవొమ్మంగి మండలం అనంతగిరి. రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి భర్త. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేశాడు.. ఆ సొమ్ముకోసం ఇప్పటికీ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన నేరచరిత్ర కూడా పెద్దదే. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన పలు కేసుల్లో నిందితుడు. నిరుద్యోగులకు మంచి జరగాలంటే భార్య శిరీషాదేవికి ఓటేయాలని ఇప్పుడు అభ్యర్థిస్తున్నాడు. అతను మాటలు నమ్మితే మన్యాన్ని మడత పెట్టేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీకి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి మఠం భాస్కర్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. ఏజెన్సీలో గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం వారి నుంచి సుమారు రూ.కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, దేవీపట్నం, వీఆర్‌పురం, డొంకరాయి, అడ్డతీగల గ్రామాల్లో ఆయన ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన యువకుడికి ఓ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.3 లక్షల వరకు తన ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చే వరకు అడగవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.అడ్డతీగల మండలం దుప్పులపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన యువకుల నుంచి సీఆర్టీ పోస్టు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పన మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో యువకుడి నుంచి టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.లక్ష, గుమస్తా పోస్టుకు రూ. 60 వేలు మధ్యవర్తుల సమక్షంలో వసూలు చేసినట్టు సమాచారం. ఇలా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్న మఠం భాస్కర్ పూర్తిగా చెల్లించిన దాఖల్లాలేవు. ఉద్యోగాలు మాట దేవుడెరుగు మా డబ్బులు మాకివ్వండి అంటూ గిరిజన యువత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎప్పటికైనా ఎంతో కొంత మొత్తం ఇస్తాడన్న ఆశతో వారు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు రాలేకపోతున్నారు.అసెంబ్లీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్‌కు నేర చరిత్ర కూడా ఉంది. రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.2016లో రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్Œ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏకే దొరపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న అతనిపై దాడికి దిగడంతో (ఎఫ్ఐఆర్: 50/2017) అదే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2017లో అతని స్వగ్రామం అనంతగిరిలో జీడిమామిడి తోటను దగ్ధం చేశాడు. గ్రామస్తుల సమక్షంలో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామపెద్దలు చెప్పినప్పటికీ అందుకు అంగీకరించనట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు (ఎఫ్ఐఆర్: 15/2017) రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.2019లో జరిగిన ఎన్నికల సమయంలో రాజవొమ్మంగిలో గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్న అభియోగంపై (ఎఫ్ఐఆర్:47/2019) కేసు నమోదైంది.2022లో అనంతగిరి గ్రామ సమీపంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పేకాట, గుండాట నిర్వహించాడన్న అభియోగం మేరకు అతనిపై రాజవొమ్మంగి పోలీసులు (ఎఫ్ఐఆర్: 10/2022) కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.ఇవి చదవండి: కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్ కళ్యాణ్ -
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Bhaskar (@gully_boy_bhaskar) -
అంగన్వాడీలను అందంగా తీర్చిదిద్దాలి
సాక్షి, అమరావతి: ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెండో దశలో అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్(మౌలిక సదుపాయాలు) కె.భాస్కర్ సాంకేతిక మార్గదర్శకాలను సోమవారం జారీచేశారు. ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో రూ.214.22 కోట్లతో 20,534 కేంద్రాల రూపురేఖలు మార్చనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ పనులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లను ఆదేశించారు. మొత్తం 20,534 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రధాన, చిన్న మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న టాయిలెట్లో రన్నింగ్ వాటర్ సమస్యలు, రక్షిత మంచినీటి పైపులు, సంప్‌లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు, పెయింటింగ్, శ్లాబ్, ఫ్లోరింగ్, గోడలకు మరమ్మతులు వంటివి ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నెల మూడో వారంలో కమిటీల సమావేశాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లులతో కమిటీలు నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక్కో కమిటీలో ముగ్గురు తల్లులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్, మహిళా శిశు సంక్షేమశాఖ సూపర్వైజర్, మహిళా పోలీసు, సమీపంలోని స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉండాలని తెలిపారు. ఆ కమిటీల పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఖాతాలను తెరవాలని సూచించారు. ఈ నెల మూడో వారంలో తల్లుల కమిటీల సమావేశాలను ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతు పనులను గుర్తించడంతోపాటు వాటికి అంచనాలను రూపొందించి తీర్మానం చేసి అంగన్వాడీ సూపర్వైజర్కు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల చివరి వారంలో మరమ్మతు పనుల అంచనాలను సమగ్ర శిక్ష పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. అంచనాలకు జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తారని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన మెటీరియల్‌ను స్థానికంగా కొనుగోలు చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. తలుపులు, కిటికీలు, వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, సంప్లతోపాటు ఏమైనా పరికరాలకు మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోతే కొత్తవి ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మెటీరియల్ కొనుగోలు, పనుల వివరాలను ఎప్పటికప్పుడు ‘ఎం బుక్’లో నమోదు చేయాలని సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శులకు సూచించారు. -
ఏడు రోజుల్లో పరిష్కరించాలి
సాక్షి, అమరావతి: కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అదే ప్రమాణాలతో నిరంతరం నాణ్యతగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మన బడి నాడు – నేడు తొలి దశ పనులు పూర్తైన పాఠశాలల్లో మరమ్మతులు, నిర్వహణపై దృష్టి పెట్టి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లకు పాఠశాల విద్య (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కె.భాస్కర్ సూచించారు. నాడు–నేడు తొలి దశ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన జారీ చేశారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలను ఏడు రోజుల్లోగా ఆయా సంస్థలు పరిష్కరించాలన్నారు. ఈమేరకు ఈ నెల 21వ తేదీలోగా సమగ్ర నిర్వహణ, మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికలు, బాలురుకు వేర్వేరు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండాలని, ఇందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. తొలి దశలో సృష్టించిన అన్ని ఆస్తుల నిర్వహణ సజావుగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులతో పాటు జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు అదనపు కో–ఆర్డినేటర్లదేనని పేర్కొన్నారు. గ్రీన్ చాక్ బోర్డులు, ఐఎఫ్‌పీలలో సమస్యలు తలెత్తితే ఏడు రోజుల్లోగా మరమ్మతులు చేయించాలని సూచించారు. టాయిలెట్లలో అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి అవసరమైతే మరమ్మతులు లేదా రీప్లేస్మెంట్ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. తరగతి గదుల్లో తలుపులు, కిటికీలు, సీలింగ్, అల్మారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకుంటూ ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత మంచినీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా పర్యవేక్షిస్తూ బ్యాటరీ, పంపులు, వాటర్ పైపుల మరమ్మతులతోపాటు అవసరమైన చోట ఫిల్టర్లను రీప్లేస్మెంట్ చేయాలన్నారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. స్కూళ్ల ఆవరణలో పెయింటింగ్ సరిగా లేకుంటే ఆయా సంస్థలకు తెలియచేసి రంగులు వేయించాలన్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. -
పట్టణాల్లో ఒకలా, పల్లెల్లో మరోలా..
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 213ని సవాల్ చేస్తూ న్యాయవాది, సామాజిక కార్యకర్త రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నా రు. ‘పోటీ చేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల నిబంధన గ్రామాల్లో ఒకలా.. పట్టణాల్లో మరో లా ఉంది. సెక్షన్ 213 ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అన ర్హులు. ఈ నిబంధన పట్టణ ఎన్నికలకు వర్తించదు. తెలంగాణ మునిసిపాలిటీ చట్టం ప్రకారం కౌన్సిలర్, మేయర్, కార్పొరేటర్, చైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు పిల్లల సంఖ్యతో సంబంధం లేదు. రెండు చట్టాల మధ్య ఈ వ్యత్యాసం రాజ్యాంగంలోని 13, 14, 19 అధికరణలను ఉల్లంఘించడమే కాదు.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 213 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి. పట్టణ, గ్రామీణ అభ్యర్థుల మధ్య వివక్షను సరిదిద్దేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. -
కూతురును కళాశాలలో దింపేందుకు.. బయల్దేరిన ఐదు నిమిషాల్లోనే..
సాక్షి, కరీంనగర్: కూతురును కళాశాలలో దింపేందుకు ఓ వ్యక్తి తన బంధువులతో కలిసి కారులో ఆనందంగా బయల్దేరాడు.. కానీ, ఐదు నిమిషాల్లోనే ఆ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో హబ్సీపూర్, రాజారం గ్రామాల్లో విషాదం నెలకొంది. జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ కథనం ప్రకారం.. ధర్మపురి మండలంలోని రాజారం గ్రామానికి చెందిన దేవరకొండ భాస్కర్(35) బుధవారం ఉదయం తన అత్తగారి గ్రామమైన హబ్సీపూర్‌కు కారులో వచ్చాడు. తన పెద్ద కూతురు అక్షరను కరీంనగర్‌లోని కళాశాలలో దింపేందుకు మామ, హబ్సీపూర్‌కు చెందిన ఇమ్మడి నందయ్య, బావమరిది శ్రీకాంత్, నందయ్య తమ్ముడి కొడుకు మహేశ్‌లతో కలిసి కారులో బయల్దేరాడు. కానీ, దురదృష్టవశాత్తు అది పొలాస శివారులో జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై అదుపుతప్పి, బోల్తాపడింది. ఈ ఘటనలో భాస్కర్, మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. నందయ్య, అక్షర, కారు నడుపుతున్న శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సదాకర్ సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు భాస్కర్ భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, భాస్కర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు, మహేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని, కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎమ్మెల్సీ పరామర్శ..! రోడ్డు ప్రమాదంలో దేవరకొండ భాస్కర్, ఇమ్మడి మహేశ్‌లు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. -
జెనీలియాను టార్చర్ చేసిన డైరెక్టర్.. మూడు రాత్రులు నిద్రపోలేదట!
జెనిలియా.. తెలుగు ప్రేక్షకులకు నవ్వుల హాసినిగానే బాగా పరిచయం. సిద్ధార్థ్‌తో కలిసి నటించిన ‘బొమ్మరిల్లు’ సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. అందులో చలాకి, టింగరితనం గల హాసిని పాత్రలో జెనిలియా ఒదిగిపోయింది. బొమ్మరిల్లు తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ.. జెనిలియా అనగానే టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం హాసిని క్యారెక్టరే గుర్తుకొస్తుంది. అయితే ఆ పాత్రలో నటించడానికి జెనిలియా చాలా కష్టపడిందట. ఆ సినిమాలో ఓ సీన్ కోసం మూడు రాత్రులు నిద్రలేకుండా చేశాడట దర్శకుడు భాస్కర్. ఒకనొక దశలో సినిమా చేయలేనని వెళ్లిపోయిందట. జెనిలియాను ఇబ్బంది పెట్టిన సీన్ ఏంటి? బొమ్మరిల్లు సినిమాలో అర్థరాత్రి వేళ హీరో సిద్ధార్థ్‌తో కలిసి జెనిలియా ఐస్‌క్రీమ్ తినడానికి వెళ్తుంది. ఈ సీన్ కోసం డైరెక్టర్ భాస్కర్.. జెనిలియాను అర్థరాత్రి షూట్‌కి రమ్మని చెప్పారట. మొదటి రోజు షూట్లో జెనిలియా సరిగా చేయలేదట. నాలుగైదు టేకులు తీసుకున్నా..సరిగా చేయలేకపోవడంతో తిరిగి పంపించారట. ఆ ఒక్క సీన్ కోసమే మూడు రోజుల పాటు ఆమెను నిద్ర పోనియకుండా చేశాడట డైరెక్టర్. అల్లు అర్జున్ చెప్పడంతో.. డైరెక్టర్ భాస్కర్ పెట్టే టార్చర్ భరించలేక సినిమా వద్దు అని జెనిలియా వెళ్లిపోయిందట. దాదాపు రెండు రోజుల పాటు షూటింగ్‌కి కూడా రాలేదట. ఈ విషయం గురించి అల్లు అర్జున్‌కు తెలిసి ఆమెతో మాట్లాడి సినిమాలో నటించేలా చేశాడని తెలుస్తోంది. బన్నీ, జెనిలియా మంచి స్నేహితులు. ఆయన కోరిక మేరకే జెనిలియా ‘బొమ్మరిల్లు’లో నటించింది. జెనిలియా ఇష్టం లేకుండా నటించిన చిత్రమే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బొమ్మరిల్లు రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆమె గురించే మాట్లాడుకున్నారు. -
దుల్కర్‌కు జోడీగా..?
తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, వరుణ్‌తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్’ చిత్రంలోని హీరోయిన్ చాన్స్ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుందట. -
కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ జాతి నమ్మదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి ఎన్నటికీ నమ్మదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ గురువారం తెలంగాణ భవన్లో హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మత కలహాలు, కరెంటు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తోందని, కాంగ్రెస్, బీజేపీలకు దళితులు, గిరిజనులపై ఏ మాత్రం ప్రేమలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంఆర్పీఎస్ నాయకులు జే.ఆర్.కుమార్, శ్రీనివాసులు, సతీష్ ఉన్నారు. -
డీజే టిల్లు కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బాపినీడు.బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రాడ్యూసర్ ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భాస్కర్ దర్శకత్వంలో సిద్ధుతో మా బ్యానర్లో సినిమా చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈప్రారంభోత్సవంలో నిర్మాతలు వై.రవిశంకర్, వంశీ, దామోదర్ ప్రసాద్, రాధా మోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ నందినీ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్. -
కుమార్తెకు లోకేషన్ షేర్... మిస్టరీగా రత్నభాస్కర్ ప్రమాదం
పెనమలూరు: విజయవాడ–అవనిగడ్డ కరకట్టపై వెళ్తున్న కారు కేఈబీ కెనాల్లోకి సోమవారం వేకువజామున దూసుకెళ్లింది. కాలువలో నాలుగడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో కారు సగ భాగం పైగా నీటిలో మునిగింది. కారులో ముందు డోర్ తెరిచి ఉండటంతో కారులో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడా లేక కాలువలో గల్లంతయ్యాడా అనే విషయంలో స్పష్టత లేదు. పోలీసులు తెలిపిన వివరాలు.. ముదినేపల్లికి చెందిన గాజుల రత్నభాస్కర్ (47) గత ఆరు నెలల క్రితం బ్యాంకు రుణం తీసుకుని ఐస్ ఫ్యాక్టరీ పెట్టాడు. అతను ఆదివారం అవనిగడ్డలో ఉన్న అత్తగారి ఇంటి వద్ద నుంచి సాయంత్రం బయలుదేరి మచిలీపట్నం వెళ్లాడు. అక్కడ కోనేరు సెంటర్లో టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. మరలా పది గంటల ప్రాంతంలో మిత్రులతో కూడా ఫోన్లో మాట్లాడి మచిలీపట్నంలో పని ఉందని, అది ముగించుకొని ముదినేపల్లికి వస్తానని తెలిపాడు. అయితే అతను రాత్రి ముదినేపల్లికి చేరలేదు. చోడవరం వద్ద కాలువలో కారు.. గాజుల భాస్కర్‌కు చెందిన కారు అవనిగడ్డ వైపు నుంచి విజయవాడ వైపునకు వస్తుండగా చోడవరం వద్ద సోమవారం వేకువజామున 3.30 గంటలకు కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో కారు పడిందన్నా సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. కాలువలో పడిన కారు ముందు డోర్ తెరుచుకొని ఉంది. పోలీసులు కారులో వెతకగా ఆధార్‌కార్డు దొరకటంతో గాజుల రత్నభాస్కర్ అని గుర్తించారు. కానీ కారులో ఎవ్వరు లేరు. డీఎస్పీ జయసూర్య ఘటనా స్థలం వద్దకు వచ్చి క్రేన్ సాయంతో కాలువలో ఉన్న కారును బయటకు తీయించారు. కారులో దుస్తులు, సెల్‌ఫోన్, కాగితాలు తప్ప ఏమి దొరకలేదు. కనిపించకుండా పోయిన రత్నభాస్కర్కు భార్య, కుమార్తె ఉన్నారు. మిస్టరీగా మారిన ఘటన.. కేఈబీ కెనాల్లో పడిన కారు ఘటన మిస్టరీగా మారింది. ముదినేపల్లికి వెళ్లాల్సిన రత్నభాస్కర్ అర్ధరాత్రి విజయవాడ వైపునకు ఎందుకు వచ్చాడనేది పెద్ద ప్రశ్నగా ఉంది. పైగా ప్రమాదం జరిగే ముందు తన ఫోన్‌తో కుమార్తెకు లోకేషన్ షేర్ చేశాడు. కాలువలో పడిన కారును పోలీసులు తనిఖీ చేయగా సెల్‌ఫోన్ కారులోనే ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. కారు కాలువలో పడిన సమయంలో కాలువలో నీరు నాలుగడుగులు మాత్రమే ఉంది. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో కాలువలో రత్నభాస్కర్ కొట్టుకు పోయాడా లేదా అనే విషయం తేలలేదు. పోలీసులు కేఈబీ కెనాల్లో గాలింపు చేపట్టారు. కరకట్టపై ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రత్నభాస్కర్కు కొందరు సొమ్ము బాకీ పడటంతో ఆర్థిక గొడవలు ఏమైనా ఉన్నయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రుణం తీసుకుని ఐస్‌ఫ్యాక్టరీ పెట్టడంతో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయమై పోలీసులు బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించనున్నారు. బంధువు మేడిశెట్టి సూర్యప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సుపారీ ఇచ్చి.. హత్య చేయించి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ ఆయ నను అపహరించి, హత్య చేసిందని.. క్వారీ నీటి గుంటలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయిందని గుర్తించారు. భూముల వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, జనగామ జెడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య ఈ హత్య కు సూత్రధారి అని తేల్చారు. ఈ మేరకు బచ్చన్నపేట, టా స్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య, సుపారీ ముఠా సభ్యులు డోలకొండ శ్రీకాంత్, శివ రాత్రి బాషా అలియాస్ భాస్కర్లను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 3 సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఓసారి చంపేందుకు యత్నించి..: అంజయ్య కు సంబంధించి సర్వే నంబర్ 174లోని భూములపై వివా దాలు ఉన్నాయి. దీనిపై రామకృష్ణయ్య గతంలో అధికారు లకు ఫిర్యాదు చేశారు. దీనిపై కక్షగట్టిన అంజయ్య.. రామకృష్ణయ్యను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. 2022 జూలైలో జలంధర్ అనే వ్యక్తితో కలసి కారుతో ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఇటీవల తనకు పరిచయమున్న దండుగు ల తిరుపతి అనే వ్యక్తితో రూ.8 లక్షలు సుపారీ ఇస్తానని, రా మకృష్ణయ్యను చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీ నికి అంగీకరించిన తిరుపతి.. తనకు సమీప బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల రాజులతో కలసి రామకృష్ణయ్య హత్యకు ప్లాన్ చేశాడు. పోచన్నపేట శివారులో కిడ్నాప్ చేసి..: తిరుపతి, శ్రీకాంత్, బాషా, దండుగుల రాజు నలుగురూ కలసి ఈ నెల 15న సాయంత్రం ఒక కారు అద్దెకు తీసుకుని పోచన్నపేట శివారులో మాటు వేశారు. బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని, చిన్నరామన్చర్ల శివారుకు తీసుకువెళ్లారు. సుమారు 6.30 గంటల సమయంలో టవల్ మెడకు బిగించి రామకృష్ణయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని.. ఓబూల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్ల మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడి ఓ క్వారీ నీటిగుంటలో పడవేశారు. హత్య జరిగే నాటికి అంజయ్య ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల వరకు నిందితులకు ముట్టజెప్పాడు. ఒకటి కాదు రెండు హత్యలు!: రామకృష్ణయ్య హత్యకేసులో విచారణ జరుపుతున్న క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చిందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అంజయ్య మరో భూవివాదంలో రూ. 2.5 లక్షల సుపారీ ఇచ్చి తన బావమరిది మల్లేశం భార్య సుభద్రను హత్య చేయించినట్టు వెల్లడైందని వివరించారు. 2022 అక్టోబర్ 20న ఆ హత్య జరిగిందని, ఆ ఘటనలోనూ తిరుపతి, రాజు హస్తం ఉన్నట్టు గుర్తించామన్నారు. 2012లో సుభద్ర భర్త మల్లేశం చనిపోయాడని.. తనకు రెండెకరాల భూమి రావాలని సుభద్ర నిలదీయడంతో అంజయ్య సుపా రి గ్యాంగ్‌తో హత్య చేయించాడని సీపీ వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి అంజయ్య సస్పెన్షన్ భూవివాదాలు, హత్య కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు గిరబోయిన అంజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ప్రకటించారు. అంజయ్య తొలి నుంచి బీఆర్ఎస్ కార్యకర్త కాదని, నాలుగేళ్ల కింద వేరే పార్టీ నుంచి వచ్చాడని పేర్కొన్నారు. -
యువకుడితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువుగా ఉంటోందని..
సాక్షి, శ్రీకాకుళం: వరుసకు వదినయ్యే మహిళతో అవివాహిత యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ మరో యువకుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెతోపాటు మరో యువకుణ్ణి కూడా దారుణంగా హతమార్చాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదడ్డపనస గ్రామానికి చెందిన వెలమల ఎర్రమ్మ (40) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన భాస్కరరావుతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కాగా, వరుసకు మరిదయ్యే ముద్దాడ రామారావు (30) అనే అవివాహిత యువకుడు ఎర్రమ్మతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మరొకరితో చనువుగా ఉంటోందని.. ఇదిలావుండగా.. ఎర్రమ్మ అదే గ్రామానికి చెందిన ముద్దాడ సంతోష్ (26)తో కొంతకాలంగా చనువుగా ఉంటోంది. ఎర్రమ్మ తనతోపాటు సంతోష్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రగిలిపోతున్న ముద్దాడ రామారావు వారిద్దరిపైనా కక్ష పెంచుకున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపైనా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజాధనం దోపిడీకే తెరపైకి ‘సీమెన్స్’
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టాలన్న ముందస్తు పథకంలో భాగంగానే గత సర్కారు పెద్దలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్‌ను తెరపైకి తెచ్చారని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,356 కోట్లకు కృత్రిమంగా పెంచారని, ఇందులో సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ప్రసాద్ కీలక పాత్ర పోషించారని నివేదించారు. ఇలా పెంచిన మొత్తాన్ని పెద్దల అండతో దారి మళ్లించేందుకు భారీ కుట్రకు తెర తీశారని తెలిపారు. అందులో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య ఒప్పందం కుదరగానే యూపీలో ఐఏఎస్ అధికారిగా ఉన్న భాస్కర్ ప్రసాద్ భార్య ఊర్మిళను ఇంటర్ కేడర్ డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదో భారీ కుంభకోణమని, ఇంత తీవ్రమైన కేసులో మేస్ట్రేస్టేట్ చాలా యాంత్రికంగా భాస్కర్ ప్రసాద్ రిమాండ్‌ను తిరస్కరించారని తెలిపారు. కింది కోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భాస్కర్ ప్రసాద్‌పై ఐపీసీ సెక్షన్లు 409, 120 (బీ) కింద సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే మేస్ట్రేస్టేట్ విస్మయకరంగా రిమాండ్ సమయంలోనే మినీ ట్రయల్ నిర్వహించి సెక్షన్ 409 వర్తించదని తేల్చడంతోపాటు భాస్కర్ ప్రసాద్ రిమాండ్‌ను తిరస్కరించారని వివరించారు. ఏ సెక్షన్ వర్తిస్తుంది? ఏ సెక్షన్ వర్తించదు? అనే అంశాలను దర్యాప్తు పూర్తై చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత చేపట్టే తుది విచారణలో తేల్చాలే కానీ రిమాండ్ సమయంలో కాదన్నారు. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో రిమాండ్ సమయంలోనే ఫలానా సెక్షన్ వర్తించదంటూ రిమాండ్‌ను తిరస్కరించే ట్రెండ్ నడుస్తోందని, దీనిపై హైకోర్టు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సుధాకర్‌రెడ్డి నివేదించారు. ఈ కుంభకోణం వెనుక దాగిన పెద్దల పాత్ర బహిర్గతం కావాలంటే భాస్కర్ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించడం సీఐడీకి అనివార్యమన్నారు. సీఐడీ తరఫున వాదనలు ముగియడంతో భాస్కర్ ప్రసాద్ తరఫు న్యాయవాది వీఆర్ మాచవరం వాదనల నిమిత్తం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్.భానుమతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో రాములు మాట్లాడుతూ సిద్దిపేటరెడ్డి సంక్షేమ భవన్లో నిర్వహించే మహాసభల ప్రాంగణానికి మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్యల పేర్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవుతారన్నారు. మూడు రోజులపాటు జరిగే మహాసభలకు ఇతర కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాని చెప్పారు. మహాసభల చివరి రోజు జరిగే బహిరంగ సభకు కేరళ మంత్రి శివమ్స్ కుట్టి వస్తారన్నారు. కార్మిక చట్టాలు, ధరల పెరుగుదల, విద్యుత్ చట్టం, రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, శశిధర్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య పాల్గొన్నారు. -
సీఎం జగనే ప్రాణం పోశారు..
ఒంగోలు: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ.. తానూ కరోనా బారినపడి మృత్యువు అంచుకు చేరిన ఓ వైద్యుడిని అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకుని ప్రాణం పోశారు. తనకు ప్రాణదానం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ వైద్యుడు కృతజ్ఞతలు చెబుతూ మళ్లీ విధులకు సిద్ధమయ్యాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలిసారిగా కారంచేడులో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆ సమయంలో కారంచేడు ప్రభుత్వ వైద్యశాల వైద్యుడిగా భాస్కర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఒంగోలు రిమ్స్‌లో రేడియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తొలినాళ్లలో 2020 ఏప్రిల్ 24న భాస్కర్ కరోనా సోకింది. తొలుత ఆయన గుంటూరు జనరల్ ఆస్పత్రిలో, తర్వాత విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే రూ.50 లక్షల దాకా ఖర్చుచేశారు. సంపాదించిన డబ్బులతో పాటు అప్పు తెచ్చినా వైద్యానికి సరిపోలేదు. అపోలో వైద్యులు అతనికి ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని, దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ సమయంలోనే రిమ్స్ ఒంగోలు రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్ ఆంకాలజీ వైద్యుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి సాయంతో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సాయం చేయాలని కోరారు. వైద్యుడి విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించారు. దీంతో డాక్టర్ భాస్కర్ ఆరోగ్యం కుదుటపడింది. ఇటీవలే కోలుకున్నారు. డాక్టర్ దంపతులు ఆదివారం ఎమ్మెల్యే బాలినేనిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు పునర్జన్మ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించాలని డాక్టర్ భాస్కర్ కోరారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపాకవిధుల్లో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన బాలినేని.. సీఎంను కలిసే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. -
స్ఫూర్తిదాయకం: పూట గడవని స్థితి నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా..
ముంబై: కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు మహారాష్ట్రకు చెందిన భాస్కర్ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి, తినేందుకు సరైన తిండి లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్‌లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్ హలామి.. ప్రస్తుతం అమెరికాలోని బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్ ఆర్ఎన్ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్, పీహెచ్డీ కూడా పూర్తిచేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు. తన చిన్న తనంలో తన కుటుంబం పడిన కష్టాలు, తినడానికి తిండి లేని రోజులను గుర్తు చేసుకున్నారు హలామి. ‘ ఒక్క పూట భోజనం కోసం చాలా ఇబ్బందులు పడ్డా. సరైన తిండి, పని దొరకని ఆనాటి రోజుల్లో ఎలా బతికామనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మా కుటుంబం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురవుతుంది. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లం. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లం. మా ఊరిలో 90 శాతం ప్రజల పరిస్థితి ఇదే’ అని తెలిపారు భాస్కర్ హలామి. భాస్కర్ హలామీ తండ్రి ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకి చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్ గుర్తు చేసుకున్నారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు.కొన్నాళ్లకు ఆ స్కూల్ ఉన్న కసనూర్‌కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు. భాస్కర్ 4వ తరగతి వరకు కసనూర్‌లోనే చదువుకున్నారు. తర్వాత స్కాలర్‌షిప్‌పై యవత్మల్లో ఉన్న ప్రభుత్వ విద్యానికేతన్‌లో 10వ తరగతి వరకు పూర్తి చేశారు. గడ్చిరోలిలో బీఎస్సీలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత నాగర్‌పూర్‌లో కెమిస్ట్రీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. 2003లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయినప్పటికీ.. భాస్కర్‌కు పరిశోధనపై ఆసక్తి తగ్గలేదు. పీహెచ్డీ నిమిత్తం అమెరికా వెళ్లి డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో పరిశోధనలు చేశారు. ‘మిషిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ’ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిర్నావోమిక్స్‌లో పనిచేస్తున్న తనకు.. తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ-మెయిల్స్ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. ఇదీ చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్ -
వీళ్లకు న్యాయం దక్కేనా?
అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ..జొమాటో.. ఊబర్.. ఓలా.. అర్బన్ క్లాప్.. బిగ్ బాస్కెట్.. కంట్రీ డిలైట్.. ఒక్కటేంటి.. ఏ పని కావాలన్నా యాప్‌లే. స్మార్ట్ ఫోన్ టచ్ దూరంలో ఆ సర్వీసులు.. మారిన కాలం అందిస్తున్న సౌకర్యాలు! ఈ డెలివరీ సర్వీసెస్‌కు కస్టమర్స్ నుంచి రేటింగ్ ఉంది.. యాజమాన్యాల నుంచే భద్రత, భరోసా ఉందా అన్నిరకాలుగా? మేడే సందర్భంగా ఓ కథనం.. ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. అరచేతి పట్టే స్మార్ట్ ఫోన్‌తో అన్నీ అనుకున్న టైమ్‌లో.. కోరుకున్నట్లుగానే మన చెంతకే వచ్చేస్తున్నాయి. ఉప్పు, పప్పు, పాల దగ్గరి నుంచి ఇంటికి, మనిషికి అవసరమైన ప్రతీది గుమ్మం ముందే వాలిపోతున్నాయి. ఇలాంటి సేవల కోసమే రోజుకో యాప్ స్టార్టప్ పుట్టుకొస్తోంది. యూజర్ల కోసం.. యూజర్ల చెంతకే.. యూజర్ ఫ్రెండ్లీ సేవలను అందిస్తోంది. పైసా, టైమ్ కలిసొస్తుండడంతో అలవాటు పడుతున్న జనాలు పెరిగిపోతున్నారు. మరి ఆ సేవలను మోసుకొస్తోంది ఎవరు? డెలివరీ సర్వీస్ ఉద్యోగులు. కొండంత భారాన్ని భుజాన వేసుకుని బయలుదేరే బాహుబలులు వాళ్లు. చదవుకున్నోడు.. చదువులేనోడు, వయసు తారతమ్యం, ఆడామగా తేడా ఉండదు అక్కడ. పార్ట్ టైమ్ కావొచ్చు ఫుల్‌టైం కావొచ్చు.. మోడర్న్ ఏజ్‌లో అత్యంత ఈజీగా దొరికే జాబ్‌లు ఇవి. బడుగు జీవుల నుంచి కాస్త ఉన్నోడి దాకా! అంతా పైసా కోసమే ఉరుకులు పరుగులు. ఎండనక వాననక రేయింబవళ్లు నిబద్ధత చూపించే నైజం వాళ్లది. వందలు కాదు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఉన్నారు అలాంటి శ్రమజీవులు. సోషల్ మీడియా హీరోలు..షీరోలు డెలివరీ సేవలు పెరగడం, ఇంటి వద్దకే ప్రతి సేవనూ అందించే డెలివరీ, సర్వీస్ పార్ట్‌నర్స్‌తో కంపెనీలకు పని మరింత సులువు అయిపోయింది. ఏ విభాగంలో పని చేసినా ఒక కమిట్మెంట్తోనే సాగుతుంది వీళ్ల ప్రయాణం. ఒకరకంగా కరోనా టైమ్ నుంచి వీళ్ల గొప్పదనం ఏంటో.. మొత్తం ప్రపంచమే గుర్తించింది. ‘అన్నా, సార్, మేడమ్..’ పిలుపు ఏదైనా వాళ్లు కోరుకునేది ఒక్కటే.. తమ సేవలకుగానూ మంచి రేటింగ్ ఇవ్వమని! కాస్త ఆలస్యమైతే ఎంత తిట్టుకుంటారో అనే ఆలోచన.. వాళ్లను స్థిమితంగా ఉండనివ్వదు. కస్టమర్ల అసహనం తప్పించుకునేందుకు వాళ్లు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎండను ఓర్చుకుంటారు. వానల్ని, వరదల్ని లెక్క చేయరు. చలిని లెక్కచేయరు. పగలు రాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా.. చివరకు ఆకలి, అనారోగ్యాల్ని సైతం లెక్కచేయకుండా శ్రమించే బతుకు జీవులు వీళ్లు. అందుకే మీడియాలో.. సోషల్ మీడియాలో ‘హీరోలు, షీరోలు’గా వీళ్ల కథలను, వ్యథలను చూడగలుగుతున్నాం. వీళ్లకంటూ ఓ పేరుంది, కానీ.. ప్రత్యేక కాల పరిమితితో అంటే పార్ట్ టైమ్ లేదంటే ఫ్రీలాన్స్‌గా పనిచేసే ఈ ఉద్యోగులను గిగ్స్గా పరిగణిస్తుంటారు. 20వ శతాబ్దంలో ‘జాజ్’ యాస నుంచి గిగ్ అనే పదం పుట్టింది.పేరుకు ‘గిగ్’ సేవా రంగం పరిధిలో ఉన్నప్పటికీ.. వీళ్లు ఉద్యోగులా? కార్మికులా? వ్యాపారులా? భాగస్వాములా? కిందిస్థాయి ఉద్యోగులా? ఇలా వీళ్లకు ఓ గుర్తింపంటూ లేదు. కంపెనీల దృష్టిలో కేవలం డెలివరీ పార్ట్నర్స్ మాత్రమే! ‘అత్యవసరాల’ పేరిట అంతా కలసి అద్భుతాలు చేస్తారు. కానీ, కష్టం వస్తే.. భాగస్వాములు కాదు కదా.. వాళ్లను ఎలా పిలవాలో తెలియని పరిస్థితి మన దేశంలో. జనాలకు బాగా దగ్గరైన వీళ్లకంటూ చట్టాల్లో ఒక నిర్వచనం, ఉద్యోగ భద్రత, హక్కులు లేకపోవడం.. నయా జమానా ఉపాధిగా గిగ్ ఎకానమీ మోసుకొచ్చిన కొత్త చిక్కు. క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారం కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. డెలవరీ సర్వీసుల్లో ఉద్యోగినులు! టూమచ్ వర్క్.. జీతం? ఈ రంగంలో పని చేసే ఉద్యోగులకు ఒక షిఫ్ట్, ఒక టైమింగ్ అంటూ ఉండదు. జీతం బదులు తమ వాటా కట్ చేసుకుని కమిషన్లు ఇస్తుంటాయి కంపెనీలు. అంటే గిగ్ వర్కర్లకు.. అవసరం కొద్దీ పని.. అందుకు తగ్గట్లు డబ్బు సంపాదన ఉంటుందనుకోవడం భ్రమే. ఒక్కోసారి అది ఆశించినట్లు ఉండకపోవచ్చు కూడా. టైమ్‌కు పని జరగకపోతే.. కోతే. జీతం, కమిషన్ల సంగతి పక్కనపెడితే.. ఇతర సౌకర్యాల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని స్టార్టప్ యాప్‌లు(కంపెనీలు). ఫెయిర్‌వర్క్ లిస్ట్‌లో ఆయా కంపెనీలకు ప్రతి ఏటా దక్కుతున్న మార్కులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లైఫ్ ఒక రేస్ డెలివరీ బాయ్స్ కాలంతో పాటే పరిగెత్తాలి. కాస్త ఆలస్యమైనా కస్టమర్ల నుంచి తిట్లు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌లు తప్పవు. ఒక్కోసారి ఇది వాళ్లకు దక్కే ప్రతిఫలం(కమిషన్, జీతం..) మీద కూడా పడుతుంది. వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్, సరైన రోడ్లు ఉండవు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. సిగ్నల్స్ జంప్ చేసినా.. వేగంగా వెళ్తే పడే ట్రాఫిక్ చలాన్లు.. అదనపు తలనొప్పులు. వీటికి తోడు వివక్షలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఫలానా కమ్యూనిటీ అనగానే ఫుడ్ క్యాన్సిల్ చేయడం, లిఫ్ట్ ఉపయోగించొద్దంటూ చిన్నచూపు చూడడం లాంటి ఘటనలు చూస్తున్నవే. వీటికి అదనంగా ‘నిమిషాల్లోనే డెలివరీ..’ అంటూ తమ ప్రకటనలతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి ఈ స్టార్టప్‌లు. ఇలాంటివి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాయి. మరి వాళ్ల భద్రతకు ఆయా కంపెనీలు గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాయా? అసలు ఇన్సూరెన్స్‌ల పరిధిలోకి వీళ్లను తీసుకొస్తున్నాయా? లేదు.. చట్టంలో అలాంటిదేం లేదు. కేవలం ఏదో ఒకటి, రెండు ఘటనల్లో మొక్కుబడి సాయం అందుతోంది అంతే. అందుకే పెరుగుతున్న రేట్లు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు తమ బతుకులూ బాగుపడాలని, తమకేమైనా జరిగితే కుటుంబాలకు భద్రత అందాలని ఆశిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఎర్రటి ఎండలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసిన దుర్గా మీనాగా శర్మ అనే గ్రాడ్యుయేట్‌కు క్రౌడ్ ఫండిగ్ ద్వారా బైక్‌ను అందించాడు ఆదిత్య శర్మ అనే కుర్రాడు. రాజాస్థాన్‌లో ఇటీవల జరిగిన విషయం ఇది. మార్గదర్శకాలు ఉండాల్సిందే! ఆ మధ్య గురుగ్రామ్‌లో మానిక్యూర్ నుంచి కార్పెట్ క్లీనింగ్ దాకా సేవలు అందించే ఓ కంపెనీలో.. మహిళా ఉద్యోగులకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. కంపెనీ తెచ్చిన కొత్త నిబంధనలు తమ ఆదాయానికి గణనీయంగా గండి కొడుతున్నాయని ఆఫీస్ ముందే టెంట్లు వేసుకుని నిరసనలకు దిగారు. ఆ సమయంలో సదరు కంపెనీ.. వాళ్లను ఉద్యోగులుగా కాకుండా భాగస్వాములుగా పేర్కొని(భాగస్వాములు కంపెనీకి వ్యతిరేకంగా పోరాడకూడదు కదా!) కోర్టు ఆదేశాలతో ఆ నిరసనలను నిర్వీర్యం చేయించింది. మరి భాగస్వాములుగా వాళ్లకు అందాల్సినవన్నీ అందించిందా? అంటే అదీ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో, అంతెందుకు జీడీపీలోనూ ఉడతాసాయంగా వీళ్ల భాగం ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గిగ్ ఎకానమీతో ఆదుకుంటున్నారు కాబట్టే వీళ్ల రక్షణ కోసం మార్గదర్శకాలు కావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే క్రమక్రమంగా ఈ రంగానికి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ భాగస్వాముల ప్రమాదాలపై స్పందిస్తూ.. ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంట్లో స్వయంగా ఇదే గళం వినిపించారు కూడా. డెలివరీలు చేసేది కంపెనీలు కాదు.. అందులో పని చేసేవాళ్లు. వ్యక్తిగత వాహనాల మీద వెళ్తూ యాక్సిడెంట్లలో గాయపడినా.. చనిపోయినా.. అవి కమర్షియల్ వాహనాలు అనే వంక చూపిస్తూ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి బీమా కంపెనీలు. కాబట్టి, వాళ్ల రక్షణకు మార్గదర్శకాలు అవసరం ఉందని గుర్తు చేశారాయన. తమ హక్కుల కోసం సమ్మెకు దిగిన డెలివరీ సర్వీస్ ఉద్యోగులు.. వానలు, వరదల్లోనూ తప్పని డెలివరీ సర్వీస్ తిప్పలు! కరోనా టైమ్‌లో కుదేలు కరోనా అనే వైరస్.. వందల కోట్ల మంది బతుకుల్ని మార్చి పడేసింది. చాలామందికి ఉపాధిని దూరం చేసింది. అందులో ఈ చిన్న చిన్న పనులు చేసుకునే ఉద్యోగులూ ఉన్నారు. లాక్డౌన్లతో ఎందరికో పని లేకుండా పోయింది. పూట గడవక వాళ్లు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో యాజమాన్య యాప్ కంపెనీలు.. మొండి చేయి చూపించాయి. కార్మిక చట్టంలో తమకంటూ ఓ పేజీ లేకుండా పోయేసరికి అభద్రతా భావంలోకి కూరుకుపోయారు వాళ్లు. అందుకే మేల్కొని తమ హక్కుల కోసం పోరాటానికి దిగారు. ఎందుకు కష్టమవుతోంది? ఎదుగూ బొదుగూలేని జీవితాలు ఎవరికైనా సహిస్తాయా? కనీసం కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని అనుకుంటారు. కానీ, లక్షల్లో ఉన్న గిగ్ వర్కర్లు తమ బతుకులకు ఓ భరోసా.. హక్కులకు కనీస రక్షణ ఉంటే చాలని కోరుతున్నారు. మన దేశంలో ఒక నిర్దిష్టత అంటూ లేని ఉద్యోగుల కోసం అసంఘటిత కార్మికుల సామాజిక సంక్షేమ భద్రత చట్టంఒకటి ఉంది. కానీ, గిగ్ వర్కర్లను ఈ చట్టం కింద చేర్చలేదు. పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసే వాళ్లు కావడంతో.. వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన, నిర్దిష్టమైన డేటా ఉండడం లేదనేది ప్రభుత్వాల వాదన. అయినప్పటికీ ప్రభుత్వం ఓ అడుగు వేసింది. నవంబర్ 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ కింద డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. ఇలాంటి ఉద్యోగులను.. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. కానీ, అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు. సాధారణంగా యూరోపియన్ యూనియన్ సహా చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఇలాంటి గిగ్ వర్కర్లను నేరుగా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి ఆదుకుంటున్నాయి.మన దగ్గర మాత్రం ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకవేళ వర్తింపచేయాలనుకున్నా.. స్టార్టప్ యాప్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఖాయమని న్యాయ నిపుణలు అంటున్నారు. ఒక ప్రత్యేకమైన నియంత్రణ వ్యవస్థ, లేదంటే కనీసం నిబంధనలతోనైనా గిగ్ ఉద్యోగుల భధ్రతకు ఒక ప్రత్యేక చట్టం తేవాల్సి ఉంది. లక్షల మంది శ్రమ జీవుల ఎదురు చూపులు ఎప్పటికీ ఫలిస్తాయో మరి! -భాస్కర్ శ్రీపతి -
ఇద్దరూ ఒకేసారి హిట్ కొట్టడం.. ఎంతో సంతోషాన్నిచ్చింది: అల్లు అర్జున్
‘‘అక్కినేని, అల్లు ఫ్యామిలీల జర్నీ 65ఏళ్లుగా సాగుతోంది. నాగార్జునగారితో నేను సినిమాలు నిర్మించా. మరో రెండు తరాలకు కూడా ఈ జర్నీ సాగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు అల్లు అరవింద్. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘అఖిల్‌కి సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ. తను డ్యాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడు. కానీ వాటిని పక్కనపెట్టి ఓ మంచి సినిమా చేయాలని ఈ చిత్రం చేశాడు. ఆ చాయిస్‌ను గౌరవిస్తాను. రీసెంట్గా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’తో, ఇప్పుడు ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టారు. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్స్ సాధించడం అనేది అనుకున్నా కూడా కుదరదు. అది ఎంతో సంతోషాన్నిచ్చింది. మా నాన్నగారు తన లైఫ్‌లో ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమా జర్నీలో ఫీలయ్యారు. ఆయన అనుకుంటే ‘ఆహా’లో రిలీజ్ చేయవచ్చు. కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుని కూడా జనాలు థియేటర్స్‌కు రావాలని థియేటర్స్‌లో విడుదల చేశారు. నాన్నగారు ఎవరితో సినిమా చేస్తే వారి కెరీర్లో అది బెస్ట్ ఫిల్మ్. హిట్ కొట్టిన యూనిట్‌కి కంగ్రాట్స్’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘పెళ్లి చేసుకోవాలనుకునేవారు చూడాల్సిన సినిమా ఇది. భాస్కర్ అంత మంచి కథ రాశారు. పెళ్లిపై మంచి అవగాహన కలిగించిన సినిమా ఇది’’ అన్నారు. అఖిల్ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘అల్లు అర్జున్‌గారు ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి మారిపోతారు. అల్లు అరవింద్గారితో పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. సందేశం ఇద్దామని కాకుండా ఈ కథ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం ఇద్దామని అనుకున్నాం. అవి వర్కౌట్ అయ్యాయనే భావిస్తున్నాను. హిట్ రూపంలో ప్రేక్షకులు ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ను ఎనర్జీగా తీసుకుని కెరీర్లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. అక్కినేని ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోనని చెప్పాను. నాకు ఇంకా నిద్ర రాలేదు. సక్సెస్ వచ్చినందుకు అంత సంతోషంగా ఉంది’’ అన్నారు. వాసూవర్మ మాట్లాడుతూ – ‘‘ఆర్టిస్టుల నటన డైలాగ్స్ చెప్పడంలో ఉండదు. తోటి నటీనటుల డైలాగ్స్‌కు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌లో తెలుస్తుంది. అఖిల్ నటన, హావభావాలు బాగున్నాయి’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూస్తే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. అలాగే వారి మధ్య ఏదైనా సెలెన్స్ ఉంటే అది బ్రేక్ అవుతుందని చెప్పగలను’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘తన సినిమా సక్సెస్ మీట్ జరగడాన్ని మించిన సంతోషం ఏదీ దర్శకుడికి ఉండదు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పూజ గ్లామరస్ స్టార్ అన్నారు. ఈ సినిమాతో పెర్ఫార్మింగ్ స్టార్ అంటున్నారు’’ అన్నారు పూజా హెగ్డే. వంశీ పైడిపల్లి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘అయ్యగారి ఫ్యాన్’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అలాయితేనే కరోనాను నివారించగలం: డాక్టర్ భాస్కర్ రావు
-
మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కేబీఎం కమిటీ (కుమురం భీం, మంచిర్యాల) కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేబీఎం కార్యదర్శి అడెల్లు అలియాస్ భాస్కర్ కమిటీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన లింగు గురువారం ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట సరెండర్ అయ్యాడు. జైనూర్ మండలానికి చెందిన 28 ఏళ్ల లింగు రెండున్నర నెలల కిందటే మావోయిస్టు పార్టీలో చేరాడు. అడేల్లు అలియాస్ భాస్కర్ దళంలో లింగు ఆదిలాబాద్ కమిటీ లో పని చేశాడు. కదంబ ఎన్కౌంటర్ తర్వాత లింగు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులు కలిసి.. లొంగుబాటు నిర్ణయానికి వచ్చాడు. దీనిపై ఎస్సీ మాట్లాడుతూ.. లింగుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని తెలిపారు. (కదంబా అడవుల్లో అలజడి) మరికొంత మంది నేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉందన్నారు. లింగు లొంగుబాటుకు అడెల్లుకి ఎదురుదెబ్బగా మాజీ మావోయిస్టులు, పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మావోల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సాగుతుండగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో మావోలు ఉన్నారు. గతనెల 19న కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా, ఇందులో ఒకరు చత్తీస్‌గడ్‌కు చెందిన చుక్కాలు కాగా, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక్ బాదీరావు ఉన్నాడు. కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేబీఎం డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్న విషయం తెలిసిందే. భాస్కర్ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
పదేళ్ల తర్వాత ఎన్కౌంటర్
-
కాల్చి చంపారు: మావోయిస్టు భాస్కర్ ఆగ్రహం
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురం భీం, మంచిర్యాల (కేబీఎం) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ పేరిట ఓ లేఖ విడుదలైంది. కాగజ్ నగర్ మండలం కందంబ అడవుల్లో ఎన్కౌంటర్ బూటకమని లేఖలో భాస్కర్ పేర్కొన్నారు. దానిని ఖండిస్తున్నామని తెలిపారు. తమ దళ సభ్యులను పోలీసులు పట్టుకొని కాల్చిచంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన చుక్కాలు, బాజీరావును పోలీసులు చుట్టిముట్టి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్లకు బాధ్యులైన టీఆర్ఎస్, బీజేపీ నేతలకు ప్రజల చేతిలో శిక్షలు తప్పవ భాస్కర్ హెచ్చరించారు. తెలంగాణలో ప్రజలపై జరుగుతున్న పాశవిక అనుచివేతకు తాజా ఎన్‌కౌంటరే ఉదాహరణ అని అన్నారు. 2022 నాటికి విప్లవోద్యమాన్ని అణిచివేసే ఉద్దేశ్యంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. కామ్రేడ్ చుక్కాలు, బాజీరావ్‌లు అమరులయ్యారని, ఇంతటితో విప్లవోద్యమం ఆగదని చెప్పారు. తెలంగాణ విప్లవోద్యమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నూతనంగా పార్టీలో చేరిన బాజీరావు నింపిన పోరాటపటిమ ఉమ్మడి ఆదిలాబాద్‌లో చిరస్థాయిగా నిలుస్తుందని భాస్కర్ లేఖలో పేర్కొన్నారు. కామ్రేడ్స్ చుక్కాలు, బాజీరావు అమరత్వం, త్యాగం వృధా కానివ్వమని అన్నారు. కాగా, కాగజ్‌నగర్ మండలంలోని కదంబ అడవుల్లో శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు వార్తలు వెలుడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్కౌంటర్ నుంచి కేబీఎమ్ డివిజన్ కమిటీ నాయకుడు భాస్కర్ తృటిలో తప్పించుకున్నాడని సమాచారం. (చదవండి: కదంబా అడవుల్లో ఎన్కౌంటర్) -
తప్పించుకున్న భాస్కర్?
-
తప్పించుకున్న భాస్కర్?
సాక్షి, మంచిర్యాల: మన్యంలో తుపాకీ మోత మోగింది. జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో ఎన్కౌంటర్ ఉలిక్కిపడేలా చేసింది. శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రాణహిత సరిహద్దు మీదుగా ప్రత్యేక బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా అనువణువు గాలిస్తున్న పోలీసులు కాగజ్‌నగర్ మండలంలోని కదంబా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే.. జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని మండలాలు, ప్రాణహిత నది తీరం వెంట డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో 8 గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నేరుగా డీఎస్పీ స్వామి మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా ఉంచిన పోలీసులు కదంబా అడవుల్లో మావోయిస్టులు తిరుగుతుండగా ప్రణాళికతో ముందుకు సాగినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మాత్రమే చనిపోగా మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో భాస్కర్‌తో పాటు లింగయ్య, వర్గీస్, ప్రభాత్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. గురువారం రాత్రి ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అక్కడ దళ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతో పాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై గస్తీ కొనసాగింది. దళ సభ్యులు కదంబా అడవుల వైపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్రణాళికతో ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. తప్పించుకున్న భాస్కర్? కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేబీఎం(కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకనుగుణంగానే తిర్యాణి మండలం టోక్కిగూడ అడవుల్లో రెండుసార్లు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసు బలగాలు మావోల సంచారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మావోయిస్టులకు భోజనం పెట్టిన తిర్యాణి మండలానికి చెందిన ఓ వ్యక్తిని సైతం అరెస్టు చేసి ఆదిలాబాద్ జైల్లో ఉంచారు. రెండుసార్లు డీజీపీ పర్యటన.. కొద్ది రోజులుగా దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. ఆగస్టులో ఓసారి పర్యటించగా, ఈనెల రెండో తేదీన ఆసిఫాబాద్‌కు వచ్చిన ఆయన నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కదంబా అడవుల్లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌తో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎప్పుడు ఎక్కడ తుపాకీ చప్పుళ్లు వినాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్
-
మహిళా ఉద్యోగిపై దాడిచేసిన భాస్కర్ అరెస్ట్
-
వినోదినిని చూసి మార్గం మార్చుకున్నాడు
భాస్కర్ ఆటో నడుపుతాడు. చెన్నై అతడిది. ఆటోలో ఎప్పుడూ రగ్గులు, డెట్టాలు, ఫినాయిలు, శానిటైజర్లు, మాస్కులు, గ్లవుజులు, ఏప్రాను ఉంటాయి. ప్యాసింజర్లు మాత్రం ఉండరు! వారికి బదులుగా గాయపడిన వీధి శునకాలు, ఇతర స్ట్రీటీలు ఉంటాయి. ముందుగా వాటికి తను ఫస్ట్ ఎయిడ్ చేసి, వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళతాడు. ట్రీట్మెంట్ అయ్యాక, తనకు వాటి గురించి ఎవరైతే సమాచారం అందించారో వాళ్లకు భద్రంగా అందజేస్తాడు. మైలాపుర్‌లో ఏడేళ్లుగా ఆటో నడుపుతున్నాడు భాస్కర్. మూడేళ్ల నుంచి అతడు ఆటో అన్న అయ్యాడు. మూగ జీవులకు దెబ్బలు తగిలినా, రక్తం కారుతున్న గాయాలతో అవి మూలుగుతూ ఉన్నా వెంటనే భాస్కర్ అన్నకు ఫోన్ వెళుతుంది. మూడేళ్ల క్రితం తారసపడిన వినోదినీ మేడమ్‌ను చూసి అతడు తన ప్రయాణ మార్గం మార్చుకున్నాడు. వినోదిని యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్. ఆవిడ ద్వారా మరికొంత మంది కార్యకర్తలకు భాస్కర్ పరిచయం అయ్యాడు. అలా స్ట్రీటీ లకు ఫుల్ టైమ్ వన్నాట్ ఎయిట్ అయ్యాడు. 42 ఏళ్ల భాస్కర్ కు ఇద్దరు కొడుకులు. ఇంటర్ ఒకరు. టెన్త్ ఒకరు. భార్య రెండిళ్లలో కుక్. ఎక్కువ భాగం ఆమెదే ఇంటి పోషణ. భర్త జంతు సంరక్షణ ‘ఉద్యోగ’ బాధ్యతల్ని ఆమె అర్ధం చేసుకున్నట్లే ఉంది. సాయంత్రానికి అతడెంత చేతిలో పెడితే అంత. -
‘శాడిస్ట్ ’ వీడియో కాల్స్ వెనక ఉన్న అసలు స్టోరీ
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువతులు, మహిళలను వేధింపులకు గురి చేసిన జనగామ జిల్లా వాసి కె.భాస్కర్ విచారణలో విస్తుపోయే వాస్తవాలను వెల్లడించాడు. ‘శాడిస్ట్ అపరిచితుడైన’ ఇతగాడిని గత వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఇతడిని న్యాయస్థానం అనుమతితో రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే అతగాడు శాడిస్ట్‌లా తయారు కావడానికి ప్రేమవిఫలమే కారణమని వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఉద్యోగం రాకపోవడంతో.. జనగామ జిల్లా లింగాలఘణపురం సమీపంలోని నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్ ఎంకాం చదువుతుండగా ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇది విఫలం కావడంతో పాటు ఆమె తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో భాస్కర్‌పై లింగాలఘణపురం పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. 2007లో నమోదైన ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ సైతం దాఖలు చేయడంతో 2010లో నేరం నిరూపితమైంది. దీంతో న్యాయస్థానం భాస్కర్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఎంకాం పూర్తి చేసినా ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో కొన్నాళ్లపాటు ఆరోగ్యశ్రీ విభాగంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పని చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ కంపెనీల్లోనూ విధులు నిర్వర్తించినా చివరకు స్వస్థలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. వేధింపుల పర్వానికి శ్రీకారం.. ఈ పరిణామంతో యువతులు, మహిళలపై కక్షకట్టిన భాస్కర్ వారిని వేధించాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను పొందుపరిచే పోర్టల్ ‘తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం’ నుంచి వివరాలు సంగ్రహించి వేధింపులు ప్రారంభించాడు. తన గ్రామానికి చెందిన అనేక మంది ప్రభుత్వ పథకాలు పొందడానికి భాస్కర్ సహకరించాడు. ఈ నేపథ్యంలోనే కింది స్థాయి అధికారులపై పలుమార్లు కలెక్టర్ సహా అనేక మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇతడి సోదరికి రావాల్సిన కల్యాణలక్ష్మి సొమ్మును అందుకోలేకపోయాడు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం తన తల్లిదండ్రులకు కేవలం ఆరు నెలల వ్యవధిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వీరి వైద్యానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చుపెట్టాడు. ఈ డబ్బు కోసం తనకు ఉన్న ఐదెకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఈ రుణానికి ప్రతి నెలా కట్టాల్సిన వాయిదాలు సైతం చెల్లించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం బ్యాంకు వాళ్లు పొలం వేలం వేయడానికి సిద్ధమవుతూ నోటీసులు జారీ చేశారు. ఇంటిలో ఒంటరిగా.. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన తల్లి తన సోదరి ఇంట్లో ఉంటుండటంతో ప్రస్తుతం భాస్కర్ తన స్వగ్రామంలో ఒంటరిగా నివసించేవాడు. వండి పెట్టే దిక్కుకూడా లేకపోవడంతో రోజుకు ఒకపూటే భోజనం చేసేవాడు. ఈ పరిణామాలతో పూర్తిస్థాయి శాడిస్ట్‌గా మారిపోయిన భాస్కర్ తనకు దొరికిన సిమ్‌కార్డును రీచార్జి చేసి, ‘అవసరమైనప్పుడు’ తన సెల్ఫోన్లోనే వేసి వినియోగిస్తూ యువతులు, మహిళల్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆ ప్రభుత్వ పోర్టల్ నుంచి సేకరించిన నెంబర్లలో ఏదో ఒకదానికి కాల్ చేసేవాడు. అవతలి వారిలో అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో అభ్యంతరకర, అసభ్య సందేశాలు పంపడం, అశ్లీల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవాడు. వేళకాని వేళల్లో నగ్నంగా ఉండి యువతులు, మహిళలకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసే భాస్కర్... వారూ అలా మారాలని బలవంతం పెట్టేవాడు. ఇతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, ఎస్సై మహిపాల్ సాంకేతిక ఆధారాలను బట్టి భాస్కర్ నిందితుడిగా గుర్తించి గత మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి భాస్కర్‌కు 16న పెళ్లి చూపులు జరగాల్సి ఉంది. ఈలోపే అతడు అరెస్టు కావడంతో బ్రేక్ పడింది. -
కురు రాజు కోరిక
ఆకాశమార్గాన వెళుతున్న ఇంద్రుడు నేలను దున్నుతున్న కురురాజును చూసి ఆగిపోయాడు. ‘చక్రవర్తి ఏమిటి, సామాన్య రైతులాగా భూమి దున్నడమేమిటని ఆశ్చర్యంతో భువికి దిగి రాజు వద్దకు వచ్చి ‘‘నేను దేవేంద్రుడిని’’ అని పరిచయం చేసుకున్నాడు. కురురాజు దున్నటం ఆపి ‘‘దివినుంచి భువికి దిగివచ్చారు. నా అదృష్టం’’ అంటూ ఇంద్రునికి నమస్కరించాడు. ‘‘రాజువై ఉండీ సామాన్యుడి లా భూమిని ఎందుకు దున్నుతున్నావో తెలుసుకుందామని...’’ నవ్వాడు ఇంద్రుడు. ‘‘ఓ అదా! ఇది పరశురాముడు శమంతక పంచకంతో పవిత్రీకరించిన ప్రదేశం. ఈ ప్రదేశంలో పుట్టిన వారందరూ స్వర్గానికి చేరుకోవాలన్న సంకల్పంతో ఇక్కడ నేను ఒక యాగం చేయాలని తలపెట్టాను...’’ సమాధానమిచ్చాడు కురురాజు. ‘‘పాప పుణ్యాలతో సంబంధం లేకుండా కేవలం ఈ ప్రదేశంలో జన్మించినంత మాత్రానే స్వర్గమా? నీ కోర్కె చిత్రంగా, అసమంజసంగా కూడా ఉంది!’’ ఇంద్రుడి భృకుటి ఆశ్చర్యంతో పైకిలేచి ఆగ్రహంతో ముడి పడింది. ‘‘చిత్రమేముంది ఇంద్రా! మీ దేవతలందరూ కేవలం జన్మమాత్రం చేతనే స్వర్గవాసం చేయడం లేదా?’’ అంటూనే ఇంద్రుడితో తనకిక పనిలేనట్టు నాగలి దున్నే పనిలో లీనమయ్యాడు కురు. ఇంద్రుడు అమరావతికి వెళ్లిపోయాడు. కురురాజు తలపెట్టిన యాగ సంకల్పం గురించి సభలో చర్చించాడు. ‘‘ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు మహేంద్రా! స్వర్గప్రాప్తికి జనన ప్రదేశం అర్హత కాదు... కారాదు. దానికి ప్రాతిపదిక మరణమే కావాలి. ఆ విధంగా కురురాజుకు నీవే తగిన మార్గదర్శనం చేయాలి’’ అన్నాడు దేవగురువు. ఇంద్రుడు సభ చాలించి లేచాడు. వెంటనే కురురాజు ముందు సాక్షాత్కరించాడు. అతని వంక ప్రసన్నంగా చూస్తూ ‘‘రాజా! నువ్వు యాగం తలపెట్టిన కారణం ధర్మబద్ధం కాదు. స్వర్గలోక వాస ప్రాప్తికి జననం కారణం కారాదు...’’ అంటుండగానే రాజు అందుకుని ‘‘ఈ క్షేత్రంలో మరణిస్తే స్వర్గవాసం లభించాలన్నదే నా కోరిక. అంతకుమించి మరేమీ లేదు మహేంద్రా’’ అంటూ చేతులు జోడించాడు. ‘‘నీ కోరిక సహేతుకమైనది కాబట్టి నేను నీకు తప్పక వరం ఇస్తాను కురు రాజా! ఈ క్షేత్రంలో ఉండి పుణ్యకార్యాలు చేస్తూ ఈ క్షేత్రం లోనే మరణించినవారు, యుద్ధంలో వీర మరణం పొందినవారూ కూడా స్వర్గవాసానికి అర్హులవుతారు. అంతేకాదు, ప్రజాక్షేమం కోరి నీవు యాగం తలపెట్టావు కాబట్టి ఇకపై ఈ ప్రదేశం నీపేరుతో కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కుతుంది. ఇది ఈ సురపతి వరం’’ అంటూ చిరునవ్వు నవ్వాడు ఇంద్రుడు. అలా ఆ క్షేత్రం ఆ రాజు పేరుతో కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఆ క్షేత్రంలోనే మహాభారత యుద్ధం జరగటం తెలిసిందే. చిత్తశుద్ధితో నిస్వార్థంగా మంచి పని తలపెట్టిన వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుందన్నదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
వైఎస్సార్ కుటుంబంపై ఆపార అభిమానం భాస్కర్ సొంతం
-
డూప్ హీరోల సందడి
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ డూప్‌లు భాస్కర్, శివ, చందు హీరోలుగా హాబీబ్ తెరకెక్కించిన చిత్రం ‘కథానాయకులు’. సి.రామాంజనేయులు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. హబీబ్ మాట్లాడుతూ – ‘‘ఒక మల్టీస్టారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ వినోదంగా సెకండాఫ్ థ్రిల్‌కు గురి చేసే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది. పెద్ద హీరోల ఫ్యాన్స్ ఎక్కడా నొచ్చుకోకుండా చేశాం’’ అన్నారు నిర్మాత రామాంజనేయులు. ఈ చిత్రానికి కెమెరా: జో అండ్ శివ. -
భాస్కర్‌ది కూడా పరువు హత్యేనా..?
పంజగుట్ట: తన కుమారుడి మరణంపై ఎన్నో సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తిచేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న భాస్కర్ తల్లిదండ్రులు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మృతుడి తండ్రి సత్యనారాయణ, తల్లి దీవెన, సోదరుడు సుదర్శన్, సోదరి సులోచన వివరాలు వెల్లడించారు. బోరబండ శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న భాస్కర్ (24) ఘట్కేసర్లోని నల్ల నర్సింహ్మా రెడ్డి కాలేజీలో బీఫార్మసీ పూర్తిచేశాడు. కాలేజీలో అతడికి మహబూబ్ నగర్ జిల్లా ఎనుగొండ గ్రామానికి చెందిన కర్రె నిషిత అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గత ఆగస్టులో నిషిత తన ప్రేమ విషయాన్ని వారి ఇంట్లో చెప్పింది. దీంతో ఆగస్టు 19న నిషిత బాబాయ్ కొర్రమోని వెంకటయ్య భాస్కర్‌కు ఫోన్‌చేసి బెదిరించాడన్నారు. 20న నగరానికి వచ్చిన అతను తమను బోరబండ కమ్యునిటీహాల్‌కు పిలిపించి నిషితను మర్చిపోవాలని బెదిరించినట్లు తెలిపారు. మరుసటి రోజే నిషిత భాస్కర్‌కు ఫోన్‌చేసి మహబూబ్‌నగర్ వచ్చి తన కుటుంబ సభ్యులను ఒప్పించాలని కోరడంతో భాస్కర్ అక్కడికి వెళ్లాడన్నారు. మర్నాడు ఉదయం వెంకటయ్య తమకు ఫోన్‌చేసి భాస్కర్ మహబూబ్‌నగర్‌లో అపస్మారకస్థితిలో ఉన్నాడని, అతడిని తీసుకువెళ్లాలని చెప్పడంతో తాము అక్కడికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తెలిపారు. భాస్కర్ ఆగస్టు 23న మళ్లీ మహబూబ్ నగర్ వెళ్లాడని, అదేరోజు సాయంత్రం నిషిత బాబాయ్ ఫోన్ చేసి భాస్కర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పడంతో తాము అక్కడకు వెళ్లేసరికి అతను మృతి చెంది ఉన్నాడన్నారు. ముమ్మటికీ హత్యే .. భాస్కర్‌ది ఆత్మహత్య కాదని..ముమ్మటికీ హత్యేనని వారు అరోపించారు. నిషిత కుటుంబం మున్నూరు కాపులని, తాము మాదిగ కులానికి చెందిన వారం కావడంతోనే పిలిపించి హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. వెంకటయ్య టీఆర్ఎస్ నాయకుడని, అతని భార్య కొర్రమోని వనజ కౌన్సిలర్‌గా కొనసాగుతందని, వారికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నందునే దర్యాప్తును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆగస్టు 23న భాస్కర్ మరణిస్తే సెప్టెంబర్ 3న పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారని, ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ప్రియురాలి దీక్ష.. విషం తాగిన ప్రియుడు..
సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోమంటే బుకాయిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఓ యువతి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ ఘటన జిల్లాలోని వలిగొండ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి వలిగొండకు చెందిన రావుల భాస్కర్ ప్రేమించుకున్నారు. అయితే, భాస్కర్ వివాహానికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ముందు జ్యోతి దీక్షకు దిగారు. అప్పటికి వివాహానికి నిరాకరించడంతో వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తూ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ శనివారం స్థానిక వేంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రియుడు భాస్కర్‌ను వలిగొండ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు పెళ్లి చేసుకోవాలని సూచించారు. అందుకు నిరాకరించిన భాస్కర్ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని హుటాహుటిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
భార్య కళ్లెదుటే భర్త హత్య
హత్నూర (సంగారెడ్డి): కళ్లలో కారం చల్లి.. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చు కొచ్చి భార్య కళ్లెదుటే భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండ లం సాదుల్ల నగర్లో చోటు చేసుకుంది. సాదుల్ల నగర్‌కు చెందిన చెక్కల భాస్కర్(32) మండలంలోని బోర్పట్ల శివారు లోని ఓ పరిశ్రమలో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉండ గా, అదే గ్రామానికి చెందిన వరుసకు మేనబావ అయిన ఎర్రొల్ల ప్రభాకర్, ఎర్రొల్ల రమేశ్, ఎర్రొల్ల వీరేశం, శ్రీకాంత్‌తో పాటు మరికొందరు ఇంట్లోకి చొరబడి కారంపొడిని భాస్కర్ కళ్లల్లో చల్లడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం అతన్ని బయటకు ఈడ్చుకొచ్చి గొడ్డళ్లతో విచక్షణా రహితంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య కవిత కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికే దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య
శింగనమల: అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని ఆకులేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్(38) 13ఏళ్ల క్రితం బుక్కరాయ సముద్రం మండలంలోని పసలూరు కొత్తపల్లి నుంచి బతుకుదెరువు కోసం ఆకులేడు చేరుకున్నాడు. భార్య రత్నమ్మతో కలిసి మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు, ఒక కుమారుడు సంతానం. అనంతపురం సహకార బ్యాంకులో గ్రామంలోని చేనేత కార్మికులంతా గ్రూపుగా ఏర్పడి రుణం తీసుకున్నారు. భాస్కర్ పేరిట రూ.50వేల రుణం ఉంది. మగ్గం ముడి సరుకుల ధర పెరగడం, నేసిన చీరలకు గిట్టుబాటు ధర లేకపోవడం.. కుటుంబ పోషణకు లక్ష రూపాయలకు పైగా ప్రయివేట్ అప్పులు చేశాడు. అదేవిధంగా ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తె జానకి పెళ్లి కోసం మరో లక్ష రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. తనవద్దనున్న 4 తులాల బంగారు నగలు(రెండు చైన్లు, కమ్మలు, చెవి దిద్దులు) అదే గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. గత నాలుగేళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ నేపథ్యంలో బయటపడే దారి లేక మంగళవారంఉదయం 6 గంటలకు గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గొర్రెల కాపరుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శింగనమల ఎస్ఐ హమీద్‌ఖాన్ తెలిపారు. -
ఉద్యోగమంటే సంపాదనకు మార్గం కాదు
ఏలూరు (మెట్రో) : ఉద్యోగమంటే సంపాదనకు మార్గమనుకుంటున్నారని, ఇది సమాజంలో నైతిక పతనానికి దారితీస్తుందని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్ ప్రగతితీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అన్ని పాఠశాలల్లో మరమ్మతులు పనులు పూర్తిచేసి ప్రతి పాఠశాలలలోనూ వాకింగ్ ట్రాక్‌తో పాటు క్రీడామైదానాలు, కోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పదేపదే చెబుతున్నప్పటికీ కనీసం పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ ఏడాది 599 క్రీడామైదానాలు ప్రారంభించాలని ప్రత్యేకంగా నిధులు అందించినప్పటికీ కేవలం 21 పాఠశాలల్లో మాత్రమే పనులు ప్రారంభించడం దారుణమన్నారు. ప్రభుత్వ, జెడ్పీకి చెందిన 359 పాఠశాలల్లో డయాస్‌ల నిర్మాణానికి కేవలం 8 పాఠశాలల్లో మాత్రమే పనులు ప్రారంభం కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. పది శాతం కమీషన్ల కోసం కక్కుర్తిపడి అభివృద్ధి పనులకు కొందరు అడ్డుపడుతున్నారన్నారు. పాఠశాలలు ప్రారంభించేనాటికే ప్రతి విద్యార్థికీ పుస్తకాలు, యూనిఫారంలు సిద్ధం చేయాలని జనవరి నుంచి ఇప్పటివరకూ 25 సార్లు సమీక్షించినా విద్యాశాఖాధికారుల్లో చలనం లేదంటే ఈ వ్యవస్థే దండగన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణికి ఫోన్ చేసి మాట్లాడారు. జిల్లాకు 14.74 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకూ 9 లక్షల పుస్తకాలు మాత్రమే సరఫరా అయ్యాయని చెప్పారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్రింటింగ్ దశలో ఉన్నాయని, రాగానే పంపిణీ చేస్తామని కలెక్టర్‌కు చెప్పారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారులతో మాట్లాడిన కలెక్టర్ ప్రింటింగ్ అవుతున్న విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు ప్రత్యేక సిబ్బందిని పంపించి యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించినప్పుడే జిల్లాలో విద్యాశాఖ పాస్ అయినట్టని కలెక్టర్ చెప్పారు. అన్ని పాఠశాలలకు వంట గ్యాస్ జిల్లాలోని 3,236 పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాల కూడా మధ్యాహ్న భోజనానికి కట్టెలపొయ్యి వినియోగించని రీతిలో ఉండాలన్నారు. ప్రతి పాఠశాలకూ నేరుగా ఆయా కంపెనీల ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ చెప్పారు. తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కిచెన్‌షెడ్డు, కిచెన్ గార్డెన్లు, నిత్యావసర వస్తువులు కచ్చితంగా ఉండాలన్నారు. ఇకపై బియ్యం, ఇతర పప్పుదినుసులు, నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అప్పగించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం భోజనం తయారీ దారులకు సంబంధించి వేతనం మాత్రమే చెల్లించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవానీ, సర్వశిక్షాభియాన్ పీవో బ్రహ్మానందరెడ్డి, జిల్లాలోని ఉపవిద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
తాగి వేధిస్తున్నాడని హత్య
సోదరులతో కలిసి రాడ్డుతో దాడి చేసిన భార్య తిరుపతి క్రైం: నగరంలోని జీవకోన రాజీవ్‌నగర్‌లో గురువారం సాయంత్రం మద్యం తాగి వేధిస్తున్నాడని భార్య తన సోదరులతో కలిసి భర్తను హత్య చేసింది. అలిపిరి సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. రాజీవ్‌నగర్‌లో భాస్కర్ (40), జ్యోతి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరూ తిరుపతి మున్సి పల్ కార్యాలయంలో కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ఒకరిని జ్యోతి సోదరునికి ఇచ్చి వివాహం జరిపించింది. మద్యానికి భానిసైన భాస్కర్ తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి చితకబాదేవాడు. బావ మరుదులు ఎన్నిసా ర్లు సర్దిచెప్పినా భాస్కర్ వినేవాడు కాదు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీనిపై భార్య ప్రశ్నిం చడంతో గోడవ పడ్డాడు. దీంతో ఆమె తన సోదరులు చలపతి, మునిరత్నంకు సమాచారం ఇచ్చింది. వారు ఇంటికి వచ్చి బావకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అతను వినకపోవడంతో ముగ్గురూ కలిసి ఇనుపరాడ్డు, కర్రలతో భాస్కర్‌పై దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
కాటేసిన కనుపాప
- కూతురిపై ఆరునెలలుగా అఘాయిత్యం - కోలారు జిల్లాలో కీచక తండ్రి అరెస్టు - నిందితుడు తిరుమలలో టీ వ్యాపారి కేజీఎఫ్ (కర్ణాటక): కోలారు జిల్లాలో ఘోరం వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిని చెరబట్టాడు. బంగారుపేట తాలూకా బేతమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతంపల్లి గ్రామంలో ఇది చోటు చేసుకుంది. నీచ కృత్యానికి పాల్పడిన తండ్రి భాస్కర్ (36)ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, భాస్కర్‌కు ఏడవ తరగతి చదివే 14 సంవత్సరాల కూతురు ఉంది. గత ఆరు నెలల నుంచి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు. తిరుమల కొండపై టీ వ్యాపారం చేసే భాస్కర్ కొద్దిరోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఫుల్లుగా తాగి కూతురని కూడా చూడకుండా అకృత్యానికి పాల్పడేవాడు. విషయం భార్యకు తెలిసినా పరువు పోతుందని మౌనంగా ఉండిపోయింది. ఆదివారం యథా ప్రకారం తిరుమల నుంచి వచ్చిన కామాంధుడు మద్యంమత్తులో బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వచ్చి బాలికను రక్షించి కీచకుణ్ని పోలీసులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు బేతమంగళ పోలీసులు నిందితునిపై పోక్సో చట్టం కింద నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
లారీకి బ్రేక్..
- గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీలు బంద్ - దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె ప్రభావం - నగరానికి నిలిచిపోనున్న నిత్యావసర వస్తువుల సరఫరా - పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్‌కు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెతో లారీలకు బ్రేక్ పడింది. సరుకు లోడింగ్, అన్లోడింగ్ వంటి పనులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీల బంద్ చేపట్టనున్నట్లు ఇప్పటికే పలు లారీ యాజమాన్య సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటో గూడ్స్ వాహనాలు మినహా అన్ని రకాల తేలికపాటి, మధ్యతరహా, భారీ సరుకు రవాణా వాహనాలన్నీ బంద్‌లో పాల్గొంటాయని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ అంతటా సుమారు 2.5 లక్షల వాహనాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో 70 వేల వాహనాలు నిలిచిపోనున్నాయి. ప్రతి రోజు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, సిమెంట్, ఐరన్, బొగ్గు వంటి వివిధ రకాల వస్తువులను హైదరాబాద్‌కు తరలించే సుమారు 5 వేల లారీల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అత్యవసర వస్తువులైన పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాను మాత్రం ప్రస్తుతం సమ్మె నుంచి మినహాయించారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించకపోతే అత్యవసర సరుకుల రవాణాను సైతం నిలిపివేయనున్నట్లు లారీ సంఘాలు పేర్కొన్నాయి. డీసీఎంలు వంటి వాహనాలు కూడా సమ్మెకు మద్దతిస్తున్న దృష్ట్యా దక్షిణాది రాష్ట్రాల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సరుకు రవాణాపైనా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వర్తించేలా సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని, టోల్ ట్యాక్స్‌ను తగ్గించాలని, త్రైమాసిక పన్నును హేతుబద్ధీకరించాలని స్థానిక లారీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని సర్కార్ లారీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసి సమ్మె అనివార్యమైన దశలో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. నగరానికి ప్రతిరోజూ సరఫరా అయ్యే సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర వస్తువులు నిలిచిపోనున్నాయి. కర్నూలు, నాందేడ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి ఉల్లి సరఫరా.. ఏపీ నుంచి బియ్యం రవాణా నిలిచిపోనుంది. నగర శివార్ల లోని కెమికల్ ఫ్యాక్టరీలకు అవసరమయ్యే 200 లారీల బొగ్గు రవాణాకూ బ్రేక్ పడనుంది. -
రసకందాయంలో ’రెవెన్యూ’ వివాదం
కలెక్టర్ భాస్కర్‌పై కస్సుమన్న రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగం చేయడానికి వచ్చావా.. రాజకీయం చేయడానికి వచ్చావా అంటూ ఆగ్రహం అంటరానితనాన్ని అవలంబిస్తున్నారంటూ ఆరోపణ ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ మధ్య తలెత్తిన వివాదం రసకందాయంలో పడింది. స్థానిక కోటదిబ్బలోని పెన్షనర్స్ హాల్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన విద్యాసాగర్ కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిమ్న జాతీయుడనైన తనను లొంగదీసుకోవడానికి కలెక్టర్ నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. ’కుయుక్తులు ప్రదర్శించి.. తహసీల్దార్లను బెదిరించి, ప్రలోభ పెట్టి వర్క్ టు రూల్ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయించావ్. అధికారులు, ఉద్యోగులు, చివరకు రాజకీయ నాయకుల మధ్య కూడా కుల వివక్ష రెచ్చగొడుతున్నావ్. నిమ్న జాతీయుడిని కాబట్టే నన్ను అక్రమంగా బదిలీ చేశావ్. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా ఇటువంటివి జరగలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడే పనిచేస్తున్నాను. దాంతో రేషన్ డీలర్లను లొంగదీసుకుని డ్రామాకు తెరలేపి నాపై ఆరోపణలు చేయించావ్’ అంటూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ’నన్ను సస్పెండ్ చేయాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించావ్. ఆయన అది సాధ్యం కాదని చెప్పడంతో మీరంతా ఒకటే అన్నావ్. మీరంతా ఒకటే అనడంలో నీ ఆంతర్యమేమిటి. ఆయన, నేను ఒకే జాతికి చెందినవాళ్లమనా. ముఖ్యమంత్రి నీ చుట్టమని చెబుతావా.. నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వవా. నువ్వు ఉద్యోగివి కాదా. టీఏ, డీఏలు తీసుకోవడం లేదని చెబుతున్నావు. జీతం కూడా తీసుకోకుండా పనిచేయి. తూర్పుగోదావరి జిల్లాలో నీ ఎర్రబుగ్గ కారు ఎవరు వాడుకున్నారు. దానిని వదిలేసి పారిపోయిందెవరు. అక్కడే తెలిసిపోతోంది నీ నిజాయితీ’ అంటూ ధ్వజమెత్తారు. ’నాకు ఉద్యోగం తృణ ప్రాయమని ఎప్పుడో చెప్పాను. నేను లీడర్ని, ఉద్యమకారుడిని. నువ్వు నన్ను ఏమీ చేయలేవ్. డ్రామాలొద్దు నన్ను ఎప్పుడు టెర్మినేట్ చేస్తావో చెప్పు కలెక్టర్. 2014 సంవత్సరంలో చేపట్టిన ఉద్యోగుల ఉద్యమాన్ని నిలుపుదల చేయడానికి ముఖ్యమంత్రి, మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్ మాతో చర్చించాల్సి వచ్చింది. అప్పుడు కాళ్ల బేరానికి వచ్చిన సంగతి మర్చిపోయావా. అదే 2014లో నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి నేను నిర్దోషినని చెప్పావ్ గుర్తు లేదా. టార్గెట్ సాగర్ ఉద్యమాన్ని ప్రారంభించావు. నన్ను ఉద్యోగం నుంచి తీయగలవే తప్ప ఉరితీయలేవు కదా. ఖబడ్దార్.. నేను లంచగొండినైతే ఏసీబీ నిద్రపోతోందా. నువ్వు నిద్రపోతావా. ఈ జిల్లాకు వచ్చిన తరువాత నీ కుల దురహంకారంతో ఎంతమంది అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేశావ్. ఎంతమందిని టెర్మినేట్ చేశావ్. ఎంతమందిని సస్పెండ్ చేశావ్. వారి ఉసురు పోసుకుంటావ్. ఒక బీసీ ఉద్యోగిని నీకు సన్మానం చేస్తానంటూ ఎగతాళిగా మాట్లాడతావా. ఇప్పుడు కూడా బహిరంగ విచారణ చేసుకో. నువ్వే ఇంటింటికీ తిరుగు. నీతిగల నాయకుడిని నేను. నీ కాళ్లు పట్టుకోను. ఇకనైనా నీ వెర్రి చేష్టలకు ఫుల్స్టాప్ పెట్టు. లేకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం. హద్దులు దాటిపోయావ్. అంటరానితనాన్ని అవలంబిస్తున్నావ్. అట్రాసిటీ పెడితే అట్టడుగుకు పోతావ్. ఖబడ్దార్’ అంటూ కలెక్టర్‌పై విద్యాసాగర్ విరుచుకుపడ్డారు. అంతకుముందు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు మాట్లాడుతూ విద్యాసాగర్‌పై జరుగుతున్న ఎదురు దాడిలో రేషన్ డీలర్లను పావులుగా వాడుకుంటున్నారన్నారు. సాగర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారిలో ఎక్కువ మంది బినామీ డీలర్లేనన్నారు. ఆయన డీలర్లను డబ్బులడిగితే ఏసీబీకి ఫిర్యదు చేయాలే గానీ ఇలా అల్లరి చేయడం తగదన్నారు. -
నిర్వాసితులకు అండగా ఉంటాం
దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు అండగా ఉండి సమస్యలపై పోరాడతామని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంతో కనుమరుగవుతున్న గండికోట గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు పలు సమస్యలను అనంతబాబు దృష్టికి తీసుకువచ్చారు. తమకు పూర్తిస్తాయి ప్యాకేజీ చెల్లించకుండా, ఎంతమొత్తం ఇస్తారో తెలియకుండా, నిర్వాసిత కాలనీలో వసతులు కల్పించకుండా తక్షణం గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. అనంత బాబు మాట్లాడుతూ నిర్వాసిత గిరిజనులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించేంతవరకూ గ్రామాన్ని ఖాళీ చేయరాదని, ఖాళీచేసే తేదీని కటాఫ్ డేట్‌గా గుర్తించి 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ అమలు చేయాలని, గిరిజనుల నుంచి సారవంతమైన భూమి తీసుకుని ఇచ్చిన కొండరాళ్ల భూముల స్థానే మరో చోట భూములు సేకరించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే గిరిజనులు కోరుకున్న విధంగా కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. నిర్వాసితులకు పరిహారాలు చెల్లించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్న అధికారులు 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని అన్నారు. ఎంపీపీ పండా జయలక్ష్మి, జెడ్పీటీసీ మట్ట రాణి రాంబాబు, పార్టీ నాయకులు కుంజం చెల్లన్నదొర, పోలిశెట్టి శివరామకృష్ణ, కట్టా సత్యనారాయణ, కందుల బాబ్జీ, గారపాటి మురళీకృష్ణ, తుర్రం జగదీష్, మట్ట రాంబాబు, సోదే వెంకన్నదొర, శిరసం పెద్దబ్బాయి దొర, తైలం వీరబాబు, కోమలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే రాజేశ్వరి దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంతో కనుమరుగవుతున్న గండికోట గిరిజనులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించిన తర్వాతే గ్రామాన్ని ఖాళీచేయించాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మంగళవారం సాయత్రం ఆమె గండికోట గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలో కనీసం గ్రామ సభ నిర్వహించకుండా, ఎంత ప్యాకేజీ చెల్లిస్తారో తెలియజేయకుండా , కొంత మొత్తం జమ చేసారని వాపోయారు. గ్రామంలో తల్లిదండ్రులు లేని ఆరుగురు యువతీ, యువకులను ప్యాకేజీకి అర్హతలేదంటున్నారని తెలపారు. గిరిజనులకు భూమికి భూమి పరిహారంగా ఇచ్చిన కొండలను పరిశీలించారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన ప్యాకేజీ చెల్లించేంతవరకూ గ్రామాన్ని ఖాళీచేసేది లేదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతవరకూ నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. పార్టీ మండల కన్వీనర్ నండూరి గంగాధరరావు, ఎంపీటీసీ సభ్యురాలు పరదా శీతారత్నం, నండూరి సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరంపై ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, వచ్చే ఏడాదికి పనులు పూర్తి చేసి సాగు, తాగు జలాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన 68వ భారత గణతంత్ర దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రూ.1,400 కోట్లతో పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టి.. రూ.660 కోట్ల విలువైన పనులు పూర్తిచేశామని కలెక్టర్ చెప్పారు. యనమదుర్రు, ఎర్రకాలువ ఆధునికీకరణ, పోగొండ రిజర్వాయర్, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నీరు–చెట్టు పథకం కింద రూ.62 కోట్లతో 480 చిన్నతరహా నీటి వనరుల్లో 171 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులు చేశామన్నారు. సాగులో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించి రూ.73 కోట్ల విలువైన యంత్రాలను 31 వేల మంది రైతులకు అందించామని వివరించారు. ఈ ఏడాది 4 లక్షల మంది రైతులకు రూ. 5,200 కోట్లను పంట రుణాలుగా అందిస్తున్నామన్నారు. 5 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల రుణమాఫీ చేశామని, 75 వేల మంది కౌలు రైతులకు రూ.22 కోట్లు పంట రుణాలుగా అందించామని తెలిపారు. రైతు కూలీల వలసలు నివారించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం కింద 2.78 లక్షల కుటుంబాలకు చెందిన 4.40 లక్షల మంది కూలీలకు 108 లక్షల పనిదినాలు కల్పించి రూ.152 కోట్లు వేతనాలుగా చెల్లించామన్నారు. జలసిరి పథకం కింద 1,500 వ్యవసాయ బోర్లు తవ్వి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని, వీటిలో 317 బోర్లకు సోలార్ విద్యుత్ పంప్ సెట్లు అమరుస్తున్నామని వివరించారు. జిల్లాలోని 47 వేల స్వయం సహాయక సంఘాలకు రూ.1,027 కోట్ల రుణాలను అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ రూ.149కే టెలిఫోన్, ఇంటర్నెట్, కేబుల్ ప్రసారాలు అందించే దిశగా చేపట్టిన ఫైబర్‌గ్రిడ్ పనులు పూర్తికావచ్చాయని చెప్పారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 1.81 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను, వివిధ జాతీయ పథకాల నిధులు రూ.146 కోట్లతో సురక్షిత మంచినీటి పథకాలను నిర్మిస్తున్నామని వివరించారు. గృహనిర్మాణ పథకం కింద 18,504 గృహాలు, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస యోజన కింద 5,296 గృహాలు, ప్రధానమంత్రి పట్టణ ఆవాస యోజన కింద ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లుల్లో 1,910 గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పంట భూములను వినియోగించకుండా 16 వేల ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చేసి, వినియోగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. వనం–మనం కార్యక్రమం కింద 93 లక్షల మొక్కలు నాటి వాటిని జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఈ ఏడాది మరో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రూ.344 కోట్లతో 82 పనులు చేపట్టామని, జిల్లాలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా రూ.9.50 కోట్లతో ఇండోర్ స్టేడియంలు నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.350 కోట్ల అంచనా వ్యయంతో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. కార్యక్రమంలో డీఐజీ పి.రామకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్, ఏఎస్పీ కె.రత్న, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డీఆర్ఓ కే.హైమావతి, ఆర్డీఓ నంబూరి తేజ్‌భరత్ పాల్గొన్నారు. -
బ్లేడుతో గొంతు కోసుకున్న విద్యార్థి
గుత్తి (గుంతకల్లు) : గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన పదో తరగతి విద్యార్థి భాస్కర్ (14) సోమవారం రాత్రి తోటలోకెళ్లి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బెల్టుషాపు నిర్వాహకుడు తనను చంపుతానని బెదిరించడం వల్లే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానంటూ బాధితుడు తన స్నేహితుడికి ఫో¯న్ చేసి తెలిపాడు. ఆ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన వచ్చి భాస్కర్‌ను గుత్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. -
తేడాలొస్తే.. సంగతి చూస్తా
డయల్ యువర్ కలెక్టర్‌లో కాటంనేని భాస్కర్ గ్రామీణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు ఏలూరు (ఆర్ఆర్ పేట) : మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తే.. అలాంటి వారి సంగతి తేలుస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. బోగస్ లెక్కలు చూపించి సొమ్ములు డ్రా చేస్తే సంబంధిత అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మానం, ఉపాధి హామీ పథకాలపై శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ అంశాలపై ప్రజలతో ఫోన్లో మాట్లాడిన ఆయన వారి సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన జి.పాండురంగారావు ఫోన్ చేసి.. మరుగుదొడ్ల నిర్మాణంలో 40 శాతం నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. మరుగుదొడ్లు కట్టకపోయినా కట్టినట్టు చూపించి కొన్నిచోట్ల.. ఒక మరుగుదొడ్డిపై మూడేసి బిల్లులు చొప్పున మరికొన్ని చోట్ల డ్రా చేశారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో పెద్దఎత్తున యూనిట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లు కట్టకుండా కట్టినట్టు లెక్కల్లో చూపి సొమ్ము డ్రా చేస్తే విచారణ జరిపిస్తామన్నారు. సంబంధిత అధికారుల నుండి సొమ్ము రికవరీ చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై 24 గంటల్లోగా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డ్వామా పీడీ ఎం. వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన కూనపాముల రాజేష్ కలెక్టర్‌కు ఫోన్ చేసి.. తమ గ్రామంలో 2004లో నిర్మించిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, కొత్తగా నిర్మించుకున్న వారికి డబ్బు ఇవ్వకపోవడంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గ్రామ కార్యదర్శి పనిచేసే చోట నివాసం ఉండటం లేదని, గ్రామానికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. తక్షణమే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ఏలూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ ఫోన్లో మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరిగిందని, ఆ గ్రౌండ్ రాళ్ళు, రప్పలతో ఉండటతో సరిగ్గా పరిగెత్తలేకపోయామని చెప్పింది. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మైదానాన్ని వాకర్లకు అనువుగా రాళ్లు రప్పలు లేకుండా తీర్చిదిద్దాలని కోరింది. దీనిపై ఎస్పీతో చర్చించి చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి గ్రామానికి చెందిన పరువు శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఇంటి పన్నును పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా అద్దెకున్న వారి పేరుతో గుమాస్తా మార్పు చేశాడని ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపితే పెద్ద కుంభకోణం బయటపడుతుందని చెప్పగా.. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పాలకొల్లు ఈఓపీఆర్డీకి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీపీవో కె.సుధాకర్ పాల్గొన్నారు. -
నగదురహిత లావాదేవీకు సమాయత్తం
ఏలూరు (మెట్రో) : చిల్లర సమస్యను అధిగమించేందుకు జిల్లాలో పూర్తిస్థాయిలో నగదురహిత లావాదేవీలు నిర్వహించుకునేందుకు ప్రజలను సమాయత్తం చేస్తున్నామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో జిల్లాలోని ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నుంచి రేషన్‌డిపోలు, ఫెర్టిలైజర్స్ షాపులు, కిరాణా షాపుల్లో పూర్తిస్థాయిలో నగదురహిత లావాదేవీలు నిర్వహించేలా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అన్ని రేషన్‌డిపోలు, ఫెర్టిలైజర్ షాపులు, వ్యాపార సంస్థల్లో కరెంట్ అకౌంట్లు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలంలో 33, పాలకొల్లులో 34 రేషన్ డీలర్ షాపులుండగా అందులో ఏ ఒక్కటీ కూడా కరెంట్ అకౌంట్ ప్రారంభించకపోవడంపై తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జేసీ పి.కోటేశ్వరరావు, డీఆర్వో కె.హైమావతి, డీఎస్వో డాక్టర్ డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
డై..లాగి కొడితే....
సినిమా : బొమ్మరిల్లు రచన: అబ్బూరి రవి, దర్శకత్వం: భాస్కర్ ఫ్రెండ్స్‌తో కలిసి గుడికెళ్లిన సిద్దు (సిద్దార్థ్) పొరపాటున హాసినిని (జెనీలియా) ఢీ కొడతాడు. అప్పుడు ఏర్పడిన పరిచయంతో హాసిని ఇంటి దగ్గర బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తుంటాడు సిద్ధు. హాసిని రాగానే హాయ్.. ఆరోజు గుడిలో సరిగ్గా మాట్లాడుకోలేదు కదా.. అందుకనీ అంటాడు. అయితే? అని హాసిని బదులివ్వగానే ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు సిద్దు. ఇడియట్ అని కాలేజీకి వెళ్లిపోతుంది హాసిని. ఆమె కోసం కాలేజీకి వెళతాడు అతను. ఏదో గుడిలో కలిసావని మళ్లీ వస్తే సైట్ కొడుతున్నాడు.. లైనేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేస్తావా? నేను అలాంటి వాడిని కాదు. నేనూ ఇదే కాలేజీలో చదివా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమంటూ హాసినీకి చెప్పి వెళుతుంటాడు సిద్ధు. అప్పుడు హాసిని అంతేనా.. అంటుంది. ఇంకేం కావాలంటాడు సిద్ధు. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ... అంటుంది హాసిని. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే సెల్‌ఫోన్స్‌లో రింగ్‌టోన్‌గా మోతమోగిపోయింది. -
రూ.1.5 లక్షలు పక్కకి పెట్టి మరిచాడు
రాంగోపాల్‌పేట: బ్యాంక్‌లో ఓ వినియోగదారుడికి చెందిన రూ.1.5 లక్షలు మాయమయ్యాయి. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం... బోయిగూడకు చెందిన భాస్కర్ ఫ్యాబ్రిక్ పనులు చేస్తుంటాడు. సోమవారం ఉదయం 11.30కి సెయింట్ మేరీస్‌రోడ్‌లోని ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చిన భాస్కర్ తన వ్యాపారాల కోసం రూ.8.5 లక్షలు నగదు డ్రా చేశాడు. ఇతరులకు ఇచ్చేందుకు రూ.7 లక్షలు ఒక పేపర్లో చుట్టుకుని రూ. 1.5 లక్షలు పక్కన పెట్టాడు. పేపర్లో చుట్టుకున్న రూ.7 లక్షలు తీసుకుని వెళ్లిపోయిన ఆయన మిగతా లక్షన్నర అక్కడే పెట్టి మరచిపోయాడు. కొద్దిదూరం వెళ్లాక బ్యాంక్‌లో మర్చిపోయిన డబ్బు గుర్తుకు వచ్చి..వెంటనే బ్యాంక్‌కు తిరిగి వచ్చి చూడగా అక్కడ కనిపించ లేదు. బ్యాంక్‌లో వాకబు చేసినా డబ్బు దొరకలేదు. దీంతో ఆయన గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
గాంధీ విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
– జిల్లా జడ్జి తుకారాంజీ ఏలూరు (సెంట్రల్) : ప్రతి ఒక్కరూ జాతిపిత గాంధీజీ విధానాలను స్ఫూర్తిగా తీసుకుని నడిచినప్పుడే దేశంలో ప్రగతి సాధ్యపడుతుందని జిల్లా జడ్జి తుకారాంజీ అన్నారు. స్థానిక జిల్లా జైలులో ఆదివారం ఖైదీల సంక్షేమ దినోత్సవ సభలో జిల్లా జడ్జి తుకారాంజీ, కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జడ్జి మాట్లాడుతూ గాంధీజీ జయంతి సందర్భంగా ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడానికి ఏటా ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని కూడా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జైలులో జీవనం సాగించే నిందితులు, ఖైదీలకు వివిధ వత్తుల్లో శిక్షణ అందిస్తే భవిష్యత్తులో తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివద్ధి సాధించే అవకాశాలుంటాయని, అందుకు అనుగుణంగా జైలులో ఏయే వత్తులు అమలు చేయవచ్చునో ప్రణాళిక సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నరసింహమూర్తి, జిల్లా జైలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
సాహిత్యంతో చెలిమి అవసరం
కాకినాడ కల్చరల్ : పుస్తకాలు మంచి స్నేహితులు వంటివని ప్రముఖ సాహితీవేత్త మాకినీడి సూర్యభాస్కర్ అన్నారు. స్థానిక జగన్నాథపురం ఆదిత్య టీచర్ ట్రైనింగ్ అకాడమీలో విశ్వర్షి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రదాన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. వివిధ రూపాల్లో సమాజానికి సాహిత్య సేవలు అందజేసిన ప్రముఖ కవులకు, పలువురు జర్నలిస్టులతోపాటు ప్రముఖ సాహితీవేత్త మాకినీడి సూర్యభాస్కర్, కవులు, రచయతలు కాట్ల దేవదానం రాజు, బి. బాబా, గదుల నాగేశ్వరరావు, పుష్పల సూర్యకుమారి, అడపా రామకృష్ణలను ఘనంగా సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాహిత్యంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా పాత్రికేయ వృత్తిలో ఉన్నవారికి మరింత అవసరమన్నారు. జీవితకాలంలో తమ అనుభవాలను పదిలపరుచుకుంటే పుస్తకం రూపంలో అందరికీ దాన్ని అందజేయవచ్చుననని అన్నారు. సాహిత్య వ్యవసాయం చేస్తూ ఫలాలను సమాజానికి అందజేస్తున్న విశ్వర్షి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ర్యాలీ ప్రసాద్ సాహిత్య సేవలను అభినందించారు. కళా జగతి పత్రిక పోలవరం అబ్బూరును సన్మానించారు. విశ్వర్షి సాహిత్య అకాడమీ వ్యవస్థాపకుడు ర్యాలి వెంకట్రావు, సూర్యరాయ విజ్ఞానంద గ్రంథాలయం అధ్యక్షుడు ఎం.భరతుడు, కార్యదర్శి కె.శంకరరావు, రచయిత మధునాపంతుల సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సాహిత్యం నేటి సమాజానికి ఎంత అవసరమో వివరించారు. ప్రపంచ పరిణామాలతోపాటు సాహిత్య పేజీలను అందజేస్తున్న పత్రికలను నిర్వాహకులు అభినందించారు. ఆ పత్రికల తరుపున ఈ చిరు సత్కారమని అన్నారు. ఆదిత్య బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వందన సమర్పణ చేశారు. -
కేంద్రం నిధులు ఏమయ్యాయి..?
–కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఏలూరు (మెట్రో): జిల్లాలో రైతులకు ఎరువులు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.100 కోట్లు ఏమయ్యాయని, ఎరువుల కంపెనీలు ఆ సొమ్ములు ఏం చేశాయని కలెక్టర్ కె.భాస్కర్ ప్రశ్నించారు. కలెక్టరేట్లో వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక, పట్టు పరిశ్రమశాఖలు వంటి ప్రాధాన్యతా రంగాల పనుల ప్రగతిపై బుధవారం అధికారులతో సమీక్షించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు ఏడాదికి రూ.20 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు అందించిందన్నారు. అయితే ఎక్కడా ఐటీ అభివద్ధికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని దీనిపై సమగ్ర పరిశీలన చేస్తామని హెచ్చరించారు. పేదలకు రుణాలివ్వరా..! బెంజ్ కార్లు కొనుగోలు చేసుకునేందుకు సున్నా శాతం వడ్డీకి రుణాలిస్తారు గాని.. పేదలకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదని, రైతులు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని కలెక్టర్ అన్నారు. అధికారులు వారానికి రెండు సార్లు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సీపీవో టి.సురేష్‌కుమార్, ప్లానింగ్ శాఖ డీడీ సాంబశివరావు, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉద్యాన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, పట్టుపరిశ్రమశాఖ డీడీ సుబ్బరామయ్య, పశు సంవర్థక శాఖ జేడీ కె.జ్ఞానేశ్వర్, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరి, మార్కెటింVŠ Sశాఖ డీడీ కె.చాయాదేవి, ఏపీఎంఐపీ పీడీ ఎస్.రామ్మోహన్ పాల్గొన్నారు. ఆటోనగర్‌ను రద్దు చేయండి ఆటోనగర్ అసోసియేషన్‌కు ఇచ్చిన సముదాయాలను తరలించలేని పరిస్థితుల్లో ఉన్నందున తక్షణమే వాటిని రద్దు చేయాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా వచ్చిన ఐదు, ప్రోత్సాహకాల మంజూరు కోసం వచ్చిన 20 ప్రతిపాదనలను అనుమతించామని చెప్పారు. అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలి జిల్లాలో నాబార్డు ఆధ్వర్యంలో ఆర్ఐడీఎఫ్ నిధుల ద్వారా 650 అంగన్వాడీ భవనాలకు ప్రతిపాదనలను తయారు చేసి సమర్పించాలని ఐసీడీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మరో 650 అంగన్వాడీ భవనాలు ఐసీడీఎస్ నిధుల ద్వారా నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టే గోపాలమిత్ర భవనాల నిర్మాణం నెలాఖరులోపు, నరసాపురంలో రైతుల శిక్షణా కేంద్రం భవనాల నిర్మాణం వచ్చేనెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. ‘జలసిరి’పై నిర్లక్ష్యం తగదు ఎన్టీఆర్ జలసిరి పథకం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో జలసిరి పథకం అమలు తీరుపై సమీక్షించారు. జలసిరి–2లో భాగంగా జిల్లాలో 4 వేల వ్యవసాయ బోర్లకు సోలార్ యంత్రాలు అందించాలనే లక్ష్యం కాగా ఇప్పటివరకు 685 మాత్రమే పూర్తిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
29 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఏలూరు సిటీ : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ నెల 29 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా ఏలూరు, తణుకులో 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2,880 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వారికి అన్ని సెంటర్లలో మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 29న బిల్‌గ్రేడ్ ఫౌండేషన్ బృందం పర్యటన జిల్లాలో ఆన్లైన్ ద్వారా అమలు చేసే పథకాలను బిల్‌గ్రేడ్ ఫౌండేషన్ వారు తణుకు, భీమడోలులో పర్యటించి పథకాల అమలుపై స్వయంగా అడిగి తెలుసుకుంటారని చెప్పారు. 29న ఏలూరు చేరుకుని రెండు బృందాలుగా తణుకు, భీమడోలు మండలాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా జరుగుతున్న పనులు, పింఛన్లు, ఎరువుల పంపిణీ, వైద్యం ఇతర అంశాలపై అడిగి తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఏలూరు కలెక్టరేట్ చేరుకుని జిల్లా అధికారుల సమావేశంలో బృందం పాల్గొంటారు -
పేదల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
నాగర్‌కర్నూల్‌రూరల్ : రాష్ట్రంలో పేదలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ అన్నారు. గురువారం పీఆర్ అతిథిగహంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సకల జనుల సమ్మెలో దళితులు ఎంతో కషిచేశారని, డప్పు నత్యాలతో ఉద్యమంలో పాల్గొన్నారని, రాష్ట్రం ఏర్పడితే దళితుల బతుకులు బాగుపడతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దళిత సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన బడ్జెట్లో దళితుల వాటా సక్రమంగా రావాలన్నారు. సెప్టెంబర్ 10నుంచి 70రోజులపాటు ఆత్మగౌరవంతో బతుకుదాం, హక్కులు సాధించుకుందామన్న నినాదంతో బస్సు యాత్ర చేపడుతున్నామని అన్నారు. సమావేశంలో టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నయ్య, కార్యదర్శులు జయశంకర్, మల్లెపోగు శ్రీను, రాష్ట్ర నాయకులు మొలకలపల్లి నర్సింహ, శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, మహిళా అధ్యక్షురాలు నిరంజనమ్మ, పాలకొండ కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల పేరిట మోసం
ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కన్సల్టెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ భాస్కర్ అనే కన్సల్టెంట్ దాదాపు 20 మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. కొన్ని నెలలుగా రేపుమాపు అని వాయిదాలు వేస్తూ ఉద్యోగార్ధులను కాలయాపన చేస్తూ వస్తున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భువనగిరిలో దారుణం
కుటుంబ కలహాలతో విసిగి వేసారిపోయిన మహిళ తన ఐదు నెలల చిన్నారిని నీటితొట్టెలో పడేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో ఆదివారం వెలుగచూసింది. స్థానికంగా నివాసముంటున్న భాస్కర్‌కు, మమత(21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరు నెలల పాప ఉంది. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరగుతున్నాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన భాస్కర్ మరోసారి గొడవపడటంతో మనస్తాపానికి గురై తన ఆరు నెలల చిన్నారి నీటితొట్టెలో పడేసి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీవర్ ఆస్పత్రిలో రేబీస్‌తో యువకుడి మృతి
హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో రేబీస్‌తో చికిత్స పొందుత్ను ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల చింతబండకు చెందిన కొంగరి భాస్కర్(28) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం అతనిపై ఓ వీధి కుక్క దాడిచేసి గాయపరిచింది.అతను వెంటనే చికిత్సల కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లగా టీటీ, ఏఆర్వీ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. కుక్క కరిచిన వారికి రేబీస్ సోకకుండా రేబీస్ ఇమ్యునొ గ్లోబులిన్ (రిగ్) ఇంజక్షన్ చేయించుకోవాలనే విషయం తెలియని అతను అలాగే ఉండి పోయాడు.. గత రెండు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్న భాస్కర్‌ను కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అతన్ని పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు ప్రారంభించారు. అక్కడ చికిత్సలు పొందుతున్న అతను బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోధిస్తూ భాస్కర్ మృత దేహాన్ని స్వగ్రాహానికి తీసుకుని వెళ్లిపోయారు. -
తెల్లవారేసరికి చెరువుకట్ట వద్ద శవమై...
బాన్స్వాడ: నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ పట్టణం సమీపంలోని ఎల్లయ్యచెరువు కట్ట వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పట్టణానికి చెందిన భాస్కర్ (33)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన భాస్కర్ ఉదయమైనా తిరిగి రాలేదు. కంగారుతో కుటుంబ సభ్యులు గాలించగా ఎల్లయ్య చెరువుకట్ట వద్ద శవమై కనపించాడు. మృతదేహం బాగా కాలిపోయిన స్థితిలో ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. -
వీధికుక్కల వీరంగం
- తీవ్రంగా గాయపడ్డ మూడేళ్ల చిన్నారి నల్లకుంట వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన ఉప్పల్ కళ్యాణ పురి కాలనీ లో జరిగింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. గుంపుగా తిరుగుతున్న వీధి కుక్కలు బుధవారం ఒక్కసారి గా ఇంట్లో కి వచ్చి.. ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి పావని(3) ని నోట కర్చుకుని ఈడ్చుకు వెళ్లాయి. చిన్నారి తల, ముఖం, కడుపు, వీపు, చేతులపై తీవ్ర గాయాలు చేశాయి. ఇంతలో దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమి.. చిన్నారిని కాపాడారు. రక్తం ఓడుతున్న చిన్నారిని హుటాహుటిన నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
అక్క మొగుడే హంతకుడు!
ఈ నెల 7న రామచంద్రాపురం జంక్షన్ వద్ద హత్యకు గురైన సుబ్రహ్మణ్యం(26) హత్య కేసులో నిందితుడు సుబ్రహణ్యం అక్క భర్తే నని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. తిరుపతిలోని జీవకోనకు చెందిన సుబ్రహ్మణ్యం, భాస్కర్ బావబామ్మర్థులు. సుబ్రహ్మణ్యం తన బావ భాస్కర్‌కు కొన్ని నెలల క్రితం రూ.లక్షన్నర అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని కొన్ని రోజులుగా అడుగుతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ నెల 7న మద్యం సేవించడానికి రామచంద్రాపురం జంక్షన్ వద్దకు ఇద్దరూ వెళ్లారు. మద్యం సేవించే సమయంలో అప్పు గురించి అడిగేసరికి భాస్కర్ కోపోద్రిక్తుడయ్యాడు. రెచ్చిపోయి బావమరిది సుబ్రహ్మణ్యంను చంపేశాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లలేదు. నాలుగు రోజులుగా ఇద్దరి కోసం కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. గురువారం రామచంద్రాపురం జంక్షన్ వద్ద సుబ్రహణ్యం మృతదేహం స్థానికుల కంటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పాముకాటుకు వ్యక్తి మృతి
వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి పాము కాటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా పోరుమామిళ్ల మండలం తోకలపల్లెలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర భాస్కర్(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా కానుండటంతో.. మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి పాముకాటుకు గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వ్యకిపై వేటకొడవళ్లతో దాడి
వివాహేతర సంబంధమే కారణం? సుండుపల్లి(కడప) వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తిపై కొందరు దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లిలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన హిదాయత్ బస్సులో సుండుపల్లికి వెళ్తుండగా దుండగులు బైకుల్లో వెంబడించారు. బస్సు దిగిన వెంటనే అతనిపై కొడవళ్లతో దాడి చేశారు. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ఇద్దరు దుండగులు బాలక్రిష్ణ, సుధాకర్ లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన భాస్కర్ భార్యతో క్షతగాత్రుడికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. -
ఒంటరితనంతో విద్యార్థి ఆత్మహత్య
కోనరావుపేట: తండ్రి, తాత రెండేళ్ల వ్యవధిలో మృతి చెందడంతో ఒంటరితనంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బడవేని భాస్కర్ (22) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి రాజిరెడ్డి మృతి చెందాడు. దీంతో తాత మల్లయ్యతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఎనిమిది నెలల క్రితం తాత కూడా మృతి చెందడంతో భాస్కర్ ఒంటరిగా ఉంటున్నాడు. సోదరుడు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భాస్కర్ ఇంటికి దగ్గర్లో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
చిత్తూరు జిల్లాలో మానసిక వికలాంగురాలైన బాలికపై అత్యాచారం జరిగింది. వివరాలివీ..పలమనేరు మండలం బండమీదిజరా వారి పల్లె గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలైన బాలిక(10) మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన భాస్కర్(30) ఆమెను ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. అదే రోజు రాత్రి బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, భాస్కర్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
మెదక్: ‘ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని వెంట పడితే బావే కదా అని నమ్మాను.. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నంగునూరు మండలం మగ్దుంపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీతను భాస్కర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అతడు వరుసకు బావ కావడంతో సంవత్సరం పాటు కలిసి తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని గీత కోరడంతో భాస్కర్ నిరాకరించాడు. దీంతో జులైలో భాస్కర్‌తో పాటు అతని తల్లిదండ్రులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన భాస్కర్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కాగా తనకు న్యాయం చేయాలంటూ గీత ఆదివారం ప్రియుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్ ఇంట్లో కుటుంబసభ్యులు ఎవ్వరు లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె వెనుదిరిగింది. -
లీగల్ మెట్రాలజీ అధికారి సస్పెన్షన్
హైదరాబాద్ సిటీక్రైం: లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న కె.భాస్కర్‌పై తెలంగాణ ప్రభుత్వం గురువారం సస్పెన్షన్ వేటు వేసింది. పెట్రోల్ బంక్‌ల్లో అక్రమాలకు ఊతమిస్తున్నారని, యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది. -
బాబుకి ఏమైంది..?
బన్నీకి తొమ్మిదేళ్లు. ఎప్పుడూ ఊహల్లో ఉంటాడు. తనకు నచ్చిన పాత్రలో తనను తాను ఊహించుకుంటూ ఉంటాడు. బన్ని అల్లరి భరించలేక అతని తండ్రి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తాడు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. అక్కడ బన్ని విచిత్రంగా ప్రవర్తిస్తాడు. మిగతా వాళ్లందర్నీ భయపెడుతూ ఉంటాడు. అసలు బన్నీకి ఏమైంది...? అనేది తెలియాలంటే ఈ నెల 17న విడుదల కానున్న ‘బుడుగు’ చూడాల్సిందే. లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్‌బాబు, ఇంద్రజ ముఖ్యతారలుగా మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మన్మోహన్ దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పిల్లలూ, పెద్దలూ చూసే విధంగా ఉంటుంది. చెన్నయ్‌లో మీడియా మ్యాజిక్ వారికి ఈ చిత్రాన్ని చూపిస్తే, తమిళంలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయనీ, లక్ష్మీ మంచు కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుందనీ నిర్మాత భాస్కర్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, సమర్పణ: సుధీర్. -
గట్లైతే పెన్షన్లు రావ్!
-
సోలార్ విద్యుత్.. సో బెటర్
ఏలూరు (వన్‌టౌన్) : సోలార్ విద్యుత్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు కె. భాస్కర్ అన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో రూ.7 లక్షల 90 వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన 5 కిలోవాల్ట్స్ సోలార్ పవర్ ప్లాంటును మంగళవారం ఉదయం కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అయిన ఖర్చులో రూ.2 లక్షల 37 వేలు నెడ్‌క్యాప్ సబ్సిడీగా అందించిందని మిగిలిన సొమ్ము ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో 25 ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని, దశలవారీగా అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జిల్లాలో విద్యుత్ కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బ్‌లను ఒక్కొక్కటి రూ.10కే అందించనున్నామన్నారు. జిల్లాలో 100 కిలోవాల్ట్‌ల సామర్థ్యంగల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక సిద్ధం చేశామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్‌కు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఏరియా హాస్పటల్స్‌కు, పురపాలక సంఘాలకు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఎండీ ఎం.కమలాకరబాబు మాట్లాడుతూ దేశంలో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోలార్ విద్యుత్ ఉత్పాదనలో 2వ స్థానంలో ఉందన్నారు. భవనాల పైకప్పులు, నిరుపయోగంగా ఉన్న ఖాళీస్థలాల్లో సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి మంచి అవకాశాలున్నాయని, వ్యక్తిగత గృహ యజమానులు, వాణిజ్య భవన యజమానులు, పారిశ్రామిక భవనాల యజమానులు కూడా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ విధానం ద్వారా నాణ్యమైన విద్య అందించాలి ఏలూరు సిటీ : క్లస్టర్ విద్యావిధానం ద్వారా మండలస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. ఏలూరు కలెక్టరు చాంబర్లో మంగళవారం ఉదయం విద్యాశాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఒక క్లస్టర్‌గా తీసుకుని పటిష్టమైన విద్యావిధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఒకటి లేక రెండు మోడల్ స్కూల్స్‌ను అభివృద్ధి చేసి ఆ పాఠశాలలను ఇతర గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్ ఏర్పాటు చేసి విద్యార్థులు మోడల్ స్కూల్స్‌కు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. డీఈవో నరసింహారావు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల్ని పరీక్షించేందుకు ప్రణాళిక రూపొందించండి ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : జిల్లాలో 3,300 పాఠశాలల్లో జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం కింద ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కె.భాస్కర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో విద్యార్థిని పరీక్షించినందుకు డాక్టర్‌కు రూ.10 చొప్పున పారితోషికం అందిస్తామని, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి రోజుకు కనీసం 100 మంది విద్యార్థులను పరీక్షించాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు, అందించిన వైద్యసేవల వివరాలు కేస్షీట్తో సహా తనకు నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సుభాష్, డీఎంహెచ్‌వో కె.శంకరరావు, సర్వశిక్షాభియాన్ పీవో విశ్వనాథ్, జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమం జిల్లా సమన్వయాధికారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువపై ‘పసుపు’ పాదం!
పేరూరులో రూ.కోటిన్నర ప్రభుత్వ భూమి ఆక్రమణయత్నం పట్టపగలే జేసీబీతో పనులు పట్టించుకోని రెవెన్యూ అధికారులు తిరుపతి రూరల్: అధికార పార్టీ నేతలు భూకబ్జాలకు దిగుతున్నారు. అమాయకులను ముందు పెట్టి రూ.కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. పట్టపగలే కాలువలను జే సీబీలతో చదును చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రూ. కోటిన్నర భూమి కబ్జా పేరూరు పంచాయతీ సర్వేనెం.164లో 17 ఎకరాల వి స్తీర్ణంలో కాలువ ఉంది. 60 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ కాలువపై పుదిపట్లకు చెందిన మాజీ మంత్రి అనుచరుడి కన్నుపడింది. దోబీఘాట్ కావాలంటూ జిల్లా అధికారులకు తన అనుచరుల ద్వారా వినతి పత్రం ఇప్పిం చాడు. ఆగమేఘాల మీద 59 సెంట్లను మంజూరు చేయించుకున్నాడు. అంత స్థలం దోబీఘాట్‌కు ఎందు కు ఇళ్ల స్థలాలు వేద్దాం అంటూ అనుచరులను ఒప్పిం చాడు. దాదాపు ఎకరాపైగా కాలువ స్థలాన్ని చదును చేయిస్తున్నారు. ఆదివారం సెలవుదినం. వర్షం పడుతున్నా రెండు జేసీబీలతో కాలువ పూడ్చివేత పనులు ముమ్మరంగా జరిగాయి. మాజీ మంత్రి అనుచరుడు సాగిస్తున్న భూదందాను చూసి మరికొందరు అధికార పార్టీ నేతలు కాలువ ఆక్రమణకోసం పోటీపడ్డారు. గతంలో 16 ఇంటి పట్టాలు ఇచ్చారంటూ గొల్లపల్లెకు చెందిన రజకులు సైతం కాలువను చదును చేస్తున్నారు. కాగా అధికార పార్టీ నేతల కాలువ కబ్జా యత్నాలన్నీ రెవెన్యూ సిబ్బంది కనుసన్నల్లోనే సాగుతున్నాయనే అరోపణలు వెల్లువెత్తున్నాయి. అందుకే తాము ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతల కబ్జాలను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు దోబీఘాట్‌కు ఈ మధ్యే స్థలం ఇచ్చాం కానీ ఎవ్వరికీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. కాలువను అక్రమించాలని చూస్తే చర్యలు తీసుకుంటాం. -భాస్కర్, గ్రామ రెవెన్యూ అధికారి, పేరూరు -
స్నేక్ గ్యాంగ్ కేసులో సీఐ, ఎస్ఐల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ రేప్ కేసు ఉదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ వీరప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ సైబారాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్నేక్ గ్యాంగ్ రేప్ దృశ్యాలను వాట్సప్‌లో పంపించిన వారందరినీ సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో వాట్సప్‌లో ఆ దృశ్యాలు దర్శనమివ్వడానికి అసలు సూత్రధారి ఎవరనేది తేలుతుందని సైబర్‌క్రైమ్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఉదంతంలో సుమారు ఎనిమిది మందిని విచారించామని వారు తెలిపారు. -
అమ్మవారి ఆలయంలో మినీ క్యూకాంప్లెక్స్
రూ.5కోట్లతో తోళప్ప గార్డెన్లో అన్నదానం క్యాంటీన్ వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి..? తిరుచానూరు: అమ్మవారి దర్శనానికి వ చ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుం ఠం తరహాలో ఇక్కడ కూడా క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. మినీ క్యూకాంప్లెక్స్‌కు అనువైన స్థలాన్ని ఆల య అధికారులు, టీటీడీ ఇంజినీరింగ్ విభాగపు అధికారులు సంయుక్తంగా పరిశీలిస్తున్నారు. అనుకున్నట్లు సాగితే వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందు కు తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్ త రహాలోనే ఇక్కడ కూడా మినీ క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఇదివరకే టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించా రు. దీనికోసం తిరుపతి జేఈవో పోలా భాస్కర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఇక్కడున్న పాఠశాలను తొలగించి క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని తొలుత అధికారులు భావించా రు. అయితే పాఠశాలను తరలించడం పై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎ దురవడంతో టీటీడీ అధికారులు వెన క్కు తగ్గారు. ప్రత్యామ్నాయంగా పుష్కరిణి సమీపంలోని స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ భవనాన్ని తొలగించి మినీ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అది కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాలని ఇం జనీరింగ్ అధికారులు యోచిస్తున్నారు. అన్నదానం క్యాంటీన్ ప్రస్తుతం అమ్మవారి ఆస్థాన మండపం కింది భాగంలో అన్నదానం క్యాంటీన్ నడుస్తోంది. రోజుకు దాదాపు 3 నుంచి 5 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచాలని, అం దుకు అనుగుణంగా తోళప్పగార్డెన్‌లో అత్యాధునిక వసతులతో అన్నదానం క్యాంటీన్ నిర్మించాలని టీటీడీ పాలకమండలి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రూ.5 కోట్లు కేటాయించారు. టెండర్లను కూడా ఆహ్వానించారు. నూతన బోర్డు ఏర్పడగానే తోళప్పగార్డెన్లోని కల్యాణమండపాలను తొలగించి అన్నదాన క్యాంటీన్ పనులు ప్రారంభించనున్నారు. దీన్ని కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేయనున్నారు. రోడ్డు విస్తరణ పనులు చంద్రగిరి-రేణిగుంట బైపాస్‌రోడ్డు నుంచి రంగనాధం వీధి, తోళప్పగార్డెన్, శంకర్నాయుడుకాలనీ మీదుగా పూడి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వాహన రాకపోకల రద్దీని తగ్గించడానికి అనువుగా ఈ విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు. అలాగే శ్మశానవాటిక వద్ద శాశ్వత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ పనులన్నింటిని ఈ ఏడాది బ్రహ్మోత్సవాల అనంతరం చేపట్టి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
నాయకా.. మీదే.. భారమిక
పాలమూరు : ప్రత్యేక పాలనతో జనం మూడేళ్లుగా విసిగి వేసారిపోయారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే నాథుడు ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. 2011లో జెడ్పీ చైర్మన్ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు చేపట్టని కారణంగా ప్రత్యేక అధికారులతో సమస్యలు తీరకపోగా.. నిధులు వినియోగం కూడా సక్రమంగా జరుగలేదు. ఎట్టకేలకు ఎన్నికలు చేపట్టి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. మన ఊరు-మన ప్రణాళిక అమలు నేపథ్యంలో కొత్త చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన జెడ్పీ సభ్యులతో సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు సకాలంలో విడుదల కాలేక పనులు పడకేసిన మాట మనం తరచూ వింటుంటాం.. కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) పనుల విషయానికొస్తే.. ఇందుకు పూర్తి విరుద్ధమనే చెప్పొచ్చు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరీలు, ఆస్పత్రి భవనాలు, సామూహిక భవనాలు, రోడ్లు, మురుగు కాలువలు ఇలా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేంద్రం ద్వారా నిధులు పుష్కలంగా మండలాలకు సమకూరినా.. అధికారులు మాత్రం మొద్దు నిద్రవీడడం లేదు. రూ.కోట్లల్లో నిధులు మంజూరయినా తగిన అభివృద్ధి పనులు జరగలేదు. జిల్లాలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు జెడ్పీ ైచైర్మన్ భాస్కర్ ప్రత్యేక దృష్టి గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. తమ బాగోగులు చూసుకోవాల్సిన భారం చైర్మన్‌పైనే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం
సర్వజనాస్పత్రిలో రోగుల సంరక్షకులకు అటెండర్ పాస్‌లు అందజేసిన వైద్యులు అనంతపురం అర్బన్: రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే తమ ధ్యేయమని, అందులో భాగంగానే పాస్‌లు అందజేస్తున్నామని స్థానిక జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ డాక్టర్ కన్నేగంటి భాస్కర్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా లేబర్, ఎమర్జెన్సీ వార్డుల్లో అటెండర్ పాస్‌లు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లేబర్ వార్డులో గురువారం రోగుల సంరక్షకులైన బంధువులకు పాస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వార్డులలో ఎవరూ ఇష్టారాజ్యంగా ప్రవేశించరాదన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం, రోగులకు ఇన్ఫెక్షన్ సోకకుండా, దొంగతనాలకు ఆస్కారం లేకుండా అటెండర్ పాస్‌లను ప్రవేశ పెట్టామన్నారు. వార్డులలోకి గుంపులుగా జనం రావడం వల్ల రోగులు ఇన్ఫెక్షన్స్కు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. తద్వారా రోగి త్వరగా కోలుకునేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. వార్డుల్లో చిన్న పిల్లలు అపహరణకు, ఆస్పత్రిలోని వస్తువులు చోరీకి గురికాకుండా ఉండేందుకు, ఇతర వ్యక్తులు లోపలకు రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు పాస్‌లు ఉపయోగపడతాయన్నారు. ఆస్పత్రిలోని సెక్యూరిటీ సిబ్బందికి జిల్లా ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రోగులకు టిఫిన్ కోసం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు భోజనం, సాయంత్ర 4 నుంచి 5 వరకు విజిటింగ్ అవర్స్ ఉంటాయన్నారు. ఈ సమయాల్లోనే రోగుల బంధువుల వార్డులలోకి రావాలన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు : డీకే
గద్వాల/న్యూటౌన్: గద్వాల మండలం కాకులారం గ్రామానికి చెందిన నారాయణ, దేవమ్మలకు నలుగురు మగపిల్ల లు, నలుగురు ఆడపిల్లలు. వీరిలో అందరికన్నా పెద్దవాడు బండారి భాస్కర్. వారిది పేద దళితకుటుంబం. ఆయన జన్మించక ముందే గ్రా మంలో ఉపాధి కోసం ఆ కుటుంబం కర్నూలుకు వెళ్లింది. అక్కడే భాస్కర్ జన్మించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏడో తరగతి వరకు చదివిన భాస్కర్ కర్నూలులోనే చదువుకున్నా డు. వీరికి నాలుగెకరాల పొలం ఉంది. భా స్కర్ పెరిగి పెద్దవాడయ్యాక తిరిగి కుటుం బం ఆ గ్రామానికి కుటుంబం చేరుకుంది. అ ప్పటి నుంచి భాస్కర్ వ్యవసాయం చేయడం తో పాటు తరచూ కర్నూలుకు వెళ్లి రైల్వేవ్యాగన్ హమాలీగా పనిచేశాడు. భాస్కర్‌కు భార్య లక్ష్మిదేవి, కుమార్తె భారతి, కుమారుడు భరత్ ఉన్నారు. వీరిద్దరూ గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. రాజకీయ వారసత్వంతో.. భాస్కర్ తండ్రి నారాయణ 1980 నుంచి రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయనకు ఇప్పటికీ ప్రజల్లో మంచిపేరు ఉం ది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భాస్కర్ రైల్వే హమాలీగా పనిచేస్తూనే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వెన్నంటే ఉన్నాడు. 2001 నుంచి 2006 వరకు భాస్కర్ కాకులారం గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశాడు. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన గద్వాల జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందాడు. అనూహ్య రాజకీయ పరిణామాలతో జెడ్పీచైర్మన్‌గా ఎన్నికై క్యాబినేట్ హోదాను అధిగమించారు. పదవికి వన్నెతెస్తాడు. మా కొడుకు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఉన్నదాంతోనే సంతృప్తిపడుతూ సర్పంచ్‌గా ఊరికి సేవలందించాడు. నేడు జెడ్పీ చైర్మన్‌గా జిల్లాలోని అన్ని పల్లెలను అభివృద్ధి చేసే అదృష్టం వచ్చింది. పదవి ఆశయాన్ని నెర వేరుస్తాడన్న నమ్మకం ఉంది. కష్టపడి పనిచేసే కొడుకు పల్లెప్రజల అభిమానాలు పొందుతాడు. ఏం చేసినా వాడు మంచే చేస్తాడనే నమ్మకం ఉంది. - దేవమ్మ, నారాయణ, భాస్కర్ తల్లిదండ్రులు ఊహించలేదు.. నా భర్త గ్రామానికి తన తండ్రి మాదిరిగా సర్పంచ్ అయి సేవలందించాడు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం ఊహించలేదు. ఇంతపెద్ద పదవి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాలాంటి పల్లెలకు ఆయన సేవలు అందిస్తాడు. - లక్ష్మీదేవి, భాస్కర్ సతీమణి -
గులాబీయింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దూషణలు.. నినాదాలు.. తోపులాటలు.. వెరసి నాటకీయ, ఉద్రిక్త పరిణామాల మధ్య జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 9వ జెడ్పీ చైర్మన్‌గా గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్‌కు ఆ అదృష్టం దక్కింది. గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి కాంగ్రెస్, టీడీపీ సభ్యుల మద్దతుతో పాగావేసింది. అధిక సంఖ్యలో జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఆ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులతో కలిసి జిల్లా పరిషత్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు రెండు ప్రత్యేక వాహనాల్లో జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఎన్నిక నిర్వహించేందుకు 33 మంది సభ్యులు అవసరం కాగా, మొత్తం 37మంది ప్రత్యేక సమావేశానికి హాజరయ్యా రు. ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో టీఆర్ఎస్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యా దవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి స మావేశమందిరానికి వచ్చారు. సభ్యుల హాజ రును లెక్కిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులతో పాటు సమావేశ మందిరంలోకి చేరుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్‌తో వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ సభ్యులతో పాటు కూర్చున్న కాంగ్రెస్ సభ్యులను వారికి నిర్ధేశించిన స్థానాల్లో కూర్చునేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. సభ్యుల హాజరు(కోరం)మాత్రమే తనకు ముఖ్యమని, సభ్యులు ఎక్కడ కూర్చోవాలనేది వారి ఇష్టమని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఎన్నిక నిర్వహణకు సహకరించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నినాదాలు.. దూషణలు కాంగ్రెస్ సభ్యులు కొందరు టీఆర్ఎస్ శిబిరంలోకి చేరడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశమందిరంలో టీఆర్ఎస్ సభ్యులు కూర్చున్న బల్లల వైపునకు దూసుకువెళ్లేందుకు పలుమార్లు యత్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సభ్యులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నిక వాయిదా వేయాలని, పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ సభ్యులను తమ వైపు పంపాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు నినాదాలు, దూషణలతో జెడ్పీహాల్ దద్దరిల్లింది. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు అనూరాధ, కట్ట సరిత కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై దూషణపర్వానికి దిగిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని కలెక్టర్ పలుమార్లు మందలించారు. సభా గౌరవాన్ని కాపాడాలని, సభ్యులు ప్రమాణస్వీకారం చేసి ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని పలుమార్లు సూచించారు. ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి ఎన్నిక ప్రక్రియను నిలిపేయాలని, నిబంధనలు పాటించాలని పట్టుబట్టారు. విప్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్నికను అడ్డుకుంటే బయటకు పంపాల్సి ఉంటుందని కలెక్టర్ పలుమార్లు కాంగ్రెస్ సభ్యులను హెచ్చరించారు. సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్నిక జరగడం ఓ దశలో అసాధ్యమనిపించింది. రెండు గంటలు దాటినా పరిస్థితి సద్దుమణగకపోవడం, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తంచేయడంతో కలెక్టర్ గిరిజాశంకర్ పోలీసుల సాయం కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలను మహబూబ్‌నగర్ డీఎస్పీ మల్లికార్జున్ నేతృత్వంలో బయటకు తరలించే క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాణ స్వీకారం చేయకుండానే కాంగ్రెస్ సభ్యులు హాల్ నుంచి నిష్ర్కమించారు. ఈ క్రమంలో నంది ఎల్లయ్య, డీకే అరుణ, చిన్నారెడ్డి ఎన్నిక ప్రక్రియ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితమివ్వని విప్ జెడ్పీ చైర్మన్ ఎన్నికలో సభ్యులు గోడదాటకుండా ఉండేందుకు కాంగ్రెస్, టీడీపీలు విప్ జారీచేసినా ఫలితం దక్కలేదు. ప్రత్యేక సమావేశానికి సభ్యులు గైర్హాజరు కావాలంటూ టీడీపీ జారీచేసిన విప్‌ను పార్టీ నాయకులు ఎన్పీ వెంకటేశ్ శనివారం ఉదయం కలెక్టర్‌కు అందజేశారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు బి.అరుణ (ఫరూఖ్‌నగర్), కె.కవితమ్మ (ధన్వాడ), ఖగనాథ్‌రెడ్డి(ఇటిక్యాల), నవీన్‌కుమార్‌రెడ్డి (కొత్తూరు), రమేశ్‌గౌడ్(ఖిల్లాఘనపూర్) సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ నుంచి కె.రామకృష్ణారెడ్డి (అచ్చంపేట), బి.లలితమ్మ (కోయిలకొండ), వెంకటమ్మ (దామరగిద్ద), ఎ.వెంకటయ్య (వనపర్తి), వెంకటేశ్వరమ్మ (వడ్డేపల్లి) కూడా టీఆర్ఎస్ శిబిరంలో చేరారు. వీరిలో ఖగనాథ్‌రెడ్డి (కాంగ్రెస్), వెంకటయ్య (టీడీపీ) సమావేశానికి హాజరైనా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 35 మంది సభ్యుల మద్దతుతో గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్ (టీఆర్ఎస్) జెడ్పీచైర్మన్‌గా ఎన్నికయ్యారు. కొత్తూరు జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. -
టీఆర్ఎస్ కన్ను
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సరిపడేంత సంఖ్యాబలం లేకున్నా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ అభ్యర్థిత్వం ప్రధానంగా తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణను రాజకీయంగా ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా అక్కడినుంచి చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. దీంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టే బాధ్యతను కృష్ణమోహన్‌రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు 33మంది జెడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం కాగా, టీఆర్ఎస్ పార్టీ నుంచి 25మంది విజయం సాధించారు. దీంతో టీడీపీ (తొమ్మిది), బీజేపీ (ఇద్దరు) మద్దతు కీలకం కానుంది. ఓ వైపు టీడీపీ, బీజేపీ మద్దతు కోసం ప్రయత్నిస్తూనే కాంగ్రెస్ శిబిరంలోనూ చీలిక కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీ, బీజేపీ సభ్యుల మద్దతు లభిస్తుందనే ఆశతో ఉంది. అయితే సొంత పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను సమన్వయం చేసే వారు లేకపోవడంతో అతి పెద్ద పక్షంగా అవతరించినా అనుకూలంగా మలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీ పక్షాన నలుగురు సభ్యులు విజయం సాధించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మద్దతు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్, టీడీపీ నడుమ రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉండడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. జెడ్పీ పీఠంపై కన్నేసిన టీఆర్ఎస్ సొంత పార్టీ సభ్యులు చేజారకుండా ఉండేందుకు క్యాంపు నిర్వహణపై దృష్టి సారించింది. క్యాంపు నిర్వహణ తీరుపై మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేశారు. జోరుగా బేరసారాలు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లలో ఓ వైపు క్యాంపులు నిర్వహిస్తూనే మరోవైపు అన్ని పార్టీలు బేరసారాలకు తెరలేపాయి. పార్టీలకు అతీతంగా మద్దతు కూడగట్టేందుకు ప్రలోభాలను ఎరగా చూపుతున్నారు. మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులతో పాటు ఎన్నికల వ్యయాన్ని చెల్లిస్తామని చైర్మన్ అభ్యర్థులు ప్రతిపాదిస్తున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా చైర్మన్ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నాయి. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న ఓ కౌన్సిలర్ ఇళ్లస్థలాలు, అభివృద్ధి నిధుల్లో వాటా వంటివి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. మండల పరిషత్ చైర్మన్ పదవి ఆశిస్తున్న నేతలు బెంగళూరు, చెన్నై, తిరుపతి, షిరిడీ వంటి సుదూర ప్రాంతాలకు ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంపులకు తీసుకువెళ్లారు. ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్దీ ప్రలోభాలు, బేరసారాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఉపాధిని మింగేస్తున్న కోతలు
విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో చేతిపనులు చిన్నబోయాయి. వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. పరిశ్రమలూ నష్టాలను చవిచూస్తున్నాయి. చిన్న వ్యాపారస్తుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని, భవిష్యత్‌లో ఇదే విధంగా ఉంటే వ్యాపారాలు మూతపడతాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజూ వేలల్లో నష్టం వ స్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ జనరేటర్ కనెక్షన్, ఇన్వెర్టర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల అదనపు భారంగా పడుతుందని చెబుతున్నారు. లేత్‌మిషన్, వెల్డింగ్, జిరాక్స్, జ్యూస్ సెంటర్లు, నెట్ సెంటర్లు, ల్యాబ్‌లు, ఫ్లెక్సీ సెంటర్లు, కుటీర పరిశ్రమలు, ఫ్యాన్సీ, పాన్ షాపులు, ఐస్‌క్రీం పార్లర్లు వంటి చిన్న చిన్న వ్యాపారాలు విద్యుత్ కోతలతో సతమతమవుతున్నాయి. పూర్తిగా విద్యుత్‌పై ఆధారపడి వ్యాపారాలు చేస్తుండటంతో ఉపాధి కరువై తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులలో సైతం విద్యుత్ కోతతో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ జనరేటర్ కన క్షన్లపైనే ఆధారపడుతున్నారు. - న్యూస్‌లైన్/భీమవరం అర్బన్ రోజుకు రూ.2,500 నష్టం విద్యుత్ కోత వల్ల ప్రతిరోజూ రూ.2,500 నష్టం వస్తోంది. వర్కర్లకు రోజుకు రూ.500 వేతనం ఇస్తున్నాను. కరెంటు లేకపోవడంతో పని ఉన్నా చేసే వీలులేక వారిని ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. ఏ సమయంలో కరెంటు పోతుందో.. వస్తుందో తెలీదు. కనీసం కరెంటు కోత వేళలను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఒప్పుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాం. దీంతో ఆర్డర్ ఇచ్చేవారి నుంచి మాటపడాల్సి వస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. - గడప శ్రీను, వెల్డింగ్ షాపు యజమాని, భీమవరం కూల్‌డ్రింకుల అమ్మకాలు లేవు అసలే వేసవి కావడం వల్ల కూల్డ్రింకులు ఎక్కువగానే తాగుతారు. విద్యుత్ కోతల వల్ల కూల్‌డ్రింక్‌లు చల్లబడటంలేదు. దీంతో కొనుగోలుదారులు తాగేందుకు నిరాకరిస్తున్నారు. కూల్డ్రింకులు, మంచినీరు తదితర పానీయాల అమ్మకాలు తగ్గిపోయి రోజుకు రూ.500 వరకు నష్టం వస్తోంది. కనీసం కోతల సమయాన్ని తగ్గిస్తే కొంతవరకైనా వ్యాపారం ఉంటుంది. అధికారులు విద్యుత్‌ను సరఫరాను మెరుగుపరచాలి. - భాస్కర్, కూల్‌డ్రింక్ షాపు యజమాని అదనపు భారం రోజుకు రూ.2 వేలు విద్యుత్ కోతల కారణంగా క్యాంటీన్లో జనరేటర్‌ను ఉపయోగించక తప్పడం లేదు. లేకపోతే వినియోగదారులు వచ్చే అవకాశంలేదు. జనరేటర్ కోసం డీజిల్ ఖర్చు రోజుకు రూ.2 వేలు వరకు ఉంటుంది. మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వీటితో పాటు జనరేటర్‌కు వినియోగం అదనపు భారంగా మారింది. చిన్న వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కోతలను తగ్గించాలి. - తాళ్లపూడి పరమేశ్వరరావు, గణేష్ క్యాంటీన్ యజమాని, భీమవరం -
గరుడునిపై గోవిందుని వైభవం
చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజన సందోహం మధ్య కల్యాణ వెంకటేశ్వరస్వామి సతీసమేతంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అంతకు ముందు తెల్లవారు జామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి ధూపదీప నిత్య కైంకర్య, పూజాకార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వాహన మండపంలో కొలువుంచి స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. గరుడ వాహన సేవను పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన పుష్ప హారాలు, పచ్చల హారాలు, తిరుమల నుంచి వచ్చిన లక్ష్మీహారాన్ని తొడిగారు. అనంతరం కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి గరుడవాహన మెక్కి వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు ఏర్పాటు చేసిన భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి చెందిన భక్తుడు సుబ్రమణ్యం రూ.12 లక్షల విలువ చేసే గరుడవాహనాన్ని కానుకగా ఇచ్చారు. గరుడ వాహన సేవకు ముందు ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, సూపరింటెండెంట్ ధనంజయ ఉత్సవంలో పాల్గొన్నారు.