చిత్తూరు జిల్లాలో మానసిక వికలాంగురాలైన బాలికపై అత్యాచారం జరిగింది. వివరాలివీ..పలమనేరు మండలం బండమీదిజరా వారి పల్లె గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలైన బాలిక(10) మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన భాస్కర్(30) ఆమెను ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. అదే రోజు రాత్రి బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, భాస్కర్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.