
చిత్తూర్, కేవీబీపురం: ఏడు నెలల గర్భిణిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన గురువారం బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం మండలంలోని అంజూరు దళితవాడకు చెందిన సాయి(24), వినోద్(25) అంజూరు గ్రామం తెలుగుగంగ కాలువ సమీపంలో ఉన్న సొంత పొలాల వద్దకు వెళ్లి తిరిగి గిరిజన కాలనీ వైపు వచ్చారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఏడు నెలల గర్భిణిని గమనించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వినోద్ బయటికి వెళ్లిపోయాడు. సాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు కేకలు పెట్టింది. దీంతో స్థానికంగా ఉన్న కూలీలు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితులు కేవీబీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment