ప్రతీకాత్మక చిత్రం
చిత్తూరు అర్బన్/దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): కన్న కూతురిపైనే లైంగికదాడికి పాల్పడిన తండ్రికి, అతనికి సహకరించిన తల్లికి బతికి ఉన్నంతవరకు జైలు శిక్ష(జీవిత ఖైదు) విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి కథనం మేరకు.. 2018, నవంబర్ 3వ తేదీన పలమనేరుకు చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతుల కుమార్తె(13 ఏళ్ల బాలిక) ఇంట్లో నిద్రిస్తోంది.
చదవండి: ముంబై హోటల్‌లో మోడల్ ఆత్మహత్య.. నేను సంతోషంగా లేనంటూ..
మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇందుకు బాలిక తల్లి సహకరించింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి డీఎస్పీ రామ్‌కుమార్ కేసు నమోదు చేసి కృష్ణమూర్తి, ధనమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై నేరం రుజువుకావడంతో ఇద్దరూ జీవించి ఉన్నంత వరకు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి 20 ఏళ్లు జైలు
కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు తీర్పు చెప్పిందని ఎస్‌ఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. దేవీపట్నం మండలంలో తున్నూరు గ్రామానికి చెందిన ఎ.రాజేశ్వరరెడ్డి తన కూతురు (మైనర్)పై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం గమనించిన ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చోడి వీర్రాఘవ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోక్సో కోర్టు జడ్జి ఎల్. వెంకటేశ్వరరావు సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధించారని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment