Chittoor: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి.. | Boy Molested On Girls In Chittoor District | Sakshi
Sakshi News home page

Chittoor: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి..

Published Wed, Sep 15 2021 7:45 AM | Last Updated on Wed, Sep 15 2021 10:22 AM

Boy Molested On Girls In Chittoor District - Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఒక కామాంధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇందిరమ్మకాలనీలో నిన్నరాత్రి (మంగళవారం) ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో అనిల్‌ కుమార్‌(21) అనే కీచకుడి కళ్లు వారిపై పడ్డాయి. దీంతో వారివద్దకు చేరుకుని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత వారిని మిద్దెపైకి తీసుకెళ్లి తొలుత 9 ఏళ్ల వయసున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మరో ఏడేళ్ల బాలిలకను తొడలమీద కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత 9 ఏళ్ల బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తన అమ్మమ్మ సావిత్రికి చెప్పింది. దీంతో సావిత్రి వెంటనే మిద్దేమీదకు వెళ్లి చూడగా కీచకుడు తన అసభ్య ప్రవర్తను కొనసాగిస్తున్నాడు. కాగా, వెంటనే సావిత్రి దిశయాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కీచకుడు అనిల్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఆలస్యంగా వచ్చి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని స్థానికులు భావిస్తున్నారు.  

చదవండి: చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement