ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కన్సల్టెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ భాస్కర్ అనే కన్సల్టెంట్ దాదాపు 20 మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. కొన్ని నెలలుగా రేపుమాపు అని వాయిదాలు వేస్తూ ఉద్యోగార్ధులను కాలయాపన చేస్తూ వస్తున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాల పేరిట మోసం
Published Fri, Jun 24 2016 2:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement