హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో రేబీస్‌తో చికిత్స పొందుత్ను ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల చింతబండకు చెందిన కొంగరి భాస్కర్(28) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం అతనిపై ఓ వీధి కుక్క దాడిచేసి గాయపరిచింది.అతను వెంటనే చికిత్సల కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లగా టీటీ, ఏఆర్వీ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు.
కుక్క కరిచిన వారికి రేబీస్ సోకకుండా రేబీస్ ఇమ్యునొ గ్లోబులిన్ (రిగ్) ఇంజక్షన్ చేయించుకోవాలనే విషయం తెలియని అతను అలాగే ఉండి పోయాడు.. గత రెండు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్న భాస్కర్‌ను కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అతన్ని పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు ప్రారంభించారు. అక్కడ చికిత్సలు పొందుతున్న అతను బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోధిస్తూ భాస్కర్ మృత దేహాన్ని స్వగ్రాహానికి తీసుకుని వెళ్లిపోయారు.
ఫీవర్ ఆస్పత్రిలో రేబీస్‌తో యువకుడి మృతి
Published Wed, Apr 27 2016 6:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement