హైదరాబాద్ సిటీ: ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ముఠా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి దాదాపు 50 మంది దగ్గర ఒక్కొక్కరితో సుమారు 5 .50 లక్షలు వసూలు చేశారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా తీసుకెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్న ఉదయ్, శేఖర్,రఫీలను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిపైన ఎస్‌ఆర్‌నగర్ , కుషాయిగూడ , కూకట్పల్లి తదితర పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.
శేఖర్(చొప్పదండి ,కరీంనగర్) అనే వ్యక్తి కొంతమందిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్తామని జార్జియా తీసుకెళ్లి అక్కడ వీరి పేర్ల మీద ఐఫోన్లు వాయిదా పద్దతులలో తీసుకున్నాడు. 2 నెలలు అక్కడే ఉండి తిరిగి వచ్చాడు. ఒకవేళ ఆస్ట్రేలియా తీసుకెళ్ల లేకపోతే మీ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి బాండ్ రాసిచ్చాడు. తీరా బాధితులు డబ్బు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండని వారిని బెదిరిస్తున్నారు. డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి..
Published Mon, Jul 10 2017 7:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement