software jobs
-
ఐటీ జాబ్స్.. పిటీ లైఫ్
సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ తరానికి ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్.. మారుతున్న అధునాతన సాంకేతికత, మోడ్రన్ లైఫ్ స్టైల్లో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆశయంతో టెకీలుగా మారుతున్న యువకులెందరో.. ఐదంకెల జీతం, ఐదు రోజులు మాత్రమే పని, సామాజిక హోదా, గుర్తింపు, గౌరవం.. ఇలా ఎన్నెన్నో ఆశలతో అక్షయపాత్ర వంటి సాఫ్ట్వేర్ పల్లకీలోకి అడుగెడుతున్నారు. కానీ.. ఒక్కసారి ఈ రంగంలోకి వచ్చాక వారి జీవన శైలి వారు అనుకున్నట్టుగానే ఉంటుందా..? సామాజికంగా, సౌకర్యాల పరంగా వైరల్ అవుతున్న రీల్స్‌లా ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం ఆ రీల్స్‌కు వచ్చే కామెంట్ల మాదిరిగా మారింది. మానసిక ఒత్తిడి, శారీరక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఆర్భాటాలు..! నాణానికి మరో కోణం వంటి ఈ అవస్థల పరిష్కారానికి నగరంలో వెల్నెస్ సెంటర్లు సైతం వెలుస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేకుండా సాఫ్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ.. మానసికంగా ఒత్తిడి మాత్రం పీక్స్‌లో ఉంటుందని టెకీల మాట. సాఫ్ట్వేర్లు, ఐటీ ఉద్యోగుల దైనందిన జీవితం.. కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్లు, పైప్‌లైన్ ప్రాసెస్, డిప్లాయిమెంట్, అజైల్ ప్రాసెస్, బెంచ్, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర నైపుణ్యాల మధ్య అందమైన దయనీయంగా కొనసాగుతుంది. ఐదు రోజుల పని, వారానికి రెండు రోజులు సెలవులు. ఇంకేం.. హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటాం.. కానీ క్రెడిట్ బిల్లులు, ఈఎంఐ పేమెంట్స్, రీఫండబుల్ అకౌంట్స్ చెక్ చేసుకుని, సెట్ చేసుకునేలోపు సోమవారం వస్తుందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు. ఆఫీసులోనైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐనా, హైబ్రిడ్ ఐనా.. ఒత్తడి మాత్రం తప్పదంటున్నారు గచ్చిబౌలికి చెందిన ఐటీ ప్రొఫేషనల్ గౌతమీ. జాబ్ రాక ముందు ఒక అవస్థ, వచ్చాక దానిని కాపాడుకోవడానికి మరో అవస్థ.. వీటి మధ్య టార్గెట్ రీచ్ కావడానికి, సొల్యూషన్స్ క్లియర్ చేయడానికి ల్యాప్‌ట్యాప్ పైన చేసే యుద్ధం మరో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేస్తుందని యువ సాఫ్ట్వేర్ నరేష్ తెలిపారు. ఇక బెంచ్‌పై ఉన్న వారి పరిస్థితి వివరించడానికి మరో జావా లాంగ్వేజ్ తయారు చేయాలని స్టీఫెన్ మాట. అసహజ జీవనానికి వేదికలుగా.. అందమైన అద్దాల గ్లోబల్ భవనాల్లోని ఈ సాఫ్ట్వేర్ల ఒత్తిడి వారి జీవితాల పైన పెద్ద ప్రభావమే చూపిస్తుందని ఆరోగ్య నిపుణలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వారి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ను విపరీతంగా పెంచుతుంది. విభిన్న ఆరోగ్య సమస్యలకు ఇది మూల కారణమని నిపుణుల మాట. పనివేళల్లో దాదాపుగా కూర్చొనే ఉండటంతో ఉబకాయం, మధుమేహం పక్క సీట్లోనే ఎదురు చూస్తుంది. వెన్ను నొప్పులు, నరాల బలహీనత ఇలా తదితర సమస్యలకు ఈ హైటీ ఒత్తిడి కారణమవుతోంది. దీనికి తోడు నైట్ డ్యూటీలు సహజ జీవన విధానానికి ఆటంకంగా మారిందిన అంతర్జాతీయ ఆరోగ్య సర్వేలు, అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో వీరికి సాంత్వన, సహకారం అందించడానికి విభిన్న రకాల వెల్నెస్ సెంటర్లు ఆవిష్కృతమైతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, అంతర్గత స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మెడిటెషనల్ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. యోగా, మ్యూజిక్, ధ్యానం.. మీరు సాఫట్వేర్ ఉద్యోగా..?! ఐతే మీ కోసమే మా ఈ సెషన్ అంటూ సోషల్ మీడియా యాడ్. ధ్యానం, యోగా సమ్మిళితంగా వినూత్న కోర్స్ అది. ఒత్తిడిమయమైన యువకులకు ఇదో ఉపశమనం. నగర శివార్లలో పచ్చని పారవశ్యంలో ఏర్పాటు చేసిన మరో బైండ్ మ్యాజిక్ సెంటర్. ఇక్కడ వారు నిర్వహించే సైకలాజికల్ సెషన్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఇలాంటి వారికి స్పిర్చువల్ మ్యూజిక్ హీలింగ్ సెంటర్లు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. ఏరోబిక్స్, జుంబా వంటి ఫిట్నెస్ సెంటర్లు సైతం ఈ అవస్థలకు కాసింత చెక్ పెడుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగంలోని అనారోగ్య సమస్యలకు ఎర్గనామిక్స్ అనే ప్రత్యేక మెడికల్ సేవలు సైతం ఉన్నాయి. ఈ మధ్య ఈ సేవలు మరింత ఆదరణ పొందుతున్నాయి. ఎన్షూర్ ఫర్ క్యూర్.. సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగులు అధిక సమయం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే పని చేయాలి. నగరంతో పాటు దేశంలోని ఈ రంగంలో దాదాపు 64 శాతం మంది సెడెంటరీ డెస్క్ జాబ్‌లలో ఉన్నవారే. ఇటీవలి ప్రముఖ అధ్యయనం ప్రకారం ఇలాంటి ఉద్యోగాల వలన ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్లకు పైగా ప్రజలను నడుము నొప్పి ప్రభావితం చేస్తుంది. 25 సంవత్సరాల్లో ఈ పరిస్థితి రెట్టింపు అయ్యింది. శరీరానికి మూలస్థంభమైన వెన్నెముక ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక ఒత్తిడిని, భారాన్ని భరిస్తోంది. ఈ సమస్య అనతికాలంలోనే విభిన్న ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ తరుణంలో సంరక్షణ కోసం ఎన్షూర్ హెల్తీ స్పైన్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఈ అవస్థలు ఎదుర్కొంటున్న వారికి ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్ సెంటర్‌గా సాధారణ, సరళమైన పద్ధతులు రూపొందించాం. కోర్ కండరాలను బలోపేతం చేయడానికి ప్లాంక్స్, బ్రిడ్జెస్ వంటి వంటి వ్యాయామాలు.. ఫ్లెక్సిబుల్, బ్యాలెన్స్ కోసం మైండ్‌ఫుల్ మూవ్మెంట్స్ పద్ధతులు నిర్వహిస్తున్నాం. వెన్నుముక అవస్థలకు ఎర్గోనామిక్ వర్క్స్పేస్తో చెక్ పెట్టవచ్చు. – నరేష్ పగిడిమర్రి, ఎన్షూర్ హెల్తీ స్పైన్ సీఈఓ. -
నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరుల అవసరాలు పెరుగుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని కొన్ని సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2028 నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 45.7 కోట్లకు చేరుతుందని సర్వీస్‌నౌ పరిశోధన సంస్థ అంచనా వేసింది. అందులో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈమేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని అంశాలు పంచుకుంది.దేశంలో 2023 నాటికి మొత్తం శ్రామికశక్తి 42.3 కోట్లుగా ఉంది.2028 నాటికి అది 45.7కోట్లుకు చేరుతుంది.వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు సృష్టించబడుతాయి.ఉపాధి వృద్ధికి చాలామంది రిటైల్ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.వివిధ విభాగాల్లో సుమారు 69.6 లక్షల మంది సిబ్బంది రిటైల్ రంగంలో పనిచేసేందుకు అవసరం అవుతారు.తయారీ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు, విద్యా రంగంలో 8.4 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణలో 8 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత కొలువులకు ఆదరణ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో 1,09,700 మంది సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్లు కావాల్సి ఉంది.48,800 మంది సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజినీర్లు 48,500 మంది అవసరం.వెబ్ డెవలపర్లు, డేటా అనలిస్ట్‌లు, సాఫ్ట్వేర్ టెస్టర్లకు గిరాకీ ఉంది. ఈ విభాగంలో వరుసగా 48,500, 47,800, 45,300 మందికి కొలువులు లభించనున్నాయి.అదనంగా డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్‌లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్లు వంటి హోదాల్లో 42,700 నుంచి 43,300 మందికి అవకాశాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. వచ్చే నెలలోనే పట్టాలపైకి..అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉపాధికి కొదువలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీలకు అవసరమయ్యే సరైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చేరిన సమయం నుంచే పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుని ఆ దిశగా స్కిల్స్ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట టోకరా
గుంటూరు: సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ ‘డెవలప్ ట్రీస్ డీఎస్ఆర్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ ఫేస్బుక్ ద్వారా ప్రచారం హోరెత్తించింది. భారీ వార్షికాదాయం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, బీమా ఇతరత్రా సౌకర్యాలు కలి్పస్తామని నిరుద్యోగులకు ఆ సంస్థ ఎర వేసింది. ఏపీ, తెలంగాణతోపాటు పాండిచ్చేరి, కన్యాకుమారి, బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర నిరుద్యోగులు ఆ ప్రకటనకు ఆకర్షితులయ్యారు.సుమారు 600 మంది రూ.లక్షల్లో డిపాజిట్ చెల్లించి ఉద్యోగాల్లో చేరారు. ఎవరికీ జీతాలు, పీఎఫ్ చెల్లింపులు లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు అమరావతి రోడ్డులో ఆ ప్రైవేట్ కంపెనీని 2021లో స్థాపించారు. ఫేస్బుక్ ద్వారా నిరుద్యోగులను ఆకర్షించారు. దాదాపు 600 మంది చేరగా.. 100 నుంచి 150 మంది గుంటూరులోని కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. పొరుగు రాష్ట్రాల్లో వారు వర్క్‌ఫ్రమ్ హోం చేసే వారున్నారు. భారీగా వసూళ్లు ఆ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసింది. ఆ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి కష్టాలు మొదలయ్యాయి. జీతం అడిగితే ట్రైనింగ్ అంటూ దాటవేసేవారు. గట్టిగా అడిగితే బూతులు తిట్టేవారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడేవారు. 3 నెలల శిక్షణ అనంతరం నెలకు రూ.40 వేల జీతం, వార్షిక ఆదాయం రూ.6 లక్షలు చెల్లిస్తామని చెప్పేవారు. పురందేశ్వరి, పెమ్మసాని బంధువులంటూ.. తమకు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిన్ని వరుస అని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బంధువని నిర్వాహకులు చెప్పుకునేవారు. పోలీస్ ఉన్నతాధికారులు బాగా తెలుసునని, హైదరాబాద్‌లో ఓ రౌడీïÙటర్ పేరు కూడా చెప్పి బెదిరించేవారని బాధిత ఉద్యోగులు తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు గుంటూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని గుంటూరుకు చెందిన షేక్.రసూల్ తెలిపారు.తాము డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కలవగా.. రాజోలు ఎమ్మెల్యేతో మాట్లాడించారని చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యే గళ్లా మాధవికి విన్నవించామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశలేదని బాధితులు సీహెచ్.సాయి (విజయనగరం), జగదీ‹Ù, ఝాన్సీ (శ్రీకాకుళం), హేమంత్, మహేందర్ (తెలంగాణ) వాపోయారు. -
ఐటీలో కోతల కాలం!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగార్థుల కలల ప్రపంచం.. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోం సౌలభ్యం. ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్‌మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు. అన్ని కంపెనీలదీ అదే బాట.. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు https://layoffs.fyi అనే సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల కోత 2024లోనూ కొనసాగుతోంది. 2024లోమే నాటికి 326 కంపెనీలు 98 వేల మందికి కత్తెరవేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. ఇక కొన్ని కంపెనీలైతే నష్టాలను భరించలేక ఏకంగా తమ కార్యకలాపాలను నిలిపేశాయి. డెల్ కంపెనీ గత ఏడాది 13వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వగా, ఈ ఏడాది 6వేల మందిని సాగనంపింది. టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు మెయిల్స్ పంపారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ 1,900 మందికి కోతపెట్టగా, తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిన బైజూస్ 500 మందిని తొలగించింది. ఇంకా యాపిల్, డెల్, సోనీ, సిస్కో, స్విగ్గీ, యూట్యూబ్, గూగుల్, డుయోలింగో కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇన్నొవేషన్ వల్లేనా.. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ (ఎంఎల్), ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని అందరూ భావించారు. వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతోందని లేఆఫ్స్ సంస్థ విశ్లేషించింది. ఇన్నొవేషన్ మూలంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసిన తర్వాతే అడ్జస్ట్మెంట్లో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడతాయని అంటున్నారు. మంచి పర్ఫార్మెన్స్ చూపించినా.. కంపెనీకి క్లయింట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగించేస్తారు. ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ఎంతగా పర్ఫార్మెన్స్ చూపించినా కూడా వారికి అవసరం లేకపోయినా.. బడ్జెట్ లేకపోయినా ఉద్వాసన పలుకుతారు. ఎప్పుడు ఉద్యోగం తొలగిస్తారోనన్న భయంతో ఉద్యోగం చేయాల్సి వస్తోంది. –మౌనిక, సాఫ్ట్వేర్ డెవలపర్, హైదరాబాద్ ఇద్దరి పని ఒక్కరిపైనే.. ఎజైల్ స్క్రమ్ మెథడాలజీ వ్యవస్థతో ఉద్యోగుల పనితీరును ప్రతి రోజూ అంచనా వేస్తుంటారు. ఇచి్చన టార్గెట్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అందుకు కారణాలను పై అధికారులకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండుసార్లు ఇలాగే జరిగితే చెప్పాపెట్టకుండా తొలగించేస్తారు. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఇద్దరి ముగ్గురి పని కూడా ఒకరిపైనే వేసి.. మిగిలిన వారికి పింక్ స్లిప్ ఇస్తున్నారు. ఐటీ రంగం ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు. –పల్లె నరేశ్, ప్రిన్సిపల్ ఇంజనీర్ తప్పని పరిస్థితుల్లోనే.. కాస్త ఇబ్బందికరమే అయినా కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని లే ఆఫ్స్ ప్రకటిస్తుంటాం. ఆర్థిక మాంద్యం ప్రభావాలను తట్టుకోవడం మార్కెట్లో పోటీ, ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. చాలా కంపెనీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది. సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు కూడా నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది. –కీర్తి రెడ్డి, బోల్డ్ ఫ్యూజ్ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకురాలు -
SAP: ఏఐపై ఫోకస్.. 8,000 ఉద్యోగాలకు ఎసరు!
జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏపీ ఎస్ఈ (SAP SE) ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు, కృత్రిమ మేధస్సు(AI)పై దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. దీంతో దాదాపు 8,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. పునర్నిర్మాణ ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవు కార్యక్రమాలు, అంతర్గత రీ-స్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఎస్ఏపీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా 2023 డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నట్లు ఎస్ఏపీ వివరించింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! కంపెనీ నాలుగో త్రైమాసిక ఐఎఫ్ఆర్ఎస్ (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్)యేతర ఆదాయంలో 5 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ఎస్ఏపీ విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్ యూరోలకు (రూ.76 వేల కోట్లు) చేరినట్లు తెలిపింది. అలాగే క్లౌడ్ సేల్స్ 20 శాతం పెరిగి 3.7 బిలియన్ యూరోలకు (రూ.33 వేల కోట్లు) చేరినట్లు వెల్లడించింది. -
తెలంగాణలో కొత్త డిగ్రీలు నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిగ్రీ కోర్సులకు నైపుణ్యం మేళవించి రూపొందించాలని భావిస్తున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది. ఇందులోభాగంగా యూజీసీ చైర్మన్ ఇటీవల పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్‌తో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చర్చించారు. ఆనర్స్ కోర్సులపై ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది. ఓయూలో లైఫ్‌సైన్స్ ఆనర్స్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలనే యోచనలో మండలి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంతవరకు నాలుగేళ్ల కోర్సులను ఇష్టపడతారనే దానిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలున్న కాలేజీల్లో తొలుత ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. డిగ్రీలో ఎంచుకునే ఏదైనా సబ్జెక్టును పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, లోతైన బోధన విధానంతో అమలు చేయడమే ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్, బీకాం ఆనర్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో ఓయూ పరిధిలో లైఫ్‌సైన్స్ కోర్సును ఆనర్స్‌గా తేవాలనే యోచన ఉంది. కొంతకాలంగా దేశ విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. పారిశ్రామిక అనుభవం తప్పనిసరి ఆనర్స్ కోర్సులకు పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. విదేశాల్లో సైతం ఉపాధి లభించేలా నైపుణ్యాలను తీర్చిదిద్దనున్నారు. బీఎస్సీ ఆనర్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు కచ్చితంగా పరిశ్రమల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల కోర్సు తర్వాత నాలుగో ఏట విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థల్లో కోర్సు చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఉపాధికి ఊతం: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు వృత్తి విద్య కోర్సులకు పోటీనిస్తాయి. డిగ్రీతో మంచి ఉద్యోగాలు పొందడమే కాదు... సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని కాలేజీల్లో వీటిని తెచ్చే లక్ష్యంతో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అనువైన కోర్సులు అన్ని దేశాల్లోనూ సాఫ్ట్వేర్ రంగం విస్తరిస్తోంది. ఉపాధి అవకాశాలూ ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు ఇంజనీరింగ్ బాట పడుతున్నారు. అయితే, డిగ్రీతోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేలా కంప్యూటర్ కోర్సులను ఆనర్స్‌గా అందించాలని నిర్ణయించారు. బీఎస్సీ ఆనర్స్ పేరుతో తెచ్చే ఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్‌ను జోడించబోతున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులను తెచ్చే యోచనలో ఉన్నారు. బీఎస్సీ (ఆనర్స్) కోర్సును రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో పరిమితంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కోర్సును ప్రారంభించేలా అనుమతులివ్వాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. ఆనర్స్ కోర్సులో మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇవ్వాలని భావిస్తున్నారు. -
‘మొహం మీద కొట్టినట్లుగా’.. గూగుల్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు!
టెక్ దిగ్గజం గూగుల్ తొలగించిన 12వేల మంది ఉద్యోగుల్లో జెరెమీ జోస్లిన్ ఒకరు. జోస్లిన్ 2003 నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్ధిక మాంద్యం భయాలు, నష్టాల్ని కారణంగా చూపిస్తూ అతడిని తొలగిస్తూ యాజమాన్యం మెయిల్ చేసింది. ఆ మెయిల్‌పై జోస్లిన్ విచారం వ్యక్తం చేస్తూ లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఆ పోస్ట్‌లో ఏముందంటే? నేను గత 20ఏళ్లుగా టెక్కీగా పనిచేస్తున్నాను. గూగుల్ తొలగింపుల్లో నేను కూడా ఉన్నాను. మొహం మీదే కొట్టినట్లుగా యాజమాన్యం నుంచి ఊహించని విధంగా ఇమెయిల్ వచ్చింది. అది చదివి టెక్ జెయింట్‌లో ఇదే నా లాస్ట్ వర్క్ డే అని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటర్‌తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లోని 20 వేల మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియెట్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో గురువారం మంత్రి సమీక్షించారు. గణితం సబ్జెక్టు కలిగి ప్ర భుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో 60 శాతం మార్కు లు పొందిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎంపికైన వారికి ఆన్లైన్లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని, అది పూర్తయ్యాక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలలపా టు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. ఇంటర్న్‌షిప్‌లో నెల కు రూ.10 వేలు ఉపకారవేతనం ఇస్తారని, ఆ తర్వాత రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తిస్థాయి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్‌లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరిపోవడం!
-కంచర్ల యాదగిరిరెడ్డి ♦ ప్రస్తుతం చదివే చదువుకు, చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటోందా? ఏదో ఒక సబ్జెక్ట్‌లో బీటెక్ చదవడం.. ఏ మాత్రం సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోవడం! ఉద్యోగంలో చేరాక తగిన నైపుణ్యం లేక తడబడుతూ భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడం!! ..ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది..? చదివిన చదువుదా, ఉద్యోగాలిస్తున్న కంపెనీలదా అని తరచి చూస్తే.. సమస్య అంతా దశాబ్దాల పాటు నామమాత్రపు మార్పులతో నెట్టుకొస్తున్న విద్యా వ్యవస్థలదే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే.. తరగతులను తిరగేయాలని, సిలబస్‌లో సమూలంగా మార్పులు రావాలని అంటున్నారు ప్రొఫెసర్ సంజయ్‌శర్మ. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన సంజయ్‌శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరుతో ఈ ఏడాది సెపె్టంబర్లో ఓ విధాన పత్రాన్ని విడుదల చేశారు. అంతేకాదు ఉద్యోగార్హతలు, విద్యా (సిలబస్) విధానాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పోరాటమే ప్రారంభించారు. ఉన్నత విద్యకు– ఉద్యోగ నైపుణ్యానికి మధ్య అంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. డిగ్రీ లేదా పీజీ పట్టా చేత పట్టుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం, అక్కడ చేయాల్సిన పనులను సీనియర్లు చెబితే నేర్చుకోవడం, తప్పులు చేస్తూ దిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతోనే సరిపోతోంది. ‘‘ప్రపంచంలో 80శాతం మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి. అందువల్ల అన్నిరంగాల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నంత కాలం పరిశోధనల్లో ముందడుగు ఉండదు’’ అని యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ గతంలో పలు సందర్భాలలో ఎత్తిచూపారు. మధ్యతరగతికి భారమవుతున్న ఉన్నత విద్య ఇప్పుడు ఉన్నత విద్య మునుపటిలా చౌక కాదు. బ్యాంకులిచ్చే రుణాలతో చదువుకున్నవారు అప్పులు తీర్చడంతో జీవితాన్ని మొదలుపెడతారు. అమెరికాలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చు వార్షిక ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతోందని అధ్యక్షుడు బైడెన్ స్వయంగా చెప్పారు. ఈ మధ్యే ఆయన కొన్ని షరతులతో కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు రద్దు చేశారు. అయినా సరే అమెరికాలో ఇప్పుడు విద్యార్థులపై ఉన్న భారం లక్షా డెబై ఐదు వేల కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే సుమారు కోటిన్నర కోట్లు. చాలా దేశాల్లో ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2.5 శాతం వరకూ విద్యకు ఖర్చు పెడుతున్నారు. ఇంతఖర్చు చేస్తున్నా ఉద్యోగాలకు తగ్గట్టుగా విద్యను రూపొందించడంపై దృష్టి పెట్టడం లేదు. దీనితో డిగ్రీ/ పీజీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల్లో చేరేవారికి నైపుణ్యాలు ఉండటం లేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ క్రమంలోనే కంపెనీలు కాలేజీల డిగ్రీలను పక్కనపెట్టేసి ఉద్యోగులకు తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలను తగ్గిస్తున్నాయి. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత అవసరమైన ఉద్యోగాల సంఖ్య 45 శాతం వరకూ తగ్గిపోయినట్టు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఈ సమస్యను గుర్తించడం లేదు. ఎంఐటీ ప్రొఫెసర్ సంజయ్ శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరిట చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సానుకూలతలను కొనసాగిస్తూనే.. ‘న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతి ప్రస్తుత ఉన్నత విద్య విధానంలోని మేలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధితోపాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యావిధానంలోని సావకాశం. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిందే అంటారు సంజయ్ శర్మ. తాము వీటికి మరిన్ని అంశాలను జోడించి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ రంగాలకు ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆయన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ కోసం రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులతోపాటు నిర్మాణాత్మక బోధన అంశాల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ కొత్త విధానంలో ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’ అనేది ఒక అంశం. ప్రస్తుతం తరగతి గదిలో కేవలం ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు (సిలబస్‌కు లోబడి) మాత్రమే ఉంటున్నాయి. మొత్తం కోర్సు అవధిలో 95 శాతం ఈ పాఠాలే. మిగతా ఐదు శాతం కంపెనీల్లో ఇంటర్న్íÙప్లు లేదా ప్రాక్టికల్స్ ఉంటాయి. ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’లో ఏముంటుంది? ఫ్లిప్డ్ క్లాస్రూమ్ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది. పాఠాలన్నీ డిజిటల్ రూపంలో ఉంటాయి. విద్యార్థి తనకు కావాల్సిన టైమ్‌లో వాటిని చూసుకోవచ్చు. వాస్తవంగా తరగతి గదిలో ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతాయి. నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోర్సు కూడా నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో సెమిస్టర్లకు బదులు 11 ట్రైమిస్టర్లు (త్రైమాసికాలు) ఉంటాయి. ఇందులో నాలుగింటిలో పరిశ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థికి అందజేస్తారు. వీటిని కో–ఆప్స్ అని పిలుస్తున్నారు. పరిశోధనశాలలు, మ్యూజియంలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కో–ఆప్స్‌లో భాగంగా ఉంటాయి. కంపెనీల ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు తాత్కాలిక విరామమిచ్చి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం వల్ల విద్యార్థికి చాలా లాభాలు ఉంటాయి. పైగా కోర్సు సమయంలోనే విద్యార్థి కొంత ఆదాయం పొందే అవకాశమూ ఏర్పడుతుంది. కో–ఆప్స్ సమయంలో కంపెనీలు విద్యార్థులకు రెమ్యూనరేషన్ చెల్లిస్తాయి. కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలతో ఉద్యోగార్థులు లభిస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త డిగ్రీలో ఐదారు అంశాలపై క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో అంశానికీ ప్రత్యేకంగా విలువ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో లీనియర్ ఆల్జీబ్రా, కంప్యూటేషన్, మెషీన్ లెర్నింగ్‌లతోపాటు నైతిక విలువలు, సామాజిక శా్రస్తాలు కలగలిపి బోధిస్తారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయకపోయినా.. వారు సాధించిన క్రెడిట్లకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్సుకాలం పూర్తయిపోయినా మిగిలిన క్రెడిట్లను ఎప్పుడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చదువుతూనే.. అప్రెంటిస్‌షిప్.. నిజానికి న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త విద్యావిధానం ఇతర రూపాల్లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ఉదాహరణకు జర్మనీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివేవారు కాలేజీలో సగం సమయం మాత్రమే ఉంటారు. తర్వాత సంబంధిత పరిశ్రమలో వారికి ఒకేషనల్ అప్రెంటిస్íÙప్ పేరుతో శిక్షణ అందిస్తారు. అది పూర్తయిన తరువాతే డిగ్రీ లభిస్తుంది. భారత్ విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో ఈ రకమైన విధానం అమల్లో ఉంది. ఐహెచ్ఎస్ వంటి సంస్థల్లో కోర్సులు చేసేటప్పుడు కోర్సులో గణనీయమైన సమయం హోటల్స్, రెస్టారెంట్లలో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు శర్మ ప్రతిపాదన అమల్లోకి వస్తే చదవడంతో పాటు నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. దేశంలో పది మందిలో ఒకరికే నైపుణ్యాలు భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధమే లేదని చెప్పాలి. ప్రతి పది మంది పట్టభద్రుల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరికి, నలుగురు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లలో ఒకరికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో ఏటా సుమారు కోటీ 30లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెడుతుంటే.. వీరిలో అత్యధికులకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎప్పుడో కాలం చెల్లిననాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐఐటీ ఖరగ్‌పూర్ డీన్ జయంత ముఖోపాధ్యాయ స్పష్టం చేశారు. నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఐక్యరాజ్యసమితి దాదాపు దశాబ్దకాలంగా చెప్తున్నా భారత్‌లో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రమే. 2020 నాటి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక కూడా డేటాసైన్స్, బిగ్ డేటా, మెషీన్ లెరి్నంగ్, ఏఐ, వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ వంటి రేపటి తరం నైపుణ్యాలను ఉద్యోగార్థులకు అందించాలని సూచించడం గమనార్హం. రెండేళ్ల క్రితం విడుదలైన జాతీయ విద్యా విధానం కూడా పిల్లలకు ఆరో తరగతి నుంచే వృత్తి నైపుణ్యాలను అందించాలని.. ఇంటర్న్షిప్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ముందుగానే అందించాలని సిఫార్సు చేసింది. -
పల్లెల్లో సాఫ్ట్వేర్ కొలువులు.. 3.30 లక్షల ప్యాకేజీ
గంగాధరనెల్లూరు: పల్లెల్లోని విద్యావంతులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించడమే స్మార్ట్ డీవీ లక్ష్యమని.. తమ కంపెనీలో 4,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్‌కుమార్ తాళ్ల తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని అగరమంగళంలో ఆయనతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎస్ఆర్ పురం మండలం కొట్టార్లపల్లి వద్ద స్మార్ట్ డీవీ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఎంవోయూ జరిగిందని, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. దీనిలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు డిసెంబర్ 23న పరీక్షలు నిర్వహిస్తామని, తొలి విడతగా 600 మందిని తీసుకుంటామన్నారు. డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న వారూ అర్హులని తెలిపారు. ఎంపికైన ఫస్టియర్ డిప్లొమో, బీకాం, డిగ్రీ చేసిన వారికి రూ.2.70 లక్షలు, బీటెక్ చేసిన వారికి రూ.3.30 లక్షల ప్యాకేజీ ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు!
ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ వివాదం ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు భారీ షాకిచ్చాయి. ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయిన ఫ్రెషర్లకు అపాయిట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకున్నాయి. తాజాగా డెలాయిట్ సంస్థ ఆఫర్లను లెటర్లను ఇప్పట్లో ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభం కలవరానికి గురి చేస్తున్న వేళ.. ఐటీ సంస్థలు ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చాంశనీయమైంది. అయితే ఆర్ధిక సంక్షోభం కాదని, మూన్‌లైటింగ్ కారణమంటూ ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే? ఇటీవల రెండేసి జాబులు చేస్తున్న 300మంది ఉద్యోగుల్ని విప్రో తొలగించింది. ఆ తర్వాత దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులపై ఓ కన్నేశాయి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన ఉద్యోగుల్ని గుర్తించడం, బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించి ఇటీవల ఉద్యోగం పొందిన వారికి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో..వాటిని తిరిగి తీసుకుంటున్నాయి. చదవండి👉 ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు తాజాగా డెలాయిట్.. గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన ఫ్రెషర్లకు ఇవ్వాల్సిన ఆఫర్ లెటర్లను ఇచ్చేందుకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో డెలాయిట్ నిర్ణయంపై ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘క్యాంపస్ ఇంటర్వ్యూల్లో డెలాయిట్‌కు సెలక్ట్ అయ్యాయి. నేను సెలక్ట్ అయ్యానంటూ 2021అక్టోబర్‌లో డెలాయిట్ కన్ఫామ్ చేసింది. అప్పటి నుంచి ఆఫర్ లెటర్ కోసం, జాయిన్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాన్నా’ ఓ ఫ్రెషర్ ఆవేదన ‘క్యాంపస్ ప్లేస్మెంట్లో డెలాయిట్ అసోసియేట్ ఎనలిస్ట్, కన్సల్టింగ్ డిపార్ట్ మెంట్ పొజిషన్లో జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు ఆఫల్ లెటర్ రాలేదు. సంస్థ ఈ ప్రక్రియను ఎందుకు అంత ఆలస్యం చేస్తోంది?’ - ప్రశ్నిస్తున్న ఓ అభ్యర్ధి ‘డెలాయిట్ ఆఫ్లెటర్లు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఫ్రెషర్లు అవమానంగా ఫీలవుతున్నారు. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యం చేసిన తరువాత, నా కుటుంబ సభ్యులు,బంధువులు ఉద్యోగం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నేను వారిని మోసం చేశానని అందరూ అనుకుంటున్నారు’ - ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్ల ఆలస్యం సుమారు 500మందిపై ప్రభావం చూపింది. మాకు టెలిగ్రామ్ గ్రూపు ఉంది. సుమారు 500 మంది ఇందులో భాగం. ఈ ఆలస్యంపై డెలాయిట్ నుండి రిప్లయి కోసం ఎదురు చూస్తున్నాను. - టెలిగ్రామ్ గ్రూప్ సభ్యుడు, డెలాయిట్ ఇచ్చే ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్న ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్లు ఆలస్యం చేయడంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు డెలాయిట్ ప్రతినిధుల్ని సంప్రదించారు. ఆఫర్లెటర్ల గురించి అడగ్గా..‘మేం నియామకాలు,కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆఫర్లెటర్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. అందుకు కొంత సమయం పడుతుంది’ అని రిప్లయి ఇచ్చారు. కాగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, మైండ్ ట్రీతోఎ పాటు అనేక ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇవ్వకపోవడం, వెనక్కి తీసుకున్న ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. చదవండి👉 దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్! -
వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
దేశంలో కరోనా మహ్మమారి కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం (Work from Home) వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని పక్కన పెట్టి కార్యాలయాలకు తిరిగి రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సంస్థలు ఉద్యోగులకు మెయిల్స్ పంపాయి. అయితే యాజమాన్యాలు పంపిన మెయిల్స్‌కు ఉద్యోగులు ఉహించని విధంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ (CIEL HR) జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ప్రకారం.. దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఒత్తిడి చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం వాళ్లు చేస్తున్న ఉద్యోగాల్ని పక్కనపెట్టి .. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్న ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారట. కాగా, వీరిలో ఎక్కువ శాతం వర్కింగ్ మదర్స్ ఉన్నారు. ఇటీవల మూన్‌లైటింగ్ తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. దీంతో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేయాలని సంస్థలు పట్టుబడుతున్నాయి.హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి ఐటి సంస్థలు సైతం వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
బూమ్.. బూమ్ సాఫ్ట్వేర్.. కంప్యూటర్ కోర్సులదే హవా..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ఒకప్పుడు ఎవర్‌గ్రీన్‌గా వెలుగొందిన మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ నేడు ప్రశ్నార్థకమవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ బూమ్‌తో ఇంజినీరింగ్ విద్యలో కంప్యూటర్ కోర్సుల హవా కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి కంప్యూటర్ కోర్సునకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఇదే క్రమంలో కోర్ బ్రాంచ్‌లుగా పేరున్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లకు ఆదరణ తగ్గుతోంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కాలేజీల యాజమాన్యాలు సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తు చేస్తున్నాయి. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే! ఇదే సాక్ష్యం.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 30 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో అన్ని కాలేజీల్లో కలిపి 13,283 సీట్లు భర్తీకి సాంకేతిక విద్యాశాఖ నుంచి అనుమతులు ఉన్నాయి. మూడు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్, అదే విధంగా మేనేజ్మెంట్ కోటాతో కలుపుకొని 9,396 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో కంప్యూటర్స్, దీనికి అనుబంధ కోర్సులకు 95 నుంచి 100 శాతం డిమాండ్ ఉంటే.. మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో 30 శాతం మాత్రమే నిండాయి. ఈ రెండు బ్రాంచ్‌ల్లో ఏడు కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాకపోగా, మరో 13 కాలేజీల్లో పది లోపే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఎందుకిలా.. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం రాజ్యమేలుతోంది. కంప్యూటర్ కోర్సులు చేసిన వారికే వీటిలో అవకాశాలు దక్కుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంప్యూటర్ ఇంజినీర్లదే పైచేయిగా నిలుస్తోంది. కోర్ బ్రాంచ్‌లు చదువుకుని అటువైపు వెళ్లిన విద్యార్థులకు మళ్లీ కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యంపై పరీక్ష పెడుతున్నారు. దీంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లు చాలా మంది ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సి వస్తోంది. కొత్త కంప్యూటర్ కోర్సుల కోసం.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) కోర్సుకు ఉన్న డిమాండ్‌తో దీనికి అనుబంధంగా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిజినెస్ సిస్టమ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, ఐవోటీ, ఆటోమేషన్ ఇలా వివిధ రకాల కోర్సుల కోసమని కాలేజీల నుంచి సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. పూర్వవైభవం తీసుకొచ్చేలా.. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాంకేతిక కోర్సుల నిర్వహణపై కూడా దృష్టి సారించింది. కోర్సు ఏదైనా నైపుణ్యానికి పెద్ద పీట వేసేలా మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడుతున్న కార్యక్రమాలతో నిర్మాణ, పారిశ్రామిక రంగాలు మళ్లీ పుంజుకుంటుండటంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే ఊపును కొనసాగించేలా కోర్ బ్రాంచ్‌లకు కొత్తరూపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నైపుణ్యం అవసరం.. ఉన్నత విద్యలో ఏ కోర్సు ఎంచుకున్నా, దానిలో నైపుణ్యం ఉన్న వారికే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకనే ఉన్నత విద్యలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్స్, సివిల్, మెకానికల్‌లో దేని ప్రాముఖ్యత దానిదే. – డాక్టర్ ఎం. రామిరెడ్డి, రిజిస్ట్రార్, కృష్ణావర్సిటీ అవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ కోర్ బ్రాంచ్‌లైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ఏ రంగమైనా యంత్రాలు లేకుండా ముందుకెలా నడుస్తుంది. ఈ కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌పైనే మక్కవ పెంచుకుంటున్నారు. -డాక్టర్ జ్యోతిలాల్, ఇంజినీరింగ్ అధ్యాపకుడు, నూజివీడు మెకానికల్ మంచిదే.. ఆటోమేషన్ వల్ల ఇంజినీర్లకు పనితగ్గింది. అయినప్పటికీ గుండు సూది నుంచి రైలు ఇంజిన్ వరకు తయారీలో మెకానికల్ ఇంజినీర్ ఉండాల్సిందే. కంప్యూటర్ సైన్స్‌కు ఎంత డిమాండ్ ఉన్నా అన్ని వ్యవస్థలకు ఆధారం మెకానికల్. -వి. ఎలీషా దేవసహాయం, సీనియర్ మెకానికల్ ఇంజినీర్, సాంకేతిక విద్యాశాఖ -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లని కబురు.. ఒత్తిడిని దూరం చేసేందుకు ప్లాన్స్!
సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రాంలతో కుస్తీ పట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోందని.. గతేడాది సుమారు 79 శాతం మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు ఐటీ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్, సెమినార్లు, మోటివేషనల్ తరగతులు నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. నగరంలో చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఐటీ కంపెనీలు 1500 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 80 శాతం కంపెనీలు ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నియామకాల్లోనూ నయా పద్ధతి.. ► గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీల వెల్లువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతోపాటు.. సమీప భవిష్యత్‌లో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించేందుకు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూలు, పదోన్నతులు అన్నీ వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థుల బయోడేటాలను తనిఖీ చేయనున్నారు. ► వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు,వ్యక్తిత్వాన్ని అంచనా వేయనున్నారు. కాగా కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీలు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంటున్నారు. నగరంలోని కంపెనీలు 54 శాతం మందిని,విదేశీ కంపెనీలు 49 శాతం మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు హైసియా వర్గాలు తెలిపాయి. ► ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ), కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌తో పని విధానం సమూలంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. ఏఐ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. (క్లిక్: ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం) -
ఐటీ ఉద్యోగులు:పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్! ఆఫీస్‌కు రాలేం!
దిగ్గజ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరగుతుందని, అదే సమయంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలైనంత సమయం దొరుకుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను తిరస్కరిస్తున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మ్యాప్స్‌కు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయడాన్ని తిరస్కరిస్తున్నారు. సుమారు 200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని, ఆఫీస్‌కు రాలేమని ఖరాకండీగా చెబుతున్నారు. అంతేకాదు ఆఫీస్ టూ రిటర్న్ అంటే ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలను భరించలేమని వాపోతున్నారు. పైగా గూగుల్ తమని (గూగుల్ మ్యాప్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని) ఒకలా, గూగుల్ ఉద్యోగుల్ని మరోలా ట్రీట్ చేస్తుందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్(ఏడబ్ల్యూ)కు దాఖలు చేసిన పిటీషన్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను ఏడబ్ల్యూ యూనియన్ సభ్యులు సైతం సమర్ధిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో కాగ్నింజెంట్కు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గూగుల్ కోసం పని చేస్తున్నారు. ఆయితే ఆ ఉద్యోగుల్ని గూగుల్ ఇంటి వద్ద నుంచి పనిచేయడం ఆపేయాలని, జూన్ 6 నుంచి ఆఫీస్‌కు రావాలని గూగుల్ ఆదేశించింది. దీంతో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు, విజృంభిస్తున్న కరోనాతో పాటు పలు కారణాల్ని ఉదహరిస్తూ వర్క్ ఫ్రమ్ హోంను కొనసాగిస్తామని, ఆఫీస్‌కు రాలేమని ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..గూగుల్‌లో పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులు రీటర్న్ టూ ఆఫీస్ పాలసీని వ్యతిరేకిస్తే గూగుల్ సదరు ఉద్యోగుల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తుందంటూ న్యూయార్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కాగ్నిజెంట్ ఏమంటుందంటే! రిటర్న్ టూ ఆఫీస్ పాలసీ అనేది ఉద్యోగులు, క్లయింట్ రిక్వైర్ మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు భద్రతే మాకు ముఖ్యం. తరువాతే మిగిలిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటాం. అందుకే ఉద్యోగుల్ని కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆఫీస్‌కు రావాలని కోరుతున్నామని కాగ్నిజెంట్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జెఫ్ డెస్మారైస్ తెలిపారు. మాకూ ఉద్యోగుల ఆరోగ్యమే ముఖ్యం! గూగుల్‌కు చెందిన ఉన్నతాధికారిణి కోర్టేనే మాన్సిని మాట్లాడుతూ..మాకు ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ముఖ్యం. కాంట్రాక్ట్ ఉద్యోగులైన సరే వాళ్లకి గూగుల్‌లో తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే సంస్థ ఆఫీస్ రిటర్న్ టూ పాలసీని అమలు చేశాం. సప్లయర్స్ (కాగ్నిజెంట్) ఈ పాలసీని ఎలా అమలు చేయాలో నిర్ణయించుకుంటారని కోర్టేనే మాన్సిని స్పష్టం చేశారు. చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్‌కు రిజైన్ చేశాడు! -
విదేశాల్లోనూ దూసుకెళ్తాం,ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్!
ముంబై: గత రెండేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి (ఐటీ) డిమాండ్ భారీ స్థాయిలోనే ఉందని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయంగా క్లయింట్లు డిజిటల్ వైపు మళ్లడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించగలదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. క్లౌడ్, డిజిటల్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు కొత్త మార్కెట్లలోకి కూడా విస్తరించడంపై హెచ్‌సీఎల్ టెక్ దృష్టి సారిస్తున్నట్లు రోష్నీ తెలిపారు. ‘అయిదేళ్ల తర్వాత చూస్తే మేము మరిన్ని మార్కెట్లలోకి విస్తరిస్తాం. మరింత మంది కస్టమర్లు ఉంటారు. సీఈవో విజయ్‌కుమార్ చెప్పినట్లుగా మేము రెండంకెల స్థాయిలో వృద్ధిని కొనసాగిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ఉత్తర ఆసియా, సెంట్రల్ అమెరికా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో క్లయింట్లతో మాట్లాడినప్పుడు వారు మరింత వేగంగా డిజిటలీకరణను ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తున్నట్లు వెల్లడైందని రోష్నీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 22,597 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 1,102 కోట్ల నుంచి రూ. 3,593 కోట్లకు ఎగిసింది. -
ఏపీ.. ఎంతో హ్యాపీ 'సొంతూళ్లలో సాఫ్ట్వేర్ కంపెనీలు'
సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్లాలి.. అక్కడి సంస్థల్లో ఉద్యోగాలు పొందితే రూ.లక్షల్లో జీతాలు సంపాదించొచ్చు.. అలా కాకుండా మన దేశంలోనే ఉద్యోగం చేయాలంటే ఏ బెంగళూరో, చెన్నై, హైదరాబాద్‌లోనో అయితే చెప్పుకోదగ్గ జీతాలు వస్తాయి.. లేదంటే విశాఖపట్నం లేదా విజయవాడల్లోని కంపెనీల్లో ఉద్యోగం చూసుకోవాలి. కానీ పట్టణాలు, నగరాలే ఎందుకు? సొంతూరిలోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే పోలా.. పుట్టిన ఊళ్లో ఉండొచ్చు. మరికొంత మందికి ఉపాధి కల్పించ వచ్చు. ఈ ఆలోచనతో కొందరు కుర్రాళ్లు ముందడుగేశారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఆ విజయగాథలు మీరే చూడండి. – సాక్షి నెట్వర్క్ సంకల్పం సిద్ధించింది ఏలూరుకు చెందిన రియాజ్ ఆలీఖాన్ హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంసీఏ పూర్తి చేశాక అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పొందారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి వెన్నాడుతూ ఉండేది. తన ప్రాంతానికి ఏమైనా చేయాలనే ఆలోచన మదిని తొలిచేది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఏలూరు చేరుకున్నారు. ముందుగా తాను ఒక్కడే కొంత మంది క్లయింట్లకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తూ వారిని ఆకట్టుకున్నారు. ఆయన పనితీరు నచ్చి అక్కడి నుంచి ఇతర క్లయింట్లు ఆయనకు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో 2012లో 20 మంది ఉద్యోగులతో ‘స్పార్క్ ఐటీ సాఫ్ట్వెబ్ సొల్యూషన్స్’ను ప్రారంభించారు. తొలుత అనుభవ రాహిత్యం వల్ల కొంత నష్టాలను చవి చూసిందా సంస్థ. పట్టుదలతో ముందుకు సాగుతూ 2016లో ‘బిజ్‌రాక్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి తన ఐటీ సేవలను కొనసాగించారు. గత అనుభవ పాఠాలతో తప్పటడుగులూ వేయకుండా సంస్థ నేడు 50 మందికి ఉపాధి కల్పిస్తోంది. విదేశీ క్లయింట్లకు ఐటీ సేవలు ప్రస్తుతం బిజ్‌రాక్ వెబ్ సొల్యూషన్స్ సంస్థ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన క్లయింట్లకు తన సేవలను అందిస్తోంది. ఈ సంస్థ అందించే సేవల్లో వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రధానమైనవి. సంస్థలో పని చేసే ఉద్యోగులకు వారి అర్హత, నైపుణ్యం బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ జీతాలు చెల్లిస్తున్నారు. ఉన్న ఊరిలో అర్హతకు తగ్గ ఉద్యోగం లభించడం, ప్రతిఫలం దక్కుతుండడంతో సంస్థను వీడి వెళ్లే ఆలోచనే రావడం లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. పేదవారిలో కష్టపడే తత్వం పేదవారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అది పేద కుటుంబాల నుంచి వచ్చే మహిళలకు మరికాస్త ఎక్కువగా ఉంటుంది. వారి సాధికారికత కోసం మా సంస్థలో 90 శాతం ఉద్యోగాలు అటువంటి వారికే ఇస్తున్నాం. స్థానికులకే ప్రాధాన్యత. – రియాజ్ ఆలీ ఖాన్, సీఈఓ, బిజ్ రాక్ వెబ్ సొల్యూషన్స్ ఆఫీసే ఒక కుటుంబంలా.. మా నాన్న సుధాకర్ క్యాటరింగ్ చేస్తారు. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడే ఈ సంస్థ గురించి విన్నాను. ఇటువంటి సంస్థలో పని చేయడం నా కల. ఈ ఆఫీసులో అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పని చేస్తారు. – తాళ్లూరి సుమాంజలి, ఉద్యోగి, బిజ్ రాక్ వెబ్ సొల్యూషన్స్ స్థానికంగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం మా నాన్న పౌల్ట్రీ ఫాంలో పని చేస్తారు. బీటెక్ పూర్తయ్యాక ఈ సంస్థలో ఉద్యోగం వచ్చింది. 2016 నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. నా భర్త ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. ఏలూరులోనే ఉద్యోగం చేయటానికి దీన్ని అవకాశంగా భావిస్తున్నా. – ఎన్.తేజస్వి, బిజ్ రాక్ వెబ్ ఉద్యోగి ఉద్యోగుల వద్దకే కంపెనీ కాకినాడ ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవంతో 2015లో హైదరాబాద్ హైటెక్ సిటీలో క్లౌడ్ సీడ్ టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించారు. కోవిడ్ కారణంగా 2019లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పించాల్సి వచ్చింది. ఆ క్రమంలో కంపెనీనే ఉద్యోగుల చెంతకు తీసుకెళితే.. అన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెడుతూ కాకినాడ కార్పొరేషన్‌లోని సిద్ధార్ధనగర్కు ఆ సంస్థ 2019 నవంబర్‌లో తరలి వచ్చింది. ఒక ఉద్యోగితో ప్రారంభమైన సంస్థలో నేడు 50 మంది యువతీ యువకులు పని చేస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాలు మా సంస్థలో కాకినాడ, పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా పని చేస్తున్నారు. ఇద్దరు మాత్రం స్థానికేతరులు ఉన్నారు. బీటెక్, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వారితో పాటు ఇతర డిగ్రీలు చదివిన వారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి జాబ్ ఇస్తున్నాం. విధుల్లోకి ఫ్రెషర్స్‌గా చేరుతున్నందున అనుభవం వచ్చేలా తర్ఫీదు ఇస్తున్నాం. వేతనం రూ.15 వేల నుంచి అనుభవాన్ని బట్టి రూ.1.70 లక్షల వరకు ఉంది. ఎక్కువగా బ్యాంకింగ్ రంగానికి సేవలు అందిస్తున్నాం. 400 మందికి జాబ్ అవకాశం ఉంది. – వి.వి.వి.కిరణ్‌కుమార్, క్లౌడ్ సీడ్ టెక్నాలజీస్ సంస్థ సీటీవో, కాకినాడ ఏడాదిలో రూ.7 వేలు ఇంక్రిమెంటు మాది కాకినాడలోని జగన్నాధపురం. నేను ఎంసీఏ చేశాను. 2021లో కాకినాడలో ఐటీ కంపెనీలో పని చేసేందుకు ఎంపికయ్యాను. ఈ సంస్థలో రూ.15 వేల జీతానికి చేరి, ఏడాదిలో రూ.22 వేల వేతనానికి చేరుకున్నాను. స్థానికంగానే ఐటీ కొలువు రావడంతో మా కుటుంబం సంతోషంగా ఉంది. – కుంచె సాయి సంతోషి, ఐటీ ఉద్యోగి, క్లౌడ్ సీడ్ టెక్నాలజీస్ ఇక్కడా ‘స్మార్ట్’గా ఎదగడమే లక్ష్యం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 14న ఎస్ఆర్ పురం మండలం కొట్టార్లపల్లె సమీపంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసి 3000 మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యం. గ్రూప్ ఛైర్మన్ దీపక్ కుమార్ తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి డీఎస్పీగా రిటైర్ అయ్యారు. తిరుచ్చి ఎన్ఐటీలో గోల్డ్ మెడలిస్ట్ అయిన దీపక్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేసి, 2007లో బెంగళూరులో డివీ గ్రూప్ ఐటీ కంపెనీని ప్రారంభించారు. 2010లో ప్రైవేట్ లిమిటెడ్‌గా, 2015లో మల్టీ నేషనల్ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో తయారయ్యే సెమీ కండక్టర్లను ప్రముఖ కంపెనీల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడతారు. యాపిల్ ఫోన్లు, తోషిబా, శామ్సంగ్ కంపెనీల టీవీలు, సీసీ కెమెరాల్లో ఉపయోగిస్తారు. కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థలకు హార్డ్‌వేర్ సరఫరా చేస్తున్నారు. ఇదీ లక్ష్యం.. ఏడాది లోపు నిర్మాణాలు పూర్తి చేస్తాం. తొమ్మిది అంతస్తుల్లో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేస్తాం. 3 వేల మందికి ఉపాధి కల్పించాలనేదే మా లక్ష్యం. దశల వారీగా ఉపాధి కల్పిస్తూ మూడేళ్లలో వంద శాతం లక్ష్యానికి చేరుకుంటాం. బీటెక్, ఎంసీఏ చేసిన వాళ్లకే కాకుండా డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఉచితంగా శిక్షణ ఇస్తాం. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తాం... – దీపక్‌కుమార్ తల, ఛైర్మన్, స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దూసుకెళ్లడానికి ‘టెక్ బుల్’ సిద్ధం 30 ఏళ్లపాటు దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించిన ఇద్దరు సోదరులు సొంత జిల్లాపై మమకారంతో కంపెనీకి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన నలమలపు బలరామిరెడ్డి, సుశీల దంపతుల కుమారులు అంజిరెడ్డి, విజయ భాస్కరరెడ్డి 1992లో ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీ నెలకొల్పి స్థిరపడ్డారు. ఐటీతో పాటు ఫార్మా, ప్రాపర్టీస్ (రియల్ ఎస్టేట్), ఎనర్జీ రంగాల్లో వందల కోట్ల టర్నోవర్‌తో వ్యాపార పరంగా, పారిశ్రామికంగా ముందుకు సాగుతున్నారు. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఐటీ కంపెనీని స్థాపించి ఉపాధి అవకాశాలను కల్పించారు. ఇప్పటికి 7 దేశాల్లో తన వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించుకుంటూ వస్తున్నారు. 1,200 మంది ఐటీ నిపుణులతో ఇతర దేశాలకు చెందిన పెద్ద పెద్ద ప్రాజెక్టులను తమ వశం చేసుకున్నారు. తమ ప్రాంతంపై మమకారంతో గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్‌ను ఎంచుకున్నారు. రూ.90 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నదే తడవుగా కార్యరూపంలో పెట్టారు. మొదటి ఏడాది వెయ్యి మందికి, ఆ తర్వాత మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో 3,000 పైచిలుకు ఉద్యోగాల మార్కు దాటాలని లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. ఒంగోలు జాతి గిత్తల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి ఐటీ కంపెనీకి ‘టెక్ బుల్’ అని నామకరణం చేశారు. 100 కంపెనీల స్థాపనే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటంతో పాటు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా టెక్ బుల్ కంపెనీని స్థాపించారు. నిరుద్యోగులకు సాంకేతిక, వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై శిక్షణ ఇవ్వటంతో పాటు ఆర్థిక వనరులు అందించేందుకు సీడ్ క్యాపిటల్ కింద రూ.100 కోట్ల ఫండ్ కేటాయించారు. వారితో కంపెనీలు ఏర్పాటు చేయించి ఈక్విటీల రూపంలో ఒప్పందం కుదుర్చుకొని ప్రోత్సహించనున్నారు. తద్వారా 100 కంపెనీలను రూపొందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఒక్కో కంపెనీ 50 మంది చొప్పున కనీసం 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించారు. సంస్థ త్వరలో ప్రారంభం కానుంది. రైతు కుటుంబాలపై ప్రేమతో... మా తల్లిదండ్రులు రైతులు. మమ్మల్ని కష్టపడి చదివించారు. వ్యవసాయంలో ఉన్న కష్టాలు మరే రంగంలో ఉండవు. అలాంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి నైపుణ్యం జోడించి మంచి భవిష్యత్తును ఇవ్వటమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ఇవ్వటమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నాం. – నలమలపు విజయ భాస్కరరెడ్డి, టెక్ బుల్ ఐటీ కంపెనీ స్థాపకులు -
టెక్ మహీంద్రా సంచలన నిర్ణయం, గ్రామీణ విద్యార్ధులకు అదిరిపోయే గుడ్ న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర సంచలన నిర్ణయం తీసుకుంది. టెక్ మహీంద్రాకు చెందిన మేకర్స్ ల్యాబ్ 'మెటా విలేజ్'ను లాంచ్ చేసింది. ఈ ఫ్లాట్ ఫామ్‌తో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి పొందాలనుకునే విద్యార్ధులకు వరంగా మారనుంది. మేకర్స్ ల్యాబ్ డిజైన్ చేసిన ఈ ప్లాట్‌ఫారమ్ లోకల్ లాంగ్వేజ్‌లో కంప్యూటర్లు, కోడింగ్ నేర్చుకునేలా సాయపడనుంది. ఇందులో భాగంగా టెక్ మహీంద్రా మహరాష్ట్రలోని పరాగావ్ గ్రామంలో మెటా విలేజ్‌ను ప్రారంభించింది. ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ మెటా విలేజ్ సాయంతో విద్యార్థులు స్థానిక మాతృ భాషలో కోడింగ్ చేసేలా కోచింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతం పరాగావ్ గ్రామ విద్యార్ధులకు ఆన్లైన్లో కోడింగ్ నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా "మేక్ ఇన్ ఇండియా" పట్ల నిబద్ధతను తెలుపుతూ మెటా విలేజ్ ప్రారంభించాం. తద్వారా అట్టడుగు స్థాయిలో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టున్నాన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేలా టెక్ మహీంద్రా మేకర్స్ ల్యాబ్ ఇప్పటికే విద్యార్ధులకు భారత్ మార్కప్ లాంగ్వేజ్ (బీహెచ్ఏఎంఎల్)ను నేర్పిస్తున్నట్లు మేకర్స్ ల్యాబ్ గ్లోబల్ హెడ్ నిఖిల్ మల్హోత్రా అన్నారు. అవకాశాల వెల్లువ టెక్ మహీంద్రా అందుబాటులోకి తెచ్చిన ఫ్లాట్ ఫామ్‌తో విద్యార్ధులు లోకల్ ల్యాంగేజ్లో కోడింగ్ నేర్చుకోవచ్చు. కోడింగ్ అనేది ఇంగ్లీష్ భాషలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ మేకర్స్ ల్యాబ్ సంస్థ స్థానిక భాషలో కోడింగ్ నేర్చుకునేలా ఈ మెటావిలేజ్ను డెవలప్ చేసింది. ఇందులో లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. స్థానిక భాషల్లో కోడింగ్ నేర్చుకొని ఆన్లైన్లో ఉపాధి పొందవచ్చు. ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందవచ్చు. చదవండి: రండి..రండి.. దయచేయండి! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్! -
జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు!
ముంబై: కరోనా వైరస్ తీవ్రత తగ్గిపోవడం.. సానుకూల ఆర్థిక కార్యకలాపాలు, ఎగుమతులకు డిమాండ్ వెరసి వ్యాపార వృద్ధి అవకాశాల నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఐటీ తో పాటు ఇతర రంగాల్లో కంపెనీలు నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) తాము ఉద్యోగులను నియమించుకోనున్నట్టు 54% కంపెనీలు తెలిపాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలి స్తే 4% అధికమని టీమ్‌లీజ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఏప్రిల్–జూన్ కాలానికి ‘టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీలు రెండంకెల వృద్ధి ని అంచనా వేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకునే ధోరణిలో ఉన్నాయి. 21 రంగాలకు చెందిన 796 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఇందు లో 16 రంగాల్లోని కంపెనీలు నియామకాలకు అను కూలంగా ఉన్నాయి. ఐటీలో 95%, విద్యా సేవల్లో 86%, ఈకామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 81%, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో 78% కంపెనీలు ఉద్యోగ నియామక ప్రణాళికలతో ఉన్నాయి. అగ్రికల్చరల్, ఆగ్రోకెమికల్స్, బీపీవో/ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో నియామకాల ధోరణి బలహీనంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
Good News: కోటికి పైగా ఉద్యోగాలు..ఇక మీదే ఆలస్యం..!
ఐటీ ఉద్యోగం సంపాదిచడం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త. రాబోయే మరికొన్ని సంవత్సరాల్లో దేశీయ ఐటీ ఉద్యోగాల డిమాండ్ 4.5 మిలియన్ల నుంచి 9 -10 మిలియన్ల చేరుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం స్వచ్ఛంద సంస్థ 'అసెంట్ ఈ -కాంక్లేవ్' 6వ ఎడిషన్‌లో నందన్ నిలేకని పాల్గొన్నారు. ఈ సందర్భంగా "అడాప్టివ్ అడ్వాంటేజ్" అనే అంశంపై ప్రసంగించారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ సేవల వినియోగం, పెరుగుతున్న యునికార్న్ సంస్థలు (100కోట్ల వ్యాల్యూ), దిగ్గజ ఐటీ సంస్థలు భారీ ఎత్తున లాభాల్ని గడిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వర్క్ ఫోర్స్ డిమాండ్ 4.5 మిలియన్ల నుంచి 9-10 మిలియన్లకు చేరుకుంటుందని అన్నారు. కరోనా కారణంగా టెక్నాలజీ రంగం అభివృద్ది చెందిందని, దీంతో ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నా లేదంటే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. విద్యా అర్హత, ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఏ టెక్నాలజీ మీద ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకొని ఆ దిశగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిదని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్‌తో సహా నాలుగు ప్రధాన ఐటి సంస్థలు డిజిటల్ ఎక్స్పర్ట్స్ కోసం పెద్దపీఠ వేడయంతో అట్రిషన్ రేట్లు పెరిగాయని నివేదించాయి. మరోవైపు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో వరకు దాదాపు 2.5 లక్షల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లతో ఫ్రెషర్లను నియమించుకునేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిపింది. చదవండి: ఒక్క జాబ్‌కే 5 మంది పోటీ పడుతున్నారు..ఈ రంగాల్లోనే -
మీదే ఆలస్యం..ఐటీ కంపెనీల్లో లక్ష పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్
నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు ప్రకటించాయి. మన దేశంలో ఐటీ సెక్టార్ తో పాటు డిజిటల్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో టీసీఎస్,ఇన్ఫోసిస్,విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,20,000 ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగుల నియామకం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. టీసీఎస్ టీసీఎస్ గత ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాల్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలో మరో 35,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను ఎంపిక తీసుకోన్నట్లు చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 78,000 మందిని నియమించుకున్నట్లు అవుతుందని అన్నారు. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ని ఉద్యోగుల అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 45 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది.ఇక సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో జూన్ చివరినాటికి 13.9 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 20.1 శాతానికి పెరిగింది. విప్రో విప్రోసైతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను ఎంపిక చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో తన రెండవ త్రైమాసిక ఆదాయాల ప్రకటన సందర్భంగా రెట్టింపు స్థాయిలో ఫ్రెషర్ల నియామకాలు చేపట్టినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ థియరీ డెలాపోర్టే తెలిపారు. హెచ్‌సీఎల్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది 20వేల నుంచి 22వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసుకుంది. వచ్చే ఏడాది 30,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని హెచ్‌సీఎల్ తెలిపింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) కాగ్నిజెంట్ సంస్థ భారీ స్థాయి అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సమస్యను ఎదుర్కొంటుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 33శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకొచ్చినట్లు తెలుస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 11.9%, ఇన్ఫోసిస్ 20.1%,విప్రో 20.5శాతం, టెక్ మహీంద్రా 21శాతంతో ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఫ్రెషర్స్‌ను నియమించుకునే పనిలో పడ్డాయి. చదవండి: తాత్కాలిక పనివారికి డిమాండ్ ! -
కోవిడ్ ముందస్తు స్థాయికి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్నాయని జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ఉద్యోగ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘నియామకాలు 2020 ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే జూలైలో ఐటీ టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు 19 శాతం అధికమయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్, ఇంజనీర్ వంటి ఇతర ఐటీ ఉద్యోగాలకు ప్రకటనలు 8–16 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవడం, కోవిడ్ –19 సవాళ్ల చుట్టూ పనిచేయడానికి వ్యాపార సంస్థలు చేసే ప్రయత్నాలు భారతీయ జాబ్ మార్కెట్‌ను రికవరీ వైపు నెట్టా యని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. టెక్ జాబ్స్ జోరు ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ, రిటైల్, ఫుడ్ రంగంలో తిరిగి డిమాం డ్ రావడం వృద్ధిని మరింతగా పెంచడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉందన్నారు. ప్రాధాన్యతలలో మార్పు.. కంపెనీలు, ఉద్యోగార్ధులకు పరిశుభ్రత ప్రధాన ప్రాధాన్యతగా మారింది. హౌజ్కీపర్స్, కేర్‌టేకర్స్, క్లీనర్స్ ఉద్యోగాలు 60 శాతం దూసుకెళ్లాయి. వెటెరినరీ, థెరపీ, పర్సనల్ కేర్, చైల్డ్ కేర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచించే ధోరణి ఇది. అభ్యర్థుల్లో ఆసక్తి విషయంలో విమానయానం 25 శాతం, అకౌంటింగ్ 8, కస్టమర్ రిలేషన్స్ 7, అడ్మిన్ 6 శాతం తగ్గాయి. ఉద్యోగ వృద్ధి వేగవంతం అవుతూనే ఉంది. ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగాలు వెతుకుతున్నారు. కార్మిక మార్కెట్ పునర్ ప్రారంభంతో ముడిపడి ఉన్న రంగాలు ముందంజలో ఉన్నాయి’ అని ఇండీడ్ వివరించింది. ఈ ట్రెండ్ రాబోయే నెలల్లో కొనసాగవచ్చన్న ఆశను కలిగిస్తున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
HCL TECH Bee 2021: ఇంటర్‌తోనే ఐటీ జాబ్
సాఫ్ట్వేర్ జాబ్స్ అనగానే.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా.. ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగ నియామకం లభిస్తుంది. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ఫీజులు, శిక్షణ, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.. టెక్ బీకి అర్హతలు ► హెచ్‌సీఎల్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సును 2020,2021లో పూర్తిచేసి ఉండాలి. ► ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్/బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ► ఇంటర్/10+2లో మార్కులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నిర్దేశించారు. ఐటీ సర్వీసెస్‌కు దరఖాస్తుచేసుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 85శాతానికిపైగా, సీబీఎస్సీ, ఐసీఎస్సీ అభ్యర్థులకు 80శాతానికిపైగా ఉండాలి. అసోసియేట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే..60 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి. ఎంపిక విధానం ► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్ కెరీర్ అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫైనల్ ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు. (యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్.. ఇక్కడ క్లిక్ చేయండి) ఎంపికైతే శిక్షణ ► హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియట్తోనే ఐటీ పరిశ్రమలో చేరేలా ప్రోత్సహించేందుకు రూపొందించారు. ఎంపికైన వారికి లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, నాగపూర్‌ల్లో శిక్షణ కేంద్రాలున్నాయి. ► శిక్షణ ‘ఐటీ సర్వీసెస్, అసోసియేట్’ అని రెండు విభాగాలుగా ఉంటుంది. ► ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐటీ రంగంలో పూర్తిస్థాయి ఉద్యోగాలకు అవసరమైన శిక్షణనిస్తారు ► ఆన్లైన్/ఆఫ్‌లైన్ అసెస్మెంట్లు, చర్చలు, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ వంటివి ఉంటాయి ► ట్రైనింగ్..ఫౌండేషన్,టెక్నాలజీ/డొమైన్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ అని మూడు దశల్లో ఉంటుంది ఫీజు మినహాయింపు ► టెక్ బీ–2021 ప్రోగ్రామ్‌లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్ శిక్షణ ఏడాది కాలం పాటు ఉంటుంది. ఈ ఏడాది కాలానికి ఐటీ సర్వీసెస్‌కు రూ.2 లక్షలు, అసోసియేట్ ట్రైనింగ్‌కు రూ.లక్ష ఫీజుగా చెల్లించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువగా ఉంటే.. వారు బ్యాంక్ నుంచి సాయం పొందవచ్చు. ► శిక్షణలో 90 శాతం,అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన అభ్యర్థులకు నూరు శాతం ప్రోగ్రామ్ ఫీజు నుంచి మినహాయింపు; 85 శాతం నుంచి 90 శాతం స్కోరు చేసినవారికి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తారు. (యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు) ఉద్యోగం–ఉన్నత విద్య ► విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. ► కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం 1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు చెల్లిస్తారు. ► హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. బిట్స్ పిలానీ, శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్‌కు: https://registrations.hcltechbee.com -
అలర్ట్: ఐటీ దిగ్గజ సంస్థల్లో లక్షకు పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
35,000–ఇన్ఫోసిస్ సంస్థ ఈ ఏడాది చేపట్టనున్న నియామకాలు.. 40,000–టీసీఎస్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ చేస్తామని పేర్కొన్న సంఖ్య.. 22,000–హెచ్‌సీఎల్ సంస్థలో ఈ ఏడాది జరగనున్న ఐటీ నియామకాలు. 12,000–విప్రో సాఫ్ట్వేర్ సర్వీసుల్లో భర్తీ చేస్తామని ప్రకటించిన పోస్టుల సంఖ్య... ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ›ఏడాది టాప్ ఐటీ సంస్థల్లోనే లక్షా పదివేల వరకూ కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు, మధ్యతరహా ఐటీ సంస్థలు చేపట్టే నియామకాలను కూడా కలుపుకుంటే.. ఐటీ రంగంలో ఈ సంవత్సరం 1.6 లక్షల నుంచి 2 లక్షల వరకు కొత్త కొలువులు స్వాగతం పలికే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ తదితర ఐటీ సంస్థల్లో నియామక ప్రక్రియ.. విజయం సాధించేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. టీసీఎస్.. టెక్నికల్ టు పర్సనల్ ► అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). ఈ ఐటీ కంపెనీ.. టెక్నికల్ నైపుణ్యాలు మొదలు సాఫ్ట్ స్కిల్స్ వరకూ.. అన్నింటినీ పరిశీలించేలా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. ► టీసీఎస్ ఎంపిక ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయి. అవి.. అప్టిట్యూడ్ టెస్ట్; టెక్నికల్ ఇంటర్వ్యూ; మేనేజీరియల్ ఇంటర్వ్యూ; హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎఫిషియన్సీ,కోడింగ్ టెస్ట్, ఈ–మెయిల్ రైటింగ్ తదితర అంశాలుంటాయి. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో రౌండ్.. టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ► టెక్నికల్ ఇంటర్వ్యూలో.. అభ్యర్థులు తమ రెజ్యుమేలో పేర్కొన్న అకడమిక్ నైపుణ్యాలు, చేపట్టిన ప్రాజెక్ట్ వర్క్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ టెక్నికల్ ఇంటర్వ్యూ టీంను మెప్పిస్తే తదుపరి దశలో మేనేజీరియల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► మేనేజీరియల్ ఇంటర్వ్యూలో.. అభ్యర్థుల మానసిక సంసిద్ధత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. చివరిగా హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ రౌండ్లో.. భవిష్యత్తు లక్ష్యాలు, కుటుంబ, వ్యక్తిగత నేపథ్యాలపై హెచ్ఆర్ ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతారు. వీటన్నింటికీ అభ్యర్థులు సంతృప్తికరంగా సమాధానాలిస్తే ఆఫర్ ఖరారైనట్లే! ► ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్: టీసీఎస్ క్యాంపస్ నియామకాలతోపాటు ఆఫ్–క్యాంపస్ డ్రైవ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్(ఎన్‌క్యూటీ) పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. ఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఎన్‌క్యూటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు.. తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే కొలువు ఖాయం అవుతుంది. వీరికి కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్(సీబీఓ), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ), లైఫ్ సైన్సెస్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చి.. విధులు కేటాయిస్తారు. ఇన్ఫోసిస్.. ఇలా ► ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ నియామకం కోసం మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అవి.. అప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధిస్తే.. టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలో..ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, కోడింగ్ స్కిల్స్, లేటెస్ట్ టెక్నాలజీస్‌పై అవగాహనను పరిశీలిస్తారు. ఇందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా.. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలో..వ్యక్తిగత సామర్థ్యాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రశ్నలు అడుగుతారు. ► అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలతో హెచ్ఆర్ ప్రతినిధులు సంతృప్తి చెందితే.. సదరు అభ్యర్థులకు ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ తేదీ ఖరారు చేస్తారు. హెచ్‌సీఎల్.. నాలుగు రౌండ్లు ► హెచ్‌సీఎల్ ఎంపిక ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయి. అవి.. అప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ ఇంటర్వ్యూ,హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. ప్రధానంగా అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, టెక్నికల్ అప్టిట్యూడ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధిస్తే.. రెండో రౌండ్లో గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్లో ఏదైనా సామాజిక, సాంకేతిక ప్రాధాన్యం కలిగిన అంశాలను ఇచ్చి.. వాటిపై చర్చించాలని పేర్కొంటారు. ఇందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వారిని టెక్నికల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► టెక్నికల్ ఇంటర్వ్యూలో.. కోడింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో విజయం సాధిస్తే చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ► హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యంపై ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు మీ గురించి చెప్పండి.. హెచ్‌సీఎల్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. వంటి ప్రశ్నలు అడుగుతారు. హెచ్ఆర్ రౌండ్లోనూ నెగ్గితే ఆఫర్ సొంతమైనట్లే! విప్రో.. మూడు దశలు ► విప్రో.. ఐటీ నియామకాలకు మూడంచెల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. అవి..అప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. అనలిటికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, టెక్నికల్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. టెక్నికల్ అండ్ లాజికల్ రీజనింగ్‌లో.. పజిల్స్, కోడింగ్‌కు సంబంధించిన చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధించిన వారిని టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ► టెక్నికల్ ఇంటర్వ్యూలో..అభ్యర్థుల ప్రోగ్రామింగ్ లాంగ్వే జ్ స్కిల్స్, కోడింగ్ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్నిసార్లు రాత పరీక్ష కూడా నిర్వహించే అవకాశముంది. అప్పటికప్పుడు ఏదైనా అంశాన్ని పేర్కొని దానిపై కోడింగ్ రాయమంటారు. ఈ టెక్నికల్ రౌండ్లో చూపిన ప్రతిభ ఆధారంగా హెచ్ఆర్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► హెచ్ఆర్ ఇంటర్వ్యూలో.. భవిష్యత్తు లక్ష్యాలు.. అకడమిక్‌గా సాధించిన విజయాలు.. తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ► హెచ్ఆర్ రౌండ్లోనూ విజయం సాధిస్తే విప్రో కొలువు ఖరారైనట్లే! సంస్థ ఏదైనా.. కోరుకునే లక్షణాలివే ► సాఫ్ట్వేర్ సంస్థలు.. నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి ప్రధానంగా కొన్ని లక్షణాలను ఆశిస్తున్నాయి. అవి.. టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్, పీపుల్ స్కిల్స్. ► టెక్నికల్ స్కిల్స్‌లో భాగంగా.. ప్రధానంగా కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నైపుణ్యాలపై సంస్థలు ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. ఇవి ఉన్న వారికే నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► అభ్యర్థులు సమస్యల పట్ల స్పందించే తీరు, సానుకూల దృక్పథం, సంస్థలో దీర్ఘ కాలం పని చేసేందుకు సంసిద్ధత వంటి వాటి ఆధారంగా తుది ఎంపిక చేస్తున్నారు. -
భార్య ఫోన్ హ్యాక్ చేసిన భర్త.. భార్య ఏం చేసిందంటే..!
చైత్ర (పేరు మార్చడమైనది), వర్ధన్(పేరు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లై ఎనిమిదేళ్లు. ఇద్దరి జీతాలు నెలకు చెరో లక్ష రూపాయలకు పైనే. ఆరేళ్ల కూతురు. చింతల్లేని చిన్నకుటుంబం. అర్ధరాత్రి దాటింది. ల్యాప్‌ట్యాప్ మూసేసి బెడ్ మీద వాలింది చైత్ర. నోటిఫికేషన్ ఏదో వచ్చినట్టు ఫోన్లో ‘బీప్’ మని సౌండ్ వచ్చింది. ఫోన్ చేతిలోకి తీసుకుంది చైత్ర. మెసేజ్ చూడగానే పెదాల మీదకు యధాలాపంగా నవ్వు వచ్చింది. ఆ పక్కనే ఉన్న వర్ధన్ కూడా ఫోన్లోనే ఉన్నాడు. చైత్రను ఒకసారి చూసి, లైట్ ఆఫ్ చేసి, తన ఫోన్ పక్కన పెట్టి, పడుకున్నాడు. చైత్ర మరో అరగంట వరకు ఉండి తనూ పడుకుంది. ఏడాది క్రితం వరకు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లేవారు. లాక్డౌన్ పుణ్యమా అని వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా ఇద్దరూ ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు. ఓ రోజు చైత్ర ఇంటి నుంచి బయటకు వచ్చేసి, విడాకులు ఫైల్ చేసింది. ఇరువైపు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకునే స్థితి లేదు. ఇద్దరి ఒంటిమీద గాయాల తాలూకు మచ్చలు ఉన్నాయి. ఆరేళ్ల వారి కూతురు బిక్కుబిక్కుమంటూ తల్లితండ్రిని చూస్తూ ఉండిపోయింది. ఏమైందంటే.. భార్యాభర్త ఇద్దరూ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంటి పనులు చేయడంలో వాటాలు వేసుకున్నారు. నువ్వంటే.. నువ్వంటూ .. ఇద్దరి ఇగోస్ దెబ్బతిన్నాయి. కొన్ని రోజుల వరకు భరించిన చైత్రకు వర్ధన్ అంటే అసహనం మొదలైంది. ఓ రోజు తన కొలీగ్ నుంచి ఓదార్పు మెసేజ్‌తో చైత్రకు పోగొట్టుకున్న పెన్నిధి దొరికినట్టయ్యింది. సాధారణంగా మొదలైన మెసేజ్.. రెగ్యులర్‌గా చాట్ చేయడం వరకు వెళ్లింది. భార్య అస్తమానం ఫోన్‌తో ఉండటం గమనించిన వర్ధన్ ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్లో ఓ సాఫ్ట్‌వేర్‌ని ఇన్స్టాల్ చేశాడు. ఆమెకు వచ్చిన మెసేజ్‌లు, ఆమె వాడిన డేటా, రోజు మొత్తం ఎన్ని గంటలు ఫోన్లో ఉంటుందనే వివరాలన్నీ తను గమనించడం మొదలుపెట్టాడు. చైత్ర కూడా భర్త తనతో సరిగా లేకపోవడంతో చిన్న అనుమానం మొదలైంది. సాఫ్ట్వేర్ కావడంతో భర్త ఫోన్లో అతనికి తెలియకుండా అతని డేటాను తన ఫోన్లో చూసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకుంది. చిన్న డౌట్‌తో మొదలై ఒకరి ఫోన్లను ఇంకొకరు హ్యాక్ చేసుకునేంతవరకు వెళ్లారు. ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి విపరీతమైన అనుమానం తలెత్తింది. ఫలితంగా గొడవలు. ఓ రోజు ఇద్దరూ కొట్టుకోవడంతో విషయం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. అటు నుంచి విడాకులకు దారితీసింది. స్మార్ట్‌గా.. విచ్ఛిన్నం అవుతున్న జీవితాలు సైబర్ సేఫ్టీ వింగ్ వారు ఒకరినొకరు చేసుకున్న ఫోన్ హ్యాకింగ్ గుర్తించి, అసలు విషయం తెలుసుకున్నారు. ‘ఒక ఇంటి కప్పు కింద ఉన్నవాళ్లైనా తమ వాళ్లను చేసే సాఫ్ట్ మోసం కూడా జీవితాలను చెల్లాచెదురు చేస్తుంది. కోవిడ్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండే స్థితి. ఫలితంగా గృహహింస కేసులు 27 శాతం పెరిగాయి. అదే ఐటి కమ్యూనిటీలలో ఉన్నవారి కేసులయితే 28 శాతం ఉన్నాయి’ అంటూ వివరించారు సైబర్ సేఫ్టీ నిర్వాహకులు అనీల్ రాచమల్ల. స్మార్ట్‌గా ఉంటే సరిపోదు స్మార్ట్ ఫోన్ వాడకం పట్ల అవగాహన పెంచుకుంటే జీవితాలు దిద్దుకోవచ్చని చెబుతున్నారు. బానిసలవడమే అసలు కారణం స్మార్ట్ ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ వాడకంతో ఐటీ కమ్యూనిటీలో కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయి. తమ భాగస్వాముల ఫొటోలు తీసి షేర్, ట్యాగ్ చేయడం చేస్తుంటారు. ఆన్లైన్ అవమానం అంటూ ఓ కొత్త తరానికి తెరతీస్తున్నారు. భర్త లేదా భార్య తనని పట్టించుకోవడం లేదని బాధపడుతూ బయటివారితో చాటింగ్ చేస్తూ ‘సో బ్యూటిఫుల్, గార్జియస్, అమేజింగ్’ అంటూ మెచ్చుకునే పదాలకు పొంగిపోతుంటారు కొందరు. స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ వల్లే డైవోర్స్ రేట్ పెరుగుతోందని మా నివేదికల్లో తేలింది. స్క్రీన్ టైమ్.. గ్రీన్ టైమ్ లెక్కింపు ఫోన్ స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటున్నాం. పచ్చదనంలో ఎంతసేపు ఉంటున్నాం.. అనేది కూడా గ్రహించాలి. ఈ నిబంధన పెట్టుకోవడం వల్ల ఫోన్లో గడిపే సమయం తగ్గుతుంది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే విషయాలపట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. బంధాలు విచ్ఛిన్నం చేసుకునేంతగా, మన ప్రవర్తన–అలవాట్లు మారేంతగా స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నామా అనేది కూడా గ్రహింపులోకి తెచ్చుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లకూడదు. ఒక టైమ్ పరిధి దాటగానే నోటిఫికేషన్ని బ్లాక్ చేసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో నిజం చెప్పినా ‘ఈజ్ ఇట్ ట్రూ’ అని అడుగుతుంటారు. ఒక అబద్ధంలో బతికేస్తున్నామనే విషయం సోషల్ మీడియా వల్ల మనకు అర్థమవుతూనే ఉంది. అందుకే, మన ప్రైవసీని కాపాడుకుంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఇంటర్నెట్ వాల్యూస్, డిజిటల్ వెల్నెస్ గురించి మరింత తెలుసుకోవడానికి సైబర్ టాక్‌ను సంప్రదించవచ్చు. – అనీల్ రాచమల్ల, ఎండ్ నౌ ఫౌండేషన్, సైబర్ సేఫ్టీ, హైదరాబాద్