గుంటూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వాకం
రోడ్డునపడ్డ వందలాది మంది ఉద్యోగులు
ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ బాధితులు
గుంటూరు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటూ ‘డెవలప్ ట్రీస్ డీఎస్‌ఆర్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం హోరెత్తించింది. భారీ వార్షికాదాయం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, బీమా ఇతరత్రా సౌకర్యాలు కలి్పస్తామని నిరుద్యోగులకు ఆ సంస్థ ఎర వేసింది. ఏపీ, తెలంగాణతోపాటు పాండిచ్చేరి, కన్యాకుమారి, బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర నిరుద్యోగులు ఆ ప్రకటనకు ఆకర్షితులయ్యారు.
సుమారు 600 మంది రూ.లక్షల్లో డిపాజిట్ చెల్లించి ఉద్యోగాల్లో చేరారు. ఎవరికీ జీతాలు, పీఎఫ్ చెల్లింపులు లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు అమరావతి రోడ్డులో ఆ ప్రైవేట్ కంపెనీని 2021లో స్థాపించారు. ఫేస్‌బుక్ ద్వారా నిరుద్యోగులను ఆకర్షించారు. దాదాపు 600 మంది చేరగా.. 100 నుంచి 150 మంది గుంటూరులోని కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. పొరుగు రాష్ట్రాల్లో వారు వర్క్‌ఫ్రమ్ హోం చేసే వారున్నారు.
భారీగా వసూళ్లు
ఆ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసింది. ఆ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి కష్టాలు మొదలయ్యాయి. జీతం అడిగితే ట్రైనింగ్ అంటూ దాటవేసేవారు. గట్టిగా అడిగితే బూతులు తిట్టేవారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడేవారు. 3 నెలల శిక్షణ అనంతరం నెలకు రూ.40 వేల జీతం, వార్షిక ఆదాయం రూ.6 లక్షలు చెల్లిస్తామని చెప్పేవారు.
పురందేశ్వరి, పెమ్మసాని బంధువులంటూ..
తమకు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిన్ని వరుస అని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బంధువని నిర్వాహకులు చెప్పుకునేవారు. పోలీస్ ఉన్నతాధికారులు బాగా తెలుసునని, హైదరాబాద్‌లో ఓ రౌడీïÙటర్ పేరు కూడా చెప్పి బెదిరించేవారని బాధిత ఉద్యోగులు తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు గుంటూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని గుంటూరుకు చెందిన షేక్.రసూల్ తెలిపారు.
తాము డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కలవగా.. రాజోలు ఎమ్మెల్యేతో మాట్లాడించారని చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యే గళ్లా మాధవికి విన్నవించామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశలేదని బాధితులు సీహెచ్.సాయి (విజయనగరం), జగదీ‹Ù, ఝాన్సీ (శ్రీకాకుళం), హేమంత్, మహేందర్ (తెలంగాణ) వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment