SAP: ఏఐపై ఫోకస్‌.. 8,000 ఉద్యోగాలకు ఎసరు! | SAP reveals Restructuring Plan Affecting 8000 Jobs | Sakshi
Sakshi News home page

SAP Restructuring Plan: ఏఐపై ఫోకస్‌.. 8,000 ఉద్యోగాలకు ఎసరు!

Published Wed, Jan 24 2024 9:12 AM | Last Updated on Thu, Jan 25 2024 2:12 PM

SAP reveals Restructuring Plan Affecting 8000 Jobs - Sakshi

జర్మన్‌ మల్టీనేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎస్‌ఏపీ ఎస్‌ఈ (SAP SE) ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు, కృత్రిమ మేధస్సు(AI)పై దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. దీంతో దాదాపు 8,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు.

పునర్నిర్మాణ ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవు కార్యక్రమాలు,  అంతర్గత రీ-స్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఎస్‌ఏపీ ఒక ప్రకటనలో తెలిపింది.  కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ​కాగా 2023 డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నట్లు ఎస్‌ఏపీ వివరించింది.

ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్‌ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు!

కంపెనీ నాలుగో త్రైమాసిక ఐఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ స్టాండర్డ్స్‌)యేతర ఆదాయంలో 5 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ఎస్‌ఏపీ విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్‌ యూరోలకు (రూ.76 వేల కోట్లు) చేరినట్లు తెలిపింది. అలాగే క్లౌడ్‌ సేల్స్‌ 20 శాతం పెరిగి 3.7 బిలియన్‌ యూరోలకు (రూ.33 వేల కోట్లు) చేరినట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement