ప్రముఖ టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర సంచలన నిర్ణయం తీసుకుంది. టెక్ మహీంద్రాకు చెందిన మేకర్స్ ల్యాబ్ 'మెటా విలేజ్'ను లాంచ్ చేసింది. ఈ ఫ్లాట్ ఫామ్‌తో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి పొందాలనుకునే విద్యార్ధులకు వరంగా మారనుంది.
మేకర్స్ ల్యాబ్ డిజైన్ చేసిన ఈ ప్లాట్‌ఫారమ్ లోకల్ లాంగ్వేజ్‌లో కంప్యూటర్‌లు, కోడింగ్ నేర్చుకునేలా సాయపడనుంది. ఇందులో భాగంగా టెక్ మహీంద్రా మహరాష్ట్రలోని పరాగావ్ గ్రామంలో మెటా విలేజ్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్ మెటా విలేజ్ సాయంతో విద్యార్థులు స్థానిక మాతృ భాషలో కోడింగ్ చేసేలా కోచింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతం పరాగావ్ గ్రామ విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో కోడింగ్ నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా టెక్ మహీంద్రా "మేక్ ఇన్ ఇండియా" పట్ల నిబద్ధతను తెలుపుతూ మెటా విలేజ్ ప్రారంభించాం. తద్వారా అట్టడుగు స్థాయిలో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టున్నాన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేలా టెక్ మహీంద్రా మేకర్స్ ల్యాబ్ ఇప్పటికే విద్యార్ధులకు భారత్ మార్కప్ లాంగ్వేజ్ (బీహెచ్‌ఏఎంఎల్)ను నేర‍్పిస్తున్నట్లు మేకర్స్ ల్యాబ్ గ్లోబల్ హెడ్ నిఖిల్ మల్హోత్రా అన్నారు.
అవకాశాల వెల్లువ
టెక్ మహీంద్రా అందుబాటులోకి తెచ్చిన ఫ్లాట్ ఫామ్‌తో విద్యార్ధులు లోకల్ ల్యాంగేజ్‌లో కోడింగ్ నేర్చుకోవచ్చు. కోడింగ్ అనేది ఇంగ్లీష్ భాషలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ మేకర్స్ ల్యాబ్ సంస్థ స్థానిక భాషలో కోడింగ్ నేర్చుకునేలా ఈ మెటావిలేజ్‌ను డెవలప్ చేసింది. ఇందులో లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. స్థానిక భాషల్లో కోడింగ్ నేర్చుకొని ఆన్‌లైన్‌లో ఉపాధి పొందవచ్చు. ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందవచ్చు.
చదవండి: రండి..రండి.. దయచేయండి! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
Comments
Please login to add a commentAdd a comment