coding skills
-
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్‌లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
కోడింగ్ పోటీల్లో 67,000 మందిని ఓడించి.. మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీ ఆఫర్‌తో!
ముస్కాన్ అగర్వాల్! ఐఐఐటీ-యునలో రికార్డ్ సృష్టించింది. ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ప్రముఖ టెక్ దిగ్గజం లింక్డిన్లో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా లింక్డిన్ విధులు నిర్వహిస్తుంది. ఇందులో ఈమె ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ కొలువంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి. అలాంటి కోడింగ్‌లో ఈమె దిట్ట. గత ఏడాది అగర్వాల్ ‘టెక్ గిగ్ గీక్ గాడెస్ 2022’ కోడింగ్ పోటీల్లో పాల్గొన్న 67,000 కంటే ఎక్కువ మంది మహిళా కోడర్లను ఓడించింది. విజేతగా నిలిచి దేశంలోనే ‘టాప్ ఉమెన్ కోడర్’గా నిలిచారు. టెక్‌గిగ్ గీక్ గాడెస్ఈవెంట్లో ఫైనలిస్టులు ప్రోగ్రామింగ్ సొల్యూషన్ల కోసం నాలుగు గంటల పాటు కోడ్లను రాసింది. ఫలితంగా ఆమె రూ.1.5 లక్షలు బహుమతి సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లింక్డిన్లో మెంటార్షిప్ అంతేకాదు ముస్కాన్ అగర్వాల్లింక్డిన్లో మెంటార్షిప్కు ఎంపికయ్యారు. ఎంపికైన 40 మంది మహిళల్లో ఆమె కూడా ఒకరు. ఈ మెంటార్ షిప్లో లింక్డిన్ నిపుణులు ఆయా విభాగాల్లో మెంటర్ షిప్‌కు సెలక్ట్ అయిన వారికి తగిన సలహాలు అందిస్తారు. ప్యాకేజీలే.. ప్యాకేజీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే గ్రాడ్యుయేట్ 2022-23 బ్యాచ్ నుండి వార్షిక ప్లేస్మెంట్లలో సంవత్సరానికి రూ. 3.67 కోట్ల జీతంతో అంతర్జాతీయ కంపెనీల్లో జాబ్ ఆఫర్ దక్కించుకున్నారు. దేశీయ ప్లేస్మెంట్లో ఓ విద్యార్ధి అత్యధికంగా ఏడాదికి రూ.1.68కోట్ల ప్యాకేజీని పొందాడు.16 మంది గ్రాడ్యుయేట్లు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనాలతో ఉద్యోగ ఆఫర్లను అంగీకరించగా, 2022-23 ప్లేస్మెంట్ సీజన్లో 65 మంది విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయి. అమెరికా, జపాన్, యూకే , నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్‌లలోని వివిధ కంపెనీల్లో ఎంపికైన విద్యార్ధులు విధులు నిర్వహించనున్నారు. -
ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత
సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 20 ఏళ్ల అస్మీ జైన్ ప్రఖ్యాత యాపిల్ WWDC23 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌ని గెల్చుకుంది. స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అద్భుతమైన ఒరిజినల్ యాప్‌ను రూపొందించనందుకుగాను ఈ ఘనతను దక్కించుకుంది. అస్మి జైన్‌తో పాటు, ఈ ఏడాది స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలలో మార్టా మిచెల్ కాలియెండో , యెమి అజెసిన్ కూడా ఉన్నారు. వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో (ఈసంవత్సరం జూన్ 5న)కి ముందు, యాపిల్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ ప్లేగ్రౌండ్ చాలెంజ్‌ను నిర్వహిస్తుంది. గ్లోబల్ యాపిల్ డెవలపర్ కమ్యూనిటీకి WWDC23 ఈవెంట్‌ను వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఛాలెంజ్ విజేతలకు కూడా అనుమతి ఉంటుంది. బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న తన స్నేహితురాలి మేనమామకు సహాయం చేసేలా యాప్‌ను రూపొందించి ఈ అవార్డును దక్కించుకుంది. బ్రెయిన్ సర్జరీ కారణంగా కంటి అంగ వైకల్యంతో పాటు ముఖం పక్షవాతానికి గురైంది. దీంతో ఇండోర్‌లోని మెడి-క్యాప్స్ యూనివర్శిటీకి చెందిన జైన్ రంగంలోకి దిగింది. స్క్రీన్ చుట్టూ కదులుతున్న బంతిని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్న యూజర్కంటి కదలికలను ట్రాక్ చేయడానికి యాప్ ప్లేగ్రౌండ్ని డిజైన్ చేసింది. దీని ప్రాథమిక ఉద్దేశ్యం కంటి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటం. అయితే వివిధ రకాల కంటి పరిస్థితులు, గాయాలైన సందర్భాల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చని జైన్ భావిస్తోంది. ఇది ప్రభావవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడడమే తన తదుపరి లక్ష్యం అని కూడా చెప్పింది. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు) హెల్త్ చాలెంజెస్ ఎదుర్కొనేలా కోడింగ్‌ని ఉపయోగించి యాపల్ ప్లే గ్రౌండ్ రూపకల్పనలో పట్ల జైన్‌కు అభిరుచే ఆమెను ఈ స్థాయిలో ఉంచింది. అలాగే జైన్ తోటి విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయంలో ఒక ఫోరమ్‌ను కూడా స్థాపించారు. ఈ ప్లాట్‌ఫారమ్ సపోర్ట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ఎవరిదో తెలుసా? ) కాగా ప్రతీ ఏడాది వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా, స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి అసలైన యాప్ రూపొంచే చాలెంజ్ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకిస్తుంది. గతంతో పోలిస్తే విజేతల సంఖ్యను 350 నుంచి 375కి పెంచామనీ, తద్వారా మరింత మంది ఔత్సాహిక విద్యార్థులు ఈ ఈవెంట్లో చేరవచ్చని భావించినట్టు తెలిపింది. 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, వినోదం, పర్యావరణం లాంటి విభిన్న టాపిక్స్ ఇందులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. మరిన్ని స్ఫూర్తిదాయక, విజేతల కథనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
9 ఏళ్ల ‘కౌటిల్య కటారియా’కు సలాం కొడుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు!
సాఫ్ట్వేర్ కొలువు అంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి. ఇదిగో ఈ చిచ్చరపిడుగు అలాగే చేశాడు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఎదిగాడు. వరల్డ్ వైడ్ టెక్ దిగ్గజ కంపెనీల సీఈవోలకు టెక్నాలజీ పాటాలు నేర్పిస్తూ అందరితో ఔరా అనిపిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ అనే పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల కౌటిల్య కటారియా టెక్నాలజీ గురించి కూడా తెలియని వయస్సుల్లో టెక్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. భారత్‌లోని టైర్-3 నగరం నుంచి యూకేలోని మెట్రోపాలిటన్ ప్రపంచానికి వెళ్లి.. 6 ఏళ్లకే అతి పిన్న వయస్కుడైన కోడర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు ఈ బాల మేధావి. 9 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా టెక్, కంప్యూటింగ్ కాన్ఫరెన్స్‌లలో స్పీకర్‌గా ప్రసంగాలతో దిగ్గజ సంస్థల సీఈవోల నుంచి ప్రశంసలందుకుంటున్నాడు. కౌటిల్య కటారియా ఎవరు? కౌటిల్య కటారియా యూకేలోని నార్తాంప్టన్ (Northampton)లోని వూటన్ పార్క్ స్కూల్లో చదువుకున్నాడు. 10, 11, 12 తరగతుల విద్యార్థులతో కలిసి జీసీఎస్ఈ మ్యాథ్స్ పరీక్షలో అత్యధిక గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. 5 సంవత్సరాల వయస్సు నుంచి బాల మేధావిగా మారడానికి అతని ప్రయాణం 5ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది. అతని తండ్రి ఈశ్వర్ కటారియా..ఆ వయస్సులో కౌటిల్యకు కోడింగ్‌కు సంబంధించిన ఓ పుస్తకాన్ని కొనిచ్చారు. ఆ పుస్తకమే అతనిలో ఆసక్తిని రేకెత్తించింది. ఒక్కరోజులో పుస్తకాన్ని పూర్తి చేసి కంప్యూటింగ్ నేర్పించడం మొదలుపెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సొంతంగా సెర్చ్ ఇంజిన్, చాట్ బాట్‌ను తయారు చేసి ఐబీఎంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ పర్ట్ అక్రిడిటేషన్ పొందారు. ఐబీఎంకు చెందిన వాట్సన్ సూపర్ కంప్యూటర్‌తో స్మోక్, ఫైర్‌ను గుర్తించే ప్రోగ్రామ్‌ను రూపొందించాడు ఈ చిచ్చర పిడుగు. 9 సంవత్సరాల వయస్సులో, కంప్యూటింగ్, గణితంలో పరిధిని విస్తరించడానికి విభిన్న అభిరుచులు గల యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ది డిసిఫర్ అనే వేదికను స్థాపించాడు. భవిష్యత్తులో కొత్త రకం ఏఐని అభివృద్ధి చేయాలని అతని లక్ష్యం. ప్రస్తుతం డాక్టర్ నుంచి రాకెట్ వరకు ఇలా ఏ రంగంలోనైనా పని చేసే రోబోను తయారు చేయాలనే డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యాడు. ఆల్ ది బెస్ట్ కౌటిల్య కటారియా. -
ఆర్ధిక మాంద్యంలో ఐటీ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా..మైక్రోసాఫ్ట్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఒక లక్షకుపైచిలుకు భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్లకు నెలరోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫ్యూచర్ రెడీ చాంపియన్స్ ఆఫ్ కోడ్ కార్యక్రమం కింద నెలరోజుల శిక్షణతోపాటు అభ్యర్థులను ధ్రువీకరించనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలపర్ కమ్యూనిటీలతో ఆవిష్కరణల కేంద్రంగా భారత్ మారిందని మైక్రోసాఫ్ట్ ఇండియా కస్టమర్ సక్సెస్ ఈడీ అపర్ణ గుప్త అన్నారు. దేశ వృద్ధిని నడిపించే సాంకేతికత అభివృద్ధిలో డెవలపర్ల సృజనాత్మకత, ఆవిష్కరణ, అభిరుచిని మైక్రోసాఫ్ట్ గుర్తిస్తుందని చెప్పారు. -
Vedant Deoakte: అమెరికాలో రూ.33 లక్షల ఉద్యోగం కోల్పోయిన బాలుడు
ముంబై: కోడింగ్ కాంపిటీషన్లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఏడాదికి రూ.33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది. అతడి వయసు గురించి తెలిశాక ఉద్యోగం ఇవ్వలేమని సమాచారం పంపింది. విజేత వయసు కేవలం 15 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన వేదాంత్ దేవ్కాటే వయసు 15 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్ సాయంతో స్వయంగా కోడింగ్ నేర్చుకున్నాడు. అందులో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలోని న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ నిర్వహించిన కోడింగ్ పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్ రాశాడు. సునాయాసంగ విజయం సాధించాడు. వేదాంత్ ప్రతిభను గుర్తించిన న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ తమ మానవ వనరుల విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తామని తెలిపింది. వ్యక్తిగత వివరాలు పంపాలని కోరింది. వేదాంత్ ఆ వివరాలు పంపించాడు. అతడి వయసు 15 ఏళ్లేనని తెలుసుకున్న న్యూజెర్సీ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేమని పేర్కొంది. తమ కంపెనీ నిబంధనల ప్రకారం చిన్న వయసు వారిని చేర్చుకోవడం సాధ్యపడదని నిస్సహాయత వ్యక్తం చేసింది. నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని వేదాంత్‌కు సూచించింది. -
టెక్ మహీంద్రా సంచలన నిర్ణయం, గ్రామీణ విద్యార్ధులకు అదిరిపోయే గుడ్ న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర సంచలన నిర్ణయం తీసుకుంది. టెక్ మహీంద్రాకు చెందిన మేకర్స్ ల్యాబ్ 'మెటా విలేజ్'ను లాంచ్ చేసింది. ఈ ఫ్లాట్ ఫామ్‌తో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి పొందాలనుకునే విద్యార్ధులకు వరంగా మారనుంది. మేకర్స్ ల్యాబ్ డిజైన్ చేసిన ఈ ప్లాట్‌ఫారమ్ లోకల్ లాంగ్వేజ్‌లో కంప్యూటర్లు, కోడింగ్ నేర్చుకునేలా సాయపడనుంది. ఇందులో భాగంగా టెక్ మహీంద్రా మహరాష్ట్రలోని పరాగావ్ గ్రామంలో మెటా విలేజ్‌ను ప్రారంభించింది. ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ మెటా విలేజ్ సాయంతో విద్యార్థులు స్థానిక మాతృ భాషలో కోడింగ్ చేసేలా కోచింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతం పరాగావ్ గ్రామ విద్యార్ధులకు ఆన్లైన్లో కోడింగ్ నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా "మేక్ ఇన్ ఇండియా" పట్ల నిబద్ధతను తెలుపుతూ మెటా విలేజ్ ప్రారంభించాం. తద్వారా అట్టడుగు స్థాయిలో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టున్నాన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేలా టెక్ మహీంద్రా మేకర్స్ ల్యాబ్ ఇప్పటికే విద్యార్ధులకు భారత్ మార్కప్ లాంగ్వేజ్ (బీహెచ్ఏఎంఎల్)ను నేర్పిస్తున్నట్లు మేకర్స్ ల్యాబ్ గ్లోబల్ హెడ్ నిఖిల్ మల్హోత్రా అన్నారు. అవకాశాల వెల్లువ టెక్ మహీంద్రా అందుబాటులోకి తెచ్చిన ఫ్లాట్ ఫామ్‌తో విద్యార్ధులు లోకల్ ల్యాంగేజ్లో కోడింగ్ నేర్చుకోవచ్చు. కోడింగ్ అనేది ఇంగ్లీష్ భాషలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ మేకర్స్ ల్యాబ్ సంస్థ స్థానిక భాషలో కోడింగ్ నేర్చుకునేలా ఈ మెటావిలేజ్ను డెవలప్ చేసింది. ఇందులో లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. స్థానిక భాషల్లో కోడింగ్ నేర్చుకొని ఆన్లైన్లో ఉపాధి పొందవచ్చు. ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందవచ్చు. చదవండి: రండి..రండి.. దయచేయండి! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్! -
చదివింది ఐదు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్
న్యూఢిల్లీ: కష్టపడితే విద్యార్హతలతో సంబంధం లేకుండా మెరుగైన ఉద్యోగం సాధించవచ్చని బెంగుళూరుకు చెందిన మహ్మద్ తన్వీర్ నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ తన్వీర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు. ఆ తర్వాత వెల్డర్‌గా కొంత కాలం పని చేశాడు. కానీ అతనికి జరిగిన ఓ ప్రమాదం తన్వీర్ జీవితాన్నే మార్చేసింది. అప్పుడే అతను జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీలు లేకపోయినా సరే, పెద్ద ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రమాదం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో..మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్సు చేస్తున్న తన్వీర్ సోదరి అతడిని ఎంతగానో ప్రోత్సహించింది. ఆమె సహాయంతో అతను ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. తరువాత టైపింగ్ కోర్సు చేసి డాటా ఎంట్రీ ఉద్యోగం సంపాదించాడు. కానీ తన్వీర్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది. దీంతో తొలుత అతను డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈవో స్పెషలిస్ట్ ఉద్యోగాలు చేశాడు. సాఫ్ట్వేర్ కొలువు సాధించాలని ఉన్నా డిగ్రీ అర్హతలు లేకపోవడంతో అతని మనసులో ఏదో మూలన నిరాశ తొంగిచూసేది. సరిగ్గా అదే సమయంలో మాసై స్కూల్ ఆఫ్ బిజినెస్ అతని లక్ష్యానికి దారి చూపింది. ఏ అర్హతలు లేకున్నా అతనికి 6నెలల కోడింగ్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కల్పించింది. కేవలం 6నెలల్లోనే తనకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం సాధించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని అందించింది. దీంతో నేడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నానని తన్వీర్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని..వారి విద్యార్హతలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాసై సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ శుక్లా పేర్కొన్నారు. -
కోడింగ్ రాకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కలే..
-
క్యాంపస్ కొలువు కష్టమే
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ఓ మోస్తరు కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం గ్యారంటీ.. టాప్ 10 కాలేజీల్లో సీటు వచ్చిందంటే ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే.. – రెండేళ్ల క్రితం వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భావన ఇది! కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి 250 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉద్యోగ ఆఫర్ లెటర్లు ఇచ్చిన దేశీయ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఏటా 10 నుంచి 12 వేల మందిని నియమించుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటివి ఇప్పుడు ‘ఏ’కేటగిరి ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అది కూడా టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి మూడు నుంచి ఆరు మాసాలపాటు శిక్షణ ఇచ్చే ఈ సంస్థలు ఇప్పుడు నైపుణ్యం కలిగిన విద్యార్థులను మాత్రమే ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరి ఆయా కాలేజీలకు వెళ్లి వేల మందికి ఒక రోజు పరీక్ష నిర్వహించి, మరో రోజు మౌఖిక పరీక్ష నిర్వహించి వందల మందిని ఎంపిక చేసుకునే ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఇన్ఫోసిస్ ‘హ్యాక్ విత్ ఇన్ఫీ’, కాగ్నిజెంట్ ‘టెక్నాలజీ హైరింగ్’పేరుతో విద్యార్థులకు కఠిన పరీక్షలు నిర్వహించి ఎక్కువ వేతనంతో నియమించుకుంటున్నాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లో ప్రైవేట్ విద్యా రంగంలో టాప్ కాలేజీలుగా పేర్కొంటున్న సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, ఎంవీఎస్ఆర్ కాలేజీల్లో సైతం 2018 పాస్డ్ అవుట్ విద్యార్థులకు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువ ఆఫర్లు వచ్చాయి. కోడింగ్ వస్తేనే.. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు అమెరికన్ కంపెనీలు కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఉద్యోగాలు ఆఫర్ చేయడానికి గతంలో మాదిరి ఒకరోజు రిక్రూట్మెంట్కు పరిమితం కావడం లేదు. కోడింగ్ బాగా తెలిసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, డెలాయెట్, అమెజాన్, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతించి.. వారిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ కారణంగా ప్రైవేట్ టాప్ కాలేజీల్లో ఐటీ సంబంధిత కోర్సుల్లో సీటు కోసం రూ.12 నుంచి రూ.15 లక్షల మేర డొనేషన్ చెల్లించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. బీ, సీ కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు కూడా ఉండటం లేదని తెలియడంతో టాప్ కాలేజీల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాలుగు కాలేజీలకే పరిమితమైన కాగ్నిజెంట్ అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ దేశవ్యాప్తంగా ఎనిమిది కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టింది. వాటిలో హైదరాబాద్ కాలేజీలే నాలుగు ఉన్నాయి. సీబీఐటీ, వాసవి, ఎంవీఎస్ఆర్, శ్రీనిధి కాలేజీల్లో మాత్రమే టెక్నాలజీ హైరింగ్ పేరుతో నియామకాలు చేపట్టి కేవలం 12 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సంస్థ సీబీఐటీ కాలేజీ నుంచి 201 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్ చేయగా ఈ ఏడాది ఐదుగురికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. వాసవీ కాలేజీలో 2017లో 121 మందికి ఆఫర్ చేసి.. ఈ ఏడాది పాసైన నలుగురు విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంవీఎస్ఆర్ నుంచి ముగ్గురికి ఉద్యోగాలు ఆఫర్ చేయగా.. శ్రీనిధి కాలేజీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదీ అదే దారి దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్.. కాగ్నిజెంట్ దారిలోనే నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వందల సంఖ్యలో టాప్ కాలేజీల విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చిన ఈ సంస్థలు 2017లో పరిమిత సంఖ్యలో నియమించుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని, గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఈ కంపెనీలకు వస్తున్న ఆర్టర్లు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో పని చేయడానికి అర్హులైన వారు లభించకపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2016లో నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 753 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసిన ఇన్ఫోసిస్.. 2017కు వచ్చేసరికి ఆ సంఖ్యను 132కి తగ్గించింది. ఈ ఏడాది రెగ్యులర్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఆ కంపెనీ విధానమేమిటో ఇంకా వెల్లడి కాలేదు. ఇక టీసీఎస్ హైదరాబాద్‌లో పరిమితంగా రెండు లేదా 3 కాలేజీల్లో మాత్రమే నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. కోడింగ్ రాకుంటే కష్టమే: ప్రొఫెసర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్, సీబీఐటీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్ కచ్చితంగా తెలిసి ఉండాలి. జావా కోడింగ్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా వంటివి కూడా ఇప్పుడు కంపెనీలకు అవసరం. ఐఐటీలు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. మిగిలిన యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. ఏదేమైనా గతంలో మాదిరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పుడు అంత ఈజీ కాదు. -
బార్బీతో కోడింగ్ పాఠాలు...!
బార్బీ.. అమ్మాయిల మనసు దోచుకునే ఓ బొమ్మ మాత్రమే కాదు.. అందం, ఆత్మవిశ్వాసాల కలయిక. బార్బీ కేవలం ఆడుకోవడానికే కాదు సరికొత్త పాఠాలు నేర్పేందుకు న్యూలుక్లో మార్కెట్లోకి వచ్చేసింది. వినోదంతో పాటు విఙ్ఞానాన్ని అందించేందుకు ‘రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీ’ని మంగళవారం లాంచ్ చేసినట్లు బొమ్మల తయారీ సంస్థ మటెల్ తెలిపింది. ఏడేళ్ల ప్రాయం నుంచే అమ్మాయిల్లో ఇంజనీరింగ్, కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించినట్లు పేర్కొంది. కిడ్స్ బేస్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫాం ‘టింకర్’ భాగస్వామ్యం వల్లే రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించడం సాధ్యమైందని మటెల్ తెలిపింది. సరికొత్త రూపంలో... జీన్స్, గ్రాఫిక్ టీ- షర్ట్‌పై డెనిమ్ జాకెట్, కళ్లకు సేఫ్టీ గ్లాసెస్‌తో న్యూలుక్లో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్స్ బార్బీలో ఆరు కోడింగ్ పాఠాలను చేర్చినట్లు ‘టింకర్’ సహ వ్యవస్థాపకుడు కృష్ణ వడాటి తెలిపారు. ఈ బార్బీతో ఆడుకుంటూనే.. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడ్ బిల్డింగ్ బ్లాక్స్ వంటి కోడింగ్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్ 2017 గణాంకాల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (స్టెమ్) తదితర రంగాల్లో మహిళల భాగస్వామ్యం కేవలం 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో ‘బార్బీ’తో జతకట్టడం ద్వారా చిన్ననాటి నుంచే అమ్మాయిల్లో కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్తరకం బార్బీతో ఆన్‌లైన్‌తో పాటు, ఆఫ్‌లైన్‌లో కూడా గేమ్స్ ఆడటం వీలవుతుందని తెలిపారు. బార్బీ నేపథ్యం... పేపర్ బొమ్మలతో ఆడుకుంటున్న తన కూతురు బార్బరా కోసం రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ 1959లో ఒక సరికొత్త బొమ్మను రూపొందించారు. జర్మన్ డాల్ ‘బిల్డ్ లిల్లీ డాల్’ స్ఫూర్తితో రూపొందించిన బొమ్మకు తన కూతురి పేరు మీదుగా బార్బీ అని ఆమె నామకరణం చేశారు. బార్బీ పరంపరలో ఇప్పటి వరకు 200 మోడళ్లతో బార్బీ డాల్స్ అందుబాటులోకి వచ్చాయి. బార్బీ ప్రెసిడెంట్, బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్, బార్బీ పైలట్ వంటివి బార్బీ మోడళ్లలో ముఖ్యమైనవి. -
హైదరాబాద్ ఇంజనీర్లకు ఆ నైపుణ్యం లేదట
హైదరాబాద్: దేశంలో కీలక నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో ఇంజినీరింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్లతో పోలిస్తే హైదరాబాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు చాలా వెనుకబడి ఉన్నారని ఓ అధ్యాయనం తేల్చింది. హైదరాబాదీ విద్యార్థుల్లో ప్రోగ్రామింగ్ చేసే నైపుణ్యం చాలా తక్కువగా ఉందని అటోమట నేషనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ చెప్పింది. అతి కొద్ది మందికి మాత్రమే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు రావడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపింది. దేశవ్యాప్తంగా 500 కాలేజీల్లోని 36వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు వివరించింది. విద్యార్థుల్లో లోపిస్తున్న ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవడానికి తాము కోడింగ్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలను భావిస్తున్నట్లు వెల్లడించింది. నగరానికి చెందిన గ్రాడ్యుయేట్లలో 0.7 శాతం మంది మాత్రమే ప్రాథమికంగా కోడ్ రాసే శక్తిసామర్ధ్యాలను కలిగివున్నారని నివేదికలో ఉంది. నివేదికపై తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈవో సుజీవ్ నాయర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగావకాశాలు పెంచేందుకు కాలేజీ స్థాయిలో ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు.