Google Contract Workers Say No To Work From Office - Sakshi
Sakshi News home page

Google: ఐటీ ఉద్యోగులు:పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయ్‌! ఆఫీస్‌కు రాలేం!

Published Tue, May 24 2022 3:11 PM | Last Updated on Tue, May 24 2022 4:43 PM

Google contract workers say no to Work From Office - Sakshi

దిగ్గజ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల వర్క్‌ ప్రొడక్టివిటీ పెరగుతుందని, అదే సమయంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలైనంత సమయం దొరుకుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ‍్రమ్‌ ఆఫీస్‌ను తిరస్కరిస్తున్నారు.  

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మ్యాప్స్‌కు చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయడాన్ని తిరస్కరిస్తున్నారు. సుమారు 200 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తామని, ఆఫీస్‌కు రాలేమని ఖరాకండీగా చెబుతున్నారు. అంతేకాదు ఆఫీస్‌ టూ రిటర్న్‌ అంటే ట్రాన్స్‌ పోర్ట్‌ ఛార్జీలను భరించలేమని వాపోతున్నారు. పైగా గూగుల్‌ తమని (గూగుల్‌ మ్యాప్స్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని) ఒకలా, గూగుల్‌ ఉద్యోగుల్ని మరోలా ట్రీట్‌ చేస్తుందని ఆల్ఫాబెట్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏడబ్ల్యూ)కు దాఖలు చేసిన పిటీషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను ఏడబ్ల్యూ యూనియన్‌ సభ్యులు సైతం సమర్ధిస్తున‍్నారు.  

పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో 
కాగ్నింజెంట్‌కు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన గూగుల్‌ కోసం పని చేస్తున్నారు. ఆయితే ఆ ఉద్యోగుల్ని గూగుల్‌ ఇంటి వద్ద నుంచి పనిచేయడం ఆపేయాలని, జూన్‌ 6 నుంచి ఆఫీస్‌కు రావాలని గూగుల్‌ ఆదేశించింది. దీంతో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు, విజృంభిస్తున్న కరోనాతో పాటు పలు కారణాల్ని ఉదహరిస్తూ వర్క్‌ ఫ్రమ్‌ హోంను కొనసాగిస్తామని, ఆఫీస్‌కు రాలేమని ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.   

న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం 
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం..గూగుల్‌లో పనిచేస్తున్న కాగ్నిజెంట్‌ ఉద్యోగులు రీటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీని వ్యతిరేకిస్తే గూగుల్‌ సదరు ఉద్యోగుల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తుందంటూ న్యూయార్స్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

కాగ్నిజెంట్‌ ఏమంటుందంటే!
రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీ అనేది ఉద్యోగులు, క్లయింట్ రిక్వైర్‌ మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు భద్రతే మాకు ముఖ్యం. తరువాతే మిగిలిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటాం. అందుకే ఉద్యోగుల్ని కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే ఆఫీస్‌కు రావాలని కోరుతున్నామని కాగ్నిజెంట్‌ చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌  జెఫ్ డెస్మారైస్ తెలిపారు. 

మాకూ ఉద్యోగుల ఆరోగ్యమే ముఖ్యం!
గూగుల్‌కు చెందిన ఉన్నతాధికారిణి కోర్టేనే మాన్సిని మాట్లాడుతూ..మాకు ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ముఖ్యం. కాంట్రాక్ట్‌ ఉద్యోగులైన సరే వాళ్లకి గూగుల్‌లో తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే సంస్థ ఆఫీస్‌ రిటర్న్‌ టూ పాలసీని అమలు చేశాం. సప్లయర్స్‌ (కాగ్నిజెంట్‌) ఈ పాలసీని ఎలా అమలు చేయాలో నిర్ణయించుకుంటారని కోర్టేనే మాన్సిని స్పష్టం చేశారు.

చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌ చేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement