కోవిడ్-19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానాన్ని అమలు చేశాయి. అయితే మహమ్మారి తగ్గుముఖం పట్టి పరిస్థితులు అదుపులోకి రావడంతో సంస్థలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని పిలుపునిచ్చాయి. ఈ విషయంలో సంస్థలు - ఉద్యోగుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మొదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంను వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టెస్లా ఉద్యోగులంతా వారానికి కనీసం 40 గంటలు ఆఫీసు నుంచి పనిచేయాలని ఆదేశించారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల నుంచి ఆశించినంత ఉత్పాదకతను రాబట్టలేమనే అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా, సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్క్ ఫ్రమ్ హోంపై మరో అడుగు ముందుకేశారు. వర్క్ ఫ్రమ్ హోం నైతికతకు సంబంధించిన విషయమన్నారు. ఎందుకంటే? ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకు, ల్యాప్ ట్యాప్‌లో వర్క్ చేసే గురించి మరో రకంగా అనుకునే అవకాశం ఉందన్నారు.
కార్లను తయారీ చేసే ఉద్యోగులు, సర్వీసింగ్ చేయడం, ఇళ్ల నిర్మాణ కార్మికులు, కుకింగ్ లేదంటే విరివిరిగా వినియోగించే వస్తువుల్ని తయారు చేసే కార్మికులు పరిశ్రమలకు వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటి వద్ద నుంచి పనిచేసే వారు ఆఫీస్‌లకు వెళ్లరు. తద్వారా ఉద్యోగుల మధ్య గందర గోళం ఏర్పడుతుంది. ‘ఇది ఉత్పాదకత మాత్రమే కాదు,నైతికంగా తప్పు అని నేను భావిస్తున్నాను’ అని మస్క్ అన్నారు.
చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment