అనంతపురం:యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ఘరానా మోసగాడు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నిరుద్యోగుల నుంచి రూ.30 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంజాద్ పర్వేద్ అనే ఉద్యోగి కొంతమంది యువతకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు.