Amjad parved
-
ఘరానా మోసగాడికి రెడ్ కార్నర్ నోటీసులు!
అనంతపురం:యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ఘరానా మోసగాడు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నిరుద్యోగుల నుంచి రూ.30 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంజాద్ పర్వేద్ అనే ఉద్యోగి కొంతమంది యువతకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. -
నిందితున్ని పట్టుకునేందుకు సహకరిస్తాం:ఎస్పీ
అనంతపురం:యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు తమవంతు సహకరం అందిస్తామని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికి సంబంధించి స్పందించిన ఎస్పీ.. ఆ కేసును హిందూపురంలో నమోదు చేయలేమన్నారు. అసలు నేరం ఎక్కడైతే జరిగిందో అక్కడే బాధితులు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బెంగళూరులో నిరుద్యోగుల నుంచి రూ. 30 కోట్ల వసూళ్లు చేసిన వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నిందితున్ని పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులకు సహకరిస్తామని తెలిపారు. 'యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంజాద్ పర్వేద్ అనే ఉద్యోగి బెంగళూరులో సుమారు రూ.30కోట్లకు...కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. -
ఉద్యోగాలని చెప్పి.. 30 కోట్లు దోచేశాడు!
-
యాహూలో ఉద్యోగాలంటూ రూ.30కోట్లు వసూలు
అనంతపురం : సాప్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మరో మోసగాడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. 'యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అతగాడు బెంగళూరులో సుమారు రూ.30కోట్లకు...కుచ్చుటోపీ పెట్టాడు. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.