Yahoo
-
YahooLayoffs ఉద్యోగులకు చేదువార్త చెప్పిన టెక్ కంపెనీ
సాక్షిముంబై: టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత అప్రతిహతంగా కొనసాగుతోంది. అధిక ద్రవ్యోల్బణం, గ్లోబల్ మాంద్యం భయాలు, వ్యయాల నిర్వహణలో భాగంగా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకు తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన టెక్ కంపెనీ యాహూ ఉద్యోగాల కోతను ప్రకటించింది. తన యాడ్ టెక్ యూనిట్ ప్రధాన పునర్నిర్మాణంలో భాగంగా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20శాతం కంటే ఎక్కువ మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈ మేరకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను ఉటంకిస్తూ ఆక్సియోస్ గురువారం నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, యాహూ యాడ్ టెక్ ఉద్యోగులలో 50శాతం కంటే ఎక్కువ మందిపై కోతలు ప్రభావం చూపుతాయి. అంటే 1600 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారని సమాచారం. -
ఎక్కడ నుంచైనా పనిచేయండి..! తిరిగేందుకు రూ. లక్ష మేమిస్తాం..!
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచదేశాలపై విరుచుకుపడుతోంది. కోవిడ్-19 ఉదృతి తగ్గముఖం పట్టడంతో ఆయా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి పలికే లోపే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చి పడింది. దీంతో పలు ఐటీ కంపెనీలు తిరిగి ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పేశాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఆయా దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోంకే జై కొట్టాయి. కాగా జపాన్‌లోని ఉద్యోగుల కోసం సరికొత్త ప్రణాళికను యాహూ ప్రతిపాదించింది. ఎక్కడ నుంచైనా పనిచేయండి..! జపాన్‌లో పనిచేస్తోన్న 8,000 ఉద్యోగులకు యాహూ బంపరాపర్ ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులు దేశంలో ఎక్కడనుంచైనా పనిచేసే వెసులబాటు యాహూ జపాన్ కల్పించింది. అంతేకాకుండా ఉద్యోగులు ఏదైనా అవసరం ఉంటే కార్యాలయాలకు వెళ్లొచ్చునని తెలిపింది. జపాన్‌లో ఇప్పటికే సంస్థకు చెందిన 90 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారని పేర్కొంది. తిరిగేందుకు లక్ష వరకు..! సంస్థ అవసరాల నిమిత్తం ఉద్యోగులు దేశంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకుగాను ఉద్యోగులకు కేటాయించే బడ్జెట్‌ను యాహూ జపాన్ భారీగా పెంచేసింది. విమానాల్లో తిరిగే సదుపాయాన్ని యాహూ జపాన్ తమ ఉద్యోగులకు కల్పించనుంది. ఈ ఆఫర్ 2022 ఎప్రిల్ 1 నుంచి అందుబాటులో రానుంది. ప్రయాణాల కోసం ఉద్యోగులకు నెలకుగాను 1500 డాలర్లను (సుమారు రూ. లక్ష వరకు) యాహూ జపాన్ ఇవ్వనుంది. ఈ చొరవతో ఉద్యోగులు మరింత కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రోత్సహకంగా నిలుస్తోందని, అంతేకాకుండా ఉద్యోగుల శ్రేయస్సుకు ఉపయోగపడుతోందని యాహూ జపాన్ అభిప్రాయపడింది. చదవండి: బిగ్ బాస్కెట్, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..! -
చైనాకు మరో భారీషాక్, డ్రాగన్‌ను వదిలేస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు
హాంకాంగ్: చైనాలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో విదేశీ టెక్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా అక్కడి నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా యాహూ కూడా చైనా మార్కెట్ నుంచి వైదొలిగింది. చైనాలో కార్యకలాపాలు కొనసాగించలేని విధంగా కఠినతరమైన పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణమని పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే యాహూకి సంబంధించిన చాలా మటుకు సర్వీసులను చైనా నిలిపివేసింది. దేశీ దిగ్గజాలు సహా టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణను ప్రభుత్వం ఇటీవలి కాలంలో మరింతగా పెంచుతోంది. ఈ పరిస్థితుల మధ్య చైనా నుంచి యాహూ నిష్క్రమించడం కేవలం లాంఛనంగా మాత్రమే మిగిలింది. ‘చైనాలో వ్యాపార నిర్వహణ, చట్టాల అమలుకు సంబంధించిన పరిస్థితులు కఠినతరంగా మారుతున్న నేపథ్యంలో నవంబర్ 1 నుంచి మా సర్వీసులు అందుబాటులో ఉండవు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా అతి పెద్ద మార్కెట్ అయినప్పటికీ కఠినతరమైన ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేయాల్సి రావడం టెక్ కంపెనీలకు సవాలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ చాన్నాళ్ల క్రితమే చైనా నుంచి తప్పుకుంది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ సైతం తమ చైనా సైట్‌ను మూసివేస్తున్నట్లు గత నెలలోనే వెల్లడించింది. చదవండి: భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా? -
చేతులు మారింది, యాహూ విలువ రూ.36వేల కోట్లు
హైదరాబాద్: టెక్ సంస్థ యాహూ (గతంలో వెరిజోన్ మీడియా) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ వెల్లడించింది. యాహూ ఇకపై స్టాండెలోన్ సంస్థగా కొనసాగుతుందని పేర్కొంది. దాదాపు 5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 36,000 కోట్లు) వెరిజోన్ నుంచి యాహూలో మెజారిటీ వాటాలను అపోలోకి చెందిన ఫండ్స్ కొనుగోలు చేశాయి. యాహూలో వెరిజోన్ 10 శాతం వాటాను అట్టే పెట్టుకుంది. యాహూకి ఇది కొత్త శకమని సంస్థ సీఈవో గురు గౌరప్పన్ వ్యాఖ్యానించారు. -
ఆస్తుల నగదీకరణ తప్పదు!
‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ మంచిదే. ప్రైవేట్ పరిశ్రమకు కట్టబెడుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అంతిమంగా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయి. నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల సమీకరణ ద్వారా మౌలిక వసతులను మెరుగుపర్చడమే నగదీకరణ లక్ష్యం. ఇది ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని అంచనా. నిరర్ధక ఆస్తులను వాణిజ్యానికి అప్పగించడం లాభసాటి అని కేంద్రం భావన. ఆగస్టు నెల చివరివారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ ఆస్తుల నగదీకరణ విధానాన్ని (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యా లకు అప్పగించడం ద్వారా 2021–22 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల నగదు సమీకరించడమే దీని లక్ష్యం. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఈ నగదీకరణలో భాగంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యు త్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ విధానం కింద భారతీయ రైల్వేకి చెందిన 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 265 గూడ్స్ షెడ్లు, 15 రైల్వే స్టేడియంలు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు. అయితే జాతీయ నగదీకరణ విధానం కింద అప్పగిస్తున్న ఆస్తులు ఆ తర్వాత కూడా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. కొంతకాలం ప్రైవేట్ నిర్వహణ కింద ఉన్న తర్వాత వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. ఈ కొత్త విధానం కింద ప్రభుత్వం మౌలిక వసతుల రంగంలో పెడుతున్న వ్యయాన్ని పెంచేలా నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని మంత్రి వ్యాఖ్య. మౌలిక వసతుల రంగంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరముందని, ప్రభుత్వ రంగ మౌలిక వసతుల ఆస్తులను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం అతి ముఖ్యమైన ఆర్థిక ఎంపిక అని, నూతన మౌలిక వసతుల నిర్మాణానికి ఇది చాలా ముఖ్యమైనదని మంత్రి సెలవిచ్చారు. ఈ కొత్త విధానంలో భాగంగా విమానయాన రంగం నుంచే దాదాపు రూ. 20,800 కోట్ల ఆస్తులను ప్రైవేట్‌కి అప్పగించనున్నారు. టెలికం రంగం నుంచి రూ. 35,100 కోట్ల ఆస్తులను నగదీకరణ కింద అప్పగించనున్నారు. ఇకపోతే రైల్వే రంగం నుంచి రూ. లక్షా 50 వేల కోట్లు, రహదారుల రంగం నుంచి రూ. లక్షా 60 వేల కోట్లు, విద్యుత్ పంపిణీ రంగం నుంచి రూ. 45,200 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ నిర్వహణకు అప్పగిస్తారు. ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని కేంద్రం అంచనా. దీనికి గాను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నగదీకరణలో నాలుగు ప్రయోజనాలున్నాయి. 1. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాబడులను పెంచడం కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, ప్రభుత్వ రంగ యాజమాన్యంలోని సంస్థల ఆర్థిక స్థితి విధ్వంసానికి గురైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతానికి పడిపోయింది. ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతానికి పెరిగింది. లాక్ డౌన్ల వల్ల ప్రభుత్వ రాబడులు క్షీణించిపోవడమే కాకుండా, పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని బాగా పెంచాల్సి వచ్చింది. దానికి తోడుగా ప్రభుత్వ, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూండటం కూడా తెలిసిన విషయమే. ఇవి భారీ స్థాయిలో రుణాలు, నష్టాల బారినపడి కునారిల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడుల ఉపసంహరణ చర్యలు తప్పనిసరయ్యాయి. భారతదేశంలో నష్టాల బారిన పడుతున్న పీఎస్‌యూల సంఖ్య 2015–16లో 79 నుంచి 2019–20 సంవత్సరానికి 84కు చేరుకుంది. ఇదే కాలానికి లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 175 నుంచి 171కి పడిపోయిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివరించారు. వీటిలో 30 ప్రభుత్వ రంగ సంస్థల నష్టం ఇప్పటికే రూ. 1,06,879 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ విధానం ప్రభుత్వానికి అదనపు రాబడులను తీసుకువస్తుంది. 2. పీఎస్‌యూలకు బడ్జెటరీ మద్దతును తగ్గించడం ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూలధన వ్యయ అవసరాలను నెరవేర్చుకోవడానికి, అంతర్జాతీయ సంస్థలకు రుణాలు తిరిగి చెల్లించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొంత నగదును వాటికి అప్పగిస్తోంది. రుణ సేవలు, వీఆర్ఎస్ పథకాలు, ఉపశమన చర్యలు, రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలు వంటివి వీటికి అదనం. ఉదాహరణకు, ఆర్థిక స్థితి దిగజారిపోయిన ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణ కోసం కేంద్రప్రభుత్వం రూ. 70 వేల కోట్ల ప్యాకేజీనీ ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ వల్ల దేశ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలకు బడ్జెటరీ కేటాయింపులు కొన్ని సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గుముఖం పడతాయని అంచనా. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు కూడా. పైగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, ద్రవ్యస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వం పీఎస్‌యూలకు తప్పనిసరిగా పెడుతున్న వ్యయాన్ని సామాజిక సంక్షేమ ప్రాజెక్టులు వంటివాటికి ఉపయోగించవచ్చు. 3. కొత్త మౌలిక వసతుల కల్పనకు నిధులు లభ్యం ప్రభుత్వం నగదీకరణ ద్వారా తన వద్ద నగదు నిల్వలను పెంచుకుంటే కొత్త ఆస్తులను సృష్టించవచ్చు. ఇది దానికదేగా ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. జీడీపీలో పెట్టుబడుల శాతం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో మహమ్మారి అనంతరం డిమాండు పునరుద్ధరణ చర్యలకు ప్రైవేట్ రంగం వేచి చూస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థల వద్ద వనరులు తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో జాతీయ ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులను పునరుద్ధరిస్తుంది. కోవిడ్ –19 వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకునేలా చేయవచ్చు. పీఎస్‌యూలు నిర్మాణ రంగ నష్టాలను ఎదుర్కొంటున్నందున వాటి ఆస్తుల నగదీకరణను నిరంతరంగా చేపట్టాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రైవేట్ రంగం నష్టభయం లేని ఆస్తుల అండతో ముందుకెళుతోంది. పైగా పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల జాప్యం ద్వారా నష్టం, వ్యాజ్యాలు వంటివి ప్రైవేట్ రంగానికి ఉండవు. 4. ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆశిస్తున్న నగదు పరిమాణంతో ప్రభుత్వరంగ పరిశ్రమల విలువ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గతి శక్తి ప్రణాళికకు గొప్ప చేయూత లభిస్తుంది. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో సాగే ఆ సృజనాత్మక పద్ధతి వల్ల కార్పొరేట్ రంగం ఆకాంక్షలకు ఊతం లభిస్తుంది. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ బహువిధాలుగా లాభపడుతుంది. ఇంతవరకు ఉపయోగంలో లేకుండా వృథాగా పడివున్న ఆస్తులను ప్రైవేట్ రంగం సమర్థంగా ఉపయోగించుకుని కొత్త ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పెంచగలుగుతుంది. ప్రభుత్వ రంగ ఆస్తులను వీలైనంతవరకు విడుదల చేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం దృఢ నిర్ణయాలు తీసుకొనక తప్పటం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. – అమితాబ్ తివారీ, ఆర్థిక రంగ విశ్లేషకులు (యాహూ సౌజన్యంతో) -
భారత్‌లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్‌స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
యాహూ మరోసారి అమ్మకం...! డీల్ విలువ ఎంతో తెలుసా..!
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజాలు యాహూ, ఏవోఎల్ మరోసారి చేతులు మారుతున్నాయి. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ వీటిని అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉండనున్నట్లు అంచనా మార్కెటు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాహూ, ఏవోఎల్‌తో కూడిన వెరిజోన్ మీడియాను 5 బిలియన్ డాలర్లకు విక్రయిస్తున్నట్లు వెరిజోన్ వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం వెరిజోన్‌కి 4.25 బిలియన్ డాలర్లు నగదు రూపంలోను, మిగతాది మైనారిటీ వాటాల రూపంలో లభించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఒప్పందం పూర్తి కావచ్చని అంచనా. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూ వెలుగొందిన సంగతి తెలిసిందే. అలాగే ఏవోఎల్ పోర్టల్ కూడా యూజర్లను ఆకర్షించింది. గూగుల్ తదితర టెక్ దిగ్గజాల ప్రాచుర్యం పెరిగే కొద్దీ వీటి ప్రభావం తగ్గిపోయింది. మొబైల్ మార్కెట్లోకి వేగంగా విస్తరించవచ్చనే ఉద్దేశంతో 2015లో ఏవోఎల్‌ను 4 బిలియన్ డాలర్లు వెచ్చించి వెరిజోన్ కొనుగోలు చేసింది. రెండేళ్ల తర్వాత అంతకు మించి వెచ్చించి యాహూను దక్కించుకుంది. అయితే, వేగంగా వృద్ధి చెందిన గూగుల్, ఫేస్బుక్ సంస్థలు.. వెరిజోన్ ఆశలపై నీళ్లు జల్లాయి. తాను ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని స్పష్టం కావడంతో వీటిపై చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ను వెంటనే నిలుపివేయగా చేసిన వెరిజోన్.. తాజాగా అమ్మేయాలని నిర్ణయించుకుంది. చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ -
బన్నీ ఖాతాలో మరో రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘‘అల వైకుంఠపురములో’ సినిమా ఏన్నో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసి, పలు సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టినవి. ఇక ఈ మూవీ ట్రైలర్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించిన టాప్ 20లో స్థానం దక్కించుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న బన్నీ.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. (చదవండి : ‘అల వైకుంఠపురములో’ అరుదైన రికార్డు) ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ లోని టాప్ మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సెలెబ్రెటీల జాబితాలో మొత్తం ఇండియన్స్ లో ఏకైక తెలుగు హీరోగా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో సినీ పరిశ్రమ నుంచి ఎస్సీ బాలసుబ్రమణ్యం, సోనుసూద్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. -
టాప్‌లో సుశాంత్.. బన్నీని వెనక్కినెట్టిన సోనూసూద్!
సినిమాలో విలన్ పాత్రలు పోషించే నటుడు సోనూసూద్ లాక్డౌన్లో రియల్ హీరోగా మారారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లో ఇబ్బంది పడిన ఎంతో మందికి సాయం అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. లాక్డౌన్లో ప్రారంభమైన సోనూసూద్ చేస్తున్న సేవలు నేటికి కొనసాగుతున్నాయి. బాలీవుడ్ నటుడైన సోనూసూద్ తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితుడే. సూపర్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన సోనూసూద్ జులాయి, అతడు, ఆగడు, అరుంధతి, శక్తి, సీత వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. తాజాగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం యాహూలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రముఖుల్లో సోనూసూద్‌కు స్థానం లభించింది. చదవండి: సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్ యాహూ 2020 లో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత రెండవ స్థానంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మూడో స్థానంలో నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. కాగా తొలిసారి ఈ జాబితాలోకి సోనూసూద్ ఎంటర్ అయ్యారు. గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన వారిలో సోనూసూద్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది ఈ స్థానాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకోగా. ప్రస్తుతం బన్నీ పదో స్థానానికి పడిపోయారు. యాహూ జాబితాలో టాప్ 10లో టాలీవుడ్ హీరోల నుంచి అల్లు అర్జున్ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు అక్షయ్ కుమార్, సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. చదవండి: బన్నీకి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్.. థ్యాంక్స్ బ్రదర్ టాప్ 10 మంది వరుసగా.. 1. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2. అమితాబ్ బచ్చన్ 3. అక్షయ్ కుమార్ 4. సల్మాన్ ఖాన్ 5. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ 6. దివంగత నటుడు రిషి కపూర్ 7. దివంగత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం 8. సోనూసూద్ 9. అనురాగ్ కశ్యప్ 10. అల్లు అర్జున్ కాగా ఈ జాబితాలో మహిళా ప్రముఖుల విభాగంలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అగ్రస్థానంలో నిలిచారు. నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదురవ్వడంతో రియా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై, సుశాంత్ మరణంతోపాటు పలువురిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెను హాట్ టాపిక్‌గా మార్చింది. ఇక వరుసగా టాప్ 10 జాబితాను చూసుకుంటే.. 1 రియా చక్రవర్తి 2 కంగనా రనౌత్ 3 దీపికా పదుకొనె 4 సన్నీ లియోన్ 5 ప్రియాంక చోప్రా 6 కత్రినా కైఫ్ 7 నేహా కక్కర్ 8 కనికా కపూర్ 9 కరీనా కపూర్ 10 సారా అలీ ఖాన్ -
జియో పేజెస్‌లో కొత్త ఫీచర్
ముంబయి: గత నెలలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం జియో పేజెస్ అనే వెబ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బ్రౌజర్ లో డేటా భద్రత, సమాచారంపై వినియోగదారులకు నియంత్రణ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, తాజాగా జియో పేజిస్ యొక్క కొత్త వెర్షన్ 2.0.1 ను విడుదల చేసింది. ఈ వెర్షన్ లో డక్‌డక్‌గోను ఇష్టపడే వారికోసం సెర్చ్ ఇంజిన్ ను ఆడ్ చేసింది. అలాగే చిన్న వీడియోల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఫీచర్ ని తేవడంతో పాటు నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను జోడించింది. (చదవండి: పబ్జీ పోటీగా వస్తున్న దేశీయ ఫౌ-జీ గేమ్) ఇప్పుడు జియోపేజ్ వినియోగదారులు డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్ ను ఇష్టపడే వారు కుడి వైపులో హాంబర్గర్ చిహ్నం(మెనూ)> సెట్టింగులు> క్విక్ సెట్టింగులు> సెర్చ్ ఇంజిన్‌ను క్లిక్ చేయడం ద్వారా డక్‌డక్‌గోను ఎంచుకోవచ్చు. డక్‌డక్‌గో అనేది గోప్యతాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సెర్చ్ ఇంజిన్. యూజర్లు బింగ్, యాహూ, గూగుల్ వంటి ఇతర సెర్చ్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా జియోపేజ్ ద్వారా ఉపయోగించవచ్చు. అలాగే ఈ యాప్ లో చిన్న వీడియోల కోసం ప్రత్యేక ఫీచర్ ని తీసుకురావడం మంచి విషయం. ఈ కొత్త ఫీచర్ లో 30 సెకన్ల వరకు చిన్న వీడియోలు ప్రదర్శించబడతాయి. చిన్న వీడియోలను చూడాలనుకునే వినియోగదారులు బాటమ్ బార్> ఎక్సప్లోర్ సెక్షన్> స్క్రోల్ టూ షార్ట్ వీడియో రీల్> వ్యూ మోర్ ను ఎంచుకుంటే సరిపోతుంది. చిన్న వీడియోలలో వినోదం, జీవనశైలి, టెక్ మొదలైన కంటెంట్ లభిస్తుంది. జియోపేజ్ లో కొత్తగా నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను కూడా తీసుకొచ్చింది. జియో పేజెస్ సౌకర్యవంతమైన వీక్షణ కోసం డార్క్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. జియోపేజీ వెబ్ బ్రౌజర్ హిందీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలలో బ్రౌజ్ చేయడానికి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది. -
తిరుగులేని సన్నీలియోన్, మళ్లీ..
భారత్‌లో ఈ యేడాది ఎక్కువ మంది జనాలు శృంగార తార సన్నీలియోన్ కోసం తెగ సెర్చ్ చేశారట. దీంతో మరోసారి అందరినీ వెనక్కి నెట్టి సన్నీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. తాజాగా యాహూ నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం.. యాహూ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ–2019గా సన్నీలియోన్‌తో పాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నిలిచారు. సల్మాన్‌ఖాన్ తర్వాత బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ కోసం నెటిజన్లు ఆన్లైన్లో గాలించారు. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలను వెనక్కు నెట్టి సన్నీలియోన్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. 2016, 2017లోనూ సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. తిరుగులేని దంగల్.. గడిచిన దశాబ్ధ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్‌ఖాన్ దంగల్ రూ.2వేల కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’, అమీర్‌ఖాన్ ‘పీకే’ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటి తర్వాత సుల్తాన్, టైగర్ జిందగీ హై, ధూమ్3, సంజు, వార్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దబాంగ్ టాప్ టెన్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో చోటు సాధించుకున్నాయి. ఈ యేడాది మేల్ స్టైల్ ఐకాన్‌గా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నిలిచారు. మహిళా స్టైల్ ఐకాన్‌గా ముక్కుసూటిగా మాట్లాడే నటి సారా అలీ ఖాన్ ఉన్నారు. -
యాహూ! సరికొత్తగా...
ఒకప్పుడు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్‌గా, ఈ–మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడిపోయింది. అయితే, పూ ర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు యాహూ మెయిల్ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్ యాప్‌ను రీబ్రాండింగ్ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ–బ్రాండ్ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 22 కోట్ల మంది యూజర్లు.. యాహూ మెయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్స్ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయో గిస్తున్నారు. యాహూ మెయిల్ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాలవారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరో ఈమెయిల్ సేవల సంస్థ వైపు మళ్లకుండా తమవద్దే అట్టే పెట్టుకునే దిశగా కొత్త మొబైల్ యాప్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. కొత్త ఫీచర్స్‌లో కొన్ని .. అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్ అత్యధికంగా 1 టెరాబైట్ (టీబీ) స్టోరేజీ స్పేస్ అందిస్తోంది. సుమారు 250–300 సినిమాలకు సరిపడేంత స్టోరేజీ ఇది. పోటీ సంస్థ జీమెయిల్ కేవలం 15 జీబీ స్టోరేజీ ఇస్తోంది. ఈ పరిమితి దాటితే.. అప్పటికే ఉన్న మెయిల్స్ కొన్నింటిని డిలీట్ చేసుకుని.. ఆ మేరకు పెరిగిన స్పేస్‌ను వాడుకోవాల్సి ఉంటోంది. లేదా నెలవారీ కొంత మొత్తం చెల్లించి అదనంగా స్టోరేజీ స్పేస్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక, ఇన్‌బాక్స్‌లో స్పామ్ బాదరబందీ లేకుండా కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్సే కనిపించేలా .. యాహూ మెయిల్ యూజర్లు..‘పీపుల్ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్మెంట్ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ–మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ తరహాలోనే బహుళ ఈ–మెయిల్ ఖాతాలను యాహూ మెయిల్ యాప్‌నకు అనుసంధానించుకోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించుకోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మెయిల్ ప్రో రీబ్రాండింగ్.. యూజర్లకు ఉచిత సర్వీసులు అందిస్తున్నప్పటికీ.. మెయిల్స్‌లో ప్రకటనల ద్వారా యాహూ మెయిల్‌కు కొంత ఆదాయం లభిస్తుంది. దీనితో పాటు ప్రకటనల బాదరబందీ లేని సబ్స్క్రిప్షన్ ఆధారిత యాహూ మెయిల్ ప్రో సర్వీసును కూడా సంస్థ గతంలో ప్రవేశపెట్టింది. సుమారు 6–7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సర్వీసును కూడా ప్రస్తుతం రీబ్రాండ్ చేస్తోంది. అలాగే, కొత్త యాహూ మెయిల్ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్స్‌లో ప్రీ–ఇన్స్టాల్ చేసేలా ఫోన్స్ తయారీ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఎంటర్ప్రైజ్ ఈ–మెయిల్ విభాగంలో ప్రవేశించే యోచనేదీ లేదని.. సాధారణ యూజర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నాయి. -
ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం
మనుషుల విపరీత ధోరణులు, వికారాలు ఎంత హేయంగా వుంటాయనే దానికి నిదర్శనం యాహూ ఉద్యోగి మాజీ ఇంజనీర్ రీస్ డేనియల్ రూయిజ్ (34). లైంగిక ఫోటోలు, వీడియోల కోసం ఏకంగా 6,000 ఖాతాలను హ్యాక్ చేశాడు. అదీ తనకు తెలిసిన మహిళలు, తన తోటి మహిళా ఉద్యోగుల ఖాతాలనుంచే వీటిని చోరీ చేశాడు. ఎన్‌గాడ్జెట్ అందించిన కథనం ప్రకారం సంస్థలోని అంతర్గత నెట్‌వర్క్‌కు తన కున్న యాక్సెస్‌ను ఉపయోగించుకొని ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తద్వారా వేలాది వినియోగదారుల పాస్‌వర్డ్స్‌ను హ్యాక్ చేశాడు. వారి ఖాతాల్లోని వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను తన పర్సనల్ హార్డ్ డ్రైవ్‌కు డౌన్లోడ్ చేశాడు.ప్రధానంగా మహిళలు,చిన్నపిల్లల సోషల్ మీడియా ఖాతాలే అతడి టార్గెట్. అంతేకాదు వీరిలో తన స్నేహితులు, మహిళా సహోద్యోగులు కూడా ఉన్నారని స్వయంగా రూయిజ్ వెల్లడించాడు. థర్డ్ పార్టీ సైట్స్ ద్వారా యాపిల్ ఐక్లౌడ్, ఫేస్బుక్, జీమెయిల్, డ్రాప్‌బాక్స్ తదితర ఖాతాల పాస్వర్డ్ రీసెట్ చేసి, తనకు కావాల్సిన డాటాను చోరీ చేసేవాడు. తాజాగా రూయిజ్ తన నేరాన్ని అంగింకరించాడు. ఇందుకు రూయిజ్ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంచనా. -
కొత్త యాహూ మెయిల్ ఇన్‌బాక్స్
న్యూఢిల్లీ: యాహూ నూతన వెర్షన్ మెయిల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌ను యూజర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది. నచ్చని ఈ మెయిల్స్ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకునే టూల్‌ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, యాహూ మెయిల్ యాప్ నుంచే జీమెయిల్, అవుట్‌లుక్ వంటి వాటిల్లోకి లాగిన్ అవ్వొచ్చని యాహూ ఒక ప్రకటనలో తెలిపింది. -
వార్తల్లోని వ్యక్తుల్లో మోదీ టాప్
న్యూఢిల్లీ: దేశంలో 2018 ఏడాదిలో అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారని ప్రముఖ సెర్చింజన్ యాహూ తెలిపింది. ‘యాహూ ఇయర్ ఇన్ రివ్యూ’ పేరిట యాహూ సంస్థ ప్రతీ ఏడాది ఎక్కువగా వార్తల్లోకెక్కిన ప్రముఖులతో ఓ జాబితా రూపొందిస్తుంది. 2018 ఏడాదికి చెందిన జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో మోదీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ దీపక్ మిశ్రాకు మూడో స్థానం దక్కింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారస్తులు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు వరుసగా 4వ, 5వ స్థానాల్లో నిలిచారు. కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌లు ‘జంట’ కేటగిరీలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మోదీ ఒవైసీ కాళ్లు మొక్కాడనీ, నెలకు రూ. 15 లక్షలు ఖర్చు పెట్టి మోదీ వ్యక్తిగతంగా మేకప్ ఆర్టిస్ట్‌ను నియమించుకున్నారనీ, ఓ వేదికపై రాహుల్ గాంధీ మహిళ చేయి పట్టుకున్నారనీ తదితర నకిలీ వార్తలు ఎక్కువగా ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయని యాహూ వెల్లడించింది. వివిధ కేటగిరీల వారీగా వార్తల్లో నిలిచిన ప్రముఖులను చూస్తే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, పారిశ్రామిక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, పురుష సెలబ్రిటీల్లో సల్మాన్ ఖాన్, మహిళా సెలబ్రిటీల్లో సన్నీ లియోనీలు ప్రథమ స్థానాల్లో నిలిచారు. కన్ను కొట్టే పాటతో ప్రాచుర్యం పొందిన ప్రియా వారియర్ తదితరులు జాబితాలో ఉన్నారు. -
యాహూ మెసేంజర్‌కి ఇక గుడ్ బై
కాలిఫోర్నియా: యాహూ అభిమానులకు చేదువార్త. యాహూ మెసెంజర్ 20 ఏళ్ల ప్రస్థానానికి తెరదించుతూ యాహూ మెసేజింగ్ యాప్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని మాతృ సంస్థ ఓత్ ఐఎన్‌సీ వెల్లడించింది. ఇకపై యాహూ మెసెంజర్ పనిచేయదని ఓత్ తెలిపింది. అలాగే యాహూలో మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని పేర్కొంది. అయితే యాహూ మెసెంజర్ సర్వీసులు ఇకపై స్క్విరల్ (Squirrel) అనే కొత్త ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌కి మళ్లిస్తున్నట్టు తెలిపింది. అలాగే యూజర్లు తమ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తునట్టు వెల్లడించింది. ఇందుకు ఆరు నెలల సమాయాన్ని కూడా ఇచ్చింది. https://messenger.yahoo.com/getmydata లింక్‌ను సందర్శిస్తే యూజర్లు తమ యాహూ మెసెంజర్ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
మరోసారి సన్నీనే టాప్
ముంబై : 2017 సంవత్సరంలో యాహూలో ఎక్కువగా వెదికిన భారతీయ నటుల్లో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంది సన్నీలియోన్. దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కత్రినా కైఫ్‌లాంటి స్టార్ హీరోయిన్లను దాటుకొని యాహూ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ జాబితాలో మరోసారి టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో ప్రియాంకా చోప్రా, మూడో స్థానంలో ఐశ్వర్యారాయ్ నిలిచారు. ఇక నటుల జాబితాలో ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా టాప్ ప్లేస్‌లో నిలిచారు. వినోద్ ఖన్నా మృతి చెందిన సమయంలో నెటిజన్లు ఎక్కువగా ఆయన కోసం యాహూలో సెర్చ్ చేశారు. కాగా, ఆ తర్వాతి స్థానంలో అనూహ్యంగా కపిల్ శర్మ నిలిచారు. సల్మాన్ ఖాన్, రజినీ కాంత్ లాంటి వారిని దాటుకుని కపిల్ శర్మ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2017 యాహూ మోస్ట్ సెర్చ్డ్ హీరోయిన్ల జాబితా సన్నీలియోన్ ప్రియాంకా చోప్రా ఐశ్వర్య రాయ్ కత్రినా కైఫ్ దీపికా పదుకునే కరీనా కపూర్ మమతా కులకర్ణి దిశాపటాని కావ్యా మాధవన్ ఇషా గుప్తా -
ఐపీఎల్ బిడ్డింగ్ బరిలో ఎయిర్టెల్, యాహూ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ హక్కుల కోసం టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ బరిలోకి దిగాయి. ఈ మేరకు ఐపీఎల్ బిడ్ డాక్యుమెంట్‌ను ఎయిర్టెల్, యాహు కొనుగోలు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వీటితో పాటు మరో రెండు కొత్త కంపెనీలు బామ్‌టెక్, డీఏజడ్ఎన్/ పర్ఫామ్ గ్రూప్ కూడా ఆన్లైన్ హక్కుల కోసం పోటీపడుతున్నాయని ఆయన చెప్పారు. -
వెరైజన్ చేతికి యాహూ
4.5 బిలియన్ డాలర్ల డీల్ పూర్తి శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్కి పర్యాయపదంగా వెలుగొందిన దిగ్గజ సంస్థ యాహూ .. రెండు దశాబ్దాల ప్రస్థానానికి తెరపడింది. దాదాపు 4.5 బిలియన్ డాలర్లకు యాహూను కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు టెక్ దిగ్గజం వెరైజన్ ప్రకటించింది. ఈ డీల్ కింద యాహూ సీఈవోగా వైదొలగనున్న మరిస్సా మేయర్‌కు 127 మిలియన్ డాలర్ల ప్యాకేజీ దక్కనుంది. యాహూతో పాటు వివిధ ఏవోఎల్ సర్వీసు విభాగాలన్నింటినీ కలిపి ఓత్ పేరిట ఏర్పాటు చేసే వెరైజన్ అనుబంధ సంస్థకు టిమ్ ఆర్మ్‌స్ట్రాంగ్ సీఈవోగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఏవోఎల్ ఇన్చార్జ్ అయిన ఆర్మ్‌స్ట్రాంగ్ ఇకపై యాహూ ఈమెయిల్, స్పోర్ట్స్, ఫైనాన్స్, న్యూస్ మొదలైన విభాగాలను కూడా పర్యవేక్షించనున్నారు. మరోవైపు పలు వ్యాపార విభాగాలను వెరైజన్కి విక్రయించిన యాహూ.. ఆలీబాబా గ్రూప్, యాహూ జపాన్‌లో వాటాలను తన దగ్గరే అట్టే పెట్టుకుంది. ఈ విభాగాలతో అల్తబా పేరుతో కొత్తగా మరో సంస్థ ఏర్పాటు కానుంది. యాహూ వద్ద ఉన్న 8 బిలియన్ డాలర్ల పైగా నగదు నిల్వలు, ఇతరత్రా న్యాయపరమైన వివాదాలు ఈ సంస్థకి సంక్రమించనున్నాయి. -
ఆ ఒప్పందంతో 2 వేల ఉద్యోగాలు ఢమాల్
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలిగిన యాహూను సొంతం చేసుకున్న వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్ ఉద్యోగులపై భారీ వేటు వేయనుంది. యాహూ కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో రెండు కంపెనీలకు చెందిన దాదాపు 2 వేల మందిని ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం 2 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్ తొలగించనుంది. మొత్తం 4.48 బిలియన్ డాలర్లు ఒప్పందం పూర్తయిన అనంతరం ఈ తొలగింపులను చేపట్టనుంది. రెండు యూనిట్లకు చెందిన 15శాతం ఉద్యోగులను తగ్గించనుంది వీటిలోముఖ్యంగా కాలిఫోర్నియా సహా, అమెరికా వెలుపల ఉద్యోగులు ఇందులో ఉన్నారు. మరోవైపు యాహూ- వెరిజోన్ విలీనానికి వాటాదారుల సాధారణ సమావేశం గురువారం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం కంపెనీ విక్రయ ప్ర్రకియ మంగళవారం పూర్తి కానుంది. వెరిజోన్ , యాహూ విలీనంతో కొత్త వెంచర్ ఓథ్ ఉనికి లోనికి రానుంది. వెరిజోన్‌కు చెందిన అమెరికన్ మల్టీనేషనల్ మాస్ మీడియా కార్పొరేషన్ ఏఓఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ ఆర్ స్ట్రాంగ్ నేతృత్వంలోని ఓథ్ అనే నూతన సంస్థగా రీబ్రాండ్ అయింది. కాగా 2012లో యాహూ సీఈవోగాఎంపికైన మెరిస్సా మేయర్ పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడంతో వివాదం రగిలింది. ఈ క్రమంలోనే 2015లో యాహూ, తన వ్యాపారంలోని ముఖ్య విభాగాలైన డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-మెయిల్, మీడియా విభాగాలను వేరిజోన్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
యాహూ ఇక గతమే.. కొత్త పేరెంటో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహూ కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. యాహూను సొంతం చేసుకున్న వెరిజాన్ కంపెనీ.. తన ఏవోఎల్ మెయిల్‌ను దానితో విలీనం చేసి.. ఓథ్ (ప్రమాణం) పేరిట కొత్త బ్రాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇకమీదట ఓథ్ మెయిల్, ఓథ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంటర్నెట్ యూజర్లను పలుకరించనున్నాయి. వెరిజాన్ కంపెనీ 4.8 బిలియన్ డాలర్ల మొత్తానికి యాహూ కంపెనీని కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏవోఎల్ మెయిల్లో యాహూ విలీనమైన తర్వాత ఈ రెండింటినీ కలిపి.. ఓథ్ అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకురానున్నట్టు ఏవోఎల్ సీఈవో టిమ్ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్విట్టర్లో వెల్లడించారు. 'వందకోట్లకుపైగా వినియోగదారులు, 20కిపైగా బ్రాండ్లు, ఎదురులేని బృందం.. టేక్ ద ఓథ్ (ప్రమాణం చేయండి)' అంటూ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. -
యాహూ సీఈవోకు బోనస్ కట్
శాన్ఫ్రాన్సిస్కో: సీఈఓ మెరిస్సా మేయర్‌కు చెల్లించాల్సిన బోనస్‌లో యాహూ కంపెనీ కోత విధించింది. గత ఏడాది లక్షలాది యాహూ ఖాతాలు హ్యాక్ అయిన ఘటన నేపథ్యంలో దానిపై విచారణ చాలా ఆలస్యం అయింది. హ్యాకింగ్‌పై జరిగిన విచారణలో యాహూ ఉద్యోగుల తప్పిదాలేవి లేవు. కానీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు పలువురు ఉద్యోగులపై యాహూ చర్యలు తీసుకుంది. తాజాగా కంపెనీ సీఈవోకు ఒక ఏడాదికి అందాల్సిన రెండు మిలియన్ డాలర్ల బోనస్‌ను కట్ చేస్తున్నట్లు యాహూ బోర్డు పేర్కొంది. కంపెనీ బోర్డు నిర్ణయంపై స్పందించిన మెరిసా.. హ్యాకింగ్‌పై జరిపిన దర్యాప్తులో కంపెనీ అసమర్థంగా వ్యవహరించిందని తేలడంతో పొరపాటుకు బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది బోనస్‌తో పాటు ఈక్విటీ గ్రాంట్‌ను వదులుకుంటున్నట్లు తెలిపారు. తన బోనస్‌ను కంపెనీలో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు పంచాలని చెప్పారు. మెరిస్సా 2012 నుంచి యాహూ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. వెరిజాన్ సంస్థ గత ఏడాది యాహూను 4.48 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
యాహూ బోర్డు నుంచి వైదొలగనున్న మరిస్సా మెయర్
శాన్ ఫ్రాన్సిస్కో: టెలికం దిగ్గజం వెరిజోన్‌తో డీల్ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ దిగ్గజం యాహూ బోర్డు పదవి నుంచి సీఈవో మరిస్సా మెయర్ తప్పుకోనున్నారు. యాహూ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ ఫిలో కూడా బోర్డు పదవికి రాజీనామా చేయనున్నారు. పలు దఫాలుగా చేపట్టిన సంస్థాగత కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా యాహూ ప్రధాన ఇంటర్నెట్ వ్యాపారాన్ని, ఆలీబాబాలో పెట్టుబడుల విభాగాన్ని విడగొట్టింది. -
యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!
-
యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!
ఇంటర్నెట దిగ్గజ సంస్థగా పేరొందిన యాహూ ఇంక్ తన పేరును మార్చుకోబోతున్నట్టు సోమవారం ప్రకటించింది. కొత్త పేరుగా ఆల్టబా ఇంక్గా నామకరణం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్‌తో కుదుర్చుకున్న డీల్ ముగిసిన అనంతరం కంపెనీ బోర్డు నుంచి యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడించింది. యాహూ తన కోర్ ఇంటర్నెట్ బిజినెస్‌లు డిజిటల్ అడ్వర్టైజింగ్, మీడియా ఆస్తులు, ఈమెయిల్ వంటి వాటిని ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. 4.83 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.32,491.41 కోట్లకు యాహు ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ సమయంలోనే యాహూ సీఈవో మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాను మాత్రం కంపెనీలోనే ఉండదలుచుకున్నట్టు పేర్కొన్నారు. కానీ డీల్ ముగిసిన అనంతరం ఆమె రాజీనామా చేయనున్నట్టు యాహూ సంస్థనే సోమవారం తెలిపింది. వెరిజోన్, యాహూతో ఈ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఆ కంపెనీలో రెండుసార్లు అతిభారీ మొత్తంలో డేటా చోరి జరిగినట్టు వెల్లడైంది. మొదటిసారి 500 మిలియన్ కస్టమర్ అకౌంట్లు, రెండోసారి 100 కోట్లకు పైగా అకౌంట్లు చోరికి గురైనట్టు తెలిసింది. దీంతో వెరిజోన్ యాహూతో కుదుర్చుకున్న డీల్‌లో మార్పులు చేయనున్నట్టు లేదా ఆ లావాదేవీలను ఆపివేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాహూతో తాము బలమైన వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉంచుకోవడానికే చూస్తున్నామని, డేటా ఉల్లంఘనల గురించి ప్రస్తుతం యాహూ విచారణ చేపట్టిందని వెరిజోన్ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయిన అనంతరం ఐదుగురు యాహూ డైరెక్టర్లు రాజీనామా చేయనున్నట్టు కూడా యాహూ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మిగతా డైరెక్టర్లు అల్టాబాను పాలించనున్నారని, కొత్త కంపెనీ బోర్డు చైర్మన్‌గా ఎరిక్ బ్రాండ్ట్ నియమించామని యాహు వెల్లడించింది. -
యాహూ సీక్రెట్ స్కానింగ్ సంచలనం?
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఇంక్ మరోసారి చిక్కుల్లో పడింది. అమెరికా ప్రభుత్వ నిఘా అధికారులతో కలిసి కస్టమర్ ఇ-మెయిల్స్ ను స్కాన్ చేసిన యాహూ గూఢచర్యం చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీని కోసం ఏకంగా ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు, వినియోగాదారుల ఈ-మెయిల్ ఖాతాలకు వచ్చే సమాచారాన్ని తస్కరించేందుకు యాహూ గత సంవత్సరం ఓ సాఫ్ట్ వేర్ ను తయారుచేసిందని, దీని సాయంతో రహస్యంగా అన్ని యాహూ మెయిల్ ఖాతాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం డిమాండ్ కు కట్టుబడి వందల మిలియన్ల యాహూ మెయిల్స్ స్కానింగ్ చేసినట్టు సమాచారం. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఆదేశం మేరకు ఖాతాలను హ్యాక్ చేస్తోందని ముగ్గురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. సందేశాలను శోధించడం కోసం నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, ఎఫ్‌బీఐ అధికారుల కోసం యాహూ ఈ పని చేస్తోందని సంస్థను వీడిన ఈ ముగ్గురు ఉద్యోగులు వెల్లడించారు. అధికారులు చెప్పిన కొన్ని పదాలు, సంకేతాల కోసం యాహూ యూజర్లకు వస్తున్న మెయిల్స్ మాత్రమే ఈ సాఫ్ట్ వేర్ సాయంతో స్కాన్ అవుతున్నాయని, అప్పటికే స్టోర్ అయివున్న మెసేజ్ లను స్కానింగ్ చేయడం లేదని వివరించారు. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఖాతాలపై పూర్తి నిఘా ఉంచేందుకూ యాహూ అంగీకరించలేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ అధికారి వెల్లడించారు. వీరు అందించిన సమాచారం ప్రకారం, యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరిస్సా మేయర్ ఈ నిర్ణయాన్ని కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారనీ, ప్రస్తుతం ఫేస్ బుక్ టాప్ భద్రతా ఉద్యోగిగా వున్న , యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ స్టామోస్ జూన్ 2015 సం.రంలో సంస్థ నుంచి నిష్క్రమణకు దారితీసింది. అయితే, యాహూ దీనిపై స్పందించడానికి నిరాకరించిందింది. అలాగే సంస్థ మాజీ అధికారి స్టామోస్ కూడా ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ఇదే డిమాండ్ పై గతంలో ఇంటర్నెట్ కంపెనీలు ఆశ్రయించిందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే సాధారణంగా ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ద్వారా దేశీయ నిఘా కోసం కొన్ని అభ్యర్ధనలు చేస్తుందని, ఏ ఏజెన్సీ సమాచారాన్ని కోరి ఉంటుందనేది తెలుసుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఉపకరించేలా యాహూ రహస్యంగా సదరు సమాచారం సేకరించిందా? గూగుల్, రెడిఫ్ లాంటి ఇతర ఈ-మెయిల్ సేవల సంస్థలనూ ఇలాగే నిఘా వర్గాలు కోరాయా? అన్నది తెలియాల్సివుందని అభిప్రాయపడుతున్నారు. -
యాహూకి మరో షాక్!
కాలిఫోర్నియా: భారీ ఎత్తున యాహూ ఖాతాలు హాకింగ్ కు గురయ్యాయని ప్రకటించిన ఇంటర్నెట్ సంస్థ యాహూకి మరో షాక్ తగిలింది. కనీసం 50 కోట్ల ఖాతాల హ్యాకింగ్ వ్యవహారంలో సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒక యూజర్ కోర్టులో దావా వేశారు. న్యూయార్క్ కు చెందిన రోనాల్డ్ ష్వార్ట్జ్, శాన్ జోస్, కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినియోగదారులను తరపున కోర్టును ఆశ్రయించారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతను కాపాడతామని వాగ్దానం చేసిన సంస్థ ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని స్క్వార్జ్ ఆరోపించారు.. అయితే ఈ వ్యాజ్యంపై స్పందించడానికి యాహూ ప్రతినిధి సన్నీవేల్ తిరస్కరించారు. వెరిజోన్, యాహూ వ్యాపార ఒప్పందానికి నష్టం చేకూరే అవకాశం ఉందని, దీనికోసం సీఈవో మారిస్సా మేయర్స్ చేస్తున్నప్రయత్నాలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. కాగా 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యాహూ వెల్లడించిన షాకింగ్ న్యూస్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. ఈ సమాచారాన్ని మొత్తాన్నీ కంపెనీ నెట్ వర్క్ నుంచి 2014లో దొంగిలించారని ఒక ప్రకటనలో తెలిపారు. యాహూ ఆన్ లైన్ ఖాతాదారులు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని యాహూ ఒక ప్రకటనలో కోరింది. భద్రతా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సూచించింది. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దని, డోన్ లోడ్లు చేయొద్దని హెచ్చరించింది. పేర్లు, ఈ మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, పాస్‌వర్డ్‌లతో పాటు ఎన్‌క్రిప్ట్, అన్ ఎన్క్రిప్డ్ ప్రశ్నలు, సమాధానాలు కూడా హ్యాకింగ్‌కు గురైన వాటిలో ఉన్నాయని బాబ్ లార్డ్ చెప్పారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని ఆరోపించిన ఆయన, హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే విచారణలో వెల్లడైన సమాచారం మేరకు.. హ్యాకింగ్‌కు గురైన వాటిలో అన్ప్రొటెక్టెడ్ పాస్వర్డ్లు, పేమెంట్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ సమాచారం తదితరాలు లేవని స్పష్టం చేశారు. పేమెంట్ కార్డ్ డేటా, బ్యాంక్ అకౌంటులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్‌కు గురైన సిస్టంలో భద్ర పరచలేదని చెప్పారు. హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్న వారు కాదని తమ విచారణలో వెల్లడైందన్నారు. మరోవైపు ఇదే అతి పెద్ద సైబర్ ఉల్లంఘనగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచి పాస్ వర్డ్ లను మార్చని యూజర్లను మార్చుకోవాల్సిందిగా కోరుతోందని షేప్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ లో ఆధునిక ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించే అవకాశ ఉందనీ, ఈనేపథ్యంలో 4.8 బిలియన్ డాలర్ల యాహూ వెరిజోన్ కీలక అమ్మకంపై ప్రభావితం చేసే అవకాశం ఉందని మరో టెక్ నిపుణుడు హెచ్చరిచారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల ఈ మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, హ్యాకర్లు జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్, ఇతర సమాచారం దొంగిలించారని, ఈ సమాచారాన్ని రష్యాలోని క్రిమినల్ అండర్ వరల్డ్‌కు విక్రయించినట్లుగా గతంలో అందోళను చెలరేగిన సంగతి తెలిసిందే. -
భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ
వందల మిలియన్ యూజర్ అకౌంట్ల డేటా దొంగతనానికి పాల్పడినట్టు యాహూ కంపెనీ బహిరంగంగా ధ్రువీకరించబోతుంది. ఈ విషయంపై అధికార వర్గాలు ఓ ప్రకటన విడుదలచేశాయి. వందల మిలియన్ యాహూ యూజర్ అకౌంట్లు ఈ చోరీ బారిన పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూజర్ అకౌంట్ల హ్యాకింగ్ విషయం ఆగస్టులోనే బయటికి వచ్చింది. దాదాపు 200 మిలియ్ యాహూ యూజర్ అకౌంట్ ఆధారాలను పీస్ అనే హ్యకర్ అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు వచ్చాయి. సుమారు 1,07,000కు ఈ అకౌంట్లను రియల్డీల్ మార్కెట్ ప్లేస్‌లో హ్యాకర్ అమ్మకానికి పెట్టాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై విచారణ కొనసాగుతుందని, చోరీపై యూజర్లు కంగారు పడాల్సిన పనిలేదని యాహూ భరోసా ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఈ అకౌంట్ల చోరిని యాహూ సైతం ధ్రువీకరించేందుకు సిద్దమైంది. ఈ డేటాలో యూజర్ల పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం, ఇతర ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్నాయి. ఇటీవలే యాహూ కోర్ వ్యాపారాలైన ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ సుమారు రూ.32,500 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ఈ హ్యాకింగ్‌ను యాహూ ధృవీకరిస్తున్నట్టు వెల్లడవడం, ఆ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపనుందోనని మార్కెట్ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఒప్పందం ముగిసే వరకు సీఈవో మారిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి. -
వెరిజాన్ చేతికి యాహూ!
♦ ఇంటర్నెట్ అసెట్స్ కొనుగోలుకు ఒప్పందం ♦ డీల్ విలువ రూ.32,500 కోట్లు... ♦ యాహూను ఏఓఎల్‌తో అనుసంధానించనున్న వెరిజాన్ న్యూయార్క్: సెర్చ్, మెయిల్, చాట్, న్యూస్... ఇలా ఏదన్నా మొదట గుర్తుకొచ్చే పేరు యాహూనే. కాకపోతే ఇదంతా గూగుల్ రాకముందు. ఒకప్పుడు మొత్తం ఇంటర్నెట్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న యాహూ... చివరకు గూగుల్‌తో పోటీపడలేక చతికిలబడిపోయింది. వరస నష్టాలతో... తెచ్చిన కొత్త ఉత్పత్తులన్నీ ఫ్లాప్ కావటంతో దిక్కుతోచక కొట్టుకుంటున్న ఈ సంస్థ... ఎట్టకేలకు చేతులు మారుతోంది. ఈ అమెరికన్ కంపెనీని కొనుగోలు చేసేందుకు వెరిజాన్ కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న యాహూ వ్యాపారాన్ని (ఇంటర్నెట్ అసెట్స్) మాత్రమే వెరిజాన్ దక్కించుకోనుంది. ఇందుకోసం దాదాపు 4.83 బిలియన్ డాలర్లు (సుమారు రూ.32,500 కోట్లు) చెల్లించనున్నట్లు సోమవారం ప్రకటించింది. కొనుగోలు తర్వాత యాహూ సేవలన్నింటినీ తన అనుబంధ సంస్థ ఏఓఎల్‌తో (అమెరికా ఆన్లైన్) అనుసంధానించనున్నట్లు వెరిజాన్ వెల్లడించింది. కాగా, యాహూ దగ్గరున్న నగదు నిల్వలు, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌లో దానికున్న వాటా, యాహూ జపాన్‌లో షేర్లు, కొన్ని మైనారిటీ పెట్టుబడులు, కొన్ని నాన్-కోర్ పేటెంట్లు ఈ కొనుగోలు ఒప్పందం పరిధిలోకి రావని ఆ ప్రకటనలో వివరించింది. ఇక ఇన్వెస్ట్మెంట్ కంపెనీగానే... యాహూ కొనుగోలు ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉది. ముఖ్యంగా యాహూ వాటాదారుల ఆమోదం, నియంత్రణ సంస్థలు ఇతరత్రా అనుమతులకు లోబడి డీల్ పూర్తవుతుందని వెరిజాన్ తెలిపింది. కాగా, డీల్ పూర్తయిన తర్వాత యాహూ తన పేరును మార్చుకుంటుంది. రిజిస్టర్డ్ పబ్లిక్ లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మారుతుంది. డీల్ పూర్తయ్యేవరకూ యాహూ ప్రస్తుత నిర్వహణ మొత్తం స్వతంత్రంగానే కొనసాగుతుందని.. యూజర్లు, అడ్వర్టయిజర్లు, డెవలపర్లు, పార్ట్నర్లు అందరికీ సేవలు, ఉత్పత్తులను యథావిధిగా అందిస్తుందని వెరిజాన్ తెలియజేసింది. 1994లో ఆవిర్భావం... స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ విద్యార్ధులైన జెర్రీ యాంగ్, డేవిడ్ ఫిలో కలిసి యాహూను 1994లో నెలకొల్పారు. ఇంటర్నెట్ రంగంలో తొలితరం సెర్చింజన్‌గా, ఈ-మెయిల్ సేవల్లో కూడా తనదైన మార్కును ప్రపంచవ్యాప్తంగా యాహూ చూపించింది. వెబ్ బ్రౌజర్ నెట్‌స్కేప్ ఇతరత్రా కొన్ని సంస్థల మాదిరిగా కాకుండా డాట్‌కామ్ బూమ్ బద్దలైన తర్వాత కూడా యాహూ నిలదొక్కుకోవడంతో పాటు షాపింగ్, న్యూస్ వంటి ఇతర సేవల్లో కూడా విస్తరించి ముందుకెళ్లింది. అయితే, గూగుల్ బరిలోకి దిగాక పరిస్థితి మారింది. పోటీలో వెనుకబడటంతోపాటు ఈ విధమైన సేవల్లో విపరీతమైన పోటీ కారణంగా నెమ్మదిగా యాహూ ప్రాభవం మసకబారింది. కాగా, ప్రస్తుతం యాహూకు 100 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లున్నట్లు అంచనా. ఇందులో 60 కోట్ల మేర యాక్టివ్ మొబైల్ యూజర్లు. నాలుగేళ్ల కిందట కంపెనీ పగ్గాలు చేపట్టిన మరిస్సా మేయర్.. గూగుల్ ఇతర పోటీ కంపెనీలను తట్టుకొని యాహూకూ పూర్వ వైభవం తీసుకురావడంలో విఫలమయ్యారు. మేయర్ అంతక్రితం గూగుల్లోనే పనిచేయడం విశేషం. యాహూ! మరికొన్ని విశేషాలు.. ♦ 2000 సంవత్సరంలో డాట్‌కామ్ బూమ్ బద్దలయ్యే ముందు వరకూ యాహూ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2008లో కూడా యాహూను కొనుగోలు చేయడం కోసం మైక్రోసాఫ్ట్ 44 బిలియన్ డాలర్లకు బిడ్ వేయడం గమనార్హం. ♦ యాహూ సోషల్ మీడియాపై పట్టు సంపాదించేందుకు ఆన్లైన్ బ్లాగింగ్ సంస్థ టంబ్లర్‌ను 2013లో బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ♦ ప్రపంచవ్యాప్తంగా యాహూలో 2014 వరకూ 11,000 మంది ఉద్యోగులుండగా కోతల కారణంగా ఈ మార్చి నాటికి 9,400 మంది మిగిలారు. ♦ 2015లో 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై 4.4 బిలియన్ డాలర్ల నష్టం రావటం గమనార్హం. ♦ ప్రస్తుతం యాహూ మార్కెట్ విలువ 38 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షల కోట్లు)గా ఉంది. అయితే, ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో యాహూకు ఉన్న 15 శాతం వాటా ఆధారంగానే ఇంతటి విలువ ఉంది. అలీబాబాలో ఉన్న యాహూ వాటా విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లు. ♦ ఇంకా నాన్-కోర్ పేటెంట్లను యాహూ విడిగా విక్రయించనుంది. ఈ డీల్ బిలియన్ డాలర్లకుపైగానే (సుమారు రూ.6,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. ♦ దాదాపు 228 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న అమెరికా టెలికం అగ్రగామి వెరిజాన్... గతేడాది ఏఓఎల్ను 4.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తద్వారా హఫింగ్టన్ పోస్ట్, టెక్‌క్రంచ్, ఎన్గ్యాడ్జెట్ తదితర న్యూస్ వెబ్సైట్లను తన యాజమాన్యంలోకి తీసుకొచ్చింది. ♦ యాహూను ఏఓఎల్‌తో అనుసంధానించడం ద్వారా గూగుల్, ఫేస్బుక్ తరహాలోనే డిజిటల్ అడ్వర్టయిజింగ్‌లో దూసుకెళ్లాలనేది వెరిజాన్ వ్యూహం. ‘డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఇంటర్నెట్ సేవలపై దృష్టిపెట్టిన నేపథ్యంలో ఏడాది క్రితం మేం ఏఓఎల్ను చేజిక్కించుకున్నాం. ఇప్పుడు యాహూను కూడా దక్కించుకోవడంతో ఇకపై ప్రపంచంలోని దిగ్గజ మొబైల్ మీడియా కంపెనీల్లో ఒకటిగా అవతరించేందుకు వీలవుతుంది. డిజి టల్ అడ్వర్టయిజింగ్‌లో ఆదాయం కూడా భారీగా పుంజుకోనుంది’. - లావెల్ మెక్ఆడమ్, వెరిజాన్ చైర్మన్, సీఈఓ ‘వెబ్ బ్రౌజింగ్, ఇంటర్నెట్ సేవల్లో ప్రపంచాన్ని మార్చిన గొప్ప ఘనత యాహూ సొంతం, వెరిజాన్-ఏఓఎల్ల నేతృత్వంలో ఇకపై కూడా యాహూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ప్రధానంగా ప్రస్తుత నిర్వహణ వ్యాపారాన్ని అమ్మడం ద్వారా ఆసియాలో ఉన్న అసెట్ ఈక్విటీ వాటాలను విడగొట్టేందుకు వీలవుతుంది. వాటాదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే ప్రణాళికల్లో ఇది కీలకం. ఈ రోజుకు యాహూకు చాలా గొప్ప రోజు. వ్యక్తిగతంగా నాకు కూడా. నేను కంపెనీతోనే కొనసాగుతాను. అంతేకాదు కంపెనీ కొత్త అధ్యాయంలో నేను భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. మీ అందరిపై(ఉద్యోగులు) నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఐ లవ్ యాహూ’. - ఉద్యోగులకు లేఖలో మరిస్సా మేయర్, యాహూ సీఈఓ -
వెరిజోన్ గుప్పిట్లోకి యాహూ
4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు లండన్ : యాహూ ఇంక్స్ కోర్ ఇంటర్నెట్ బిజినెస్‌లు ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్ చేతికి వెళ్లిపోయాయి. 4.83 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32,491.41కోట్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్టు వెరిజోన్ ప్రకటించింది. ఈ కొనుగోలు డీల్ మొత్తం నగదు రూపంలో ఉండనుందని తెలిపింది. మొదటి నుంచి గట్టి పోటీదారుడిగా వచ్చిన వెరిజోన్ చివరికి యాహూను కైవసం చేసుకున్నట్టు ప్రకటించింది. యాహూ వ్యాపారాలను వెరిజోన్ కొనుగోలు చేయడం వల్ల, తన ఏఓఎల్ ఇంటర్నెట్ బిజినెస్‌లను వెరిజోన్ పెంచుకోనుంది. ఈ బిజినెస్‌లను గతేడాదే 4.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ.29,598.8 కోట్లకు)కు వెరిజోను కొనుగోలు చేసింది. యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్, సెర్చ్, మెయిల్, మెసెంజర్ లాంటి ఇతర ఆస్తులకు మాత్రమే ఈ డీల్ పరిమితం కానుంది. తమ ఆపరేటింగ్ బిజినెస్‌ల అమ్మకం, ఆసియన్ అసెంట్ ఈక్విటీ షేర్లను వేరుచేయడానికి ఈ డీల్ సమర్థవంతంగా ఉపయోగపడుతుందని యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. షేర్‌హోల్డర్స్ విలువను అన్ లాక్ చేయడానికి ఈ ప్లాన్ కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులకు, అలీబాబాలోని షేర్లకు, జపాన్‌లోని యాహు షేర్లకు, యాహూ కన్వర్టబుల్ నోట్స్‌కు, కొన్ని మైనార్టీ ఇన్వెస్ట్మెంట్లకు, నాన్-కోర్ పేటెంట్లకు ఈ అమ్మక ఒప్పందం వర్తించదని తెలుస్తోంది. అలీబాబా, జపాన్ ఇన్వెస్ట్మెంట్ల విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2,69,080కోట్లు). శుక్రవారం మార్కెట్లు ముగిసేనాటికి యాహూ 37.4 బిలియన్ డాలర్ల(రూ.2,51,589.8కోట్ల) మార్కెట్ విలువను కలిగి ఉంది. 140 మిలియన్లకు పైగా యూజర్లతో ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం అడ్వర్ టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది. -
వెరిజోన్ చేతికి యాహూ?
లండన్ : యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కోనుగోలుకు ప్రముఖ వైర్ లెస్ దిగ్గజం వెరిజోన్ సంస్థ అంతాసిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొదటినుంచీ గట్టి పోటీదారుడుగా భావిస్తున్న వెరిజోన్ చివరకి యాహూ ను కైవసం చేసుకోనుంది. ఈ క్రమంలో ఈ రెండు సంస్థల మధ్య చర్చలు మరింత సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. సుమారు రూ. 33 వేల 575 కోట్లకు (5 బిలియన్ డాలర్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్దమైనట్టు ఇరు కంపెనీల సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించనున్నట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు వచ్చే వారం రోజుల్లోపే ఈ డీల్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే వెరిజోన్ యాహూ కోర్ ఇంటర్నెట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమనీ, ఈ ఒప్పందంలో యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులు, పేటెంట్లు లాంటి ఇతర ఆస్తులు ఉండవని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. నాన్ కోర్ మేధో సంపత్తి ఆస్తుల అమ్మకం విడిగా విక్రయించబడుతుందని తెలిపారు. మరోవైపు వెరీజోన్ తప్ప మరి ఏ కంపెనీ యాహూ ఆస్తులను కొనుగోలు చేయలేదని రీకాన్ ఎనలిస్ట్ రోజర్ ఎ ట్నెర్ వ్యాఖ్యానించారు.అయితే వెరిజోన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీనిపై స్పందించడానికి నిరాకరించినట్టు సమాచారం. 140 మిలియన్లకు పైగా యూజర్లతో ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం ఎడ్వర్టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది. డిజిటల్ ప్రకటనల మార్కెట్లో పోటీ పెరగనుందనీ, 200 మిలియన్ యాహూయూజర్లతో వెరిజోన్ ప్రకటనల బేస్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ సంవత్సరం యాహూ షేర్లు ఇప్పటివరకు 18 శాతానికిపైగా వృద్ధి చెందాయి కాగా మిగతా బిడ్డర్స్ లో పెట్టుబడిదారులు సమాఖ్య (కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టర్స్), బైన్ క్యాపిటల్ ,బెర్క్ షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫ్ఫెట్, ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎల్లో పేజెస్ మాతృ సంస్థ వైపి హోల్డింగ్స్ పేర్లు ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
గూగుల్.. యాహూ, ఇదేం పాడుపని?
తాము ఎంత చెప్పినా పట్టించుకోకుండా సెక్స్ సెలెక్షన్, అబార్షన్లకు సంబంధించిన ప్రకటనలను పెడతారా అంటూ ప్రముఖ సెర్చింజన్లు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్లపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇలాంటి ప్రకటనల ద్వారా సెర్చింజన్లు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతిక నిపుణులు, సెర్చింజన్ల ప్రతినిధులతో పది రోజుల్లోగా సమావేశం ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి తెలిపింది. వాళ్లు బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా, వాటిని బ్లాక్ చేయడానికి ఏమీ చేయలేకపోతున్నామని, ఇలాంటి ప్రకటనలను ఆపి తీరాల్సిందేనని ధర్మాసనం చెప్పింది. ఇలాంటి అక్రమ ప్రకటనలను బ్లాక్ చేయడానికి ఏం చేస్తారో ఈనెల 25లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి తెలిపింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను తాము ఇవ్వడం లేదని సెర్చింజన్ల తరఫున హాజరైన న్యాయవాదులు చెప్పారు. అయితే వారి వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. -
యాహూలో ట్విటర్ విలీనం!
న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ వైబ్‌సైట్ ట్విటర్ యాహూలో విలీనం అయ్యే అవకాశముంది. ఈ మేరకు ట్విటర్ అధికారులు యాహూ సీఈవో మరిస్సా మేయర్‌తో విలీన అవకాశాలను చర్చించినట్లు సమాచారం. మేనేజ్మెంట్ సమావేశంలో ఇరు సంస్థల ప్రధాన అధికారులు విస్తృతంగా సమాలోచనలు జరిపినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. యాహూ-ట్విటర్ సమాచార మార్పిడి ద్వారా మార్కెట్లో పట్టు పెంచుకోవాలని చూస్తున్నాయి. త్వరలో బిడ్డింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే విలీన వ్యాఖ్యలపై కంపెనీ స్పందించజాలదని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. టెలికం దిగ్గజం వెరిజోన్‌తో యాహూ కోర్ ఇంటర్నెట్ వ్యాపారం కోసం త్వరలో రెండో రౌండ్ వేలం జరగనుంది. -
యాహూలో ట్విట్టర్ విలీనం...?
న్యూయార్క్ : ఫ్రీ సోషల్ నెట్ వర్క్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, ఇంటర్నెట్ సేవ ఆధారిత సంస్థ యాహూ లో విలీనం కాబోతుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ విలీనం విషయం చర్చించడానికి ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ లు యాహూ సీఈవో మెరిస్సా మేయర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. కాలానుగుణంగా ట్విట్టర్ సేవలకు పడిపోతున్న డిమాండ్ తో, ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ను యాహూలో విలీనం చేయాలని యోచిస్తున్నారు. మేనేజ్ మెంట్ మీటింగ్ లో ట్విట్టర్, యాహూ ఎగ్జిక్యూటివ్ లు చాలా గంటలు చర్చలు జరిపినట్టు న్యూయార్క్ పోస్టు నివేదించింది. వెనువెంటనే సమాచారాన్ని అందించడంలో ట్విట్టర్ ఓ మాధ్యమంగా యూజర్లకు ఉపయోగపడుతోంది. ఈ-మెయిల్ వ్యవస్థతో పాటు వివిధ రకాల వెబ్ ఆధారిత సేవలను అందించడంలో యాహూ ముందంజలో ఉంది. యాహూ నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ట్విట్టర్ ఎక్కువగా ఆసక్తి చూపుతుందని, ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ను త్వరలోనే పూర్తికాబోతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అయిత్ ట్విట్టర్ సీఈవో డోర్సే ఈ సమావేశ వివరాలను బయటకు వెల్లడించలేదు. ట్విట్టర్ ఈ వివరాలను బయటికి వెల్లడించకపోవడాన్ని మార్కెట్ వర్గాలు తప్పుబడుతున్నాయి. యాహూ అధికారులు సైతం ఈ విలీన ప్రతిపాదనపై స్పందించడానికి తిరస్కరించారు. యాహూ కోర్ ఇంటర్నెట్ బిజినెస్ ల రెండో రౌండ్ బిడ్ లు టెలికాం దిగ్గజం ఒరిజన్ వద్ద వచ్చే వారం మొదట్లో జరుగనున్నాయి. -
డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ
శాన్ఫ్రాన్సిస్కో: ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సంస్థ యాహూ.. వ్యాపార పునర్వ్యవస్థీకరణపై మరిం తగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని డిజిటల్ మ్యాగజైన్స్‌ను నిలిపివేయడం మొదలుపెట్టింది. యాహూ ఫుడ్, హెల్త్, పేరెంటింగ్, మేకర్స్, ట్రావెల్, ఆటోస్, రియల్ ఎస్టేట్ మ్యాగజైన్లను దశలవారీగా మూసివేయనున్నట్లు సంస్థ గ్లోబల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మార్తా నెల్సన్ తమ బ్లాగ్‌లో వెల్లడించారు. యాహూను వృద్ధి బాట పట్టించే దిశగా ఉత్పత్తులు, వనరులపరంగా మరింత సాహసోపేత ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో మరిస్సా మెయర్ ఇటీవలే పేర్కొన్నారు. దీని ప్రకారం దాదాపు 1,500 ఉద్యోగాల్లో కంపెనీ కోత విధించనుంది. దుబాయ్, మెక్సికో సిటీ, బ్యూనస్ ఎయిర్స్, మ్యాడ్రిడ్, మిలాన్ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలను మూసివేయనుంది. -
రోడ్డున పడనున్న 'యాహు' ఉద్యోగులు!
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించనుంది. నేడు త్రైమాసిక లాభాల రిపోర్టు విడుదల చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు.. దాదాపు 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మరిస్సా మేయర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా డైరెకర్టపై ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తోంది. యాహూ లాభాలు క్రమక్రమంగా తగ్గుతున్నందున సంస్థ నిర్వహణ ఖర్చును అదుపులో పెట్టేందుకు ఉద్యోగులను తీసేయడం మార్గంగా ఎంచుకుంది. చాలా మార్పులు రావాలని స్టార్ బోర్డ్ భావిస్తోంది. గతేడాది డిసెంబర్ లో యాహు కంపెనీలో ఓ ఇన్వెస్టర్ స్ప్రింగ్ ఓల్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ను నియమించడంతో పాటు 80శాతం ఉద్యోగాలకు కోతపెట్టింది. చైనాకు చెందిన అలిబాబా కంపెనీలో తన వాటాలు విక్రయించవద్దని నిర్ణయించుకుంది. గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో యాహు ఫలితాలు సాధించలేదన్న విషయం తెలిసిందే. ఉద్యోగులపై వివక్ష చూపిస్తోదంటూ, చట్టాలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలతో యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో సొంత సంస్థపై దావా వేశాడు. సరిగ్గా అదేరోజు కంపెనీ ఉద్యోగుల కోత విషయం బయటకు రావడంతో సంస్థకు చెందిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. -
'యాహూ' కవలలు పుట్టేశారోచ్...
కాలిఫోర్నియా: నిన్న ఫేస్బుస్ సీఈవో...తాజాగా యాహూ మహిళా సీఈవో మరిస్సా మేయర్ కూడా మాతృత్వపు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరిస్సా ఈసారి డబుల్ ప్రమోషన్ కొట్టేశారు. గురువారం ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె టుంబర్ల్లో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో పాటు, తనకు సహకరించినవారికి ధన్యవాదాలు అంటూ మరిస్సా ఈ సందర్భంగా ఆమె ట్విట్ చేశారు. మరోవైపు మరిస్సా భర్త బోగ్ 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్విట్ చేయగా, కుటుంబమంతా థ్రిల్లింగ్ లో మునిగితేలుతోంది. కాగా మరిస్సా మేయర్ జూలై 2012 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా యాహూ చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఫైనాన్షియర్ బోగ్ వివాహం చేసుకున్న ఆమె 2012లో తొలిసారి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె కేవలం నాలుగు వారాలకే ఉద్యోగానికి వెళ్లిపోయారు. అయితే ఈసారి కూడా మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నిటీ సెలవు తీసుకున్నారు. కాగా చైనీస్ కామర్స్ దిగ్గజం ఆలీబాబా కంపెనీ నుంచి యాహూ తన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన ముద్దుల కూతురు కోసం రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే -
అమ్మకానికి యాహూ ఇంటర్నెట్ వ్యాపారం!
శాన్ఫ్రాన్సిస్కో/బెంగళూరు: యాహూ కంపెనీ కీలకమైన తన ఇంటర్నెట్ బిజినెస్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఈవారం జరిగే కంపెనీ డెరైక్టర్ల బోర్డ్‌లో ఈ మేరకు ఒక నిర్ణయం వెలువడగలదని సమాచారం. యాహూ కంపెనీ భవితవ్యం, ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరిసా మేయర్ భవితవ్యంపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ బోర్డ్ మీటింగ్ జరగనున్నది. యాహూ సంస్థ తన ఇంటర్నెట్ వ్యాపారాన్ని విక్రయించే అవకాశాలున్నాయంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ మంగళవారం పేర్కొంది. బోర్డ్ సమావేశాలు బుధవారం నుంచి శుక్రవారం వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆలీబాబా హోల్డింగ్ గ్రూప్‌లో ఉన్న 3,000 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించే విషయం కూడా చర్చకు రానున్నదని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు 7శాతం ఎగిశాయి. యాహూ కీలక వ్యాపారాలు.. యాహూ మెయిల్, న్యూస్, స్పోర్ట్స్ సైట్ల విక్రయానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, మీడియా, టెలికాం కంపెనీల నుంచి మంచి స్పందన లభించగలదని యాహూ భావిస్తోంది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి యాహూ నిరాకరించింది. కాగా చాలా కాలం గూగుల్‌లో పనిచేసి ఆ తర్వాత యాహూలో చేరిన మరిసా మేయర్‌పై పనితీరు అంశాల పట్ల తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. గూగుల్, ఫేస్‌బుక్‌లతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న యాహూ ఆమె రాకతో టర్న్అరౌండ్ అవగలదన్న అంచనాలు పెరిగిపోయాయి. అయితే మావెన్స్ పేరుతో ఆమె అందుబాటులోకి తెచ్చిన వ్యూహాం సత్ఫలితాలనివ్వలేదు. -
ఘరానా మోసగాడికి రెడ్ కార్నర్ నోటీసులు!
అనంతపురం:యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ఘరానా మోసగాడు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నిరుద్యోగుల నుంచి రూ.30 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంజాద్ పర్వేద్ అనే ఉద్యోగి కొంతమంది యువతకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. -
నిందితున్ని పట్టుకునేందుకు సహకరిస్తాం:ఎస్పీ
అనంతపురం:యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు తమవంతు సహకరం అందిస్తామని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికి సంబంధించి స్పందించిన ఎస్పీ.. ఆ కేసును హిందూపురంలో నమోదు చేయలేమన్నారు. అసలు నేరం ఎక్కడైతే జరిగిందో అక్కడే బాధితులు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బెంగళూరులో నిరుద్యోగుల నుంచి రూ. 30 కోట్ల వసూళ్లు చేసిన వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నిందితున్ని పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులకు సహకరిస్తామని తెలిపారు. 'యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంజాద్ పర్వేద్ అనే ఉద్యోగి బెంగళూరులో సుమారు రూ.30కోట్లకు...కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. -
ఉద్యోగాలని చెప్పి.. 30 కోట్లు దోచేశాడు!
-
యాహూలో ఉద్యోగాలంటూ రూ.30కోట్లు వసూలు
అనంతపురం : సాప్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మరో మోసగాడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. 'యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అతగాడు బెంగళూరులో సుమారు రూ.30కోట్లకు...కుచ్చుటోపీ పెట్టాడు. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యాహూలో భారీగా ఉద్యోగాల కోత?
ప్రముఖ సెర్చింజన్, మెయిల్ ప్రొవైడర్ సంస్థ యాహూ భారతదేశంలో భారీగా ఉద్యోగాలకు కోత పెడుతున్నట్లు సమాచారం. బెంగళూరు కార్యాలయాన్ని తాము పునర్నిర్మిస్తున్నట్లు చెబుతున్నా, ఎక్కడా ఉద్యోగాల కోత విషయాన్ని మాత్రం వాళ్లు అధికారికంగా నిర్ధారించడం లేదు. కానీ ఇంతకుముందు ఒకసారి ఇలాగే 2000 మంది ఉద్యోగులను తొలగించి.. దాదాపు 375 మిలియన్ డాలర్ల సొమ్మును ఆదా చేసుకుంది. యాహూ నిరంతర ప్రగతి సాధిస్తూనే ఉందని, మరింత సామర్థ్యాన్ని సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్, లీడ్ ప్రచి సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు కార్యాలయాన్ని తాము పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నామని, భారతదేశంలోను.. బెంగళూరులో కూడా తాము తమ ఉనికిని బాగానే చాటుకుంటామని ఆమె అన్నారు. అయితే అనధికారిక కథనాల ప్రకారం ఈసారి కూడా దాదాపు రెండు వేల మందికి యాహూ పింక్ స్లిప్పులు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. -
సహకరించకపోతే జరిమానా వేస్తామన్నారు!
వాషింగ్టన్: అమెరికా రహస్య నిఘా కార్యక్రమం ‘ప్రిజమ్’ కోసం యూజర్ల డేటా ఇచ్చి సహకరించకపోతే రోజుకు రూ. 1.5 కోట్ల(2.5 లక్షల డాలర్లు) జరిమానా వేస్తామని అమెరికా ప్రభుత్వం తమను హెచ్చరించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ తెలిపింది. కోర్టు డాక్యుమెంట్లలో ఈ విషయం ఉందని కంపెనీ న్యాయవాది రాన్ బెల్ ఓ బ్లాగులో తెలిపారు. నిఘా యత్నాలను అడ్డుకోవడానికి తమ యత్నాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. యూజర్ల సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం 2007లో ఓ కీలక చట్టాన్ని సవరించిందని, అది రాజ్యాంగ విరుద్ధం కనుక సహకరించేందుకు నిరాకరించామన్నారు. -
జీమెయిల్, యాహూలపై నిషేధం!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పరిరక్షించడానికిగానూ అధికారిక కార్యకలాపాల్లో జీమెయిల్, యాహూలాంటి ఈమెయిల్ సర్వీసుల వినియోగాన్ని నిషేధించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(డీఈఐటీవై) కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దీనిపై కేంద్ర మంత్రివర్గం ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు, హ్యాకింగ్ ఘటనలు పెరిగడంతో డీఈఐటీవై ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. గూగుల్‌కు సంబంధించిన 50 లక్షల జీమెయిల్ యూజర్ నేమ్‌లు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయన్న వార్తలూ దీనికి దోహదం చేశాయి. -
డేటా ఇవ్వమని అమెరికా బెదిరించింది!
వాషింగ్టన్: అమెరికా రహస్య నిఘా(ఎన్సీఏ) కార్యక్రమం ‘ప్రిజమ్’ కోసం తమకు యూజర్ల డేటా ఇచ్చి సహకరించకపోతే రోజుకు రూ. 1.5 కోట్ల జరిమానా వేస్తామని అమెరికా ప్రభుత్వం తమను హెచ్చరించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ తెలిపింది. కోర్టు డాక్యమెంట్లలో ఈ విషయం స్పష్టమైందని యాహూ కంపెనీ న్యాయవాది రాన్ బెల్ ఓ బ్లాగులో తెలిపారు. నిఘా యత్నాలను అడ్డుకోవడానికి తాము చేస్తున్న యత్నాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఆన్లైన్ యూజర్ల సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం 2007లో ఓ కీలక చట్టాన్ని సవరించిందని, అది రాజ్యాంగ విరుద్ధం కనుక సహకరించేందుకు నిరాకరించామని వెల్లడించారు. అయితే తమ వాదన కోర్టులో వీగిపోవడంతో అమెరికా యూజర్ల 1,500 పేజీల డాక్యుమెంట్ల డేటాను ఇవ్వాల్సి వచ్చిందని, ఒక దశలో డేటా ఇవ్వకపోతే భారీ జరిమానా విధిస్తామని అధికారులు బెదిరించారని పేర్కొన్నారు. ఈ నిఘా కార్యక్రమం కోసం పెద్ద మొత్తంలో డేటా సేకరించడానికి యాహూ సంస్థతో పాటు, గుగూల్ ను కూడా అమెరికా ఆశ్రయించింది.